ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు షాకిచ్చారు. ఎక్స్ ఫ్లాట్ ఫామ్ నుంచి అకౌంట్లను బ్లాక్ చేసే ‘బ్లాక్’ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ’ ఎక్స్ అకౌంట్ యూజర్ ‘బ్లాక్ అండ్ మ్యూట్’ ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటూ ప్రశ్నించిన సందర్భంగా ఎలాన్ మస్క్ పైవిధంగా స్పందించారు.
బ్లాక్ ఆప్షన్ డిలీట్ చేస్తున్నట్లు తెలిపిన మస్క్.. యూజర్లు ఇతర అకౌంట్ల నుంచి ఏదైనా సమస్యలు తలెత్తితే మ్యూట్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఇక తాము డిలీట్ చేసిన బ్లాక్ అనే ఫీచర్ వల్ల పెద్ద ఉపయోగం లేదనే అభిప్రాయాన్ని మస్క్ వ్యక్తం చేశారు. కానీ, ఎవరైతే మన అకౌంట్‌లను మ్యూట్ చేశారో వాళ్లు వారి ఎక్స్ అకౌంట్‌లో ఏ పోస్ట్‌లు పెడుతున్నారో, ఎన్ని కామెంట్స్, ట్వీట్‌లు, రీట్విట్‌లు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తే వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్‌లను తన స్నేహితులకు పంపుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ కూడా చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
మరోవైపు, సోషల్ మీడియాలో బ్లాక్ అనే ఆప్షన్ యూజర్ల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడీ ఈ ఫీచర్‌ను తొలగించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉందని ఎక్స్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
చదవండి👉ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్.. జియో ఫైనాన్స్ లిస్టింగ్ ఎప్పటినుంచంటే?
Comments
Please login to add a commentAdd a comment