Hardik Pandya’s watches worth Rs 5 crore seized at airport: టీ20 ప్రపంచకప్-2021లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. పాండ్యా వద్ద గల అత్యంత ఖరీదైన వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వాచ్‌ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు.
ఏబీపీ లైవ్ కథనం ప్రకారం... నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. సదరు వాచీలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు పాండ్యా చూపకపోవడంతో ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడిని ఆపిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఖరీదైన బ్రాండ్‌లు..
హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం... ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్‌తో రూపొందించబడింది. 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్‌లెట్ కూడా ఉంటుంది. అంతేకాదు కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్‌ను తయారు చేసి ఇస్తారు. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచె ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ వాచీని ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: Venkatesh Iyer: ఆ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌లా.. టీమిండియాకు నేను ఆడాలి అనుకుంటున్నా..
Comments
Please login to add a commentAdd a comment