ఇంగువ.. వంటల్లో వాడే మంచి సుగంధ ద్రవ్యం ఇది. అసఫోటిడా అని కూడా దీన్ని పిలుస్తారు. మన దేశీ వంటకాల్లో ఇంగువని చాలా విరివిగా వాడుతుంటాం. దీనిలోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తాయి.
ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇంగువను చర్మ సంరక్షణలోనూ ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా? మృతకణాలు తొలగించి ముఖం కాంతివంతంగా మారడానికి ఇంగువ ఉపయోగిస్తారు.
►రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాలపాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు పోతాయి. చర్మం పొడిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది.
►తేనె ఇంగువ సూపర్ కాంబినేషన్. ఈ రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్లెన్సర్‌గా ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న బాక్టీరియాను తొలగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment