ఆపరేషన్ లేకుండా టాన్సిల్స్‌ను నయం చేయవచ్చు
మా బాబు వయసు 5 సం. మాటిమాటికి గొంతునొప్పి, జ్వరంతో ఎన్నో మందులు వాడారు. టాన్సిల్స్ వచ్చాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటున్నారు. హోమియోపతి ద్వారా ఆపరేషన్ నివారించవచ్చా?
- గీత, గుంటూరు
టాన్సిల్స్ అనేవి నోటి వెనుక భాగంలో గొంతుపైన ఉండే లింప్ గ్రంథులు. టాన్సిల్స్ నోటి ద్వారా వెళ్లే బ్యాక్టీరియా, వైరస్, అలర్జీ కారక అనూలను ఇతర హానికరమైన వాటిని శుద్ధి చేస్తూ మన శరీరానికి ఏ హాని కలగకుండా రక్ష కభటుల్లా కాపాడుతాయి. ఈ టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్‌కు లోనవటం, ఎర్రపడటం, గొంతునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే టాన్సిలైటిస్ అంటారు. ఈ టాన్సిలైటిస్ రావటానికి ముఖ్య కారణాలు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఐనా స్ట్రెప్టొకోకస్, టావేజన్స్, ల్యూమోనియా లాంటి బ్యాక్టీరియా, వైరస్‌లు, షహాస్‌లు అలర్జీ కారక క్రిములు శీతల పానీయాలు, నోరు శుభ్రపరచుకోకపోవటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఈ టాన్సిలైటిస్ వస్తూ ఉంటుంది.
ఈ టాన్సిలైటిస్‌ను అక్యూట్ టాన్సిలైటిస్, క్రానిక్ టాన్సిలైటిస్‌లో చూడవచ్చు. గొంతునొప్పి, ట్యాన్సిల్స్ వాపు, జలుబు, ఇతర లక్షణాలను బట్టి అక్యూట్ టాన్సిలై టిస్ లేదా క్రానిక్ టాన్సిలైటిసా తెలుసుకోవచ్చు.
1. అక్యూట్ టాన్సిలైటిస్ : హఠాత్తుగా తీవ్రమైన గొంతునొప్పి. ట్యాన్సిల్స్ ఎర్రగా వాయటం, జ్వరం, చ లితో ప్రతి 10 నుండి 15 రోజులకు వస్తూ పోతూ ఉంటాయి. వీటితో పాటు చెవి నొప్పి, అన్నం మింగలేకపోవటం, నోటి దుర్వాసన లక్షణాలు ఉంటాయి. ఈ విధమైన టాన్సిలైటిస్‌కు హోమియోపతిలో బెల్లడోనా అనే మందు అద్బుతంగా పని చేస్తుంది. గొంతు గుటక వేయడం కూడా చాలా కష్టం. టాన్సిల్ ఎర్ర రంగులో వాచి 102 నుండి 105 జ్వరం వస్తుంది. చలిజ్వరంతో టాన్సిల్స్‌పై తెల్లని మచ్చలు చీములాగా కనిపిస్తూ విపరీతమైన నొప్పితో ఉంటే హెపర్ సల్ఫ్ బాగా పనిచే స్తుంది. ఇంకా ఫై ఫాస్, ఏపిస్ మెల్ఫికా, అకోనైట్ మందులు బాగా పని చేస్తాయి.
2. క్రానిక్ టాన్సిలైటిస్ : దీర్ఘకాలికంగా టాన్సిల్స్‌వాపుతో ఇన్‌ఫెక్షన్‌లు కొంత విరామం తరువాత జ్వరము, గొంతునొప్పి, తరచుగా దగ్గు, ఆహారం మింగడం కష్టమవటం, మెడ భాగంలో లింఫ్ గ్రంథులు వాచడం... చిన్న పిల్లలు, టాన్సిల్ సమస్యలున్న పెద్దవాళ్లు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం వ్యాధి నిరోధక శక్తి తగ్గటం. హోమియోపతిలో ఈ వ్యాధినిరోధక శక్తి పెంచటానికి, టాన్సిల్స్ వాపు తగ్గించటానికి, మాటిమాటికి జబ్బుపడకుండా, అక్యూట్ టాన్సిలైటిస్‌ను, క్రానిక్ టాన్సిలైటిస్‌ను హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. దీర్ఘకాలికంగా ఉండే టాన్సిల్స్‌కు బెరైటాకార్బ్, మెర్క్‌సాల్, గయాకమ్, కాల్కేరియాఫాస్, కాల్కేరియా అయోడమ్, బ్రోమియమ్, అమ్కిడోలా పెర్సికా కాలిమూర్ అనే మందులు డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని రోజులు తీసుకుంటే ఆపరేషన్ లేకుండా టాన్సిల్స్‌ను తగ్గించవచ్చు.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి,
హైదరాబాద్
హోమియో కౌన్సెలింగ్
Published Fri, Jul 24 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement