Tonsils
-
వికటించిన సర్జరీ.. మృత్యువుతో పోరాడి ఓడిన మోడల్
బ్రెసిలియ: విధి వక్రీకరించడం అంటే ఇదేనేమో. ఒక సాధారణ సర్జరీ అనూహ్యంగా ఆమె ప్రాణం తీసింది. కోలుకుంటుందనుకున్న టైంలో.. ప్రాణం మీదకు వచ్చింది. ఫలితం.. రెండు నెలలు కోమాలో ఉన్న ఆ మాజీ సుందరి(27) కన్నుమూసింది. మోడలింగ్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రెజిల్ మాజీ సుందరి గ్లెసీ కొర్రెయియా మోడల్, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్ బ్రెజిల్ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా రాణిస్తోంది ఆమె. అయితే.. గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఓ ప్రైవేట్ క్లినిక్లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె.. జూన్ 20వ తేదీన కన్నుమూసింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొర్రెయియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్ సర్జరీకి ఆమె మృతి చెందడం.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. -
గొంతు నొప్పికి వైద్యులు చెప్పిన కారణం తెలిస్తే..
టోక్యో : జలుబు, గొంతు నొప్పి పట్టి పీడిస్తుంటే ఓ మహిళ వైద్యానికి ఆస్పత్రికి వెళ్లగా అక్కడ డాక్టర్లు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యింది. గొంతునొప్పికి మందులు ఇస్తారని ఆశించిన మహిళకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు. మహిళ నొప్పికి కారణం ఆమె గొంతులో సజీవంగా ఉన్న పురుగు ఉందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతింది. ఈ ఆశ్చర్యకర సంఘటన జపాన్లో చోటుచేసుకుందిం. ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ హైజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. టోక్యోకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇటీవల జపాన్ రాజధాని సెయింట్ లూకాస్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసుకుంది.తరచూ తలనొప్పి: యువతి మెదడులో.. జపానీస్ వంటకం షాషిమి(చేపలు, లేదా ఇతర మాంసాన్ని చిన్న ముక్కులుగా కోసి పచ్చివి తినడం) తిన్న తర్వాత తన గొంతులో నొప్పి మొదలైందని వైద్యులకు తెలిపింది. దీంతో సదరు మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 1.5 అంగుళాల పొడవైన, 1 మి.మీ వెడల్పున్న పురుగు ఉన్నట్లు తెలిపారు. అనంతరం చికిత్స చేసి దానిని తొలగించగా అది ఇంకా సజీవంగానే ఉండటం గమనార్హం. అదృష్టవశాత్తు పురుగును తొలగించిన తరువాత మహిళా ఆరోగ్య పరిస్థితి కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. పురుగుకి డీఎన్ఏ పరీక్ష చేయగా అది ఎర్రటి వానపాముగా గుర్తించారు. ఇది పచ్చి మాంసం తినేవారికి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. (మూడు కళ్లతో బాబు: నిజమేనా?) (ఈ వింత చూశారా? 50 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందట) -
హోమియో కౌన్సెలింగ్
ఆపరేషన్ లేకుండా టాన్సిల్స్ను నయం చేయవచ్చు మా బాబు వయసు 5 సం. మాటిమాటికి గొంతునొప్పి, జ్వరంతో ఎన్నో మందులు వాడారు. టాన్సిల్స్ వచ్చాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటున్నారు. హోమియోపతి ద్వారా ఆపరేషన్ నివారించవచ్చా? - గీత, గుంటూరు టాన్సిల్స్ అనేవి నోటి వెనుక భాగంలో గొంతుపైన ఉండే లింప్ గ్రంథులు. టాన్సిల్స్ నోటి ద్వారా వెళ్లే బ్యాక్టీరియా, వైరస్, అలర్జీ కారక అనూలను ఇతర హానికరమైన వాటిని శుద్ధి చేస్తూ మన శరీరానికి ఏ హాని కలగకుండా రక్ష కభటుల్లా కాపాడుతాయి. ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్కు లోనవటం, ఎర్రపడటం, గొంతునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే టాన్సిలైటిస్ అంటారు. ఈ టాన్సిలైటిస్ రావటానికి ముఖ్య కారణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఐనా స్ట్రెప్టొకోకస్, టావేజన్స్, ల్యూమోనియా లాంటి బ్యాక్టీరియా, వైరస్లు, షహాస్లు అలర్జీ కారక క్రిములు శీతల పానీయాలు, నోరు శుభ్రపరచుకోకపోవటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఈ టాన్సిలైటిస్ వస్తూ ఉంటుంది. ఈ టాన్సిలైటిస్ను అక్యూట్ టాన్సిలైటిస్, క్రానిక్ టాన్సిలైటిస్లో చూడవచ్చు. గొంతునొప్పి, ట్యాన్సిల్స్ వాపు, జలుబు, ఇతర లక్షణాలను బట్టి అక్యూట్ టాన్సిలై టిస్ లేదా క్రానిక్ టాన్సిలైటిసా తెలుసుకోవచ్చు. 1. అక్యూట్ టాన్సిలైటిస్ : హఠాత్తుగా తీవ్రమైన గొంతునొప్పి. ట్యాన్సిల్స్ ఎర్రగా వాయటం, జ్వరం, చ లితో ప్రతి 10 నుండి 15 రోజులకు వస్తూ పోతూ ఉంటాయి. వీటితో పాటు చెవి నొప్పి, అన్నం మింగలేకపోవటం, నోటి దుర్వాసన లక్షణాలు ఉంటాయి. ఈ విధమైన టాన్సిలైటిస్కు హోమియోపతిలో బెల్లడోనా అనే మందు అద్బుతంగా పని చేస్తుంది. గొంతు గుటక వేయడం కూడా చాలా కష్టం. టాన్సిల్ ఎర్ర రంగులో వాచి 102 నుండి 105 జ్వరం వస్తుంది. చలిజ్వరంతో టాన్సిల్స్పై తెల్లని మచ్చలు చీములాగా కనిపిస్తూ విపరీతమైన నొప్పితో ఉంటే హెపర్ సల్ఫ్ బాగా పనిచే స్తుంది. ఇంకా ఫై ఫాస్, ఏపిస్ మెల్ఫికా, అకోనైట్ మందులు బాగా పని చేస్తాయి. 2. క్రానిక్ టాన్సిలైటిస్ : దీర్ఘకాలికంగా టాన్సిల్స్వాపుతో ఇన్ఫెక్షన్లు కొంత విరామం తరువాత జ్వరము, గొంతునొప్పి, తరచుగా దగ్గు, ఆహారం మింగడం కష్టమవటం, మెడ భాగంలో లింఫ్ గ్రంథులు వాచడం... చిన్న పిల్లలు, టాన్సిల్ సమస్యలున్న పెద్దవాళ్లు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం వ్యాధి నిరోధక శక్తి తగ్గటం. హోమియోపతిలో ఈ వ్యాధినిరోధక శక్తి పెంచటానికి, టాన్సిల్స్ వాపు తగ్గించటానికి, మాటిమాటికి జబ్బుపడకుండా, అక్యూట్ టాన్సిలైటిస్ను, క్రానిక్ టాన్సిలైటిస్ను హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. దీర్ఘకాలికంగా ఉండే టాన్సిల్స్కు బెరైటాకార్బ్, మెర్క్సాల్, గయాకమ్, కాల్కేరియాఫాస్, కాల్కేరియా అయోడమ్, బ్రోమియమ్, అమ్కిడోలా పెర్సికా కాలిమూర్ అనే మందులు డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని రోజులు తీసుకుంటే ఆపరేషన్ లేకుండా టాన్సిల్స్ను తగ్గించవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్