అపర కుబేరుడు, ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఏదో ఒక అంశంపై నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అలాంటి మస్క్ తాజాగా వికీపీడియా సంస్థకు భారీ ఆఫర్ చేశారు.
మానవాళికి తెలిసిన విజ్ఞానాన్నంతా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందగలిగే ప్రపంచాన్ని ఊహించండి’ అంటూ జిమ్మీ వేల్స్ అతి తక్కువ మంది వాలంటీర్లతో వికీపీడియాను రూపొందించారు. ఇప్పుడీ ఈ వికీపీడియా యూజర్ల నుంచి విరాళాలు సేకరించడంపై మస్క్ వ్యంగంగా స్పందించారు. ఓ బూతు పేరును సూచించి.. వికీపీడియాకు బదులు తాను ప్రతిపాదించిన పేరు పెట్టాలని మస్క్ కోరారు. తన ప్రతిపాదనను అంగీకరిస్తే రూ.100 కోట్లు ఇస్తానని కూడా ఆఫర్ చేశారు.
నేనేమీ ఫూల్‌ని కాదు
మస్క్ ట్వీట్‌తో ఓ యూజర్ వికీపీడియా పేరు మార్చిన తర్వాత మళ్లీ పాతపేరునే (వికీపీడియా) అప్‌డేట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అందుకు మస్క్ ‘నేనేమీ ఫూల్ కాదు. ఏడాది వరకు ఆపేరు అలాగే ఉంచాలి. మార్చడానికి వీలు లేదని రిప్లయి ఇచ్చారు.
అంత డబ్బు ఎందుకు
మరొక పోస్ట్‌లో.. వికీమీడియా ఫౌండేషన్‌కి ఎందుకు అంత డబ్బు కావాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వికీపీడియాను ఆపరేట్ చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరం లేదు. మీరు మీ ఫోన్‌లో టెక్ట్స్‌ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి, అంత డబ్బు దేనికి? ఇక యూజర్లని డబ్బులు ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని మస్క్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment