'అకీరా'లో సోనాక్షి ఫైట్లు | Sonakshi's 'exhausting' action sequence for 'Akira' | Sakshi
Sakshi News home page

'అకీరా'లో సోనాక్షి ఫైట్లు

Published Sun, Apr 12 2015 7:22 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

'అకీరా'లో సోనాక్షి ఫైట్లు - Sakshi

'అకీరా'లో సోనాక్షి ఫైట్లు

అందం, అభినయమేకాదు.. అదరగొట్టే ఫైట్లు, ఒళ్లు గగుర్పొడిచే ఫీట్లతోనూ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొడతానంటోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా! హిందీ సినిమా 'అకీరా' లో సోనాక్షి కోసమే ప్రత్యేకంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశాడట దర్శకుడు ఏఆర్ మురుగదాస్.

దానికోసం ఫిట్ నెస్ ట్రైనర్లదగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని, గంటలతరబడి ఒళ్లుహూనమయ్యేలా కష్టపడ్డానని, ఇటీవలే ఆ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తికావడంతో అలసట ఆవహించిందని సోనాక్షి ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్  అకీరాలో హీరో. సోనాక్షి, ఆమె తండ్రి శత్రుఘ్నసిన్హా కలిసి నటిస్తోన్న తొలి చిత్రం కూడా ఇదే కావడం మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement