From mangoes to luxury watches, Indians look to offload Rs 2,000 notes - Sakshi
Sakshi News home page

‘నేనే కింగ్‌’: మాంగో అయినా లగ్జరీ వాచ్‌ అయినా...!

May 24 2023 1:22 PM | Updated on May 24 2023 3:01 PM

Rs2000 notes From mangoes to luxury watches - Sakshi

సాక్షి, ముంబై:  రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటన తరువాత బడా బాబులతోపాటు, సామాన్య ప్రజలు దాకా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు తమ తమ స్థాయిల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో పెద్ద నోటుదే ప్రస్తుత హవా. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజువారీ నిత్యావసరాలు మొదలు ప్రీమియం బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లదాకా.. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా రూ.2 వేల నోటుతోనే కొనుగోలు చేస్తున్నారట.

రూ.2 వేల నోటు చలామణికి మరో నాలుగు నెలల్లో (సెప్టెంబరు 30) గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే.  దీనికి  తోడు డిజిటల్‌ పేమెంట్స్‌లో క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఇపుడు కస్టమర్లు ది బెస్ట్‌గా భావిస్తున్నారట.  ఆన్‌లైన్‌లో   వేసవి సీజన్‌లో అత్యధికంగా లభించే మామిడిపళ్ల దగ్గరనుంచి  ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య  విపరీతంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి చెప్పారు. (సింపుల్‌ వన్‌: లాంగెస్ట్‌ రేంజ్‌ స్కూటర్‌ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?)

సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్‌లో స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ మాట్లాడుతూ  తమ స్టోర్‌లో  2000 రూపాయల నోట్లు  60-70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాచ్ అమ్మకాలు  గతంలో 1-2 నుండి రోజుకు 3-4కు పెరిగిందని మార్టిస్ చెప్పారు.

పెట్రోల్‌ బంకుల్లో కూడా ఎక్కువగా రూ.2 వేల నోటే ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటించింది మొదలు  తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని  జొమాటో ప్రతినిధి తెలిపారు. బంగారం షాపులకు కూడా రద్దీ పుంజుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ లావాదేవీ  పెద్ద నోటుతోనే.  (ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ‘గార్బేజ్‌ క్వీన్స్‌’ : వైరల్‌ ఫోటోలు)

కాగా దేశంలోనే అతిపెద్ద డినామినేషన్‌ నోటు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ  ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు,  ఖాతాల్లో జమ చేసుకునేందుకు  అవకాశం కల్పించింది. ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement