స్విస్‌తో కలిసి పనిచేస్తాం: మోదీ | India to work with Switzerland on black money: PM Narendra Modi | Sakshi
Sakshi News home page

స్విస్‌తో కలిసి పనిచేస్తాం: మోదీ

Published Thu, Aug 31 2017 5:31 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

India to work with Switzerland on black money: PM Narendra Modi

బీజింగ్‌: నల్లధనం కట్టడికి స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేం‍ద్ర మోదీ స్పష్టం చేశారు. నల్లధనం, హవాలా, ఆయుధ అక్రమ రవాణా, డ్రగ్స్‌ ఇలా ఏ ఆర్థిక లావాదేవీలో అయినా పారదర్శకత ప్రధాన సవాల్‌గా ముందుకొస్తున్నదన్నారు. గురువారం స్విస్‌ ప్రెసిడెంట్‌ డొరిస్‌ లూథర్డ్‌తో భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ తరహా అంతర్జాతీయ సమస్యలపై స్విట్జర్లాండ్‌తో కలిసి భారత్‌ ముందుకు సాగుతుందన్నారు. 

ఇరు దేశాల ఆర్థిక సహకారానికి ఎఫ్‌డీఐ కీలక చోదక శక్తిగా ఉంటుందన్నారు. భారత్‌లో స్విట్జర్లాండ్‌ పెట్టుబడిదారులను తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు. భారత్‌ అభివృద్ధిలో స్విస్‌ కంపెనీల నైపుణ్యం ఉపయోగపడుతుందని అన్నారు. తమ చర్చల్లో ఐరోపా యూనియన్‌, భారత్‌ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణజ్య ఒప్పందం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని మోదీ చెప్పారు. మరోవైపు తమ దేశంలో మనీలాండరింగ్‌కు వ్యతిరేకంగా పటిష్ట చట్టాలున్నాయని లూథర్డ్‌ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement