క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాకొలెట్లు అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లలు వరకు ఇష్టపడని వారు ఉండరు. అలాగే ఈ క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్‌మెంట్ ఎంతగా ప్రజల దృష్టిని ఆకర్షించిందో అందరికి తెలిసిందే. 1990లలో తీసిన అడ్వర్టైస్‌మెంట్ ఇప్పుడు వస్తున్న అడ్వర్టైస్‌మెంట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొంత మంది ట్విట్టర్‌లో ప్రశంసిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే....
(చదవండి: వ్యాక్సిన్ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’)
క్రికెట్ తమ ఆరాధ్య క్రీడగా భావించే మన దేశంలో 1990లో వచ్చిన క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్ మెంట్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సమయంలో కేవలం పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే జరిగేవి. ఈ క్రమంలో కాలనుగుణంగా క్యాడ్‌బరీ ప్రకటన రూపకర్త ఓగిల్వి మంచి అడ్వర్టైస్‌మెంట్ రూపొందించారు. ఇందులో ఒక అమ్మాయి పూల డ్రస్ వేసుకుని క్యాడ్‌బరీ చాకొలెట్ తింటూ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుంటోంది. తన బాయ్‌ఫ్రెండ్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆనందంతో నృత్యం చేసుకుంటూ సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలోకి వచ్చేస్తుంది.
పైగా దీనికి "అస్లీ స్వాద్ జిందగీ కా" (జీవితంతో నిజమైన రుచి) ట్యాగ్‌లైన్ జోడించడంతో ప్రజల దృష్టి క్రికెట్ నుంచి మరల్చకుండా చాలా బాగా ప్రజలకు చేరువైంది. అప్పటి వరకు పిల్లలకు మాత్రమే చాకొలెట్లు అనే దానిని చెరిపేసినట్లుగా చాలా బాగా ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా ప్రకటనను రూపొందించారు. తదనంతరం ప్రస్తుతం మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో చిన్న చిన్న మార్పులతో అదే అడ్వర్టైస్‌మెంట్ రూపొందించింది.
అప్పుడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌కోసం నృత్యం చేస్తే ఇప్పుడు అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ నృత్యం చేసినట్లు రూపొందించారు. ఇది కూడా ప్రేక్షకులకు చేరువైంది గానీ కొత్తదనం కోరుకుంటున్నామంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. మరికొంతమంది లింగఅసమానతకు తావు లేకుండా కాలానుగుణంగా రూపొందిస్తున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
Oh wow!! Take a bow, Cadbury Dairy Milk and Ogilvy :) A simple, obvious twist that was long overdue, and staring right at all of us all this while! pic.twitter.com/Urq8NXtg7W
— Karthik 🇮🇳 (@beastoftraal) September 17, 2021
(చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు)
Comments
Please login to add a commentAdd a comment