ఇంటిప్స్
⇒ పూల మొక్కలకు పురుగు పడితే... నీటిలో కొంచెం ఇంగువ కలిపి మొక్క మొదలులో పోస్తే చీడ వదిలిపోతుంది. పూలు కూడా బాగా పూస్తాయి.
⇒ బట్టల షెల్ఫుల్లో చిన్న చిన్న పురుగులు చేరి కొట్టేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే షెల్ఫులో ఓ మూల రెండు ఎండు మిరపకాయలు పెట్టాలి.
⇒ గాజు సామాన్లపై మరకలు పడినప్పుడు.. నిమ్మనూనెలో ముంచిన స్పాంజి ముక్కతో తుడిస్తే వదిలిపోతాయి.
⇒ కర్పూరాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కొద్దికొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియపు గింజలు వేయాలి.
⇒ పాతబడిన ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే... ఆలివ్ నూనెలో కొంచెం వెనిగర్ కలిపి తుడవాలి.
⇒ పప్పు దినుసును నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రేకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది.
⇒ పాతబడ్డ ఉడెన్ ఫర్నీచర్ కొత్తగా మెరవాలంటే.. వేడినీళ్లలో రెండు టీబ్యాగ్‌లను ఉంచండి. పదినిమిషాలయ్యాక వాటిని తీసేసి... మెత్తటి బట్ట తీసుకొని ఆ డికాషన్‌తో ఫర్నీచర్‌ను తుడవండి.
చిటికెడు ఇంగువతో చీడ దూరం!
Published Sun, May 17 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement