ప్రముఖ చాక్లెట్ తయారీ దిగ్గజం క్యాడ్‌బరీ ఒకేసారి రెండు వివాదాల్లో చిక్కుకుంది!. జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో చాక్లెట్‌ను తయారు చేస్తుందని.. ఆ సంస్థను భారత్‌లో బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి. దీంతో ట్విటర్‌లో ‘బాయ్‌కాట్ క్యాడ్‌బరీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం’ అంటూ దీపావళి సందర్భంగా క్యాడ్‌బరి సంస్థ ఓ చాక్లెట్ యాడ్‌ను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ యాడ్ వివాదంగా మారింది. ఆ యాడ్‌లో సంభాషణలు ఇలా జరిగాయి.
డాక్టర్: దీపావళి సందర్భంగా ఓ డాక్టర్ ప్రమిదెలు అమ్మే వ్యక్తి కోసం అంగట్లో చూస్తుంటాడు. అదే సమయంలో ప్రమిదెలు అమ్మే వ్యక్తి డాక్టర్‌కు తారసపడడంతో దామోదర్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో
ప్రమిదెలు అమ్మే వ్యాపారి : డాక్టర్ సార్
డాక్టర్: ఎక్కడున్నావ్.. రెండు రోజుల నుంచి నీ కోసం చూస్తున్నాను.
వ్యాపారీ: అయినా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నార్ సార్. మీకు ఏమైనా కావాలా? అని అడుగుతాడు.
డాక్టర్: కాదు, కాదు నేను మీకు ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నా. అంటూ తన బ్యాగ్‌లో నుంచి క్యాడ్‌బరీ చాక్లెట్ ప్యాకెట్‌ను వ్యాపారికి అందిస్తాడు.
వ్యాపారీ: అందుకు కృతజ్ఞతగా మీకు దీపావళి శుభాకాంక్షలు అని రిప్లయి ఇస్తారు. అంతటితో యాడ్ పూర్తవుతుంది.
ఇప్పుడీ యాప్‌పై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి అభ్యంత్రం వ్యక్తం చేశారు. తోపుడు బండిపై ప్రమిదెలు విక్రయించే వ్యక్తి పేరు దామోదర్. ఆ యాడ్‌లో దామోదర్ అనే పేరును వినియోగించడంపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మండిపడ్డారు.
‘‘మీరు క్యాడ్‌బరీ చాక్లెట్ యాడ్‌ను పరిశీలించారా? షాపు లేని ఓ నిరు పేద ల్యాంప్ విక్రేత పేరు దామోదర్. ప్రధాని మోదీ తండ్రి పేరును తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ అంశంలో క్యాడ్ బరీ సంస్థ సిగ్గుపడాలి. బాయ్ కాట్ క్యాడ్ బరీ’’ అంటూ సాధ్వి ప్రాచి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. బాయ్‌కాట్ క్యాడ్‌బరీ అంటూ వరుసగా రీట్వీట్‌లు చేస్తున్నారు.
Have you carefully observed Cadbury chocolate's advertisement on TV channels?
— Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) October 30, 2022
The shopless poor lamp seller is Damodar.
This is done to show someone with PM Narendra Modi's father's name in poor light. Chaiwale ka baap diyewala.
Shame on cadbury Company #BoycottCadbury pic.twitter.com/QvzbmOMcX2
Comments
Please login to add a commentAdd a comment