ఎ.ఆర్.మురుగదాస్ చిత్రంలో సోనాక్షి | Sonakshi Sinha in AR Murugadoss' next action movie | Sakshi
Sakshi News home page

ఎ.ఆర్.మురుగదాస్ చిత్రంలో సోనాక్షి

Published Wed, Jun 11 2014 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ఎ.ఆర్.మురుగదాస్ చిత్రంలో సోనాక్షి - Sakshi

ఎ.ఆర్.మురుగదాస్ చిత్రంలో సోనాక్షి

 ఏ.ఆర్.మురుగదాస్ తాజా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనున్నారు. ఇప్పటి వరకు భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ తన నిర్మాణ సంస్థలో బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ నూతన దర్శకులకు అవకాశం కల్పిస్తూ వచ్చిన ఏ.ఆర్.మురుగదాస్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదీ బాలీవుడ్ చిత్రం చేస్తుండడం విశేషం. అయితే అది యాక్షన్‌తో కూడిన లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ భామ సోనాక్షి సిన్హా యాక్షన్ హీరోయిన్‌గా నటించనుండడం ఇంకో విశేషం.
 
 ఏ.ఆర్.మురుగదాస్ బాలీవుడ్‌లో గజిని చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హాలీడే చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ చిత్రం తుపాకీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా నటనను ఎ.ఆర్.మురుగదాస్ తెగపొగిడేశారు. సోనాక్షి నటిగా చాలా ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. చెప్పిన టైమ్‌కు కరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌లో ఉంటారని ఆమెతో కలిసి వర్క్ చేయడం చక్కని అనుభవమని పేర్కొన్నారు.
 
 మురుగదాస్, సోనాక్షి సిన్హాల ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ విజయ్‌తో రూపొందిస్తున్న కత్తి చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. సోనాక్షి ప్రస్తతం సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన లింగా చిత్రంలో నటిస్తున్నారు. తరువాత ఏ.ఆర్.మురుగదాస్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement