టోక్యో : జలుబు, గొంతు నొప్పి పట్టి పీడిస్తుంటే ఓ మహిళ వైద్యానికి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ డాక్టర్లు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యింది. గొంతునొప్పికి మందులు ఇస్తారని ఆశించిన మహిళకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. మహిళ నొప్పికి కారణం ఆమె గొంతులో సజీవంగా ఉన్న పురుగు ఉందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతింది. ఈ ఆశ్చర్యకర సంఘటన జపాన్‌లో చోటుచేసుకుందిం. ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ హైజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. టోక్యోకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇటీవల జపాన్ రాజధాని సెయింట్ లూకాస్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసుకుంది.తరచూ తలనొప్పి: యువతి మెదడులో..
జపానీస్ వంటకం షాషిమి(చేపలు, లేదా ఇతర మాంసాన్ని చిన్న ముక్కులుగా కోసి పచ్చివి తినడం) తిన్న తర్వాత తన గొంతులో నొప్పి మొదలైందని వైద్యులకు తెలిపింది. దీంతో సదరు మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 1.5 అంగుళాల పొడవైన, 1 మి.మీ వెడల్పున్న పురుగు ఉన్నట్లు తెలిపారు. అనంతరం చికిత్స చేసి దానిని తొలగించగా అది ఇంకా సజీవంగానే ఉండటం గమనార్హం. అదృష్టవశాత్తు పురుగును తొలగించిన తరువాత మహిళా ఆరోగ్య పరిస్థితి కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. పురుగుకి డీఎన్‌ఏ పరీక్ష చేయగా అది ఎర్రటి వానపాముగా గుర్తించారు. ఇది పచ్చి మాంసం తినేవారికి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. (మూడు కళ్లతో బాబు: నిజమేనా?)
Comments
Please login to add a commentAdd a comment