Cadbury dairy milk
-
నోరూరించే చాక్లెట్ల చరిత్ర తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
క్యాడ్బరీ డైరీమిల్క్, ఫైవ్‌స్టార్, కిట్‌కాట్, జెమ్స్... చెబుతుంటేనే నోరూరి΄ోతోంది కదా. అమ్మానాన్నలు ఏదైనా పని చె΄్పాలంటే ‘చేశావంటే చాక్లెట్ ఇస్తా’ అంటుంటారు. నోట్లో వేసుకోగానే కరిగి΄ోయే చాక్లెట్లంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దలకూ ఇష్టమే. ఈ చాక్లెట్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో అమెరికాలో చాకో చెట్లను తొలిసారి గుర్తించారు. ఆ చెట్టు పళ్లలోని గింజల నుంచి రసం తీసి తాగడం అలవాటు చేసుకున్నారు. రుచికరమైన ఆ రసం అందరికీ తెగ నచ్చింది. దీంతో కోకో చెట్టును దైవప్రసాదంగా భావించేవారు. ప్రధాన వేడుకల్లో ఈ చెట్లను కానుకలుగా ఇచ్చేవారు. డబ్బు చలామణీ లేని ఆ కాలంలో ఈ చెట్టునే విలువైన వస్తువుగా భావించేవారు. ఆ తర్వాత 1519లో స్పెయిన్ దేశస్థులు ఆ చాకో చెట్టు రసాన్ని తమ దేశానికి తెచ్చారు. అక్కడే మొదటిసారి ఆ రసానికి ‘చాకొలేట్’ అనే పేరు పెట్టారు. అక్కడి నుంచి అది యూరప్ ప్రాంతానికి పరిచయమై ప్రాధాన్యాన్ని పొందింది. వందల ఏళ్లపాటు రసంగానే ఉన్న ఆ ద్రవం 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ అనంతరం బిళ్లల రూపంోకి మారింది. ఆ రసంలో మరిన్ని కొత్త దినుసులు కలిపి కొత్త తరహా రుచుల్ని తీసుకొచ్చారు. 1819లో స్విట్జర్ల్యాండ్ దేశంలో ‘ఫ్రాంకోయిస్ లూయిస్ కైల్లర్’ తొలిసారి చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. ‘స్విస్ చాక్లెట్’ సృష్టికర్త ఆయనే. ఇప్పటికీ కైల్లర్ బ్రాండ్ చాక్లెట్ ప్రపంచంలోనే శ్రేష్ఠమైన చాక్లెట్.మొదట్లో ఒకే రంగులో ఉండే చాక్లెట్లు ఆ తర్వాత కొత్త కొత్త రంగులతో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ల వ్యాపారం లక్షల కోట్ల ఆదాయంతో నడుస్తోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చిన్నారులకు వేడుకలు... ఇలా ఏ శుభకార్యం జరిగినా చాక్లెట్లు ఉండాల్సిందే అనేంతగా పేరు పొందాయి. అయితే మీకు చాక్లెట్లంటే ఎంత ఇష్టమున్నా వాటిని ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. తరచూ చాక్లెట్లు తింటే పళ్లు పాడవుతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే చాక్లెట్లు తినండి. ఇది కూడా చదవండి: ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే! -
HYD: డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగు.. మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం
చాక్లెట్స్ .. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. ఏషాప్కు అయినా వెళితే ఏదో ఒక చాక్లెట్ కొనితీరాల్సిందే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక మరో రెండో రెండు రోజుల్లో వాలంటైన్స్ డే(ఫిబ్రవరి 14) వస్తుండటంతో చాకెట్లకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. చాలామంది ప్రేమికులు తమ ప్రేమసి, ప్రియుడికి చాక్లెట్‌ను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ చేదువార్త.. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు కనిపించింది. చాక్లెట్ కవర్ తీయడంతో అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో సదరు వ్యక్తి కంగు తిన్నాడు. .. తనకు ఎదురైన అనుభవాన్ని బిల్‌తోపాటు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ రిటైల్ స్టోర్ నుంచి రూ. 45 చెల్లించి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్ చేయడంతో అందులో పురుగు పాకుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను చాక్లెట్‌ను వీడియో, ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. చదవండి: Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు] Found a worm crawling in Cadbury chocolate purchased at Ratnadeep Metro Ameerpet today.. Is there a quality check for these near to expiry products? Who is responsible for public health hazards? @DairyMilkIn @ltmhyd @Ratnadeepretail @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/7piYCPixOx — Robin Zaccheus (@RobinZaccheus) February 9, 2024 ‘అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ షాప్‌లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో ఒక పురుగు పాకుతున్నట్లు కనిపించింది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ చేస్తున్నారా? ప్రజలు అనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. సంబంధిత ఆహార భద్రత అధికారులను అప్రమత్తం చేశామని.. సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని తెలిపింది. అదే విధంగా క్యాడ్బెరీ డెయిరీ మిల్క్ సైతం స్పందిస్తూ... ‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది. -
‘క్యాడ్ బరీ సిగ్గుపడాలి.. మా మోదీనే అవమానిస్తారా’!
ప్రముఖ చాక్లెట్ తయారీ దిగ్గజం క్యాడ్బరీ ఒకేసారి రెండు వివాదాల్లో చిక్కుకుంది!. జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో చాక్లెట్‌ను తయారు చేస్తుందని.. ఆ సంస్థను భారత్‌లో బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి. దీంతో ట్విటర్లో ‘బాయ్‌కాట్ క్యాడ్బరీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం’ అంటూ దీపావళి సందర్భంగా క్యాడ్బరి సంస్థ ఓ చాక్లెట్ యాడ్‌ను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ యాడ్ వివాదంగా మారింది. ఆ యాడ్‌లో సంభాషణలు ఇలా జరిగాయి. డాక్టర్: దీపావళి సందర్భంగా ఓ డాక్టర్ ప్రమిదెలు అమ్మే వ్యక్తి కోసం అంగట్లో చూస్తుంటాడు. అదే సమయంలో ప్రమిదెలు అమ్మే వ్యక్తి డాక్టర్‌కు తారసపడడంతో దామోదర్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో ప్రమిదెలు అమ్మే వ్యాపారి : డాక్టర్ సార్ డాక్టర్: ఎక్కడున్నావ్.. రెండు రోజుల నుంచి నీ కోసం చూస్తున్నాను. వ్యాపారీ: అయినా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నార్ సార్. మీకు ఏమైనా కావాలా? అని అడుగుతాడు. డాక్టర్: కాదు, కాదు నేను మీకు ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నా. అంటూ తన బ్యాగ్‌లో నుంచి క్యాడ్బరీ చాక్లెట్ ప్యాకెట్‌ను వ్యాపారికి అందిస్తాడు. వ్యాపారీ: అందుకు కృతజ్ఞతగా మీకు దీపావళి శుభాకాంక్షలు అని రిప్లయి ఇస్తారు. అంతటితో యాడ్ పూర్తవుతుంది. ఇప్పుడీ యాప్‌పై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి అభ్యంత్రం వ్యక్తం చేశారు. తోపుడు బండిపై ప్రమిదెలు విక్రయించే వ్యక్తి పేరు దామోదర్. ఆ యాడ్‌లో దామోదర్ అనే పేరును వినియోగించడంపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మండిపడ్డారు. ‘‘మీరు క్యాడ్బరీ చాక్లెట్ యాడ్‌ను పరిశీలించారా? షాపు లేని ఓ నిరు పేద ల్యాంప్ విక్రేత పేరు దామోదర్. ప్రధాని మోదీ తండ్రి పేరును తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ అంశంలో క్యాడ్ బరీ సంస్థ సిగ్గుపడాలి. బాయ్ కాట్ క్యాడ్ బరీ’’ అంటూ సాధ్వి ప్రాచి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. బాయ్‌కాట్ క్యాడ్బరీ అంటూ వరుసగా రీట్వీట్లు చేస్తున్నారు. Have you carefully observed Cadbury chocolate's advertisement on TV channels? The shopless poor lamp seller is Damodar. This is done to show someone with PM Narendra Modi's father's name in poor light. Chaiwale ka baap diyewala. Shame on cadbury Company #BoycottCadbury pic.twitter.com/QvzbmOMcX2 — Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) October 30, 2022 -
1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..
క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్లు అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లలు వరకు ఇష్టపడని వారు ఉండరు. అలాగే ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్మెంట్ ఎంతగా ప్రజల దృష్టిని ఆకర్షించిందో అందరికి తెలిసిందే. 1990లలో తీసిన అడ్వర్టైస్మెంట్ ఇప్పుడు వస్తున్న అడ్వర్టైస్మెంట్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొంత మంది ట్విట్టర్లో ప్రశంసిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే.... (చదవండి: వ్యాక్సిన్ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’) క్రికెట్ తమ ఆరాధ్య క్రీడగా భావించే మన దేశంలో 1990లో వచ్చిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్ మెంట్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సమయంలో కేవలం పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే జరిగేవి. ఈ క్రమంలో కాలనుగుణంగా క్యాడ్బరీ ప్రకటన రూపకర్త ఓగిల్వి మంచి అడ్వర్టైస్మెంట్ రూపొందించారు. ఇందులో ఒక అమ్మాయి పూల డ్రస్ వేసుకుని క్యాడ్బరీ చాకొలెట్ తింటూ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుంటోంది. తన బాయ్‌ఫ్రెండ్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆనందంతో నృత్యం చేసుకుంటూ సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలోకి వచ్చేస్తుంది. పైగా దీనికి "అస్లీ స్వాద్ జిందగీ కా" (జీవితంతో నిజమైన రుచి) ట్యాగ్‌లైన్ జోడించడంతో ప్రజల దృష్టి క్రికెట్ నుంచి మరల్చకుండా చాలా బాగా ప్రజలకు చేరువైంది. అప్పటి వరకు పిల్లలకు మాత్రమే చాకొలెట్లు అనే దానిని చెరిపేసినట్లుగా చాలా బాగా ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా ప్రకటనను రూపొందించారు. తదనంతరం ప్రస్తుతం మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో చిన్న చిన్న మార్పులతో అదే అడ్వర్టైస్మెంట్ రూపొందించింది. అప్పుడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌కోసం నృత్యం చేస్తే ఇప్పుడు అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ నృత్యం చేసినట్లు రూపొందించారు. ఇది కూడా ప్రేక్షకులకు చేరువైంది గానీ కొత్తదనం కోరుకుంటున్నామంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. మరికొంతమంది లింగఅసమానతకు తావు లేకుండా కాలానుగుణంగా రూపొందిస్తున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు. Oh wow!! Take a bow, Cadbury Dairy Milk and Ogilvy :) A simple, obvious twist that was long overdue, and staring right at all of us all this while! pic.twitter.com/Urq8NXtg7W — Karthik 🇮🇳 (@beastoftraal) September 17, 2021 (చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు) -
చాక్లెట్లో ‘బీఫ్’ ఆరోపణలు.. క్యాడ్బరి క్లారిటీ
Cadbury Beef Controversy: ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం' అంటూ అలరించే క్యాడ్ బరి చాక్లెట్ యాడ్ గురించి మనందరికి తెలిసిందే. ఆ యాడ్ చూసిన వారెవరైనా వెంటనే ఆ చాక్లెట్ కొనుక్కొని తినేయాలనే అనుకుంటారు. అందుకే ఆ చాక్లెట్ అంటే ఇష్టపడని వారుండరు. బాధైనా, సంతోషమైనా ఆ చాక్లెట్ తింటూ ఆ ఫీలింగ్‌ను షేర్ చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత పాపులర్ అయిన ఈ చాక్లెట్‌ను భారత్‌లో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం క్యాడ్బరీని జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో తయారు చేస్తున్నరంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Is this true @CadburyUK? If yes, Cadbury deserves to be sued for forcing Hindus to consume halaal certified beef products Our ancestors &Gurus sacrificed their lives but didn't accept eating beef. But post "independence"rulers have allowed our Dharma to be violated with impunity pic.twitter.com/Ub9hJmG8gO — Madhu Purnima Kishwar (@madhukishwar) July 17, 2021 దీంతో పలువురు నెటిజన్లు యూకే క్యాడ్ బరీ సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను తినిపించినందుకు క్యాడ్ బరీపై కేసు పెట్టాలని ట్వీట్ చేశారు. బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టారు. దీంతో ఈ వివాదంపై క్యాడ్బరీ.. ఆకు పచ్చ చుక్క గుర్తును ఉటంకిస్తూ క్లారిటీ ఇచ్చింది. మాండెలెజ్ / క్యాడ్బరీ ఉత్పత్తులు ప్యూర్ వెజిటేరియన్ అని తెలిపింది. అంతేకాదు క్యాడ్ బరీ చాక్లెట్ ర్యాపర్ పై ఉన్న ఆకు పచ్చ గుర్తు వెజిటేరియన్ అన్న విషయాన్ని సూచిస్తుందంటూ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. pic.twitter.com/798qgPozsF — Cadbury Dairy Milk (@DairyMilkIn) July 18, 2021 చదవండి : మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి -
డెయిరీ మిల్క్ చాకొలెట్లో పురుగులు
-
క్యాడ్బరి చాకొలెట్లో పురుగులు
సాక్షి, హైదరాబాద్ : మోర్ సూపర్మార్కెట్లో చాకొలెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్ సూపర్మార్కెట్లో మూడు రోజుల క్రితం క్యాడ్బరి డెయిరీ మిల్క్ చాకొలెట్ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్ తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. -
శ్రీసిటీలో క్యాడ్బరీ ఉత్పత్తి షురూ
♦ తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ♦ 19 కోట్ల డాలర్ల పెట్టుబడి; 60వేల టన్నుల ఉత్పత్తి ♦ 2020 నాటికి 2.5 లక్షల టన్నులకు చేరనున్న ఉత్పత్తి సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్బరీ డైరీమిల్క్ చాకొలెట్ల ఉత్పత్తి ఆరంభమయింది. అమెరికాకు చెందిన మాండలెజ్ ఇంటర్నేషనల్‌లో భాగమైన మాండలెజ్ ఇండియా... శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన తన అతిపెద్ద ప్లాంటులో తొలిదశ ఉత్పత్తిని సోమవారం ఆరంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్పత్తిని స్విచ్ ఆన్ చేయటం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫుడ్ దిగ్గజాల్లో ఒకటైన మాండలెజ్ సంస్థ... శ్రీ సిటీలో తన ప్లాంటును ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ, తయారీ సామర్థ్యాన్ని తీసుకు రావటంతో పాటు ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తోందని ప్రశంసించారు. ‘‘క్యాడ్బరీ సంస్థ కోకో సాగుకు సం బంధించి రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులతో కలసి పనిచేస్తోంది. స్థానికులకు తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించటం అభినందనీయం. సరైన శిక్షణ పొందితే మన గ్రామీణులు అంతర్జాతీయ స్థాయికి తీసిపోకుండా పనిచేయగలరు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక పరిశ్రమల ఉద్యోగులంతా అక్కడే ఉండేందుకు వీలుగా ఆరు నెలల్లో 5 వేల గృహాలను నిర్మించాలని శ్రీసిటీ ప్రతినిధులకు సూచించారు. శ్రీ సిటీ ప్రతి నిధులు శ్రీనిరాజు, రవి సన్నారెడ్డిలను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 2020 నాటికి 1,600 మందికి ఉద్యోగాలు మాండలెజ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చెయిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ మైర్స్ మాట్లాడుతూ ప్రస్తుత, రేపటి వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేలా అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పుతున్నామన్నారు. తాము ప్రపంచవ్యాప్తంగా అత్యంత సామర్థ్యం ఉన్న తయారీ టెక్నాలజీపై పెట్టుబడి పెడుతున్నట్లు తెలియజేశారు. శ్రీ సిటీ ప్లాంటును తమ పవర్ బ్రాండ్ల వృద్ధికి వీలుగా ఏర్పాటు చేస్తున్న భవిష్యత్ తయారీ కేంద్రంగా అభివర్ణించారు. తొలి దశ ఉత్పత్తిని ఆరంభించిన ఈ ప్లాంటు... 2020 నాటికి 2.5 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని అంచనా. తద్వారా 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాంటుపై సంస్థ 19 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ప్రస్తుత సామర్థ్యం 60వేల టన్నులు మాండలేజ్ ఇండియా ఎండీచంద్రమౌళి వెంకటేశ్ మాట్లాడుతూ... 2015లో సంస్థ నికర ఆదా యం 30 బిలియన్ డాలర్లుగా చెప్పారు. 165 దేశాల్లో వ్యాపారం చేస్తున్నామని, పలు ఉత్పత్తుల్లో అగ్రగాములుగా ఉన్నామని చెప్పారు. తొలిదశలో శ్రీ సిటీ ప్లాంటు ద్వారా ఏటా 60,000 టన్నుల చాకొలెట్లు ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు. మాండలేజ్ ప్రతినిధులతో పాటు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎపీఐఐసీ చెర్మైన్ కృష్ణయ్య, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.