Former Miss Brazil Gleycy Correia Dies In Coma After Tonsil Surgery Failure - Sakshi
Sakshi News home page

Former Miss Brazil Death: టాన్సిల్స్‌ సర్జరీ వికటించి కోమాలోకి.. మృత్యువుతో పోరాడి ఓడింది

Published Thu, Jun 23 2022 12:33 PM | Last Updated on Thu, Jun 23 2022 12:54 PM

Brazil Former Miss Dies In Coma After Tonsil Surgery Failure - Sakshi

బ్రెసిలియ: విధి వక్రీకరించడం అంటే ఇదేనేమో. ఒక సాధారణ సర్జరీ అనూహ్యంగా ఆమె ప్రాణం తీసింది. కోలుకుంటుందనుకున్న టైంలో.. ప్రాణం మీదకు వచ్చింది. ఫలితం.. రెండు నెలలు కోమాలో ఉన్న ఆ మాజీ సుందరి(27) కన్నుమూసింది. మోడలింగ్‌ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బ్రెజిల్‌ మాజీ సుందరి గ్లెసీ కొర్రెయియా మోడల్‌‌, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్‌ బ్రెజిల్‌ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తోంది ఆమె. అయితే.. గొంతు టాన్సిల్స్‌ తొలగించుకునేందుకు ఏప్రిల్‌ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. 

వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె.. జూన్‌ 20వ తేదీన కన్నుమూసింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొర్రెయియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్‌ సర్జరీకి ఆమె మృతి చెందడం.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement