ఎక్స్.కామ్‌ను ఎవ్రీథింగ్ యాప్’గా మార్చే దిశగా ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీ నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్‌లో కీలక ప్రకటన చేశారు.
ఎలాన్ మస్క్ తొలిసారి ఎక్స్.కామ్‌లో ఆల్ హ్యాండ్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మస్క్, ఎక్స్ సీఈవోగా లిండా యాకరినో, ఉద్యోగులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగులు, స్టేక్ హోల్డర్స్ హాజరయ్యారు.
ది వెర్జ్ నివేదిక ప్రకారం, యూజర్లు ఎక్స్‌లో ఆర్ధిక లావాదేవీలు ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని మస్క్ కోరుకుంటున్నారు. ఎక్స్ వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్‌తో అవసరం లేకుండా ఎక్స్‌లో అభివృద్ది చేసే తన ఫీచర్ ద్వారా వారి ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చగలిగేలా తీర్చిదిద్దేలా పనిచేస్తుంది. ఆ సౌకర్యం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్లు వెర్జ్ నివేదిక హైలెట్ చేసింది.
ఎక్స్.కామ్‌లో
చైనాలో మోస్ట్ పాపులర్ యాప్ వీచాట్‌లో రకరకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మెసేజింగ్, కాలింగ్‌తో పాటు మనీ ట్రాన్స్ ఫర్ అవకాశం కూడా ఉంది. ఒకే యాప్‌తో అనేక పనులకు ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎక్స్ కూడా ఇలాగే పని చేయబోతోంది. వాస్తవానికి మస్క్ 1999లో ‘ఎక్స్’ అనే ఆన్‌లైన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి దాన్ని ‘పేపాల్’లో విలీనం చేశారు. అయితే ఎక్స్‌లో ఇప్పుడు ట్రాన్సాక్షన్‌లు చేసుకునేలా ఫీచర్లను అభివృద్ది చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది చివరి నాటి వరకు ఎదురు చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment