HYD: డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం | Viral Video: Hyd Man Finds Worm Crawling In Cadbury Dairy Milk Chocolate, Cadbury Company Apologises - Sakshi
Sakshi News home page

Worm Crawling On Dairy Milk: చాక్లెట్‌ ప్రియులకు అలర్ట్‌.. డైరీ మిల్క్‌లో పురుగు.. మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం

Published Mon, Feb 12 2024 8:57 AM | Last Updated on Mon, Feb 12 2024 10:33 AM

HYD Man Finds Worm Crawling In Dairy Milk Chocolate Cadbury Responds - Sakshi

చాక్లెట్స్‌ .. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. ఏషాప్‌కు అయినా వెళితే ఏదో ఒక చాక్లెట్‌ కొనితీరాల్సిందే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక మరో రెండో రెండు రోజుల్లో వాలంటైన్స్‌ డే(ఫిబ్రవరి 14) వస్తుండటంతో చాకెట్లకు డిమాండ్‌ మరింత పెరిగిపోయింది.  చాలామంది ప్రేమికులు తమ ప్రేమసి, ప్రియుడికి చాక్లెట్‌ను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు..

అయితే చాక్లెట్‌ ప్రియులకు ఓ చేదువార్త.. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో బతికున్న పురుగు కనిపించింది. చాక్లెట్‌ కవర్‌ తీయడంతో అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో సదరు వ్యక్తి కంగు తిన్నాడు. .. తనకు ఎదురైన అనుభవాన్ని బిల్‌తోపాటు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.  

హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ జాచెయస్‌ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ రిటైల్ స్టోర్ నుంచి రూ. 45 చెల్లించి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్‌ చేయడంతో అందులో పురుగు పాకుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను చాక్లెట్‌ను వీడియో, ఫొటో తీసి ట్విట్టర్​లో షేర్​ చేశాడు.
చదవండి: Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు]

‘అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్‌ షాప్‌లో కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ చాక్లెట్‌లో ఒక పురుగు పాకుతున్నట్లు కనిపించింది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ చేస్తున్నారా? ప్రజలు అనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ట్వీట్‌ చేశారు.దీనిపై హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పందించింది.  సంబంధిత ఆహార భద్రత అధికారులను అప్రమత్తం చేశామని.. సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని తెలిపింది. 

అదే విధంగా క్యాడ్‌బెరీ డెయిరీ మిల్క్‌ సైతం స్పందిస్తూ... ‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement