Asafoetida
-
Asafoetida : ఇంగువతో ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు
ప్రతీ వంట ఇంట్లో ఇంగువ (ఆసఫోటిడా) ఘుమఘుమ లాడుతుంది. వాసన ఘాటుగా, చేదు రుచితో లభించే సుగంధ ద్రవ్యం . కొన్నిసార్లు "డెవిల్స్ డంగ్" అని పిలుస్తారు.దీని వాసన అంత ఇష్టంగా ఉండక పోయిన్పటికీ ఆహారాన్ని మంచిరుచిని ఇస్తుంది. అలాగే దీని వలన ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా..!ఇంగువ ఆరోగ్యానికి మంచిది. పప్పు, సాంబారు, పులిహోర, రసం, పచ్చళ్లలో ఇంగువ లేని పోపును ఊహించలేం. ఇది మంచి ప్రిజర్వేటివ్‌గా కూడా పనిచేస్తుంది. ఇంగువను తీసుకోవటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపులో ఉన్న గ్యాస్ , ఎసిడిటీలకు చెక్ పెడుతుంది. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్‌తో సహా కొన్ని కొవ్వులనుంచి అధిక రక్త స్థాయిలను తగ్గిస్తుంది. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇంగువలో ఉండే కూమరిన్స్ అనే రసాయనాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి.జలుబు, దగ్గు సమస్యలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీబయోటిక్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను కూడా తొలగిస్తాయి. అంతేకాదు స్వల్పపరిమాణంలో నెలసరి టైం లో వచ్చే పొత్తి కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. కప్పు నీళ్లను బాగా మరగబెట్టి దీనిలో చిటికెడు ఇంగువ వేసి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే తలనొప్పి కూడా మాయం అవుతుంది. ఇంగువను వాము బెల్లంతో కలిపి తీసుకోవటం వలన నులి పురుగుల సమస్య తగ్గుతుంది.సౌందర్య సాధనాలలో ఆహారాలు , పానీయాలలో సువాసన పదార్ధంగా ఉపయోగిస్తారు. కుక్కలు, పిల్లులు దూరంగా ఉంచే ఉత్పత్తులలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇంగువను మితంగా తీసుకోవడం ఉత్తమం. -
ఇంగువతో ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా..
ఇంగువ.. వంటల్లో వాడే మంచి సుగంధ ద్రవ్యం ఇది. అసఫోటిడా అని కూడా దీన్ని పిలుస్తారు. మన దేశీ వంటకాల్లో ఇంగువని చాలా విరివిగా వాడుతుంటాం. దీనిలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇంగువను చర్మ సంరక్షణలోనూ ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా? మృతకణాలు తొలగించి ముఖం కాంతివంతంగా మారడానికి ఇంగువ ఉపయోగిస్తారు. ►రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాలపాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు పోతాయి. చర్మం పొడిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ►తేనె ఇంగువ సూపర్ కాంబినేషన్. ఈ రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్లెన్సర్‌గా ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న బాక్టీరియాను తొలగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. -
చిటికెడు ఇంగువతో చీడ దూరం!
ఇంటిప్స్ ⇒ పూల మొక్కలకు పురుగు పడితే... నీటిలో కొంచెం ఇంగువ కలిపి మొక్క మొదలులో పోస్తే చీడ వదిలిపోతుంది. పూలు కూడా బాగా పూస్తాయి. ⇒ బట్టల షెల్ఫుల్లో చిన్న చిన్న పురుగులు చేరి కొట్టేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే షెల్ఫులో ఓ మూల రెండు ఎండు మిరపకాయలు పెట్టాలి. ⇒ గాజు సామాన్లపై మరకలు పడినప్పుడు.. నిమ్మనూనెలో ముంచిన స్పాంజి ముక్కతో తుడిస్తే వదిలిపోతాయి. ⇒ కర్పూరాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కొద్దికొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియపు గింజలు వేయాలి. ⇒ పాతబడిన ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే... ఆలివ్ నూనెలో కొంచెం వెనిగర్ కలిపి తుడవాలి. ⇒ పప్పు దినుసును నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రేకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. ⇒ పాతబడ్డ ఉడెన్ ఫర్నీచర్ కొత్తగా మెరవాలంటే.. వేడినీళ్లలో రెండు టీబ్యాగ్‌లను ఉంచండి. పదినిమిషాలయ్యాక వాటిని తీసేసి... మెత్తటి బట్ట తీసుకొని ఆ డికాషన్‌తో ఫర్నీచర్‌ను తుడవండి.