‘క్లిక్‌ చేస్తే ఖల్లాస్‌’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ! | Massive Data Leak Of 26 Billion Records Detected Including Twitter And LinkedIn Information, See Details - Sakshi
Sakshi News home page

Massive 26 Billion Record Leak: ‘క్లిక్‌ చేస్తే ఖల్లాస్‌’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ!

Published Tue, Jan 23 2024 5:25 PM | Last Updated on Tue, Jan 23 2024 6:29 PM

Massive Data Leak Of 26 Billion Records - Sakshi

ఇంటర్నెట్‌ యూజర్లకు, అమెరికాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్‌ నేరస్తులు షాకిచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన డేటాను చోరీ చేశారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 26 బిలియన్ల యూజర్ల డేటా చోరీకి గురైనట్లు డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన రీసెర్చర్లు నిర్ధారించారు. సైబర్‌ నేరస్తులు సేకరించిన డేటా మొత్తం ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బ్రీచెస్‌’ అనే అన్‌ సెక్యూర్‌ పేజీలో ఉందని తెలిపారు. 

ఈ సందర్భంగా లీకైన ఈ డేటాను చైనా మెసేజింగ్‌ జెయింట్‌ టెన్‌సెంట్‌, వైబో, అడోబ్‌, కాన్వా, లింక్డిన్‌, ఎక్స్‌.కామ్‌, టెలిగ్రాం ద్వారా సేకరించినట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు రీసెర్చర్లు అన్నారు. ఇక యూజర్ల డేటాతో పాటు అమెరికా, ప్రపంచంలోని ఆయా దేశాల ప్రభుత్వ డేటా సైతం సైబర్‌ నేరస్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చారు.   

డేటాతో ఏం చేస్తారంటే?
ఇక సైబర్‌ నేరస్తులు( థ్రెట్‌ యాక్టర్స్‌) తస్కరించిన డేటాను ఉపయోగించి భారీ మొత్తంలో సైబర్‌ దాడులు, యూజర్ల బ్యాంక్‌ అకౌంట్లతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం, ఫిషింగ్‌ స్కామ్స్‌, కొన్ని సంస్థల్ని లేదంటే, కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్‌ దాడులు చేసేందుకు వీలుగా ఉపయోగిస్తారని రీసెర్చర్లు వెల్లడించారు.

ఆ ధీమా వద్దు
అయితే, డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారులే’ అనే ధీమాతో కాకుండా దొంగిలించిన డేటాతో ఏం చేయొచ్చు? ఒకవేళ వినియోగిస్తే వాటి పర‍్యవసనాలు ఏ విధంగా ఉంటాయో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎస్‌ఈటీ  గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్మూర్ అన్నారు. ఫోన్‌, మెయిల్స్‌, వాట్సాప్‌ ఆడియోకాల్స్‌ తో పాటు ఇతర అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయొద్దని, అలాంటి లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. 

గతాన్ని గుర్తు చేసిన రీసెర్చర్లు
ఈ సందర్భంగా ఇదే తరహాలో సైబర్‌ నేరస్తులు 2019లో వెరిఫికేషన్‌.ఐఓ తయారు చేసిన ఎలాంటి భద్రత లేని డేటాబేస్ నుంచి దాదాపు వన్‌ బిలియన్ రికార్డులు డేటా లీకైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇదే అతిపెద్ద, అత్యంత హానికరమైన లీకేజీల్లో ఒకటిగా పేరొందింది. ఈ డేటా చౌర్యం మైస్పేస్ (360 మిలియన్లు), ట్విటర్ (281 మిలియన్లు), లింక్డిన్‌ (251 మిలియన్లు), అడల్ట్‌ఫ్రెండ్‌ఫైండర్ (220 మిలియన్లు) వంటి సోషల్‌ నెట్‌ వర్క్‌ యూజర్లదని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement