చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన | Doctor Removes 20 Live Worms From a Man's Eye in China | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచే ఘటన, కంటి నుంచి...

Published Thu, Oct 29 2020 12:55 PM | Last Updated on Thu, Oct 29 2020 1:49 PM

Doctor Removes 20 Live Worms From a Man's Eye in China - Sakshi

సుజోవు: చైనాలోని సుజోవు నగరంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కంటి నుంచి 20 నులిపురుగులను వైద్యులు బయటకు తీశారు. వాన్‌ అనే వ్యక్తికి కంటి నొప్పి బాగా రావడంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడిని పరీక్షించిన వైద్యులు కంటిలో నులిపురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. మొదటిలో కంటినొప్పి వచ్చిందని, తాను పెద్దగా పట్టించుకోలేదని వాన్‌ తెలిపారు. తరువాత ఆ నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.  

అప్పటికే అతడి కంటిలో 20 నులిపురుగులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. సాధారణంగా ఇలాంటి పురుగులు కుక్కలు, పిల్లులు కన్నీటిలో ఉంటాయి. అయితే వాన్‌ ఇంట్లోకానీ పని చేసే చోట కానీ ఎలాంటి పెంపుడు జంతువులు లేవని వాన్‌ తెలిపారు. అతడి కంటిలోకి ఈ పురుగులు ఎలా చేరాయో తెలియడం లేదు. ఇలాంటి ఘటనే అంతకు ముందు అమెరికాలో కూడా ఒకటి జరిగింది. ఒక మహిళ ముఖంలో ఏదో కదలుతున్నట్లు అనిపించగా ఆమె డాక్టర్‌ను సంప్రదించింది. ఆమె చర్మం కింద నులిపురుగులు కదులుతున్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు వైద్యాన్ని అందించారు.  

చదవండి: ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement