Worm
-
HYD: డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగు.. మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం
చాక్లెట్స్ .. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. ఏషాప్కు అయినా వెళితే ఏదో ఒక చాక్లెట్ కొనితీరాల్సిందే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక మరో రెండో రెండు రోజుల్లో వాలంటైన్స్ డే(ఫిబ్రవరి 14) వస్తుండటంతో చాకెట్లకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. చాలామంది ప్రేమికులు తమ ప్రేమసి, ప్రియుడికి చాక్లెట్‌ను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ చేదువార్త.. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు కనిపించింది. చాక్లెట్ కవర్ తీయడంతో అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో సదరు వ్యక్తి కంగు తిన్నాడు. .. తనకు ఎదురైన అనుభవాన్ని బిల్‌తోపాటు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ రిటైల్ స్టోర్ నుంచి రూ. 45 చెల్లించి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్ చేయడంతో అందులో పురుగు పాకుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను చాక్లెట్‌ను వీడియో, ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. చదవండి: Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు] Found a worm crawling in Cadbury chocolate purchased at Ratnadeep Metro Ameerpet today.. Is there a quality check for these near to expiry products? Who is responsible for public health hazards? @DairyMilkIn @ltmhyd @Ratnadeepretail @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/7piYCPixOx — Robin Zaccheus (@RobinZaccheus) February 9, 2024 ‘అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ షాప్‌లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో ఒక పురుగు పాకుతున్నట్లు కనిపించింది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ చేస్తున్నారా? ప్రజలు అనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. సంబంధిత ఆహార భద్రత అధికారులను అప్రమత్తం చేశామని.. సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని తెలిపింది. అదే విధంగా క్యాడ్బెరీ డెయిరీ మిల్క్ సైతం స్పందిస్తూ... ‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది. -
షాకింగ్ ఘటన: మహిళ మెదడులో.. కొండచిలువ..
ఓ మహిళ గత కొన్ని రోజులుగా విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఇవన్నీ సాధారణమైనవే కదా అన్నట్లు మందులు వాడింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోగా మతిమరుపు వంటి జ్వరం వంటివి మరీ ఎక్కువైపోయాయి. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్‌గానే వచ్చాయి. ఇక చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా..ఆమె మెదడులో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు వైద్యులు. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..64 ఏళ్ల మహిళ విరేచనాలు, వాంతులు దీర్ఘకాలిక జ్వరం తదితర వాటితో గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో వైద్యలు ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమె మెదడులో ఉన్న పరాన్నజీవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది కొండచిలువ శరీరంలో ఉండే ఒక విధమైన పురుగులాంటిది. అలా అని ఆమె పాములు పట్టే ఆమె కూడా కాదు. ఆమె కసలు పాములతో ఎలాంటి సంబంధ కూడా లేదు. అయితే ఆమె కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమె వంట చేయడం కోసం అని గడ్డి వంటివి కోసుకువచ్చేది. అలాగే ఆకుకూరలు వంటి పదార్థాలను తీసుకొచ్చేది. ఈ కొండచిలువ వాటిపై పాకడం లేదా దాని మలం ద్వారా ఈ జీవి ఉండొ అవకాశం ఉందని. ఆమె ఆకుకూరలు తిన్నప్పుడో లేదా మరేవిధంగానో ఆమె శరీరంలోకి వెళ్లి మెదడులో కూర్చొందన్నారు. అది ఏకంగా ఎనిమిది సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగనట్లు ఉందన్నారు. దీని కారణంగా ఆమె విపరీతమైన వాంతులు, కడుపునొప్పితో కూడిని విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొందన్నారు. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పరాన్నజీవిని తీసేసినట్లు తెలిపారు. సదరు పేషెంట్ కూడా నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుందని అన్నారు. ఈ కేసు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేసిందన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ వ్యాధులేనని చెప్పారు. జూనోటిక్ అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు. ఇలానే కనోనా వైరస్లు కూడా మానవాళిని భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. అందువల్ల మానవులు జంతువులను పెంచుకునేటప్పుడూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. టేప్‌వార్మ్ లాంటి బద్దె పురుగులు కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేసి మూర్చ వంటి రుగ్మతలను కలుగ చేస్తాయన్నారు. ఇవి జంతువుల శరీరంలో పరాన్నజీవిగా ఆశ్రయించి ఉండటం కారణంగా..మనం వాటిని ఆహారంగా తీసుకోవడంతో మన శరీరంలో చేరి నెమ్మదిగా అభివృద్ధి చెంది కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేస్తుందని అన్నారు. అందువల్ల బాగా ఉడకబెట్టి తగు జాగ్రత్తల పాటించి ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. (చదవండి: ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!) -
స్పైడర్ ‘మ్యాన్’!
తాండూరు టౌన్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన రామకృష్ణ ఇంట్లో మనిషి తలను పోలిన సాలె పురుగు (స్పైడర్)ను కనుగొన్నారు. దాన్ని చూసిన ఆ ఇంట్లోని పిల్లలు స్పైడర్ మ్యాన్‌లా ఉందంటూ కేరింతలు కొట్టారు. సాలె పురుగు వెనుక భాగం అచ్చం మనిషి తల, కళ్లు, నోరును పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ వివరణ ప్రకారం ఇది అరుదైన జాతి సాలె పురుగు అని తెలుస్తోంది. ఇలాంటిది గతంలో చైనా దేశంలో కనిపించినట్టు.. దీని శాస్త్రీయ నామం అరేనియస్ మిటిఫికస్ అని సమాచారం. -
చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
సుజోవు: చైనాలోని సుజోవు నగరంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కంటి నుంచి 20 నులిపురుగులను వైద్యులు బయటకు తీశారు. వాన్ అనే వ్యక్తికి కంటి నొప్పి బాగా రావడంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడిని పరీక్షించిన వైద్యులు కంటిలో నులిపురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. మొదటిలో కంటినొప్పి వచ్చిందని, తాను పెద్దగా పట్టించుకోలేదని వాన్ తెలిపారు. తరువాత ఆ నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. అప్పటికే అతడి కంటిలో 20 నులిపురుగులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. సాధారణంగా ఇలాంటి పురుగులు కుక్కలు, పిల్లులు కన్నీటిలో ఉంటాయి. అయితే వాన్ ఇంట్లోకానీ పని చేసే చోట కానీ ఎలాంటి పెంపుడు జంతువులు లేవని వాన్ తెలిపారు. అతడి కంటిలోకి ఈ పురుగులు ఎలా చేరాయో తెలియడం లేదు. ఇలాంటి ఘటనే అంతకు ముందు అమెరికాలో కూడా ఒకటి జరిగింది. ఒక మహిళ ముఖంలో ఏదో కదలుతున్నట్లు అనిపించగా ఆమె డాక్టర్‌ను సంప్రదించింది. ఆమె చర్మం కింద నులిపురుగులు కదులుతున్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు వైద్యాన్ని అందించారు. చదవండి: ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!! -
పత్తిపై ‘గులాబీ’ పంజా
సాక్షి, హైదరాబాద్: పత్తిపై గులాబీ రంగు పురుగు పంజా విసురుతోంది. మూడేళ్ల క్రితం పంటపై పెద్దెత్తున దాడి చేసిన ఈ పురుగు ఇప్పుడు మరోసారి విజృంభిస్తుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల సహా మిగిలిన జిల్లాల్లోనూ పత్తిని పీడిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురుగు ప్రారంభ దశలోనే ఉన్నా, మున్ముందు దీని విస్తరణ మరింత వేగవంతం కానుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. ఒకచోట గులాబీ రంగు పురుగుంటే, చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు అక్కడి వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో వారంలోగా దాని ఉధృతి కనిపించనుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో... రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 60.52 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వాణిజ్య పంట కావడంతో పత్తిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మద్దతు ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఇలాంటి సమయంలో గులాబీ పురుగు పత్తి చేలల్లో కనిపిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు ఈ పురుగు సోకినట్లు అంచనా. లింగాకర్షక బుట్టల ఏర్పాటుతో పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో నాలుగు పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉందని అంచనా. పురుగును గుర్తించాక అవసరమైన క్రిమిసంహారక మందులు వేస్తే చనిపోతుంది. అయితే లింగాకర్షక బుట్టలను సకాలంలో సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ యంత్రాంగం విఫలమైందని, దీంతో పురుగు ఉధృతి పెరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. బీటీ–2 విత్తన వైఫల్యమే... బీటీ పత్తి విత్తనాలు రాకముందు కాయతొలిచే పురుగుల ఉధృతితో తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బీటీ రాకతో ఈ కాయతొలిచే శనగ పచ్చ పురుగు, మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు తాకిడి తగ్గింది. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. బీటీ–1 టెక్నాలజీని 2002లో మోన్శాంటో పరిచయం చేసింది. 2006 వరకు బాగానే ఉన్నా తర్వాత ఈ బీటీ–1 గులాబీరంగు పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో దాని స్థానే బీటీ–2ని తీసుకొచ్చింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత బీటీ–3ని తీసుకొచ్చినా.. దీంతో జీవ వైవిధ్యానికే నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దేశంలో దానికి అనుమతివ్వలేదు. బీటీ టెక్నాలజీ విఫలమైనా దేశంలో బీటీ–2 విత్తనాలనే రైతులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రత్యామ్నాయం వైపు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎకరాకు సరాసరిన 10–12 క్వింటాళ్ల వరకు పత్తి ఉత్పత్తి కావాల్సి ఉండగా, గులాబీ రంగు పురుగుతో 6–7 క్వింటాళ్లకు పడిపోయింది. పైగా గులాబీ రంగు పురుగుతో పత్తి పంట పోయినా రైతులకు బీమా సౌకర్యమే లేదు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గులాబీ రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం చేసింది. పైగా విత్తన కంపెనీల నుంచి కూడా పరిహారం ఇప్పించింది. గులాబీ రంగు పురుగుతో నష్టం ఇలా.. ఈ పురుగు తాకిడి పంట పూత దశ నుంచి మొదలై పంట చివరి దశలో ఎక్కువగా నష్టపరుస్తుంది. గులాబీ రంగు పురుగు సోకిన పత్తి కాయలను చూస్తే దాంట్లో దూది నల్లగా మారి, నాణ్యత దెబ్బతిని ఉంటుంది. బరువు తగ్గటంతో దిగుబడి తగ్గుతుంది. లేత కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాయలపై 2 మిల్లీమీటర్ల పరిమాణం వరకు రంధ్రాలు కనిపిస్తాయి. పంట కాలాన్ని నవంబర్ తర్వాత పొడిగించడం వల్ల కూడా గులాబీరంగు పురుగు వస్తుంది. లింగాకర్షక బుట్టలతో పురుగును నియంత్రించవచ్చు. పంట నాశనం 12 ఎకరాల్లో పత్తి సాగు చేశా. అధిక వర్షాలకు తోడు పం టకు గులాబీ రంగు పురుగు ఆశించింది. పూత, కాతను పురుగు నాశనం చేసింది. ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదు. – మిర్యాల విక్రమ్‌రెడ్డి, బీరోలు, ఖమ్మం జిల్లా కాయ రాలిపోయింది 8 ఎకరాల్లో పత్తిని సాగు చేశా. కౌలుతో కలుపుకొని ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి అయ్యింది. గులాబీ రంగు పురుగుతో కాయ రాలిపోయింది. అధిక వర్షాలు కూడా తోడుకావడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. – బాగం రవి,సిద్దిక్‌నగర్, ఖమ్మం జిల్లా దున్నేద్దామనుకుంటున్నా... 15 ఎకరాల్లో పత్తి వేశా. అందులో నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. ఒకసారి దూది తీసినం. ఐదు క్వింటాళ్లు వచ్చింది. ఇప్పుడు రెండోసారి తీద్దామంటే పురుగువచ్చింది. ఎకరానికి రూ. 35 వేలు పెట్టుబడి పెట్టిన. పంట నాశనం కావడంతో దీన్ని దున్నేద్దామని అనుకుంటున్నా. – అండె అశోక్, పొన్నారి, ఆదిలాబాద్ జిల్లా -
గొంతు నొప్పికి వైద్యులు చెప్పిన కారణం తెలిస్తే..
టోక్యో : జలుబు, గొంతు నొప్పి పట్టి పీడిస్తుంటే ఓ మహిళ వైద్యానికి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ డాక్టర్లు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యింది. గొంతునొప్పికి మందులు ఇస్తారని ఆశించిన మహిళకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. మహిళ నొప్పికి కారణం ఆమె గొంతులో సజీవంగా ఉన్న పురుగు ఉందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతింది. ఈ ఆశ్చర్యకర సంఘటన జపాన్‌లో చోటుచేసుకుందిం. ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ హైజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. టోక్యోకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇటీవల జపాన్ రాజధాని సెయింట్ లూకాస్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసుకుంది.తరచూ తలనొప్పి: యువతి మెదడులో.. జపానీస్ వంటకం షాషిమి(చేపలు, లేదా ఇతర మాంసాన్ని చిన్న ముక్కులుగా కోసి పచ్చివి తినడం) తిన్న తర్వాత తన గొంతులో నొప్పి మొదలైందని వైద్యులకు తెలిపింది. దీంతో సదరు మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 1.5 అంగుళాల పొడవైన, 1 మి.మీ వెడల్పున్న పురుగు ఉన్నట్లు తెలిపారు. అనంతరం చికిత్స చేసి దానిని తొలగించగా అది ఇంకా సజీవంగానే ఉండటం గమనార్హం. అదృష్టవశాత్తు పురుగును తొలగించిన తరువాత మహిళా ఆరోగ్య పరిస్థితి కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. పురుగుకి డీఎన్ఏ పరీక్ష చేయగా అది ఎర్రటి వానపాముగా గుర్తించారు. ఇది పచ్చి మాంసం తినేవారికి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. (మూడు కళ్లతో బాబు: నిజమేనా?) (ఈ వింత చూశారా? 50 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందట) -
కత్తెరపై సేంద్రియ విజయం!
మన దేశంలో గత సంవత్సర కాలంగా మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు అతలాకుతలం చేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మన శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎన్నో రకాల పురుగులను చూశాం కానీ, ఇటువంటి వేగం, ఉధృతితో పంటకు నష్టం చేయగల కీటకాన్ని చూడటం ఇదే తొలిసారి అని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న పురుగుమందులన్నీ తెచ్చి పిచికారీ చేస్తున్నా వారం తిరగక ముందే పురుగు యథాస్థితికి వచ్చేస్తోంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో కత్తెర పురుగు నివారణ ఖర్చు మెండై కూర్చుంది. కేవలం రసాయనిక పురుగు మందులకే ఎకరానికి రూ. 2,500 – 4,000 వరకు రైతులు ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఒక మహమ్మారిలా దాపురించింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో రబీ మొక్కజొన్న కూడా దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో కత్తెర పురుగుపై జరిగిన పరిశోధనలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. దీనికి సారథ్యం వహిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గత 8 నెలల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో జరిగిన విస్తృతమైన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చాయి. రబీలో ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించగలమని డా. శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’ కి తెలిపారు. మొక్కజొన్న రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఆ ప్రయోగ వివరాలు.. కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) మొక్కజొన్న రైతులను వణికిస్తోంది. అయితే, పూర్తి సేంద్రియ పద్ధతుల్లో కొన్ని ప్రత్యేక మెలకువలు పాటిస్తూ సాగు చేస్తే ఈ పురుగు అంత భయంకరమైనదేమీ కాదని డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించి గడచిన ఖరీఫ్, రబీ కాలాల్లో మొక్కజొన్నను పండించి కత్తెర పురుగును జయించే పద్ధతులపై నిర్థారణకు వచ్చారు. ఏయే దశల్లో ఏయే చర్యలు తీసుకున్నదీ, వాటి ఫలితాలు ఎలా వచ్చినదీ నమోదు చేశారు. భూసారం పెరిగితే కత్తెరకు తెర! మొక్కజొన్న సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే తొలుత భూ సారం పెంపుదలపై దృష్టి పెట్టాలి. అంతకుముందు పంట పూర్తయిన తర్వాత 3 నెలలు భూమికి విరామం ఇచ్చిన తర్వాత మొక్కజొన్న సాగు చేశారు. గుంటకు 100 కిలోల చొప్పున.. ఎకరానికి 4 టన్నుల (2 ట్రాక్టర్ ట్రక్కుల) గొర్రెల ఎరువు వెదజల్లి దున్ని విత్తనం వేశారు. విత్తనం మొలకెత్తిన తర్వాత 2వ వారంలో.. గుంటకు 10 కిలోలు.. ఎకరానికి 400 కిలోల చొప్పున ఘన జీవామృతం చల్లారు. వర్షం వచ్చినప్పుడో లేక నీటి తడి పెట్టినప్పుడో.. పది రోజులకోసారి.. వేస్ట్ డీ కంపోజర్ లేదా జీవామృతాను.. అదొకసారి, ఇదొకసారి ఎకరానికి వెయ్యి లీటర్ల చొప్పున ఇస్తూ వచ్చారు. భూసారం పెంపుదలకు ఈ రెంటినీ కలిపి మొత్తం 6 సార్లు నేలకు నీటితోపాటు పారగట్టినట్లు శాస్త్రవేత్త డి.నరేశ్ తెలిపారు. కత్తెర పురుగు బెడద 5–10 వారాలు కత్తెర పురుగు జీవిత చక్రం వర్షాకాలంలో 5 వారాలు, (ఖరీఫ్) శీతాకాలం (రబీ)లో 10 వారాలు ఉంటుందని, ఈ రెండు కాలాల్లోనూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సమర్థవంతంగా అరికట్టామని డా. శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. రబీ పంట కోతకు సిద్ధమవుతోంది. ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి సాధించగలిగే పరిస్థితి ఉందని ఆయన ధీమాగా చెబుతున్నారు. రైతుకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయవచ్చని.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులెవరైనా ఈ పద్ధతులను అనుసరించి కత్తెర పురుగు దాడి నుంచి మొక్కజొన్న పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చనడంలో సందేహం లేదన్నారు. మొదటి 2–3 వారాలు కత్తెర బెడద ఎక్కువ మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత తొలి 2–3 వారాలు అతి సున్నితమైన రోజులు. మొలకెత్తిన రెండో వారానికి పంట 3 ఆకుల దశలో ఉంటుంది. 3వ వారం తర్వాత సుడి ఏర్పడుతుంది. 6 ఆకుల దశ వరకు.. అంటే విత్తిన తర్వాత 35 రోజుల వరకు.. కత్తెర పురుగు బెడద నుంచి పంటను రక్షించుకోగలిగితే చాలా వరకు గట్టెక్కినట్టే. ఆ తర్వాత దశలో కత్తెర పురుగు ఆశించినా పంట ఎదుగుదల వేగాన్ని పుంజుకుంటుంది కాబట్టి నష్టాన్ని పూడ్చుకోగలుగుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే.. పంట మోకాలెత్తుకు ఎదిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుము ఎత్తుకు పెరిగిందంటే చాలు.. ఒక వైపు కత్తెర పురుగు తింటున్నా మొక్క లెక్క చేయదు. ఎదుగుదల ఆగదు. వేపనూనె, అగ్ని అస్త్రం, లొట్టపీచు కషాయం.. పంట తొలి 2–3 వారాల్లోనే తల్లి పురుగు గుడ్లు విపరీతంగా పెడుతుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో వర్షం లేదా మంచు నీటి చుక్కలతో సుడి నిండి ఉండటంతో పురుగు సుడిలోకి వెళ్లలేదు. ఆ మేరకు సుడికి ప్రకృతి సిద్ధంగానే రక్షణ లభిస్తుంది. ఎండాకాలం పంటకు ఈ రక్షణ తక్కువ. తల్లి పురుగు లేత ఆకులపై, మొదళ్ల దగ్గర కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన లేత లార్వాలు(పురుగులు) ఆకులను తినేస్తుంటాయి. ఈ దశలో వేపనూనె (లీ. నీటికి 1500 పీపీఎం వేపనూనె 5 ఎం.ఎల్.) లేదా అగ్ని అస్త్రం (10%. 10 లీ. నీటికి 1 లీ. అగ్ని అస్త్రం) లేదా లొట్ట పీచు కషాయం (10%. వంద లీ. నీటిలో 10 కిలోల లొట్టపీచు ఆకులు 3,4 పొంగులు పొంగించి, చల్లార్చి వాడాలి) పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధిలో వీటిల్లో ఏదో ఒక దాన్ని 3 లేదా 4 సార్లు పిచికారీ చేయాలి. కత్తెర పురుగు గుడ్లు నశిస్తాయి. లేత లార్వాలు మాడిపోయి చనిపోతాయి. మట్టి, ఇసుక, ఊకతో సుడికి రక్షణ మొక్కజొన్న మొలిచిన 4వ వారం, ఆ తదనంతర దశలో సుడి లోపలికి చేరే కత్తెర పురుగు తీవ్రనష్టం కలిగిస్తుంది. అయితే, పొడి మట్టిని లేదా ఇసుకను లేదా వరి ఊక వంటి పదార్థాలను మొక్కజొన్న మొక్క సుడిలో పోయాలి. అప్పటికే సుడిలో ఉండే పురుగు చనిపోతుంది. బయటి నుంచి పురుగులు లోపలికి వెళ్లలేవు. పంట మొలిచిన తర్వాత 4వ వారంలో సుడిలో వేసిన పదార్థం వల్ల.. సుడి నుంచి ఆ తర్వాత వెలువడే 3 నుంచి 5 ఆకులను కత్తెర పురుగు నుంచి కాపాడగలుగుతాయి. కండెలను మొక్కజొన్న మొలిచిన తర్వాత 7వ వారంలో మొక్క సుడుల్లో పొడి మట్టి లేదా ఇసుక లేదా వరి ఊకను మరోసారి పోయాలి. ఆ తర్వాత సుంకు (మగ పూత) బయటకు వస్తుంది. కత్తెర పురుగు సుంకును ఆశించినప్పటికీ పంటకు పెద్దగా నష్టం జరగదు. పైన సూచించిన విధంగా 7వ వారంలోగానే 90% పైగా కత్తెర పురుగులను నాశనం చేయగలగాలి. ఈ దశలో అదుపు చెయ్యలేకపోతే.. ఆ తర్వాత దశలో ఎదుగుతున్న లేత కండెలను ఆశించి లేత గింజలను, కండె భాగాలను పురుగులు తినేసి నష్టం కలిగిస్తాయి. ఈ వయసుకు మొక్కలు మనిషి ఎత్తున పొలంలో వత్తుగా ఉంటాయి. కాబట్టి కండెలపై కషాయాన్ని లేదా ద్రావణాన్ని పిచికారీ చేయడం కష్టమే. జీవ నియంత్రణ ద్రావణాలతో మేలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే రైతుల పొలాల్లో మెండుగా వృద్ధి చెందే మిత్రపురుగులు మొక్కజొన్న కంకులకు రక్షణగా నిలుస్తాయి. జీవ నియంత్రణ సూక్ష్మజీవులతో కూడిన ద్రావణాలను పిచికారీ చేయడం వల్ల కత్తెరు పురుగు లార్వాలు రోగాల బారిన పడి నశిస్తాయి. బవేరియా, నొమేరియా శిలీంధ్రాలు.. బీటీ బాక్టీరియా.. కీటక నాశక నులిపురుగులు(ఈ.పి.ఎన్.).. ఎన్పీ వైరస్ ద్రావణాలను పిచికారీ చేశారు. వీటిలో అందుబాటులో ఉన్న ఏరెండిటినైనా మొక్కజొన్న మొలకెత్తిన 5 నుంచి 8 వారాల మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయడం వల్ల కత్తెర పురుగులు జబ్బుల పాలై చనిపోయాయని సస్యరక్షణ శాస్త్రవేత్త రవి పాల్థియ తెలిపారు. తడి వాతావరణంలో ఇ.పి.ఎన్. అత్యంత ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. కత్తెర పురుగును అరికట్టడానికి రసాయనిక పురుగుమందులను సకాలంలో వాడిన రైతులు తొలి దశల్లో కత్తెర పురుగును అదుపు చేయగలుగుతున్నారు. అయితే, సమయం మీరినప్పుడు పంటకు నష్టం జరుగుతోంది. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల రైతుకు అదనపు ఖర్చు కావడంతోపాటు మిత్ర పురుగులు కూడా నశిస్తాయి. కండె దశలో పంటకు ప్రకృతిసిద్ధంగా మిత్రపురుగుల ద్వారా రక్షణ దొరక్క దిగుబడి నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో జరుగుతున్నది ఇదే. పైన సూచించిన విధంగా సస్యరక్షణకు సేంద్రియ పద్ధతులను సకాలంలో పాటించి మంచి దిగుబడులు తీయవచ్చని డా. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. ప్రతి రైతూ కత్తెర పురుగును సమర్థవంతంగా కట్టడి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా పండించిన రసాయనిక అవశేషాల్లేని మొక్కజొన్నలు మనుషులకు, పశువులు, కోళ్లకు కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాయన్నారు. (డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి– 99082 24649) అగ్ని అస్త్రం ధాటికి బుగ్గి అయిన కత్తెర పురుగు బీటీ బాక్టీరియా పిచికారీతో మాడిపోయిన కత్తెర పురుగు ఈపీ నులిపురుగుల ధాటికి చనిపోయిన కత్తెర పురుగు బవేరియా శిలీంద్రం పిచికారీతో... – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పురుగును చంపిన మనిషి!
ఒకపక్క కీచురాళ్ల రొద.. ఇంకోపక్క ఝుమ్మంటూ తూనీగలు.. పచ్చటి గరిక, గడ్డిలో ఎర్ర ఎర్రటి ఆరుద్రలు! చిమ్మచీకట్లో పచ్చటి వెలుగులు జిమ్ముతూ మిణుగురులు! వాన చినుకుకు తడిసిన మట్టిలోంచి ఆత్రంగా బయటకొస్తూ.. వానపాములు! అగ్గిపెట్టెల్లో దాచుకుని మురిసిపోయిన బంగారు పురుగులు పేడ పురుగులు.. ఉసిళ్లు...తేనెటీగలు..అబ్బో చెప్పుకుంటూ పోతే.. పురుగుల పేర్లు సహస్రం దాటేస్తాయి! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట! ప్రకృతి గత వైభవం! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇంకొన్నేళ్లకు.. ఈ భూమ్మీద పురుగన్నది లేకుండా పోతుంది. సోవాట్.. పురుగుల్లేకపోతే మనకేమిటి నష్టం? ఈ భూమ్మీద ఉండే 700 కోట్లపై చిలుకు మనుషుల కంటే పురుగుపుట్ర బరువు 17 రెట్లు ఎక్కువ అని! సముద్రాలు, చెరువుల్లోని జలచరాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ క్రిమి కీటక సామ్రాజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విషయం చాలా కాలంగా వింటున్నదే అని అంటున్నారా.. అయితే ఇదిగో తాజా వార్త. కొన్ని దశాబ్దాల్లో ఉన్న కీటకాల్లో కనీసం 40 శాతం కనిపించకుండా పోతాయని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి. బయలాజికల్ కన్సర్వేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ప్రమాదం ఒక్క తేనెటీగలకే పరిమితం కాలేదు.. సీతాకోకచిలుకలు, పేడ పురుగులు కూడా వినాశనం అంచుల్లో ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఈ చిన్ని జీవాల పాత్రను గుర్తించకపోయినా.. కాపాడుకునే ప్రయత్నం చేయకపోయినా.. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని స్పష్టం చేస్తోంది. గత 40 ఏళ్లలో జరిగిన 73 వేర్వేరు పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. భూమ్మీది మొత్తం పురుగుల బరువు ఏటా 2.5% చొప్పున తగ్గుతోందని.. అమెరికా సహ అనేక దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది ప్రపంచ సమస్యే అన్నది సుస్పష్టం. కారణాలేమిటి? కీటక జాతుల నాశనానికి 4 కారణాలు ఉన్నా యని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా చెప్పుకోవాల్సింది... ఆవాస ప్రాంతాల నష్టం. అడవులు, చెట్లు.. పచ్చిక బయళ్లు.. వంటివి తగ్గిపోవడం, భూములను వ్యవసాయానికి వాడుకోవడం ఎక్కువ కావడం వంటివన్న మాట. రెండో కారణం.. వ్యవసాయం లో కీటకనాశినుల వాడకం పెరగడం. శిలీంధ్రాల కోసం ఫంగిసైడ్, చిన్న చిన్న పురుగుల కోసం పెస్టిసైడ్స్, కీటకాల కోసం ఇన్సెక్టిసైడ్స్.. ఇలా వేర్వేరు పేర్లతో వాడుతున్న రసాయనాలు భూమిని.. పరిసరాల్లోని పురుగులను నాశనం చేసేశాయన్నది నిర్వివాద అంశం. ఇప్పటివరకూ నశించిపోయిన కీటకాల్లో 8 శాతం కీటకనాశినుల కారణంగానే అని అధ్యయనం చెబుతోంది. ఎరువులు, పారిశ్రామిక వ్యర్థాలు మూడో కారణమైతే.. మారిపోతున్న వాతావరణం ఇంకో కారణమని తేల్చింది. వీటితోపాటు.. ఇన్వెసివ్ స్పీషీస్ (ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించి.. సహజ శత్రువులు లేనికారణంగా విచ్చలవిడిగా పెరిగే జీవజాతులు), పరాన్నజీవులు, వ్యాధులూ కీటకాల సంతతి తగ్గిపోయేందుకు దోహ దపడుతున్నాయి. మరి ఏం చేద్దాం? నశించిపోతున్న కీటకజాతిని రక్షించుకునేందుకు మనుకున్న సులువైన ఉపాయం సేంద్రీయ ఆహారం వాడకాన్ని ఎక్కువ చేయడమే. పరిసరాల్లో వీలైనన్ని ఎక్కువ జాతుల మొక్కలను పెంచితే.. అవి కాస్తా కీటకాలకు ఆవాసంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ వీటిఅవసరమేమిటి? కీటక జాతులు తగ్గిపోతుండటం పర్యావరణానికి జరుగుతు న్న నష్టానికి సూచిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. వానపాములనే తీసుకుంటే.. మట్టిని తిని అవి విడిచే వ్యర్థాలు భూమిని సారవంతం చేస్తాయి. వీటిమాట ఇలా ఉంటే.. మిగిలిన పురుగులు కీటకాలు.. ఆహార పిరమిడ్‌లో అట్టడుగున ఉంటూ.. మిగిలిన పక్షులు, జంతువులకు ఆహారంగా మారతాయి. పరపరాగ సంపర్కం ద్వారా పూల పుప్పొడిని, విత్తనాలను సుదూర ప్రాంతాలకు విస్తరించడంలోనూ వీటి పాత్ర చాలా ముఖ్యం. ఇలాంటి పర్యావరణపరమైన సేవలన్నింటికీ విలువ కడితే.. అది ఏటా కొన్ని కోటానుకోట్లకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి కీలకమైన పురుగులు నాశనమైపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం ఖాయం. కన్యా శాస్త్రవేత్త డినో మార్టిన్స్ మాటల్లో చెప్పాలంటే.. ‘కీటకాల్లేపోతే.. ఆహారమే లేదు... అంటే మనుషులే లేరు’. -
గులాబీ పురుగును బుట్టలో వేయరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తున్నా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదు. నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గులాబీ పురుగును గుర్తించి నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు లింగాకర్షక బుట్టలను రైతులకు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గులాబీ రంగు పురుగు పత్తి చేలలో విజృంభిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఈసారి అంచనాలకు మించి 44.30 లక్షల (105%) ఎకరాల్లో సాగైంది. గత నెలలోనే దాడి ప్రారంభం.. గత నెల్లోనే పత్తిపై గులాబీ పురుగు దాడి ప్రారంభమైందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తిని పీడిస్తున్నట్లు అంచనా వేశాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ దీని జాడలున్నట్లు గుర్తిం చాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో గులాబీ రంగు పురుగు విస్తరించి ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. అయితే దాన్ని నియంత్రించడంలో మాత్రం నామ మాత్రపు చర్యలకే పరిమితమయ్యాయి. 25 వేల ఎకరాలకే బుట్టలు.. గులాబీ రంగు పురుగును గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను వాడాల్సి ఉంటుంది. అయితే వీటిని కేవలం తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎకరాలకే సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలు సైతం తయారుచేసింది. దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల వరకు పురుగు సోకిందని అంచనా వేసినా అధికారులు కేవలం 25 వేల ఎకరాలకే లింగాకర్షక బుట్టలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా ఒక్కో ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను వాడాలి. ఆ ప్రకారం 25 వేల ఎకరాలకు 2 లక్షల లింగాకర్షక బుట్టలను మాత్రమే వ్యవసాయశాఖ ఆర్డర్ చేసింది. ఇదిలాఉంటే మరో వైపు గులాబీ పురుగు ఇంతింతై విస్తరిస్తోంది. ఇప్పటికే బుట్టలు అమర్చాల్సి ఉన్నా వ్యవసాయశాఖ ఆర్డర్లకే పరిమితమైంది. అవెప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. రైతుల్లో ఆందోళన.. కొన్ని చోట్ల గులాబీ పురుగు కారణంగా రైతులు పత్తి మొక్కలను పీకేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికేడాదికి గులాబీ పురుగు ఉధృతి పెరుగుతోంది. వ్యవసాయశాఖ దీన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించి గులాబీ పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ వ్యవసాయశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేయడం లేదు. గతేడాది గులాబీ పురుగు కారణంగా పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 5–6 క్వింటాళ్ల మేర తగ్గింది. గతేడాది 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సాగు ఎంత పెరిగినా గులాబీ పురుగు నుంచి రక్షణ కల్పించకుంటే తమ శ్రమంతా వృథాయేనని రైతులు వాపోతున్నారు. లాభాలు దేవుడెరుగు నష్టాలతో అప్పులే మిగులుతాయని ఆందోళన చెందుతున్నారు. -
బియ్యంలో పురుగు
బియ్యంలో పురుగు ఉంటుంది.బియ్యపు గింజలా ఉంటుంది.కలగలిసిన పురుగును కనిపెట్టడం కష్టం.కాని క్లూ ఉంటుంది.సరైన క్లూ దొరికితే పురుగు పట్టుబడుతుంది.చట్టం ఆ పురుగు చుట్టూ బిగుసుకుపోతుంది. హార్యానాలో ఆర్మీ క్యాంప్.‘ఘర్ జానా హై’... అని పెద్దగా అరిచాడు ఒక జవాను.అది సెలవులు ఇచ్చే టైము. అందరూ ఉత్సాహంగా ఉన్నారు.‘బీవీ కో చుమ్మా దేనా హై’ అని నవ్వాడు కిరణ్.‘ఏయ్... ఏంట్రా నీ వాగుడు’ అన్నాడు ఒక మిత్రుడు కిరణ్‌తో.‘లేకుంటే ఏంట్రా మీరంతా. ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా పెళ్లాం పాదాల దగ్గర వాలిపోదామా అని. నాకు చూడు ఒంటరిగాణ్ణి. హాయిగా సెలవుల్లో తిరుగుతా. అన్నింటిమించి మా అన్నయ్య వొదిన దగ్గర సరదాగా గడుపుతా’ అన్నాడు కిరణ్.‘ఈ వయసులో పెళ్లి పిచ్చో సినిమాల పిచ్చో ఉండాలి. నువ్వు మాత్రం అన్నా వదినల పిచ్చోడివి’ అని ఆటపట్టించారు ఫ్రెండ్స్.కిరణ్ హాయిగా నవ్వేశాడు. అన్నా వదినల దగ్గరకు వెళ్లినా ఈసారి పెళ్లి బలవంతం తప్పదేమో అనుకుంటూ బ్యాగ్ సర్దుకొని స్టేషనుకు చేరుకున్నాడు. ‘ఇది కోడి కూరా.. ఇది చింతాకు పులుసు... ఇది గోంగూర రొయ్యలు’... వరుస పెట్టి పెడుతూ ఉంది వదిన మణి.‘ఇంకో నాలుగు తెచ్చి పెట్టవే. ఏ ఆర్మివాడైనా బుల్లెట్‌తో పోయాడంటే గౌరవం. భోం చేసి పోయాడంటే ఎంత అప్రదిష్ట’ నవ్వుతూ అన్నాడు.నెల్లూరు జిల్లాలోని ఒక టౌన్ అది.సెలవు ఇవ్వగానే కిరణ్ సరాసరి అన్నా వదినల ఇంటికి వచ్చేశాడు. అక్కడికి పది మైళ్ల దూరంలో ఉన్న పల్లెలో కిరణ్ తల్లిదండ్రులు ఉంటారు. కాని సాధారణంగా అక్కడికి వెళ్లడు. వచ్చాడంటే ఇక్కడే.‘కిరణ్ సంగతి ఏమోకాని మీరు తినకపోతే బడితె పూజే’ భర్త ప్లేట్లో కూడా అన్నీ వడ్డిస్తూ అంది మణి.కిరణ్ నవ్వుతూ వాళ్లనే చూస్తూ ఉన్నాడు.వచ్చిన ప్రతిసారీ వాళ్లనే చూస్తూ ఉంటాడు. ప్రసాద్ బియ్యం వ్యాపారం చేస్తాడు. మణి ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు. ఐదొకరు, ఏడొకరు చదువుతున్నారు. నలుగురూ హ్యాపీగా ఉంటారు. ప్రసాద్ మాటే వేదవాక్కు అన్నట్టుగా మణి ఉంటుంది. ప్రసాద్ తిన్నాక అదే కంచంలో తింటుంది. ఎంత ఆలస్యంగా వచ్చినా ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నింటికి మించి ఎప్పుడూ నవ్వుతూఉంటుంది. వారిద్దరు కొట్లాడుకున్నట్టు కిరణ్ ఎప్పుడూ చూళ్లేదు.అందుకే ఆ వాతావరణంలో ఉంటాడు తను. ఇది చూసి ఇరుగూ పొరుగూ ‘సొంత అన్నదమ్ములు కూడా ఇలా ఉండరు’ అంటూ ఉంటారు. అవును. ప్రసాద్, కిరణ్ చిన్నాన్న పెదనాన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కిరణ్ అందుకే చనువుగా ఇక్కడ ఉంటాడు.భోజనం ముగిస్తుండగా పిల్లలు లోపలికొచ్చారు. ‘బాబాయ్... మా స్కూల్ యానివర్సరీ ఉంది ఎల్లుండి... నువ్వు రావాలి’ అంది పెద్దమ్మాయి. ‘అవును కిరణ్.. నువ్వు రా. ఈ మనిషికి అలాంటివేవీ పట్టవు. ఎంత పిలిచినా రాడు’ అంది మణి.‘అలాగే... తప్పకుండా వెళ్దాం వదిన’ అన్నాడు కిరణ్.అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు.‘ఈసారి సంబంధం ఖాయం చేసి వెళ్రా’ అన్నాడు ప్రసాద్.‘బాబోయ్... ఇప్పుడే పెళ్లొద్దు’ హాస్యమాడాడు కిరణ్.ప్రసాద్ సీరియస్ అయ్యాడు.‘పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇలా ఎంత కాలం’మణి కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుంది.‘అవునయ్యా. పెళ్లికి ఓకే అనకపోతే ఇక మా ఇంటికి రావద్దు’ అంది.ప్రసాద్‌కు వ్యవహారం సీరియస్‌గా ఉన్నట్టుందని అర్థమై ‘సరే... మీ ఇష్టం’ అన్నాడు. ఏప్రిల్ 18. 2016.తెల్లవారి మంచం మీద నుంచి హడావిడిగా నిద్ర లేపుతోంది తల్లి.‘రేయ్ కిరణ్... లేవరా... అన్నయ్య కనపడటం లేదట’‘ఏంటి?’‘ప్రసాద్ కనిపించడం లేదట’కంగారుగా లేచాడు కిరణ్. రాత్రే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఏమై ఉంటుంది? ఆఘమేఘాల మీద టౌన్‌కు చేరుకున్నాడు.ఇంటి దగ్గర ప్రసాద్ ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు. సెల్ నాట్ రీచబుల్ వస్తోంది.‘కిరణ్’... కిరణ్‌ను చూసి మణి ఏడ్చేసింది.‘ఏం అయ్యుండదులే వదినా. కంగారు పడకు’ అన్నాడు కిరణ్. ఈలోపు ఊరి పొలిమేరలో పొదల దగ్గర ఓ బైక్ పడి ఉందని ఊర్లో వాళ్లు ఇంటికి వచ్చి చెప్పారు. వెళ్లి చూస్తే అది ప్రసాద్ బండే. మణి ఆలశ్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.‘సార్... మా అల్లుడికి బియ్యం వ్యాపారులతో కొన్నిసార్లు పడకపోవడం మేం చూశాం. వాళ్లే ఈ పని చేసి ఉంటారు’ అన్నాడు అనుమానంగా మణి తండ్రి. పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. వాళ్లనూ వీళ్లనూ ఆచూకీ తీశారు. గట్టిగా ఏమీ కనిపించలేదు. మూడు రోజులు గడిచాయి. కిరణ్ తిరిగి తిరిగి అలసిపోయాడు. మరోవైపు అతడికి సెలవులు అయిపోవచ్చాయి. అసలే ఆర్మీతో వ్యవహారం. వెళ్లి తీరాలి. బరువెక్కిన గుండెతో వదిన దగ్గరకు వచ్చాడు.‘వదినా! నా సెలవులైపోయాయి. లీవ్ పొడిగించుకోవడం కుదరడం లేదు. అన్నయ్య త్వరలోనే ఇంటికి వస్తాడు ధైర్యంగా ఉండు. పిల్లలు, నువ్వూ జాగ్రత్త’ అన్నాడు.కన్నీరుతో మౌనంగా ఉండిపోయింది మణి. ఏప్రిల్ 21, 2016 వింజమూరు–గుండెమడకల మధ్య చిట్టడవిలో ప్రసాద్ మృతదేహం దొరికింది.మెడపై, ఛాతిపైభాగాన, కడుపులో, భుజాలపై 11 కత్తిపోట్లు ఉన్నాయి. అంతక్రూరంగా హత్యచేశారంటే పగబట్టిన వాళ్లే అయి ఉంటారు. వాళ్లెవరనేది ఇప్పుడు తేలాలి.పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బియ్యం వ్యాపారంలోని లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చని నిర్ధారణకొచ్చారు. ప్రసాద్‌తో సంబంధాలున్న ప్రతి ఒక్క వ్యాపారిని వేరువేరుగా విచారణ చేపట్టారు. ప్రసాద్ కాల్ డీటైల్స్‌ను పరిశిలించారు. ఏ చిన్నపాటి క్లూ లభ్యం కాలేదు. కేసు ఎటూ తేలడం లేదు. ఎనిమిది నెలలు గడిచిపోయాయి. జనవరి 28, 2017. కేరళ నుంచి ఒక పార్శిల్ మణి ఇంటికి వచ్చింది. అది అక్కడి ఒక ఆయుర్వేద హాస్పిటల్ నుంచి వచ్చిన మందుల ప్యాకెట్. దాని మీద కిరణ్ పేరు ఉంది. సెలవుల్లో ఇక్కడకు వచ్చే ముందు కేరళ తిరిగి వచ్చినట్టు కిరణ్ చెప్పడం మణికి గుర్తు ఉంది. మరి అక్కడ ఆయుర్వేద హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడు? మణి మందుల పేర్లు చూసింది. ఇంటర్నెట్లో సెర్చ్ కొట్టింది. అవన్నీ పురుషపటుత్వానికి ఉపయోగపడే మందులు. సర్ప్రైజ్ గిఫ్ట్‌గా వాటిని పంపుతున్నట్టు మళ్లీ విజిట్‌ను ఆశిస్తున్నట్టు ఆ లెటర్లో ఉంది. వాటిని తండ్రికి చూపించింది మణి. ఆయనకు కిరణ్ వ్యవహారం ముందు నుంచి గిట్టదు. అంత ప్రేమించే అన్నయ్య కనిపించకపోతే సెలవైపోయిందని వెళ్లడమే ఆయనకు నచ్చలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులను కలిశాడు.ఎస్.ఐ ఆ మందులను చూసి ‘ఇలాంటివి కుర్రాళ్లు వాడటం మామూలే. దీని ఆధారంగా ఎలా అనుమానిస్తాం’ అన్నాడు.‘అది కాదండీ... పోయినసారి వచ్చినప్పుడు ఫ్రెండ్ పెళ్లి ఉందని సెలవు ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. అప్పుడు ఎక్స్టెండ్ చేసుకోగా లేనిది అన్నయ్య కనపడకపోతే చేసుకోడా’ అన్నాడు మణి తండ్రి.ఎస్.ఐకి ఏదో క్లూ దొరికినట్టే అయ్యింది.కిరణ్‌కు సంబంధించిన ఒక్కొక్క వివరం సేకరించడం మొదలుపెట్టాడు. సరిగ్గా పది రోజులకు ఆర్మీ పర్మిషన్ తీసుకుని కిరణ్‌ను పట్టుకొని జైల్లో తోశాడు. కిరణ్ హర్యానాలోని మానేసర్ ఎన్ఎస్జీ క్యాంప్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు సొంత ప్రాంతానికి వచ్చి వెళుతుంటాడు. ఒక్కడే కొడుకు. కాని చిన్నతనం నుంచి ఇంట్లో శాంతి లేదు. తల్లిదండ్రుల వైవాహిక జీవితం సరిగా లేదు. ఎప్పుడూ కాట్లాడుకుంటూ ఉండేవారు. తను మాత్రం ఇలా కాకుండా కాబోయే భార్యతో బాగా ఉండాలని అనుకునేవాడు. కాని ఒకసారి ఊహించనిది జరిగింది. వేశ్యావాటికకు వెళ్లినప్పుడు అతడి లోపం తెలిసింది. పెళ్లి జరిగితే అవమానం తప్పదని అర్థమైంది. మెరుగు కోసం రకరకాల మందులు వాడేవాడు. లాభం లేకపోయింది. కేరళలో డూప్లికేట్ ఆయుర్వేదశాలకు వెళ్లి అక్కడా మోసపోయాడు. ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయింది. బుద్ధి పాడైంది. ఈ నేపధ్యంలో ప్రసాద్–మణిల దాంపత్యం చూసి ఈర్ష్యతో రగిలిపోయాడు. తన జీవితంలో కుదరనిది అన్న జీవితంలో మాత్రం ఎందుకు అని భావించాడు. సెలవు మీద వచ్చినప్పుడు ప్రసాద్‌ని హత్యచేయాలని కత్తి కొనుగోలుచేసి తన వద్దనే ఉంచుకొన్నాడు. ఏప్రిల్ 17వ తేది సాయంత్రం స్కూల్ వార్షికోత్సవం కోసం ప్రసాద్ భార్య, ఇతర కుటుంబసభ్యులు స్కూల్‌కు వెళ్లారు. ప్రసాద్ ఇంటి దగ్గరే ఉండటంతో కిరణ్ వచ్చి స్నేహితులు పార్టీ ఇస్తున్నారని రమ్మని కోరాడు. ఇద్దరు ప్రసాద్ బైక్‌పై బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక బైక్‌ను నడపమని ప్రసాద్‌కు ఇచ్చి తను వెనుక కూర్చొన్నాడు. అటవీప్రాంతం వచ్చేసరికి బైక్‌ని స్లో చేయమన్నాడు. ఒక్కసారిగా ప్రసాద్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని బోర్లపడవేసి అక్కడ నుంచి బైక్‌పై టౌన్‌కి బయలుదేరాడు. దారిలో పెట్రోల్ అయిపోవడంతో చెట్లలో పడేసి ఎవరికీ అనుమానం రాకుండా స్కూల్ వార్షికోత్సవ ఫంక్షన్లో పాల్గొని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు. ప్రసాద్ కోసం గాలించినట్టు నటించాడు. తాను చేసిన ఘాతుకం ఎప్పటికీ బయటకు రాదని భావించాడు. నేరం చేసిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని, పోలీసులు చిన్నపాటి క్లూతో నిందితుడ్ని కటకటాల వెనక్కి పంపారు. ఊరి పొలిమేరలో పొదల దగ్గర ఓ బైక్ పడి ఉందని ఊర్లో వాళ్లు ఇంటికి వచ్చి చెప్పారు. వెళ్లి చూస్తే అది ప్రసాద్ బండే. మణి ఆలశ్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ‘సార్... మా అల్లుడికి బియ్యం వ్యాపారులతో కొన్నిసార్లు పడకపోవడం మేం చూశాం. వాళ్లే ఈ పని చేసి ఉంటారు’ అన్నాడు అనుమానంగా మణి తండ్రి. – కె. హరిబాబు, సాక్షి, నెల్లూరు -
వీరింతే.. మారరంతే
♦ గోడౌన్లలో రేషన్ బియ్యం పరిశుభ్రత గాలికి ♦ ఉండలు కట్టి, పురుగు పట్టిన బియ్యమే సరఫరా ♦ అంగన్వాడీలు, విద్యార్థులకూ అవే దిక్కు ♦ మామూళ్ల మత్తులో అధికారులు బమోమెట్రిక్ వచ్చినా.. ఈ పోస్ పెట్టినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. తీరు మారలేదు. పేదోడి ఎండిన డొక్కలు నింపే రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగలేదు. గోడౌన్లో సరుకు రేషన్ దుకాణాలకు చేరకుండానే నల్లబజారుకు తరలిపోతోంది. ఈ మధ్యలో జరుగుతున్నదంతా అవినీతి నాటకమే.. ఈ దోపిడీ నాటకంలో అధికార పార్టీ నేతలు తెర వెనుక సూత్రధారులైతే.. రేషన్ డీలర్లు పాత్రధారులు. ఇవన్నీ తెలిసినా కళ్లప్పగించి చూస్తూ మామూళ్ల మత్తులో జోగే అధికారులు ప్రేక్షకులు. ఇదీ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు.. కాదు కాదు దోపిడీకి గురవుతున్న నిరుపేదల ఆకలి కన్నీరు. సాక్షి, అమరావతి బ్యూరో : సివిల్ సప్లయ్స్ అధికారుల తీరు మారలేదు. జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా గత నెలలో సివిల్ సప్లయ్స్ అధికారులు, గోడౌన్ ఇన్చార్జిలు, సీఎస్ డీటీలతో సమావేశం ఏర్పాటు చేసి పనితీరు మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాలేదు. గుంటూరు నగరంలో పలు రేషన్ షాపులకు తూకాలు వేయకుండానే డీలర్లకు సరుకు పంపారు. కొన్ని వాహనాలకు జీపీఎస్ లేకుండానే బియ్యాన్ని తరలించారు. గోడౌన్లలో పరిశుభ్రతను గాలికొదిలేశారు. గుంటూరు, తెనాలిలలోని గోడౌన్లలో బియ్యం పురుగు పట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. గోడౌన్లలో లీకేజీలు, ప్యూమిగేషన్ షెడ్యూల్ గురించి సిబ్బంది మరిచిపోయారు. గోడౌన్ల నుంచే నేరుగా సరుకు నల్ల బజారుకు తరలుతున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ తరువాత డీలర్లు, కార్డుదారులతో గుర్తు వేయించుకొని, బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి పంపుతున్నారు. తూకాలలో తేడాలు గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారని డీటర్లు భయపడిపోతున్నారు. అధికారులు కొన్ని షాపులు తనిఖీ చేసిన బియ్యం తక్కువ నిల్వలు ఉన్నట్లు తెలిసింది. మార్క్ లేకుండానే బియ్యం సరఫరా గోడౌన్లలో ఉన్న బియ్యంలో కొద్దిగా మెరుగ్గా ఉన్న బియ్యం సంచులను పక్క తీసి, వాటికి ప్రత్యేకంగా మార్క్ చేయాలి. ఆ విధానం గుంటూరు నగరం పరిధిలోని గోడౌన్లో అమలు కావటం లేదు. కార్డుదారులకు ఇచ్చే బియ్యానే అంగన్వాడీలకు పంపుతున్నారు. మ««ధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థులకు అవే బియ్యాన్ని అంటగడుతున్నారు. ఇవి పురుగుపట్టి, ఉండలు కట్టి ఉంటున్నాయి. గుంటూరు పరిసరాలలోని గౌడౌన్లలో జరిగిన అవకతకలపై ఇటీవలే డీటీలపై చర్యలు తీసుకొన్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తనిఖీలు చేస్తున్నాం ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలయ్యేందుకు తనిణీ చేస్తున్నాం. వీలైనంత వరకు అంగన్వాడీ కేంద్రాలకు మార్క్ చేసిన బియ్యాన్నే డీలర్లకు పంపుతున్నాం. ఎక్కడైనా నాణ్యతలేని బియ్యం వస్తే వాటిని రీ ప్లేస్ చేస్తాం. అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు తప్పవు. – చిట్టిబాబు, డీఎస్వో, గుంటూరు -
పత్తి రైతు.. చిత్తు
అర్కటవేముల(రాజుపాళెం): జిల్లాలో పత్తిని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. గతేడాది ధరలు, దిగుబడి బాగుండటంతో ఈ ఏడాది ఎంతో ఆశతో రైతులు సాగు చేశారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. పువ్వు దశకు రాగానే పురుగు ఆశించడంతో పంట మొత్తం దెబ్బతినింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాల్లో ఈ పంట సాగు అవుతోంది. గతేడాది 22 వేల హెక్టార్లలో సాగైంది. గతేడాది ధర అత్యధికంగా క్వింటాలు రూ.7,200 పలకడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు సాగు చేయడానికి ఆసక్తి కనబరిచారు. వర్షాభావం వారిని వెంటాడింది. ఇప్పటి వరకు 4,800 హెక్టార్లలో సాగు చేశారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చు చేశారు. 50 రోజుల క్రితం సాగు చేసిన పంట పూత, కాయ దశకు చేరుకుంది. ఇటివంటి పరిస్థితిలో పంటను ఎర్ర గులాబి రంగు పురుగు (పింక్ బోల్వాన్) ఆశించింది. మొక్క పువ్వులో పురుగు ఏర్పడటంతో మున్ముందు ఈ పంట సాగుకు పెట్టుబడులు వృథా అని భావించిన రైతులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒక్కొక్కరుగా దున్నేస్తున్నారు.. ఇప్పటికే ఎకరాకు విత్తనాలు, నాటిన కూలీలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు కూలీలు కలిపి రూ.10 వేలు ఖర్చు చేశారు. రెండు దఫాలుగా నాలుగైదు సార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. పంట చూస్తే పచ్చగా కళకళలాడుతున్నా ఈ పురుగు ఆశించడంతో రైతులు ఒక్కొక్కరుగా దున్ని వేసేందుకు ఉపక్రమించారు. జిల్లాలో రాజుపాళెం మండలంలోనే ఈ పంట ఎక్కువగా సాగు అవుతుంది. మండలంలోని కొర్రపాడు, రాజుపాళెం, గాదెగూడూరు, వెంగళాయపల్లె, సోమాపురం, అర్కటవేముల, తొండలదిన్నె తదితర గ్రామాల్లో దాదాపుగా 1500 ఎకరాల్లో సాగైంది. శుక్రవారం అర్కటవేముల గ్రామానికి చెందిన సిద్ది వెంకట ప్రసాద్‌రెడ్డి 8.50 ఎకరాలు, తల్లు సుబ్బిరెడ్డి 3 ఎకరాల్లో ట్రాక్టరుతో దున్నివేశారు. అదే బాటలో మరి కొంత మంది రైతులు నడిచేందుకు సిద్ధ పడుతున్నారు. ఈ గ్రామంలో సుమారుగా 200 ఎకరాలు పైగా ఈ పంటను సాగు చేశారు. మందులు వాడినా అంతే: ఖరీదైన పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. గతేడాది చివరలో ఈ పురుగు ఆశించడంతో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి నష్టపోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ ఏడాది మొదట్లోనే ఆశించడంతో మొత్తం నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. ఎనిమిదిన్నర్ర ఎకరాల్లో దున్నేశా నేను ఎనిమిదిన్నర్ర ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేశా. ప్రస్తుతం పంటలో పూత, కాయ బాగుంది. పూత, కాయల్లో గులాబి రంగు పురుగు పడటంతో ఖరీదైన మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయింది. -
పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే...
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులను పెడితే చాలు. వంట చేసేటప్పుడు స్టవ్ మీద పడిన మరకలు అంత సులువుగా పోవు. అలాంటప్పుడు పెద్ద సైజు టొమాటో ముక్కను తీసుకొని దాన్ని ఉప్పులో ముంచి మరకలపై రుద్దాలి. ఇలా చేస్తే ఎలాంటి మరకలైనా త్వరగా పోతాయి. అంతే కాకుండా ఎన్నేళ్ల స్టవ్ అయినా కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. పచ్చి బటానీలు ఉడికిస్తున్నప్పుడు వాటి రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేస్తే చాలు.కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డికాషిన్‌లో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇంటిప్స్ -
చిటికెడు ఇంగువతో చీడ దూరం!
ఇంటిప్స్ ⇒ పూల మొక్కలకు పురుగు పడితే... నీటిలో కొంచెం ఇంగువ కలిపి మొక్క మొదలులో పోస్తే చీడ వదిలిపోతుంది. పూలు కూడా బాగా పూస్తాయి. ⇒ బట్టల షెల్ఫుల్లో చిన్న చిన్న పురుగులు చేరి కొట్టేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే షెల్ఫులో ఓ మూల రెండు ఎండు మిరపకాయలు పెట్టాలి. ⇒ గాజు సామాన్లపై మరకలు పడినప్పుడు.. నిమ్మనూనెలో ముంచిన స్పాంజి ముక్కతో తుడిస్తే వదిలిపోతాయి. ⇒ కర్పూరాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కొద్దికొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియపు గింజలు వేయాలి. ⇒ పాతబడిన ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే... ఆలివ్ నూనెలో కొంచెం వెనిగర్ కలిపి తుడవాలి. ⇒ పప్పు దినుసును నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రేకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. ⇒ పాతబడ్డ ఉడెన్ ఫర్నీచర్ కొత్తగా మెరవాలంటే.. వేడినీళ్లలో రెండు టీబ్యాగ్‌లను ఉంచండి. పదినిమిషాలయ్యాక వాటిని తీసేసి... మెత్తటి బట్ట తీసుకొని ఆ డికాషన్‌తో ఫర్నీచర్‌ను తుడవండి. -
నడ్డి విరిచే గొడ్డు చాకిరీకి స్వస్తి!
పత్తి సాగులో బండ చాకిరీకి ‘బ్రష్ ఈజీ’ పరికరంతో చెక్ రూ. 100-150 ఖర్చుతో రైతులే తయారు చేసుకోవచ్చు పురుగుమందు పూత చాలా సులభం.. భారీగా కూలి ఖర్చు ఆదా బీటీ పత్తి విత్తనాలతో శనగపచ్చ పురుగు బెడద నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. రసంపీల్చే పురుగులు పత్తి రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పురుగుల నివారణకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల వాతావరణంకలుషితమవ్వడమే కాకుండా, పంటకు మేలుచేసే మిత్రపురుగులు కూడా నాశనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిచికారీకి ప్రత్యామ్నాయంగా లేత దశలో పత్తి మొక్క కాండానికి పురుగుమందును పూయడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి విత్తిన తర్వాత 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకోసారి మొక్కల కాండానికి పురుగుమందును పూస్తే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఈ మూడు దఫాల్లో పిచికారీకి ఎకరానికి 1.5 నుంచి 2 లీటర్ల వరకు మోనోక్రోటోఫాస్‌ను వాడుతుంటారు. మొక్కల కాండానికి మందు పూసే పద్ధతిలో అయితే మూడు దఫాలకు కలిపి పావు లీటరు మందు సరిపోతుంది. పిచికారీ కన్నా ఈ పద్ధతి సత్ఫలితాలిచ్చినప్పటికీ, మొక్క మొక్కకూ వంగి మందు పూయాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. పని మందకొడిగా నడవడం వల్ల ఎకరంలో పంటకు ఒకసారి మందు పూతకు నలుగురు కూలీల అవసరముంటుంది. వంగి మందు పూయడం కష్టం కాబట్టి ఈ పనంటేనే కూలీలు రాని పరిస్థితి నెలకొంది. 2 గంటల్లోనే ఎకరం మొక్కలకు మందు పూత ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన కీటకశాస్త్ర నిపుణుడు, రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ పుల్లూరి రమేష్ సులువుగా పని జరిగేందుకు ఉపయోగపడే ‘బ్రష్ ఈజీ’ అనే పరికరాన్ని రూపొందించారు. దీన్ని చేతబట్టుకొని, వంగనవసరం లేకుండానే, సులువుగా మొక్కకాండానికి రసాయనాన్ని పూయవచ్చు. ఈ పరికరంతో ఒకే ఒక్క మనిషి గంటన్నర- రెండు గంటల్లోనే ఒక ఎకరంలో పత్తి మొక్కలకు సులభంగా మందు పూయవచ్చు. తద్వారా మందు పూత కూలి ఖర్చు భారీగా తగ్గుతుంది. పరికరం తయారీ సులభం! ‘బ్రష్ ఈజీ’ పరికరాన్ని రూ. 100-150ల ఖర్చుతోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. 1.9 సెం.మీ. వెడల్పు, 90 సెం.మీ. పొడవు ఉన్న పీవీసీ పైపును తీసుకోవాలి. పైపునకు ఒక వైపు చివరన చిన్న బెజ్జం ఉన్న మూతను బిగించాలి. దాని లోనికి దూదితో చేసిన వొత్తిని పెట్టాలి. రెండో వైపు నుంచి పైపులోనికి రసం పీల్చే పురుగులను నివారించే మోనోక్రొటోఫాస్ రసాయనిక పురుగుమందును 1:4 నిష్పత్తిలో నీటిలో కలిపి పోయాలి. తర్వాత పైపునకు మూతను బిగించాలి. దీన్ని చేతబట్టుకొని పత్తి పొలంలో సాళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తూ.. మొక్కల కాండానికి పైపు చివరన ఉన్న దూదివొత్తి ద్వారా స్రవించే పురుగులమందును పూస్తే సరిపోతుంది. కాండానికి ఒక చుక్క మందును పూసినా సరిపోతుందని డా. రమేష్ చెప్పారు. ఈ పరికరం వల్ల కూలీల ఖర్చు చాలా వరకు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ రైతులే తయారు చేసుకోవచ్చు! బ్రష్ ఈజీ పరికరం వాడితే కూలీల కొరత సమస్య తీరుతుంది. పురుగుమందుల వృథా జరగదు. సాగు వ్యయం తగ్గుతుంది. పంటకు మేలు చేసే మిత్రపురుగులకు ఎలాంటి హానీ జరగదు. పురుగుల మందును మొక్కలకు పూసే పరికరాన్ని స్వల్ప ఖర్చుతో రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాలు దుకాణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ పుల్లూరి రమేష్ (98497 54309), ప్రాంతీయ సమన్వయకర్త, రాష్ర్ట జీవవైవిధ్య మండలి నడుము నొప్పి పీడ విరగడ! నాకున్న ఐదెకరాల్లో పత్తిని సాగు చేస్తున్న. బ్రష్ ఈజీ పరికరంతో మొక్కల మొదళ్లకు పురుగుమందును పూస్తున్నం. కూలీలకు నడుము నొప్పి పీడ పోయింది. పురుగుమందుల ఖర్చూ తగ్గింది. తక్కువ సమయం లోనే పని పూర్తవుతున్నది. - కుర్మ లక్ష్మణ్ (99498 84642), పత్తి రైతు, పొన్నారి, ఆదిలాబాద్ జిల్లా