
5 కోట్లు కాదు.. కోటిన్నర మాత్రమే.. క్లారిటీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా
Hardik Pandya Clarifies on 2 Luxury Wrist Watches Price After Customs Row: ‘‘సోమవారం.. నవంబరు 15 ఉదయం నేను నా లగేజీతో దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకోగానే... ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. నేను కొన్న వస్తువుల గురించి తెలియజేశాను. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాను కూడా. కానీ.. నాకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకే.. అసలు విషయం గురించి స్పష్టతనివ్వాలని భావించాను’’ అంటూ తన గురించి ప్రచారమవుతున్న కథనాలపై టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.
కాగా సరైన పత్రాలు చూపని కారణంగా పాండ్యాకు చెందిన సుమారు 5 కోట్ల విలువైన వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా పాండ్యా క్లారిటీ నోట్ షేర్ చేశాడు. ‘‘నాకు నేనుగా.. స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లాను. దుబాయ్‌లో నేను చట్టబద్ధంగా ఖరీదు చేసిన వస్తువులకు పన్ను చెల్లించాను.
వాళ్లు అడిగిన పత్రాలు అన్నీ కూడా సమర్పించాను. వస్తువులకు సంబంధించి ఎంత డ్యూటీ చెల్లించాల్సి వస్తుందో వాళ్లు నాకు చెప్పారు. నిజానికి ఆ వాచ్ వాస్తవ ధర ఇంచు మించు కోటిన్నర. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా రూ. 5 కోట్లు కాదు’’ అని పాండ్యా పేర్కొన్నాడు.
పాండ్యా గతంలో షేర్ చేసిన ఫొటోలు
నేను చట్టాన్ని గౌరవిస్తాను
‘‘ప్రభుత్వ సంస్థలను నేను గౌరవిస్తాను. చట్టాన్ని పాటించే దేశ పౌరుడిని నేను. ముంబై కస్టమ్స్ డిపార్టుమెంటు అడిగిన విధంగా నేను అన్ని వివరాలు అందించాను. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చూపించాను. దీంతో వాళ్లు కూడా నాకు సహకరించారు. నేను చట్టాన్ని అతిక్రమించాననే వార్తలు అన్నీ కూడా నకిలీవే’’ అని హార్దిక్ పాండ్యా తన సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో అభిమానులు పాండ్యాకు అండగా నిలుస్తుండగా.. కొంతమంది హేటర్స్ మాత్రం.. ‘‘ఏంటి.. కోటిన్నర వాచ్ పెట్టుకుంటేనే సిక్స్ కొడతావా లేదంటే.. ఆడటం చేతకాదా? విలాసాలపై కాదు.. ఆటపై దృష్టి పెట్టు ముందు’’ అని ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అసలు విషయం తెలీదా.. లేదంటే సెమీస్‌లో పాక్‌ను ఓడించినందుకేనా అక్కసు!
— hardik pandya (@hardikpandya7) November 16, 2021