ప్రతీ వంట ఇంట్లో ఇంగువ (ఆసఫోటిడా) ఘుమఘుమ లాడుతుంది. వాసన ఘాటుగా, చేదు రుచితో లభించే సుగంధ ద్రవ్యం . కొన్నిసార్లు "డెవిల్స్ డంగ్" అని పిలుస్తారు.దీని వాసన అంత ఇష్టంగా ఉండక పోయిన్పటికీ ఆహారాన్ని మంచిరుచిని ఇస్తుంది. అలాగే దీని వలన ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా..!
ఇంగువ ఆరోగ్యానికి మంచిది. పప్పు, సాంబారు, పులిహోర, రసం, పచ్చళ్లలో ఇంగువ లేని పోపును ఊహించలేం. ఇది మంచి ప్రిజర్వేటివ్‌గా కూడా పనిచేస్తుంది. ఇంగువను తీసుకోవటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపులో ఉన్న గ్యాస్ , ఎసిడిటీలకు చెక్ పెడుతుంది.
కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్‌తో సహా కొన్ని కొవ్వులనుంచి అధిక రక్త స్థాయిలను తగ్గిస్తుంది. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇంగువలో ఉండే కూమరిన్స్ అనే రసాయనాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి.
జలుబు, దగ్గు సమస్యలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…
రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీబయోటిక్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను కూడా తొలగిస్తాయి.
అంతేకాదు స్వల్పపరిమాణంలో నెలసరి టైం లో వచ్చే పొత్తి కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. కప్పు నీళ్లను బాగా మరగబెట్టి దీనిలో చిటికెడు ఇంగువ వేసి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే తలనొప్పి కూడా మాయం అవుతుంది.
ఇంగువను వాము బెల్లంతో కలిపి తీసుకోవటం వలన నులి పురుగుల సమస్య తగ్గుతుంది.
సౌందర్య సాధనాలలో ఆహారాలు , పానీయాలలో సువాసన పదార్ధంగా ఉపయోగిస్తారు. కుక్కలు, పిల్లులు దూరంగా ఉంచే ఉత్పత్తులలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇంగువను మితంగా తీసుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment