పుష్టిగా ఉంటేనే బెస్టు! | Sonakshi Sinha Plays Cupid For Sidharth Malhotra! | Sakshi
Sakshi News home page

పుష్టిగా ఉంటేనే బెస్టు!

Published Tue, Sep 15 2015 10:51 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

పుష్టిగా ఉంటేనే బెస్టు! - Sakshi

పుష్టిగా ఉంటేనే బెస్టు!

బల్లిని చూస్తే బేర్‌మంటారు... కారు వేగం పెరిగితే క్యార్‌మంటారు... చాక్లెట్స్ అంటే ఇష్టంగా చప్పరించేస్తారు... ఇలా సోనాక్షీ సిన్హాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటి గురించి మీకు తెలుసా?!

 * హీరోయిన్ కాకముందే సోనాక్షీ సిన్హా ఆటోగ్రాఫ్స్ ఇచ్చేవారట. ఆమె తండ్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాది పాట్నా. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తండ్రితోపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనాక్షి పాట్నా వెళ్లినప్పుడు అక్కడివాళ్లు ఆటోగ్రాఫ్స్ అడిగితే, సిగ్గుపడుతూ ఇచ్చారట.
* ఫ్యాషన్ డిజైనర్ కావాలనే ఆకాంక్షతో ముంబయ్‌లోని ‘శ్రీమతి నాతీబాయ్ దామోదర్ తాకర్సే ఉమన్స్’ యూనివర్శిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు.

‘దబాంగ్’ చిత్రం ద్వారా కథానాయిక కాకముందు ‘మేరా దిల్ లేకే దేఖో’ అనే చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘దబాంగ్’ చిత్రానికి సల్మాన్ ఖాన్ కథానాయికగా అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
* దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ముంబయ్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా లేక వేరే ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా తనతో పాటు అదనంగా ఓ డ్రెస్ తీసుకెళతారు సోనాక్షి. ఒంటి మీద ఉన్న డ్రెస్ పొరపాటున చిరిగినా, అసౌకర్యంగా అనిపించినా నలుగురిలో నవ్వులపాలు కాకూడదు కాబట్టి, ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటారు.
* యాక్టర్స్ అందరూ కాంప్లికేటెడ్ అనుకుంటారు. కానీ తాను ఆ జాబితాకు చెందనని పలు సందర్భాల్లో సోనాక్షి పేర్కొన్నారు. అందుకే హీరోలను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటున్నారు. అన్‌కాంప్లికేటెడ్ పర్సన్స్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది కూడా సినిమా రంగానికి చెందినవాళ్లని చేసుకోరట.
* సైజ్ జీరో అంటే చాలా చిరాకు. పుష్టిగా ఉంటేనే అందంగా ఉంటామంటున్నారు. అందుకే తననెవరైనా బొద్దుగా ఉంటావని విమర్శించినా వాటిని ప్రశంసలుగా భావిస్తారు.
* ఖరీదు గల కార్లు చూపించి అమ్మాయిలను పడగొట్టాలనుకునే అబ్బాయిలంటే పడదు. కాలేజ్ డేస్‌లో అలా బిల్డప్ ఇచ్చిన అబ్బాయిల బుర్ర తిరిగిపోయేలా క్లాస్ తీసుకునేవారు.
* బల్లులంటే తెగ భయం. సాలీడులంటే అలర్జీ. బల్లులంటే సోనాక్షీకి భయం అని తెలిసి, ‘జోకర్’ సినిమాలో నటించేటప్పుడు అక్షయ్ కుమార్ సరదాగా రబ్బర్ బల్లిని చూపిస్తూ, ఆమెను ఏడిపించేవారు. మొదటిసారి ఆ రబ్బర్ బల్లిని చూసి, నిజమైనదని నమ్మి, షూటింగ్ లొకేషన్లో పరుగులు పెట్టారు.
* చదువుకునే రోజుల్లో ఆటల్లో ఫస్ట్. వాలీబాల్, ఫుట్‌బాట్, త్రో బాల్, టెన్నిస్ బాగా ఆడేవారు. వేగంగా కారు నడపడం అంటే టెన్షన్. అలా నడిపేవాళ్లతో ప్రయాణం చేయరు.
* చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవి తినకుండా ఉండలేరు. తిన్న తర్వాత గిల్టీగా అనిపిస్తుందని అంటుంటారు. అలాగే, డైట్ కోలా తెగ తాగుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా తాగుతారట.
* పెయింటింగ్ అంటే సోనాక్షీకి ఇష్టం. తీరిక చిక్కినప్పుడల్లా బొమ్మలు గీస్తుంటారు. అలాగే ఖాళీ సమయాల్లో ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement