data leak
-
మా డేటా లీక్ అవుతోంది!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక అవసరానికి మన కీలక వివరాలైన ఆధార్, పాన్ కార్డు, ఈ–మెయిల్, ఫోన్ నంబర్.. వీటిలో ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. అయితే ఇలా మనం ఎంతో నమ్మకంగా ఇతర సంస్థలతో పంచుకునే డేటా కొన్ని మార్గాల్లో లీకవుతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత వివరాలకు సంబంధించి డేటా లీకేజీలపై ప్రజాభిప్రాయం కోసం లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయి. ఆధార్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ.. ఇలా ఏదో ఒక రకమైన తమ డేటా పబ్లిక్ డొమైన్‌లోకి లీకైనట్టుగా సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వెల్లడించారు. డేటా లీకేజీకి ఈ–కామర్స్ వెబ్సైట్లు, టెలికం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పేమెంట్ యాప్‌లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కారణమై ఉండొచ్చని వారు పేర్కొన్నారు. మరో 50 శాతం మంది తమ ఆధార్ లేదా పాన్‌కార్డుల వివరాలు లీకయ్యే ప్రమాదం ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేశారు. డేటా లీకేజీ 2022లో 72 శాతంగా ఉండగా.. 2025 ఫిబ్రవరి నాటికి అది 87 శాతానికి చేరినట్టుగా లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. 2024 అక్టోబర్‌లో ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారుల్లో 31 మిలియన్ల మంది డేటా లీకవడం.. ఇటీవల జరిగిన కుంభమేళా సమయంలో సంబంధం లేకుండానే ఎన్నో రకాల ఆఫర్ల పేరిట ఎస్ఎంఎస్లు రావడంతో డేటా లీకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఇటీవల దేశవ్యాప్తంగా 375 జిల్లాల్లో 36 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
వ్యక్తిగత డేటా లీక్!.. కారణం వారే అంటున్న నెటిజన్స్
న్యూఢిల్లీ: తమ వ్యక్తిగత డేటా పబ్లిక్ డొమైన్‌లోకి చేరిపోయినట్టు మెజారిటీ నెటిజన్లు భావిస్తున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీక్ అయినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది చెప్పారు. ఇందులో సగం మంది తమ ఆధార్ లేదా పాన్ వివరాలు లీక్ అయినట్టు భావిస్తున్నారు.దేశవ్యాప్తంగా 375 జిల్లాల పరిధిలో 36వేల మంది స్పందనలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ప్రధానంగా టెలికం ఆపరేటర్లు, ఈ–కామర్స్ యాప్‌లు, బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ విభాగాలు తమ డేటా లీకేజీకి కారణమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీకేజీకి టెలికం ఆపరేటర్లు కారణమని 65 శాతం మంది భావిస్తుంటే, 63 శాతం మంది ఈ–కామర్స్ యాప్‌లు లేదా సైట్లు, 56 శాతం మంది బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు కారణమై ఉంటాయని చెప్పారు.స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇందుకు కారణమని 50 మంది అనుకుంటున్నారు. 48 శాతం మంది పేమెంట్ యాప్‌ల ద్వారా తమ వ్యక్తిగత వివరాలు లీక్ అయి ఉంటాయని చెప్పగా.. 26 శాతం మంది విద్యా సంస్థలు, 37 శాతం మంది వ్యాపార సంస్థల పాత్ర ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. -
నివా బూపా హెల్త్‌పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్‌ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్‌ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే. -
డేటా లీక్‌పై యూరప్ ఎన్ఆర్ఐల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్‌కు ఎన్ఆర్ఐల డేటా లీక్ చేయడం కలకలం సృష్టిస్తోందని, ఒక రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేస్తారని యూరోప్ ఎన్ఆర్ఐలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ‘దావోస్ పర్యటన–రాష్ట్రానికి పెట్టుబడులు’ అనే అంశంపై బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూరోప్ నుంచి పలువురు వాణిజ్య నిపుణులు, న్యాయవాదులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రాజకీయ సంస్థ (ఎన్ఆర్ఐ టీడీపీ)కు డేటా లీక్ అయ్యిందని, ఈ సంస్థ ద్వారా యూరోప్‌లోని ఎన్ఆర్ఐలకు మెయిల్స్ రావడం చూసి అందరూ ఆందోళనకు గురయ్యారనే విషయం ఈ వెబినార్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై జీడీపీఆర్ (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్)కు ఫిర్యాదులు చేయనున్నారనే విషయం ఈ వెబినార్ ద్వారా బయట పడింది. ఈ వెబినార్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..డేటా లీక్‌పై విచారణ జరపాలిఒక రాజకీయ సంస్థగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ అనే సంస్థ నుంచి మాకు మెయిల్స్ రావడం చాలా సీరియస్ అంశం. యూరోప్‌లోని మొత్తం తెలుగు ఎన్ఆర్ఐలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరగాలి. ఆయా దేశాల్లోని ఎన్ఆర్ఐలు జీడీపీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అక్కడ నో కార్ జోన్ ఉంటుంది. ఎంత పెద్ద వారు అయినా అక్కడ నడవాల్సిందే. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. జిందాల్ సంస్థ ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒక మహిళతో కేసులు పెట్టించడం చేటు చేసింది. – ఎల్లాప్రగడ కార్తీక్, ఆర్థిక నిపుణుడు, ఇంటర్నేషనల్ ట్రేడ్ దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలా?దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్త హస్తాలతో తిరిగి వచ్చి, దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలతో సమానం అని చెప్పడం దారుణం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తీసుకువస్తుంటే, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పైగా ప్రపంచ తీరు తెలుసుకునేందుకే దావోస్‌కు వెళ్లామని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనం. – వీవీఆర్ కృష్ణంరాజు, కన్వీనర్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదురాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు, ఎటువంటి సహకారం ఇస్తామనే దానిపై సమగ్ర ప్రణాళికతో దావోస్‌కు వెళ్లాలి. అది జరగలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌కు పలు సంస్థలు వచ్చాయి. కానీ చేసిన హడావుడికి, ఆచరణలో సంస్థల పట్ల వ్యవహరించిన తీరుకు మధ్య చాలా తేడా ఉంది. గతంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖలో నిర్వహించిన సదస్సులో భోజనాల కోసం తోపులాట జరగడం ఎవరూ మరచిపోలేదు. – జేటీ రామారావు, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడుఏపీకి నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదుపెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల రాజకీయ ప్రభుత్వం, సులభతర వాణిజ్య విధానాలు ఉండాలి. దేశంలో బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తెలంగాణా రాష్ట్రం ఫార్మా, ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీ మాత్రం దేనిపైనా ఫోకస్ పెట్టలేక పోయింది. నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదు. – చింతలపాటి సుబ్బరాజు, ఏపీ సివిల్ సొసైటీ కో కన్వీనర్పవన్ ప్రాధాన్యత తగ్గించేందుకేడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించాలన్న లక్ష్యంతోనే దావోస్ పర్యటనను వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌లు దావోస్‌కు వెళితే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది భ్రమ అని నిరూపితమైంది. ఎన్ఆర్ఐల డేటాను రాష్ట్ర ప్రభుత్వం లీక్ చేయడంపై న్యాయస్థానంలో కేసు నమోదు చేయబోతున్నాం. – పల్లి ప్రభాకర్ రెడ్డి, న్యాయ నిపుణుడు, సామాజిక ఉద్యమకారుడు అస్తవ్యస్తంగా చంద్రబాబు పాలనవైఎస్ జగన్ పాలనలో దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఈరోజు చంద్రబాబు పర్యటన ద్వారా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు? రేవంత్‌రెడ్డి రూ.1.79 లక్షల కోట్లు తెలంగాణాకు తీసుకువచ్చారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఉత్త చేతులతో రాష్ట్రానికి వచ్చారు. బాబు పాలనలో అప్పులు పెరిగాయి, రాబడి తగ్గింది. ఈ లెక్కన ఎవరిది సమర్థమైన పాలన? – బి.అశోక్ కుమార్, ఆంధ్రా అడ్వొకేట్స్ ఫోరం కన్వీనర్ -
3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ
పాలసీదారుల కీలక సమాచారం లీక్ కావడంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ తన భద్రతను పటిష్టం చేసుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ తరహా డేటా లీకేజీ ఘటన మరోసారి చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన డేటా లీకేజీ ఘటనలో 3.1 కోట్ల స్టార్ హెల్త్ కస్టమర్ల మొబైల్ ఫోన్, పాన్, చిరునామా తదితర సున్నిత సమాచారం బయటకు రావడం గమనార్హం. షెంజెన్ అనే హ్యాకర్ ఈ సమాచారాన్ని ఏకంగా ఒక పోర్టల్‌లో విక్రయానికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందే..‘ఒకరితో ఒకరు అనుసంధానమై పనిచేయాల్సిన ప్రపంచం ఇది. ఏజెంట్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు అన్ని అనుసంధానమై పని చేసే చోట తమ వంతు రక్షణలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బలహీన పాస్వర్డ్లు తదితర వాటిని హ్యాకర్లు సులభంగా గుర్తించగలరు. కేవలం అంతర్గతంగానే కాకుండా, స్వతంత్ర నిపుణుల సాయంతో మేము ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకున్నాం’ అని ఆనంద్‌రాయ్ వివరించారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయంటూ, బీమా కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..అసలేం జరిగింది..?స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి ఉంచినట్లు గతంలో గుర్తించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్ల అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం. మద్రాస్ హైకోర్ట్ ఆదేశాల మేరకు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. -
ఇన్సూరెన్స్ పాలసీదారుల డేటా లీక్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన ఐటీ సిస్టమ్స్‌లో డేటా లీక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉల్లంఘనల తీవ్రత, ప్రభావాలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. కస్టమర్లకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు ఒక గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చినట్లు, ఎవరో దురుద్దేశంతోనే ఇదంతా చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వీటికి మూలకారణాలను తెలుసుకునేందుకు, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించినట్లు వివరించింది. పాలసీదారుల డేటా లీక్ ఉదంతాల నేపథ్యంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఇటీవలే ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయించాల్సిందిగా రెండు బీమా సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉదంతం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సెకనుకో సైబర్ నేరం.. రోజుకు 90 లక్షల కంప్యూటర్ వైరస్ల పుట్టుక
ఏదో ఒక పెద్ద జీవి అమాంతం నోరు తెరిచి ఈ డైవర్‌ను మింగేస్తున్నట్లు కనిపి స్తోంది కదూ.. ఈ సాడీన్ చేపలు వేల సంఖ్యలో గుంపుగా తిరుగుతుంటాయి. ఆ సమయంలో ఇవి రకరకాల ఆకారాలను ఏర్పరుస్తుంటాయి. ఆ సందర్భంగా తీసినదే ఈ చిత్రం. ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ అవార్డు–2024లో బెంజమిన్ యావర్ తీసిన ఈ చిత్రం నేచర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైంది.సాక్షి,హైదరాబాద్: మనదేశంలో ప్రతి సెకనుకు ఒక సైబర్ నేరం జరుగుతోందని ప్రముఖ సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి తెలిపారు. ప్రతి 8 నిమిషాలకు ఒక ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు 90 లక్షల కంప్యూటర్ వైరస్లు పుట్టుకొస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో బిట్కాయిన్ల రేటు పెరుగుతోందంటే ఓ భారీ సైబర్ దాడికి రంగం సిద్ధమవుతోందని సంకేతమని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడేది,లావాదేవీలు జరిపేది బిట్కాయిన్ల రూపంలోనే కావడమే అందుకు కారణమని వివరించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నగర పోలీసులు, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం ‘హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024’(హాక్–2.0) నిర్వహించింది. దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ నటుడు అడవి శేషు తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి కీలకోపన్యాసం చేశారు. సాఫ్ట్వేర్ రంగంతోపాటు దేశంలోని అన్నిరంగాలకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉన్నదని తెలిపారు. ప్రతీరోజూ పుట్టుకొస్తున్న 90 లక్షల కంప్యూటర్ వైరస్లలో రెండు శాతం వైరస్ల లక్షణాలు ఎవరికీ తెలియదని అన్నారు. కృష్ణశాస్త్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..గుర్తించటం కష్టమే..సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త మార్గాల్లో దాడులకు పాల్పడుతుండటంతో వాటిని గుర్తించటం కష్టంగా మారింది. విమాన సర్వీసులకు జీపీఎస్ స్ఫూఫింగ్, డ్రాపింగ్ పెద్ద సవాల్‌గా పరిణమించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల జీపీఎస్‌ను హ్యాక్ చేసేందుకు 64 శాతం అవకాశం ఉంది. ప్రపంచంలోని ప్రతి ఆటోమేటిక్ వ్యవస్థకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉంది. ఎస్సెమ్మెస్‌ల ద్వారా లింకులు పంపే విషింగ్, ఈ–మెయిల్స్ ద్వారా పంపే ఫిషింగ్ స్కామ్‌లు ఇప్పటివరకు చూశాం. తాజాగా క్యూఆర్ కోడ్ పంపిస్తూ చేసే క్యూఆర్ ఇషింగ్ కూడా జరుగుతోంది. పుణేలోని కాస్మోస్ బ్యాంక్ సర్వర్‌పై మాల్వేర్తో దాడి చేసిన సైబర్ నేరగాళ్లు రూ.94 కోట్లు కాజేశారు. 2018లో ఇది జరిగినా ఆ మొత్తం ఎక్కడకు వెళ్లిందో ఇప్పటికీ గుర్తించలేకపోయాం. హెల్త్ డేటా లీకైతే బయోవెపన్స్ ముప్పువ్యక్తిగత, ఆర్థిక డేటాతోపాటు హెల్త్ డేటా కూడా అత్యంత కీలకం. ఇటీవల కాలంలో వైద్య రంగానికి చెందిన సంస్థలు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు, ఆస్పత్రులకు సంబంధించిన సర్వర్ల మీద సైబర్ దాడులు చేస్తూ ప్రజల హెల్త్ డేటాను కాజేస్తున్నారు. ఇది శత్రుదేశాల చేతికి చిక్కితే భవిష్యత్తులో బయోవెపన్స్ (జీవాయుధాలు) ముప్పు పెరుగుతుంది. ఈ హెల్త్ డేటా ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారు అనేది వారికి తెలుస్తుంది. దీంతో ఆయా బ్లడ్ గ్రూప్స్ వారిపైనే ఎక్కువ ప్రభావం చూపేలా బయోవెపన్స్ తయారు చేసి ప్రయోగించే ప్రమాదం ఉంటుంది. ఈ ఏడాది డిజిటల్ ఫోరెన్సిక్‌కు సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈ నేపథ్యంలో ప్రిడెక్టివ్, రెస్పాన్సివ్ కంట్రోల్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
డేటా లీక్.. రూ.57 లక్షలు డిమాండ్!
కస్టమర్ డేటా, మెడికల్ రికార్డుల లీక్ వ్యవహారానికి సంబంధించి దేశంలో అతిపెద్ద ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ కొత్త విషయాన్ని వెల్లడించింది. సైబర్హ్యాకర్లు తమను 68,000 డాలర్లు (రూ.57 లక్షలు) డిమాండ్ చేసినట్లు తెలిపింది.టెలిగ్రామ్ చాట్బాట్లు, వెబ్‌సైట్‌ను ఉపయోగించి పన్ను వివరాలు, మెడికల్ క్లెయిమ్ పేపర్లు సహా కస్టమర్ల సున్నితమైన డేటాను హాకర్ లీక్ చేసినట్లు రాయిటర్స్ నుంచి కథనం వెలువడిన తర్వాత కంపెనీ వ్యాపార సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో స్టార్ హెల్త్ షేర్లు 11% క్షీణించాయి. ఈ డేటా లీక్ వ్యవహారంపై కంపెనీ అంతర్గత విచారణ చేపట్టింది. టెలిగ్రామ్, హ్యాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది.టార్గెటెడ్ సైబర్అటాక్కు గురైనట్లు గతంలో చెప్పిన స్టార్, హ్యాకర్ తమను 68,000 డాలర్లు డిమాండ్ చేస్తూ గత ఆగస్ట్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్‌లకు ఈమెయిల్ పంపినట్లు తాజాగా వెల్లడించింది.డేటా లీక్‌లో తమ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కంపెనీ దర్యాప్తు చేస్తోందని రాయిటర్స్ నివేదికపై భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు స్టార్ నుండి వివరణలు కోరిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అంతర్గత విచారణ కొనసాగుతున్నప్పటికీ, అధికారి అమర్జీత్ ఖనుజా ఎలాంటి తప్పు చేయలేదని స్టార్ పునరుద్ఘాటించడం గమనార్హం. -
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 3.1 కోట్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన పాలైనట్టు యూకే కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ ఆరోపించారు. కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి 3.1 కోట్ల కస్టమర్లకు సంబంధించి మొబైల్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను విక్రయించినట్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడో పక్షం నుంచి మోసపూరిత చర్యలకు (ఉల్లంఘైన డేటా ఆధారంగా) అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు స్టార్ హెల్త్ సంస్థ ఈ మెయిల్ ద్వారా హెచ్చరించడం ఉల్లంఘన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. యూకేకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ షెంజెన్ అనే హ్యాకర్ స్టార్ హెల్త్ నుంచి పొందిన డేటాను వెబ్సైట్లో పెట్టినట్టు ప్రకటించారు. ‘‘స్టార్ హెల్త్ ఇండియా కస్టమర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి సున్నితమైన డేటాను లీక్ చేస్తున్నాను. ఈ డేటాను నాకు నేరుగా విక్రయించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీదే ఇందుకు బాధ్యత’’అంటూ షెంజెన్ పోస్ట్‌ను పార్కర్ ప్రస్తావించారు. టెలీగ్రామ్ బోట్లను సృష్టించడం ద్వారా 2024 జూలై నాటికి 3,12,16,953 మంది కస్టమర్ల డేటాను, 57,58,425 క్లెయిమ్‌ల డేటాను హ్యాకర్ పొందినట్టు చెప్పారు. డేటా లీకేజీకి గాను 1,50,000 డాలర్ల డీల్ కుదిరినట్టు కూడా పార్కర్ తెలిపారు. అప్రమత్తత.. స్టార్ హెల్త్ ఉద్యోగులమని చెబుతూ ప్రస్తుత పాలసీని నిలిపివేయండనే చర్యలకు థర్డ్ పారీ్టలు పాల్పడొచ్చంటూ స్టార్ హెల్త్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ తరహా మోసపూరిత చర్యలు వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించడంతోపాటు, దీర్ఘకాలంలో పాలసీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. క్లెయిమ్‌ల డేటాను అనధికారికంగా పొందినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు మెయిల్స్ కూడా వచి్చనట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు కంపెనీ సమాచారం ఇచి్చంది. ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా తగిన సైబర్ భద్రతా వ్యవస్థలు, నియంత్రణలను అమలు చేస్తున్నామని, దీనిపై మళ్లీ తాజా సమాచారం విడుదల చేస్తామని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది. -
37.5 లక్షల యూజర్ల డేటా లీక్!.. స్పందించిన ఎయిర్టెల్
డార్క్ వెబ్‌లో 37.5 కోట్ల భారతీ ఎయిర్టెల్ వినియోగదారుల డేటా అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణల మీద కంపెనీ స్పందిస్తూ.. స్వార్థ ప్రయోజనాలతో ఎయిర్టెల్ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం ఇదని ఖండించింది.‘ఎక్స్జెన్’ పేరుతో 37.5 కోట్ల ఎయిర్టెల్ వినియోగదారుల వివరాలు, ఫోన్ నంబర్, ఈమెయిల్, చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ నంబర్ డార్క్ వెబ్‌లో రూ. 41 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు హ్యాకర్ పేర్కొన్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని ఎయిర్టెల్ ప్రతినిధి అన్నారు.డేటా లీక్ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా రాజశేఖర్ రాజహరియా 25 లక్షలకుపైగా ఎయిర్టెల్ యూజర్ల వివరాలను ‘రెడ్ రాబిట్ టీమ్’ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కూడా దీనిపైన విచారణ జరిపితే.. అదికూడా వాస్తవం కాదని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ఎయిర్టెల్ వివరించింది. -
అమెరికన్ బ్యాంకు డేటా లీక్
-
అదంతా ఇన్ఫోసిస్ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్ నిందలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్కామిష్ అనేది ప్లాట్‌ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్ బీపీవో) కొనుగోలు చేసింది. "2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్‌లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్‌లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! -
‘క్లిక్ చేస్తే ఖల్లాస్’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ!
ఇంటర్నెట్ యూజర్లకు, అమెరికాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరస్తులు షాకిచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన డేటాను చోరీ చేశారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 26 బిలియన్ల యూజర్ల డేటా చోరీకి గురైనట్లు డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన రీసెర్చర్లు నిర్ధారించారు. సైబర్ నేరస్తులు సేకరించిన డేటా మొత్తం ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే అన్ సెక్యూర్ పేజీలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లీకైన ఈ డేటాను చైనా మెసేజింగ్ జెయింట్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డిన్, ఎక్స్.కామ్, టెలిగ్రాం ద్వారా సేకరించినట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు రీసెర్చర్లు అన్నారు. ఇక యూజర్ల డేటాతో పాటు అమెరికా, ప్రపంచంలోని ఆయా దేశాల ప్రభుత్వ డేటా సైతం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చారు. డేటాతో ఏం చేస్తారంటే? ఇక సైబర్ నేరస్తులు( థ్రెట్ యాక్టర్స్) తస్కరించిన డేటాను ఉపయోగించి భారీ మొత్తంలో సైబర్ దాడులు, యూజర్ల బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం, ఫిషింగ్ స్కామ్స్, కొన్ని సంస్థల్ని లేదంటే, కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులు చేసేందుకు వీలుగా ఉపయోగిస్తారని రీసెర్చర్లు వెల్లడించారు. ఆ ధీమా వద్దు అయితే, డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారులే’ అనే ధీమాతో కాకుండా దొంగిలించిన డేటాతో ఏం చేయొచ్చు? ఒకవేళ వినియోగిస్తే వాటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎస్ఈటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్మూర్ అన్నారు. ఫోన్, మెయిల్స్, వాట్సాప్ ఆడియోకాల్స్ తో పాటు ఇతర అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, అలాంటి లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. గతాన్ని గుర్తు చేసిన రీసెర్చర్లు ఈ సందర్భంగా ఇదే తరహాలో సైబర్ నేరస్తులు 2019లో వెరిఫికేషన్.ఐఓ తయారు చేసిన ఎలాంటి భద్రత లేని డేటాబేస్ నుంచి దాదాపు వన్ బిలియన్ రికార్డులు డేటా లీకైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇదే అతిపెద్ద, అత్యంత హానికరమైన లీకేజీల్లో ఒకటిగా పేరొందింది. ఈ డేటా చౌర్యం మైస్పేస్ (360 మిలియన్లు), ట్విటర్ (281 మిలియన్లు), లింక్డిన్ (251 మిలియన్లు), అడల్ట్ఫ్రెండ్ఫైండర్ (220 మిలియన్లు) వంటి సోషల్ నెట్ వర్క్ యూజర్లదని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు స్పష్టం చేశారు. -
తాజ్ హోటల్స్‌పై సైబర్ అటాక్ - ప్రమాదంలో 15 లక్షల మంది డేటా!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ 'ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా'(ఐసీబీసీ) మీద జరిగిన సైబర్ దాడి మరువకముందే.. టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 నవంబర్ 5న తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు, తాజ్ హోటల్‌కు చెందిన సుమారు 15 లక్షల మంది డేటాను హ్యాక్ చేసినట్లు తెలిసింది. నిందితులు ఈ డేటాను తిరిగి ఇవ్వాలంటే 5000 డాలర్లు డిమాండ్ చేస్తూ కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని.. దీనిపైనా సమగ్ర పరిశీలను జరుగుతోందని, డేటా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. Dnacookies అనే పేరుతో హ్యాకర్లు కస్టమర్ల డేటాను హ్యాక్ చేసినట్లు, ఇప్పటికి ఈ డేటాను ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. కస్టమర్ ఐడీ, అడ్రస్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారాలను వారు హ్యాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టమర్ డేటా 2014 నుంచి 2020 వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. ఈ సంఘటనపై ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అధికారులకు కూడా ఇప్పటికే తెలియజేసినట్లు స్పష్టం చేశారు. -
81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే.. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్‌లో కొవిన్ వెబ్సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు! భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
కొవిన్ పోర్టల్‌లో డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కాగా, డేటా లీక్ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్ పూర్తిగా సేఫ్. ఇందులోని డేటాను సీక్రెట్‌గా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ-డీడీఓఎస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్‌ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఇక, ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే కొవిన్ పోర్టల్‌లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇది కూడా చదవండి: టీకా వేయించుకున్నారా? డాటా లీక్ -
కొవిన్ పోర్టల్ డేటా లీక్.. ఆర్బీఐ అప్రమత్తం!
కోవిడ్-19 వ్యాక్సిన్ టీకాలు అందించే భారత ప్రభుత్వ పోర్టల్ కోవిన్‌లో నమోదు చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో లభ్యమైనట్లు కోవిన్ డేటా లీకేజీపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. డేటా లీకేజీ అంశంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. డేటా లీకేజీ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం బ్యాంకుల్ని అప్రమత్తం చేసినట్లు జాతీయ, అంతర్జాతీయంగా ఆర్ధిక సేవల్ని అందించే సౌత్ ఏసియా ఇండెక్స్ నివేదించింది. కొవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్‌లోని (CoWIN ) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. కోవిన్‌లో వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో వారి వివరాల్ని నమోదు చేసుకున్న ప్రముఖుల పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, జెండర్, పుట్టిన తేదీ, వ్యాక్సినేషన్ సెంటర్‌తో ఇతర వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో లభ్యమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. Just IN:— Major data breach in India; Personal data of all vaccinated Indians have been leaked online. ☆ Leaked data has Aadhaar, voter ID, Passport numbers & mobile numbers of Indians who got covid-19 vaccines. — South Asia Index (@SouthAsiaIndex) June 12, 2023 అంతేకాదు కోవిన్ పోర్టల్‌లో అప్డేట్ చేసుకున్న విదేశీ ప్రయాణాల వివరాలు, వారి పాస్‌పోర్ట్ సమాచారం టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. వ్యక్తిగత వివరాలు లీకైన ప్రముఖుల్లో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రాజేష్ భూషణ్‌తో పాటు అతని భార్య ఉత్తరాఖండ్ కోటద్వార్ బీజేపీ ఎమ్మెల్యే రితూ ఖండూరి భూషణ్‌ల ఆధార్, పుట్టిన తేదీ వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ తరుణంలో డేటా లీక్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐటీ శాఖలు అప్రమత్తమయ్యాయి. విచారణను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదీ చదవండి : బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్! -
టీకా వేయించుకున్నారా? డాటా లీక్
కొవిన్ యాప్‌లో పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వం అతి పెద్ద గోప్యతా ఉల్లంఘన అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టీకా పొందినవారి వ్యక్తిగత వివరాలు ఇక టెలిగ్రామ్‌లో లభ్యమయ్యేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Cowin Portal से डाटा हुआ लीक? करोड़ों लोगों की पर्सनल डिटेल टेलीग्राम पर आई!अब तक मोदी सरकार देश की संपत्ति ही बेच रही थी, पर अब तो.... pic.twitter.com/NnCPnuT9YT— Rashtriya Janata Dal (@RJDforIndia) June 12, 2023 బాధ్యులెవరు? 'కొవిడ్ టీకా తీసుకున్నప్పుడు ఆధార్, ఫోన్ నెంబర్లు,పాస్‌పోర్టు వివరాలు,ఓటర్ ఐడీతో సహా కుటుంబ వివరాలు అన్ని నమోదు చేశారు. దేశంలో ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా అందులో ఉన్నాయి. కొవిన్ డేటా వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు ఇందులో పాలుపంచుకున్నారు? ప్రజల ముందు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?' అని సాకేత్ గోఖలే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రియా సూలే.. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎట్టిపరిస్థితుల్లో క్షమార్హం కాని నేరం' అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేం లేదు.. కొవిన్ యాప్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునే సమయంలో కేవలం వ్యాక్సిన్ తీసుకునే తేదీని మాత్రమే సేకరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. Co-WIN portal of Health Ministry is completely safe with safeguards for data privacy. All reports of data breach are without any basis and mischievous in nature. Health Ministry has requested CERT-In to look into this issue & submit a report: Government of India pic.twitter.com/hXbTpl3FNU— ANI (@ANI) June 12, 2023 ఇదీ చదవండి:వీడియోలెందుకు తీస్తున్నావ్.. భారత్‌లో విదేశీయుడికి చేదు అనుభవం -
ఈ–కామర్స్ సైట్ల నుంచే డేటా లీక్.. ఇంటి దొంగల పనే ఇదంతా..!
ఈ రోజుల్లో సరుకులు, కూరగాయల నుంచి దుస్తుల వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనేయడం అలవాటైపోయింది. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయింది. కస్టమర్ల పేరు, చిరునామా, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు.. ఇలా ప్రతీ ఒక్కటీ బహిరంగ మార్కెట్లోకి అలవోకగా వచ్చేస్తున్నాయి. భద్రంగా ఉండాల్సిన కస్టమర్ల వ్యక్తిగత వివరాలు అంగట్లో సరుకులుగా విక్రయిస్తున్నట్లు ఇటీవలసైబరాబాద్ పోలీసులు డేటాలీక్, విక్రయం కేసు విచారణలో గుర్తించారు. అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమాటో వంటి పదుల సంఖ్యలోని ఈ–కామర్స్ సైట్లలోని కస్టమర్ల డేటాను నేరస్తులు అమ్మకానికి పెట్టారు. – సాక్షి, హైదరాబాద్ ఇంటి దొంగల పనే.. ఆయా ఈ–కామర్స్ వెబ్సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆర్డర్ చేసిన వస్తువులతోపాటు కస్టమర్ల డేటా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత టెలికాలర్స్తో కస్టమర్లకు ఫోన్ చేయిస్తున్నారు. ఫలానా సైట్ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు.. కంపెనీ తీసిన లక్కీడీప్‌లో మీరు ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్లో నమ్మిస్తున్నారు. జీఎస్టీ, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ ఇలా రకరకాల చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రీఫండ్ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అప్రమత్తత అవసరం నిందితులు విక్రయానికి పెట్టిన వాటిలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, బుక్‌మై షో, ఇన్‌స్ట్రాగామ్, జొమాటో, పాలసీ బజార్, ఓఎల్ఎక్స్, బైజూస్, వేదాంతు వంటి సంస్థల వినియోగదారుల డేటా కూడా ఉంది. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఈ–కామర్స్ సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
డేటా దేశం దాటిందా?
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డేటా లీక్ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 24 రాష్ట్రాలకు చెందిన 80 కోట్ల మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెట్టడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా చౌర్యానికి గురైన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారం కూడా ఉండటంతో అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సైబరాబాద్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇటీవల మూడు డేటా చౌర్యం కేసులకు సంబంధించి 17 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, ర్యాంకులు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలు లీక్ అయ్యాయి. విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీఓలతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితులు విక్రయిసున్నారు. ఎలా లీకైంది? ఎవరు కొన్నారు? హై ప్రొఫైల్ వ్యక్తుల రహస్య సమాచారం లీక్ కావడంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. నిందితులకు సమాచారం ఎలా చేరింది? ఎక్కడి నుంచి లీకైంది? ఎవరెవరు డేటా కొనుగోలు చేశారు? కొన్న సమాచారాన్ని దేని కోసం వినియోగిస్తున్నారు? సున్నితమైన సమాచారం ఏమైనా దేశం దాటిందా? వంటి అంశాలపై సైబరాబాద్ పోలీసులను ఆరా తీసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే నిందితుల నుంచి రాబట్టిన సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు వివరించారు. వెబ్సైట్ల ద్వారా డేటా విక్రయం.. తొలుత నిందితులు జస్ట్ డయల్ వేదికగా డేటాను విక్రయిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. నిందితులు సొంతగా నకిలీ గుర్తింపు కార్డులతో కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి పేరుతో వెబ్సైట్లను సృష్టించి మరీ డేటాను విక్రయిస్తున్నట్లు తేలింది. ఢిల్లీ, ఫరీదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రామీణ నిరుద్యోగులను టెలీ కాలర్లుగా నియమించుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తెరుస్తూ.. కొట్టేసిన సొమ్మును నేరుగా ఆయా ఖాతాలకు మళ్లిస్తే పోలీసులకు దొరికిపోతామని నో బ్రోకర్.కామ్, హౌసింగ్.కామ్, పేటీఎం, మ్యాజిక్ బ్రిక్స్ వంటి ఆన్లైన్ సంస్థలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. 21 సంస్థలకు నోటీసులు జారీ.. నిందితుల నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను విశ్లేషించిన పోలీసులు.. 21 సంస్థల నుంచి డేటా చౌర్యానికి గురైనట్లు గుర్తించారు. దీంతో బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యా ట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి 21 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో 8 సంస్థలు మాత్రమే విచారణకు హాజరై.. కస్టమర్ల డేటా సమీకరణ, భద్రత విధానాలపై పోలీసులకు నివేదికను సమర్పించాయి. దీంతో గైర్హాజరైన కంపెనీలపై పోలీసులు న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. 28 వెబ్సైట్లు ఇవే.. ♦ ఇన్‌సై్పర్ వెబ్స్ ♦ డేటా మార్ట్ ఇన్ఫోటెక్ ♦ గ్లోబల్ డేటా ఆర్ట్స్ ♦ ఎంఎస్ డిజిటల్ గ్రో ♦ ఇన్స్పైర్ డిజిటల్ ♦ ఫన్డూడేటా.కామ్ ♦ కెనిల్స్.కో ♦ డేటాస్పెర్నీడ్.కామ్ ♦ బినరీక్లూస్.కామ్ ♦ ఇనిగ్మా మార్కెటింగ్ ♦ అల్టీమోక్డ్స్.కామ్ ♦ ఫాస్ట్ డేటాబేస్ ప్రొవైడర్ ♦ డేటా సొల్యూషన్ ఫర్ బీ2బీ అండ్ ♦ బీ2సీ పోర్టల్ ♦ బీజీ డేటా ♦ డిమాండ్ డేటా సొల్యూషన్ ♦ స్పెర్ డిజిటల్ ఇండియా ♦ క్యూబిక్టెక్నాలజీ.కామ్ ♦ బీబీజీఈబ్రాండిం గ్.కామ్ ♦ ఈజీసర్వ్.కో.ఇన్ ♦ డేటాప్రొలిక్స్.కామ్ ♦ క్యూబిర్ర్ డేటాబేస్ మార్కెటింగ్ ♦ 77డేటా.నెట్ ♦ 99డేటాఏసీడీ.కామ్ ♦ డేటాబేస్ప్రొవైడర్.ఇన్ ♦ హెచ్ఐడేటాబేస్.కామ్ ♦ బల్క్డేటాబేస్.ఇన్ఫో ♦ గ్లోబల్‌డేటా.కామ్ ♦ డేటాపార్క్.కో.ఇన్ -
డేటా లీకుపై 'ఈడీ ఆరా'
సాక్షి, హైదరాబాద్: దేశంలోని సగం జనాభా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయించిన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. 70 కోట్ల మంది ప్రజలు, సంస్థలకు చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని చోరీ చేసిన ఫరీదాబాద్ (హరియాణా)కు చెందిన వినయ్ భరద్వాజ్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే 17 కోట్ల మంది డేటా లీకు కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నితీశ్ భూషణ్ కుమార్, పూజా కుమారి, సుశీల్ తోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్, జియా ఉర్ రెహ్మాన్‌లపై పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని అతిపెద్ద డేటా లీకు కేసులో ప్రధాన సూత్రధారి వినయ్ భరద్వాజ్‌పై కూడా ఈడీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు రక్షణ, టెలికం, విద్యుత్, ఇంధనం, జీఎస్టీ వంటి ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కీలక సమాచారాన్ని నిందితులు తస్కరించి, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నిందితుల కార్యకలాపాల్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణతోపాటు ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మనీలాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం ఆంధ్రపదేశ్, తెలంగాణతోపాటు 24 రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని నిందితులు విక్రయానికి పెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసులను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. వినయ్ భరద్వాజ్ ఏడాది కాలంగా ఫరీదాబాద్ కేంద్రంగా డేటా నిల్వ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్సైట్ ద్వారా ఇప్పటివరకు 50 మందికి డేటాను విక్రయించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లతోపాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంగా నిందితులు డేటా చోరీ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కకపోవటం గమనార్హం. ఈ–కామర్స్ కంపెనీలు, బ్యాంకులకు నోటీసులు ఈ–కామర్స్, ఐటీ కంపెనీలు వినియోగదారుల సమాచారంలో గోప్యత, భద్రత పాటించకపోవడం వల్లే డేటా లీకైనట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. యూజర్ల సెన్సిటివ్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ (ఎస్పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా ఈ–కామర్స్ కంపెనీల చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, అస్ట్యూట్ గ్రూప్, యాక్సిస్ బ్యాంకు, మాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంకు అఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలకు సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేశారు. -
డేటా లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: డేటా లీక్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 6 మెట్రోపాలిటిన్ సిటిల్లో 4.5 లక్షల ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడు. మొత్తం 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. బుక్ మై షో, ఇన్స్టాగ్రామ్ జొమాటో, పాలసీ బజార్ నుంచి డేటా చోరీ చేశారని తెలిపారు. బైజూస్, వేదాంత సంస్థల డేటా కూడా లీకైనట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటితో పాటు 9, 10, 11, 12 తరగతులు విద్యార్థులు డేటా, పాన్‌కార్డ్, క్రెడిట్‌కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్‌కంట్యాక్స్, ఢిఫెన్స్ డేటా కూడా చోరికి గురైంది. చదవండి: కడుపు తరుక్కుపోయింది.. కన్నీళ్లు ఆగలేదు: సీఎం కేసీఆర్ -
HYD: డేటా చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈడీ ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. డేటా చోరికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. డేటా చోరి స్కామ్‌లో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. పలు కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు -
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది. వెబ్సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు.. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, వెబ్సైట్లను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్‌పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్)లను గుర్తించారు. వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్ఐఏకు బదిలీ? బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్‌స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు. -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్‌మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్‌ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్‌ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్‌లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
డేటా ఎక్కడి నుంచి లీకైంది?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్లౌడ్, హార్డ్ డిస్క్‌లలో డేటా.. ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్ డిస్క్‌లతోపాటు క్లౌడ్ సర్వీస్‌లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్ సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్‌లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అలర్ట్ నీట్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్‌కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. ఏజెన్సీల నుంచే డిఫెన్స్ సమాచారం లీక్? రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్ అధికారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్‌లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
‘ఎయిమ్స్’ తరహాలో మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా!
చెన్నై: దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిమ్స్‌పై సైబర్ దాడితో గత 10 రోజులుగా సర్వర్లు పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ విషయం తేలకముందే మరో ఆసుపత్రిపై పంజా విసిరారు హ్యాకర్లు. సుమారు 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ సర్వర్లను హ్యాక్ చేసి రోగుల డేటాను పాపులర్ సైబర్ క్రైమ్ ఫోరమ్స్, టెలిగ్రామ్ ఛానళ్లలో అమ్మకానికి పెట్టినట్లు సైబర్ ముప్పుపై విశ్లేషించే సంస్థ ‘క్లౌడ్‌సెక్’ వెల్లడించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. క్లౌడ్‌సెక్ వివరాల ప్రకారం.. ‘థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్’ అనే థర్డ్ పార్టీ వెండర్ ద్వారా 2007 నుంచి 2011 మధ్య నమోదైన రోగుల వివరాలను దొంగిలించినట్లు తేలింది. అయితే, శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ విధులు నిర్వర్తించటంపై సమాచారం లేదని పేర్కొంది. కొనుగోలుదారులు నమ్మేందుకు నమూనా జాబితాను ఆన్లైన్ ఉంచారు. లీక్ అయిన డేటాలో రోగుల పేర్లు, జన్మదినం, అడ్రస్, సంరక్షకుల పేర్లు, డాక్టర్ల వివరాలు ఉన్నాయి. డాక్టర్ల వివరాలతో ఏ ఆసుపత్రి డేటా హ్యాకింక్‌గు గురైందనే విషయాన్ని క్లౌడ్‌సెక్ గుర్తించింది. ఆన్లైన్ అమ్మకానికి ఉంచిన డేటాలోని డాక్లర్లు తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్లో పని చేశారని తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన మరుసటి రోజునే తమిళనాడు శ్రీ శరణ్ ఆసుపత్రి డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: 8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు -
2 కోట్ల మంది వొడాఫోన్ యూజర్ల డేటా బహిర్గతం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (వీఐ) సిస్టమ్‌లోని పలు లోపాల వల్ల దాదాపు 2 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కాల్ డేటా రికార్డులు బహిర్గతం అయినట్లు సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ సైబర్ఎక్స్9 ఒక నివేదికలో వెల్లడించింది. ఏ కాల్స్‌ను ఎవరికి, ఎన్నింటికి, ఎంత సేపు, ఎక్కడ నుంచి చేశారనే వివరాలతో పాటు కస్టమర్ల పూర్తి పేరు, చిరునామా మొదలైన సమాచారం అంతా కూడా వీటిలో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని వీఐకి ఆగస్టు 22న తెలియజేయగా, సిస్టమ్‌లోని లోపాలను గుర్తించినట్లు ఆగస్టు 24న కంపెనీ తమకు ధృవీకరించినట్లు వీఐ తెలిపింది. మరోవైపు, నివేదికలో పేర్కొన్నట్లుగా డేటా ఉల్లంఘన వార్తలను వీఐ ఖండించింది. నివేదికంతా తప్పుల తడకని, విద్వేషపూరితమైనదని వ్యాఖ్యానించింది. తమ ఐటీ సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగానే ఉందని, కస్టమర్ల డేటా సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. బిల్లింగ్ విషయంలో లోపాలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించామని, దాన్ని వెంటనే సరిచేశామని పేర్కొంది. చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్) -
China: జిన్‌పింగ్ గూడుపుఠాణి.. డాటా లీక్ కలకలం
హ్యాకర్ల చేతిలో కోట్ల మందికి చెందిన కీలక సమాచారం.. దీనంతటికి కారణం చైనా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలపై నోరు మెదపకుండా ఉండిపోయింది డ్రాగన్ సర్కార్. చైనా పోలీస్, భద్రతా వర్గాల డేటాను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఏకంగా బిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం తమ గుప్పిట్లో ఉందంటూ ప్రకటించడం డ్రాగన్ కంట్రీని కలవరపెడుతోంది. అదే సమయంలో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నాలపైనా చర్చ(రచ్చ) మొదలైంది. ఏ దేశంలో అయినా.. ప్రజానుమతులతో వ్యక్తిగత సమాచార సేకరణ ఉంటుంది. గుర్తింపు కోసం(మన దేశంలో ఆధార్‌లాగా) జరిగే సర్వసాధారణ వ్యవహారమే ఇదంతా. కానీ, జి జింగ్‌పిన్ సర్కార్ చేపట్టిన.. డాటా సేకరణ వెనుక అసలు ఉద్దేశాని న్యూయార్క్ టైమ్స్ బట్టబయలు చేసింది. అంతేకాదు ఆ డాటాను సేకరించేందుకు వ్యవహరిస్తున్న తీరుపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు. పౌరుల ఐడెంటిటీ కోసమే వ్యక్తిగత సమాచార సేకరణ అంటూ ప్రకటించుకున్న చైనాకు.. అసలు ఉద్దేశం వేరే ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనాలో సామాజిక స్థిరత్వం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని ముప్పుగా పరిణమించే అంశమేదైనా దృష్టికి వస్తే.. వెంటనే దానిని అడ్డుకునేందుకు, అవసరమైతే అడ్డు తొలగించేందుకు ఈ డేటాను ఉపయోగిస్తోంది జింగ్‌పిన్ సర్కార్. అయితే ఇది సంఘ విద్రోహుల అణిచివేత అనడం కంటే.. హక్కుల కోసం నిలదీసేవాళ్లను అణచివేయడంగా పేర్కొనడం సరైందని సదరు కథనం హైలైట్ చేసింది. 2020లో.. చైనాకు చెందిన ఓ మహిళ వివాహం చేసుకునేందుకు హాంకాంగ్ వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతికి దరఖాస్తు చేసుకుంది. అయితే.. కాబోయే భర్తను తాను ఇదివరకే చాలాసార్లు కలుసుకున్నానని ఆమె చెప్పడం.. పలు అనుమానాలకు తావు ఇచ్చింది. సర్వేయిలెన్స్ సాఫ్ట్వేర్ అదంతా అబద్ధం అని తేల్చింది. దీంతో అప్రమత్తం అయిన చైనా పోలీసులు.. ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆపై దర్యాప్తులో మైగ్రేషన్ పర్మిట్ కోసమే ఆమె నాటకం ఆడిందన్న విషయం వెలుగు చూసింది. ఈ కేసు మాత్రమే కాదు.. పిరమిడ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని, ఓ ఉద్యమవేత్తను, ఓ నటిని.. ఇలా ఎంతో మందిని కేవలం నిఘా ద్వారానే అప్రమత్తమై నిలువరించగలిగింది చైనా ప్రభుత్వం. జిన్‌పింగ్ ప్రభుత్వంలో అభద్రతా భావం నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ పరిస్థితులతో వ్యతిరేకత మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ముప్పును ముందుగా పసిగట్టి.. అణిచివేసేందుకు నాలుగు రకాలుగా పౌరుల వ్యక్తిగత సమాచార సేకరణ జరుగుతోంది. 1. సీసీటీవీ కెమెరాలు.. దేశంలో నలుమూలలా, దాదాపు ప్రతీ ఇంటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి కరోనా టైంలో ఇది ఎక్కువైంది. 2. ఫోన్ ట్రాకర్స్.. ప్రజల డిజిటల్ జీవితాలను నిరంతరం పర్యవేక్షించేలా ఫోన్ ట్రాకింగ్ డివైజ్‌లను ఉపయోగించడం మొదలుపెట్టింది. తద్వారా వాళ్ల గుర్తింపులతో పాటు కదలికలను సైతం పర్యవేక్షిస్తోంది. 3. డీఎన్ఏ శాంపిల్స్.. నేర చరిత్ర ఉన్నా లేకున్నా.. సాధారణ పౌరుల నుంచి సైతం డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ చేపట్టింది చైనా. 4. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. నేరాలను గుర్తించేందుకు, ప్రమాదాలను పసిగట్టి దగ్గర్లోని భద్రతా సిబ్బంది అప్రమత్తం చేసేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తోంది చైనా. అయితే చైనా ప్రజల వ్యక్తిగత జీవితాలపైనా.. ఈ నిఘా ప్రభావం చూపెడుతోంది. అనుమతులు లేకుండా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడడం.. అనైతికం మాత్రమే కాదు అన్యాయం కూడా. అలాగే.. ఈ సమాచార సేకరణ కోసం సాంకేతికత కోసం ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెడుతోంది. నిఘా ఆరోపణలను ఏనాడూ ఒప్పుకోని చైనా.. ఇప్పుడు కోట్ల మంది డేటా హ్యాకర్ల బారినపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నా మన్నుతిన్న పాములా గమ్మున ఉంటోంది. కీలక సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కడంతో.. దానిని విడిపించుకునేందుకు గప్‌చుప్‌గా బేరసారాలకు దిగిందన్నది పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం. ఇంకోవైపు ఐరాస మానవ హక్కుల సంఘ విభాగం జోక్యం చేసుకోవాలంటూ పలు దేశాలు కోరుతున్నాయి. -
పీఎన్బీ ఖాతాదారులకు షాక్... 18 కోట్ల మంది డేటా లీక్ ?
Punjab National Bank server exposed customer data : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వర్‌లోని (పీఎన్బీ) ఒక లోపం కారణంగా సుమారు 18 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. సుమారు ఏడు నెలల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిందని వివరించింది. అడ్మినిస్ట్రేషన్ అధికారాలతో పీఎన్బీకి చెందిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను బైటి వ్యక్తులు అందుబాటులోకి తెచ్చుకునేందుకు దోహదపడేలా ఈ లోపం ఉందని పేర్కొంది. దీన్ని తాము గుర్తించి సైబర్ సెక్యూరిటీ ప్రాధికార సంస్థలు సీఈఆర్టీ–ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా హెచ్చరించిన తర్వాత, పీఎన్బీ లోపాన్ని సరిదిద్దిందని సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు హిమాంశు పాఠక్ తెలిపారు. మరోవైపు, లోపం ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారించినప్పటికీ దీని వల్ల కీలకమైన డేటా ఏదీ బైటికి పోలేదని బ్యాంక్ తెలిపింది. - న్యూఢిల్లీ -
4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్: సైబర్ఎక్స్9
న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్)లో భాగమైన సీడీఎస్ఎల్ వెంచర్స్ (సీవీఎల్) వ్యవస్థలో లోపాల కారణంగా కోట్ల కొద్దీ దేశీ ఇన్వెస్టర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు లీక్ అయ్యాయి. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు 4.39 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా బైటికి వచ్చినట్లు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ స్టార్టప్ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. ఈ వివరాలను ఇప్పటికే సైబర్ నేరగాళ్లు చోరీ చేసి ఉంటారని, సీడీఎస్ఎల్ వ్యవస్థలో డేటా భద్రతపై ప్రభుత్వం ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా, రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా ఉన్నారు. -
ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ డేటా లీక్..కిమ్ కర్దాషియన్ తో పాటు
లక్షల సంఖ్యలో ఇన్ స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. ఈ రెండు సోషల్ నెట్ వర్క్‌లలో 'ఎలాస్టిక్ సెర్చ్' అనే అన్ సెక్యూర్డ్ సర్వర్ ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్స్ సంస్థ తెలిపింది. ఈ సర్వర్ ద్వారా 2.6 మిలియన్ల యూజర్లకు చెందిన 3.6 జీబీ డేటా లీకైంది. తద్వరా 2 మిలియన్లకు పైగా సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం పడనుందని అంచనా వేసింది. ఇక డేటా లీకైన యూజర్లలో ఆలిసియా కీస్ ఆరియానా గ్రాండే, రియాలిటీ టీవీషోలతో, హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్‌తో పాటు పలువురు ఫుడ్ బ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జులై 5న గుర్తించింది సోషల్ మీడియా అనలిటిక్స్ సైట్ IGBlade.com సోషల్ మీడియా సైట్స్‌లో ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌కు సంబంధించి ఫాలోవర్స్ గ్రోత్, ఎంగేజ్మెంట్, అకౌంట్ పర్మామెన్స్ గురించి తెలుసుకునేందుకు కొన్ని టూల్స్‌ను వినియోగిస్తుంది. ఆ టూల్స్ వినియోగం కోసం ఐజీబ్లేడ్.కామ్ రక్షణలేని సర్వర్లను వినియోగిస్తుందని, అలా చేయడం వల్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న యూజర్ల డేటా లీక్ అవుతుందనే విషయాన్ని ఈ ఏడాది జులై5 న సేప్టీ డిటెక్టివ్ సంస్థ గుర్తించింది. ఆ డేటాలో ఏముంది ఇక ఈ అన్వాంటెడ్ సర్వర్ల కారణంగా లీకైనా సోషల్ మీడియా యూజర్లకు చెందిన బయోడేటా తోపాటు అడ్రస్, కాంటాక్ట్ నెంబర్లు, ప్రొఫైల్ పిక్చర్స్‌కు సంబంధించిన లింకులన్నీ ఈ లీకైన రికార్డుల్లో ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్ నిపుణలు వెల్లడించారు. ఇలా డేటా లీక్ అవ్వడం తొలిసారి కాదని 2020 ఆగస్ట్ నెలలో కంపేరిటచ్ అనే సంస్థ ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ యూజర్లు 235 మిలియన్ల మందికి పైగా డేటా లీకైనట్లు గుర్తించింది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు
ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్‌ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ–మెయిల్ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచి్చనట్లు సైబర్ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు. -
నల్ల ధనవంతుల గుట్టురట్టు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఆదివారం బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్ అని భావిస్తున్నారు. వీరిలో భారతదేశానికి చెందిన బడా బాబులు ఉండడం గమనార్హం. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. వీరిలో అమెరికా, ఇండియా, పాకిస్తాన్, యూకే, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. ► జోర్డాన్ రాజు, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు పండోరా పత్రాల్లో ఉన్నాయి. ► పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. ► ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ► బయోకాన్ సంస్థ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు. భారత్‌లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి ట్రస్టును ఏర్పాటు చేసింది. అతడు పారిపోవడానికి నెల రోజుల ముందు ఈ ట్రస్టును నెలకొల్పారు. ► 2016లో వెలుగులోకి వచి్చన పనామా పేపర్ల లీకు తర్వాత నల్ల ధనవంతులు అప్రమత్తమయ్యారు. విదేశాల్లోని తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా పునర్వ్యస్థీకరించుకున్నారు. అంటే ఆస్తులను చాలావరకు అమ్మేసుకొని, నగదుగా మార్చుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. ► జోర్డాన్ రాజు అబ్దుల్లా2 అమెరికా, యూకేలో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడబెట్టాడు.. ► పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయి. ► ఇమ్రాన్ ఖాన్ మిత్రుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంది. ► రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయి. ► యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 3,12,000 పౌండ్ల మేర స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారు. ఐసీఐజే ట్వీట్ తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేస్తామని ఐసీఐజే ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 600 మందికిపైగా పాత్రికేయులు ఈ ‘పండోరా పత్రాలను’సేకరించారని వెల్లడించింది. ఎంతో శ్రమించి పరిశోధన సాగించారని, ధనవంతుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక రహస్యాలను తెలుసుకున్నారని వివరించింది. -
RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి
ప్రముఖ హ్యాకర్ ఫోరమ్‌లో భారీ మొత్తంలో పాస్వర్డ్ డేటాను లీక్ చేశారు. ఆ ఫోరమ్ 100జీబీ టెక్స్ట్ ఫైల్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఇందులో సుమారు 8.4 బిలియన్ల పాస్వర్డ్లు ఉన్నాయి. ఇందులో గతంలో లీకైన డేటా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లీకైన డేటలో పాస్వర్డ్లు 6-20 అక్షరాల పొడవు ఉన్నాయి. హ్యాకర్స్ పోస్ట్ చేసిన టెక్స్ట్ ఫైల్లో 82 బిలియన్ పాస్వర్డ్లు ఉన్నట్లు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. సైబర్ న్యూస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డేటా దాదాపు 8,45 9,060,239గా ఉంది. 100జీబీ టెక్స్ట్ ఫైల్‌కు అనే ఫోరమ్ యూజర్ 'రాక్యూ 2021(rockyou2021.txt)'గా పేరు పెట్టారు. బహుశా 2009లో రాక్ యూ డేటా పేరుతో లీకైన డేటా కూడా ఉండవచ్చు అని సమాచారం. అందుకే ఈన్ని పాస్‌వర్డ్‌లను కలిగి ఉన్న టెక్స్ట్ ఫైల్‌కు రాక్యూ 2021 అనే పేరు పెట్టవచ్చు. ఆ సమయంలో లీకైన 32 మిలియన్ పాస్‌వర్డ్‌లను సోషల్ మీడియా సర్వర్ ల నుంచి హ్యాక్ చేశారు. అలాగే ఆ ఏడాది సమయంలో 3.2 బిలియన్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయి. ఇక్కడ రాక్యూ 2021 కూడా పెద్దదని గుర్తించాలసిందే. ఎందుకంటే రాక్ యూ పేరిట ఈ హ్యాకర్స్ గ్రూప్ చాలా డేటాను లీక్ చేశారు. వీరు కొన్ని ఏళ్లుగా ఈ డేటాను సేకరించారు. వాస్తవానికి, ఆన్లైన్లో కేవలం 4.7 బిలియన్ల మంది మాత్రమే ఉంటే, రాక్యూ 2021 పేరుతో విడుదల చేసిన మొత్తం డేటా ప్రపంచ ఆన్లైన్ నెటిజన్ డేటా కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది. మరోసారి ఇంత మొత్తంలో చాలా మంది డేటా లీక్ కావడంతో యూజర్ల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. యూజర్లు తమ వ్యక్తిగత డేటా లీక్ అయిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు తమ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయా? లేదా అనేది చెక్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీ పాస్వర్డ్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే పాస్‌వర్డ్‌లను ఛేంజ్ చేయడం ఉత్తమం అని సైబర్ నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్ -
10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్
ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన కో-ఫౌండర్ & సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హడ్సన్ రాక్, అలోన్ గాల్ చేసిన ట్వీట్ల ప్రకారం.. ఈ డేటా సామర్ధ్యం 13 టెరాబైట్లు(టీబీ). డేటాలో 10 లక్షల యూజర్ల క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా 18 కోట్ల మిలియన్ల ఆర్డర్ వివరాలు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పడు ఈ డేటా మొత్తం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపాడు. జూమినెంట్ ఫుడ్‌వర్క్స్ డొమినోస్ ఇండియా మాతృ సంస్థ. అలాగే, 250 మంది డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తాన్ని 550,000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అలోన్ గాల్ పేర్కొన్నారు. ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తల్ని తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ వినియోగదారులదే. Threat actor claiming to have hacked Domino's India (@dominos) and stealing 13TB worth of data. Information includes 180,000,000 order details containing names, phone numbers, emails, addresses, payment details, and a whopping 1,000,000 credit cards. pic.twitter.com/1yefKim24A — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) April 18, 2021 మా నిబందనల ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేము ఎప్పుడు స్టోర్ చేయలేము. అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18 కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో చాలా కంపెనీల డేటా లీక్ అవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. చదవండి: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి! -
భారీ సంఖ్యలో లీకైన లింక్డ్ఇన్ యూజర్ల డేటా!
కొద్ది రోజుల క్రితం 53.3 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీక్ అయింది. సైబర్‌న్యూస్ ప్రకారం.. 50 కోట్లకు పైగా లింక్డ్ఇన్ వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు పేర్కొంది. లీక్ అయిన సమాచారంలో లింక్డ్ఇన్ ఐడి, పూర్తి పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, లింగాలు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, ఇతర కీలక వివరాలు ఉన్నాయి. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు దాన్ని ఓ వెబ్సైట్లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్ అనే వార్తా సంస్థ పేర్కొంది. ఈ సమాచారాన్ని సదరు హ్యాకర్ కొన్ని వేల డాలర్లు విలువ చేసే బిట్కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. లీకైన డేటా లింక్డ్ఇన్ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్ చేసినవి కాదని లింక్డ్ఇన్ తెలిపింది. కొన్ని ఇతర వెబ్సైట్లు, కంపెనీల నుంచి సేకరించిన వివరాల సమాహారమని పేర్కొంది. దాదాపు 50 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో కనిపించడం ఇటీవల కలకలంరేపిన విషయం తెలిసిందే. 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు అమ్మకానికి ఉంచారు ఇటాలియన్ గోప్యతా వాచ్డాగ్ లింక్డ్ఇన్ మిలియన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఏవిదంగా బహిర్గతం అయ్యింది అనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ డేటా ద్వారా స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోవాలని, అలాగే మీ లింక్డ్ఇన్ ఖాతా పాస్వర్డ్, లింక్డ్ఇన్ ఖాతాతో అనుబంధించబడిన ఈమెయిల్ చిరునామా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: గుప్త నిధులు దొరికితే.. అది ఎవరికి చెందుతుంది? -
మరోసారి ఫేస్బుక్ డేటా లీక్, 50 కోట్ల యూజర్లకు షాక్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లూ జరభద్రం! మీ పర్సనల్ సమాచారాన్ని, ఫోన్ నంబర్‌ను ఆన్లైన్లో వేలానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్బుక్ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఫేస్బుక్ డేటాను ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ప్రచారం జరగుతోంది. అయితే ఈ డేటా లీక్ విషయం చాలా పాతదే అయినా.. మరోసారి భారీ ఎత్తున డేటా లీక్ అయిందన్న సమాచారం మాత్రం ప్రస్తుతం ఫేస్బుక్ యూజర్లలో కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్లైన్లో పెట్టినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇన్సైడర్ శనివారం తన కథనంలో పేర్కొంది. కాగా, 106 దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్లైన్లో లీక్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఫేస్బుక్ డేటా లీక్‌తో సుమారు 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. అయితే, ఫేస్బుక్ డేటా లీక్ సమస్య ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఉన్నదే. ఫేస్బుక్ 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్‌ను తీసివేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఫేస్బుక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఫేస్బుక్ లీక్ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్బుక్ క్లారిటీ ఇచ్చింది. చదవండి: వెనుజులా అధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత..! -
మొబీక్విక్ వినియోగదారులకు షాక్: భారీగా డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ యూజర్లకు షాకింగ్ న్యూస్. లక్షలమంది మొబీక్విక్ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకాని పెట్టారన్న వార్తలు మొబీక్విక్ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది. 37 మిలియన్ల ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు,సీసీ డేటా ఉన్నాయనే అంచనాలు యూజర్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా ఇతర తదితరాలు హ్యాకింగ్ గురయ్యాయని, డార్క్ వెబ్ లింక్‌లో ఈ లీక్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్ వార్తలతో మొబీక్విక్ ఇబ్బందుల్లో పడింది. ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ లీక్‌ను మొదటిసారి నివేదించారు. ఫిబ్రవరి 26 న లీక్ వివరాలను ట్వీట్ చేశారు: “11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు, కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు. మొబీక్విక్‌కు సంబంధించి నో-యు-కస్టమర్ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి స్క్రీన్షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను విక్రయానికి పెట్టినట్టు సమాచారం. “బహుశా చరిత్రలో అతిపెద్ద కేవైసీ డేటా లీక్.అభినందనలు మొబీక్విక్...’ అంటూ మరోహ్యాకర్ ఇలియట్ హ్యాండర్సన్ కూడా ట్వీట్ చేశారు. లీక్ అయిన డేటాలో ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ, కేవైసీ వివరాలున్నాయి కాబట్టి స్కామర్లకు ఈజీగా యాక్సెస్ లభిస్తుందని స్వతంత్ర భద్రతా పరిశోధకుడు ఇంద్రజీత్ భూయాన్ వ్యాఖ్యానించారు. Indian payment systems giant "Mobikwik" allegedly suffered what may be considered the largest KYC data leak in history. Over 37m files, KYC of 3.5m individuals, and a whopping 100m phone numbers, emails, passwords, geodata, bank accounts & CC data.@MobiKwik pic.twitter.com/dCFqTHEv1F — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) March 28, 2021 Probably the largest KYC data leak in history. Congrats Mobikwik... pic.twitter.com/qQFgIKloA8 — Elliot Alderson (@fs0c131y) March 29, 2021 యూజర్ల డేటా సేఫ్‌గా ఉంది : మొబీక్విక్ అయితే ఈ వార్తలను మొబీక్విక్ ఖండించింది. తమ సెక్యూరిటీ సిస్టంలోఎలాంటి లోపాలులేవని స్పష్టం చేసింది.దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, తమ వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని మోబిక్విక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భద్రతా పరిశోధకులు అని పిలవబడే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపాడేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 200-250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్ క్లారిటీ
న్యూఢిల్లీ: యూజర్ల వ్యక్తిగత సంభాషణల డేటా గోప్యత పాటించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి కూడా తెలియజేశామని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీని ముందుగా ప్రకటించినట్లు మే 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు వివరించింది. అయితే యూజర్లు ఈ అప్డేట్ గురించి యాప్ ద్వారా పూర్తి వివరాలు తీరిగ్గా చదువుకునేందుకు, తగినంత సమయం ఉంటుందని పేర్కొంది. ‘తప్పుడు ప్రచారం, యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ బట్టి వాట్సాప్ సర్వీసుల నిబంధనలను అంగీకరించేందుకు ఉద్దేశించిన గడువును మే 15 దాకా పొడిగించాం. ఈలోగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. వారి ప్రశ్నలకు సమాధానమిస్తున్నాం‘ అని వాట్సాప్ ఒక బ్లాగ్‌పోస్టులో పేర్కొంది. అప్డేట్ ఓకే చేయకున్నా కాల్స్ వస్తాయి కానీ.. రాబోయే రోజుల్లో అప్డేట్ గురించిన సమాచారాన్ని యాప్‌లో బ్యానర్‌గా డిస్ప్లే చేయనున్నట్లు వివరించింది. యూజర్ల సందేహాలన్నీ నివృత్తి చేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు, జనవరిలో చూసిన దానికి భిన్నంగా కొత్త ఇన్–యాప్ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. ఒకవేళ మే 15 నాటికి కూడా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయినా ఆయా యూజర్లు .. కాల్స్, నోటిఫికేషన్స్ పొందవచ్చని, కానీ మెసేజీలు పంపాలంటే మాత్రం అప్డేట్కి అంగీకరించాల్సి ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. తమ మెసేజింగ్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలతో లావాదేవీలు జరిపే యూజర్లకు సంబంధించిన కొంత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్ కంపెనీలతో పంచుకునే విధంగా వాట్సాప్ అప్డేట్ ప్రకటించడం వివాదాస్పదంగా మారడం తెలిసిందే. -
బిగ్‌బాస్కెట్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, ముంబై: గ్రోసరీ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. డేటా ఉల్లంఘనలను గుర్తించే సైబుల్ నివేదిక ప్రకారం, హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. మొత్తం 2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్‌ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. డార్క్ వెబ్‌ను మానిటర్ చేస్తున్నప్పుడు బిగ్‌బాస్కెట్‌కు చెందిన డేటా అమ్మకాన్ని గమనించామని సైబల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. సుమారు రెండు కోట్ల మంది యూజర్ల డేటా ఇందులో ఉందని తెలిపింది. బిగ్‌బాస్కెట్ వినియోగదారులు - జాగ్రత్తలు ఓటీపీలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ చెప్పవద్దు. ఆప్ నుండి ఆర్డర్ చేయడానికుపయోగించే అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చండి. యూపీఐ యాప్ పిన్‌లను మార్చండి. అలాగే ఈమెయిల్, ఇతర సేవలకు ఒకే పాస్వర్డ్ లేదా పిన్‌లను ఉపయోగిస్తుంటే తక్షణమే వాటన్నింటి పాస్‌వర్డ్‌లను మార్చండి. వేరు వేరు పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ఉత్తమం. బిగ్‌బాస్కెట్ యాప్‌ను అధికారిక ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి లేదా అప్ డేట్ చేయండి. అప్డేట్కు సంబంధించి ఎలాంటి తప్పుడు సందేశాలను నమ్మకండి. కస్టమర్ కేర్ మోసాలు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లపై పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీకుసంబంధంలేని, మీరు ఆర్డర్ ఇవ్వని ప్యాకేజీలను డెలివరీలు స్వీకరించవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వని క్యాష్ ఆన్ డెలివరీ ప్యాకేజీలను విశ్వసించకండి. వాటికి ఎలాంటి నగదు చెల్లించకండి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా నటిస్తూ మానిప్యులేట్ చేస్తున్న స్కాం పట్ల జాగ్రత్త వహించండి. -
దేశ రక్షణ సమాచారం చైనాకు?
న్యూఢిల్లీ: దేశ సరిహద్దు వ్యూహం, సైన్యం మోహరింపులు, ఆయుధ సేకరణ వంటి కీలక సమాచారాన్ని చైనా గూఢచార విభాగాలకు అందజేశారన్న ఆరోపణలపై రాజీవ్‌శర్మ అనే జర్నలిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జర్నలిస్టుకు భారీగా లంచం ముట్టజెప్పారన్న ఆరోపణలపై చైనా మహిళ, నేపాల్‌కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. ‘చైనా నిఘా సంస్థలకు దేశ సమాచారాన్ని చేరవేసినందుకు ఢిల్లీలోని పిటంపురకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్‌ను 14న స్పెషల్ సెల్ అరెస్ట్‌చేసింది. బోగస్ సంస్థల ద్వారా అందిన సొమ్మును రాజీవ్‌కు అందజేసినందుకు చైనా జాతీయురాలితోపాటు నేపాల్ వాసిని అరెస్ట్ చేశాం’ అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్(స్పెషల్ సెల్) సంజీవ్æ తెలిపారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సున్నిత సమాచారమున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.‘రాజీవ్ 2016 నుంచి మైకేల్ అనే చైనా నిఘా విభాగం అధికారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 2018 వరకు కీలక సమాచారాన్ని అతడికి చేరవేశాడు. 2019 నుంచి చైనాకే చెందిన జార్జి అనే మరో నిఘా అధికారికి శర్మ కీలక రక్షణ సమాచారాన్ని అందజేస్తూ వచ్చాడు. ఇందుకుగాను గత ఏడాదిన్నరలోనే రూ.45 లక్షల వరకు అందుకున్నాడు. సమాచారం అందజేసిన ప్రతిసారీ వెయ్యి డాలర్లు(సుమారు రూ.73 వేలు) ఇతడికి ముడుతుంటాయి’ అని ఆయన తెలిపారు. గతంలో వివిధ పత్రికల్లో పనిచేసి, భారత పత్రికలతోపాటు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాస్తున్నాడన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) గుర్తింపు కూడా ఉన్న ఇతడికి అనేక మంత్రిత్వ శాఖల్లోకి సులువుగా వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ–మెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా ఇతడు ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేశాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా సోషల్ మీడియా యూజర్ల డేటా లీక్
హాంకాంగ్ : 235 మిలియన్ల ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో లీక్ అయింది. హాంకాంగ్‌కు చెందిన ‘సోషల్ డేటా’ అనే సంస్థ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు చెందిన వారి వ్యక్తిగత వివరాలను అమ్ముకుని సొమ్ముచేసుకుంటోందని కంపారిటెక్ పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం వారు ఓ నివేదికను విడుదల చేశారు. లీకైన సమాచారంలో యూజర్లకు సంబంధించిన పేర్లు, కాంటాక్ట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఉన్నాయని తెలిపింది. ( చైనా సంచలన నిర్ణయం..) ‘సోషల్ డేటా’ సమాచారాన్ని దొంగిలించడానికి వెబ్ స్క్రాపింగ్ పద్ధతిని ఉపయోగిస్తోందని పేర్కొంది. ఈ వెబ్ స్క్రాపింగ్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్ ద్వారా వెబ్సైట్లు, వెబ్ పేజీలలోని సమాచారాన్ని తస్కరిస్తుందని తెలిపింది. లీకైన సమాచారంలో 192,392,954 మంది ఇన్స్టాగ్రామ్, 42,129,799 మంది టిక్‌టాక్, 3,955,892 మంది యూట్యూబ్ యూజర్ల వివరాలు ఉన్నాయని వెల్లడించింది. -
82 వేలు కాదు..6.4 లక్షలు!
న్యూఢిల్లీ: చైనా చెబుతున్నట్లు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 82 వేలు కాదని, అది అంతకు 8 రెట్లు ఎక్కువని వెల్లడైంది. ఫిబ్రవరి మొదటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సుమారు 6.40 లక్షల మంది చైనాలో కరోనా బారిన పడ్డారని తేలింది. చైనా మిలటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, వాషింగ్టన్కు చెందిన ‘100 రిపోర్టర్స్’ఒక కథనాన్ని ప్రచురించాయి. ఆసుపత్రులు, అపార్ట్మెంట్స్ సహా చైనా వ్యాప్తంగా, సుమారు 230 నగరాల వారీగా అన్ని ప్రాంతాల్లో కేసుల విస్తృతికి సంబంధించిన పూర్తి వివరాలను టేబుల్ రూపంలో తమకు అందాయని అవి పేర్కొన్నాయి. భౌగోళికంగా, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎన్ని కేసులున్నాయనే విషయాన్ని ఆ కథనంలో సమగ్రంగా వివరించారు. కరోనా వైరస్‌ను మొదట గుర్తించిన హుబయి రాష్ట్రం, వుహాన్ ప్రాంతాల్లో కోలుకున్నవారి వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. పూర్తి వివరాలను భద్రత కారణాల రీత్యా ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచడం లేదని, అయితే, వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు అందజేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, ‘100 రిపోర్టర్స్’ ప్రకటించాయి. దీనిపై చైనా స్పందించలేదు. కానీ, ‘కరోనా విషయంలో విదేశీ మీడియా చైనాపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వివరాలు పూర్తిస్థాయిలో నిజమా? కాదా? అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని పలువురు స్వతంత్ర పరిశోధకులు పేర్కొన్నారు. ‘ఫారిన్ పాలసీ ఈ విషయాన్ని బయటపెట్టడం మంచిదే. అయితే, దీనిపై మరింత శోధన జరగాలి’ అని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ వ్యాఖ్యానించారు. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలోని కరోనా కేసుల సంఖ్య 82,919. మరణాల సంఖ్య 4,633గా ఉంది. -
అతి చౌకగా ఫేస్బుక్ యూజర్ల డేటా
సాక్షి, న్యూఢిల్లీ : అతిపెద్ద డేటా లీక్ కుంభకోణంపై గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి లీకుల ఇబ్బందుల్లో పడింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారుల సమాచారం అతి చౌగాగా అమ్ముడు పోయిందన్న వార్త అటు యూజర్లలో ఆందోళన రేపుతోంది. 267 మిలియన్ల మంది అంటే దాదాపు 26 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ యూజర్ల పర్సనల్ డేటా ‘డార్క్ వెబ్’ చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సైబుల్’ వెల్లడించింది. వినియోగదారుల ఐడీలు, పూర్తి పేర్లు, ఈ మెయిల్స్, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్ షిప్ స్టేటస్‌లతో లాంటి వివరాలన్నీ ‘డార్క్ వెబ్’ కు విక్రయించినట్టు పేర్కొంది. ప్రస్తుతానికి, ఈ డేటా ఉల్లంఘనకు కారణం తెలియనప్పటికీ ఫేస్బుక్ లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాల ఆధారంగా ఈ డేటాను దొంగలించి ఉండే అవకాశం ఉందని సైబుల్ అభిప్రాయపడింది. ఫేస్బుక్ యూజర్ల డేటా ‘డార్క్ వెబ్’ లో అమ్మకానికి పెట్టినట్టుగా ఇది ధృవీకరించింది. 300 మిలియన్లకు పైగా డేటా లీక్ కావడంపై సైబుల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ప్రొఫైల్‌తో సహా డార్క్ వెబ్‌లో అందుబాటులో 267 మిలియన్ యూజర్ల డేటా కేవలం 543 డాలర్లు (రూ. 4138 )కే లభ్యం కావడం సెక్యూరిటీ భద్రతను ప్రశ్నల్ని లేవనెత్తుతోందని పేర్కొంది. అయితే పాస్ వర్డ్ మాత్రం భద్రంగా ఉన్నాయనీ, యూజర్ల డేటాను రక్షణకు కఠిన పద్దతులను పాటించాలని సూచించింది. లేదంటే ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని హెచ్చరించింది. -
హ్యాకర్ల గుప్పిట్లో ఎఫ్బీ యూజర్ల డేటా
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌పై డేటా ఉల్లంఘనలు, వ్యక్తిగత సమాచారం లీక్ కావడం వంటి ఆరోపణలు నమోదవుతున్న క్రమంలో తాజాగా కోట్ల మంది వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉందని కంపెయిర్టెక్, సెక్యూరిటీ పరిశోధకులు బాబ్ దియచెంకో నివేదిక వెల్లడించింది. 26.7 కోట్ల మంది ఎఫ్బీ యూజర్ల యూజర్ ఐడీలు, పేర్లు, ఫోన్ నంబర్ల వంటి వ్యక్తిగత డేటా ఓ డేటాబేస్ ఆన్లైన్లో నిక్షిప్తమైందని, ఈ డేటాబేస్‌ను ఎవరైనా ఆన్లైన్లో పాస్వర్డ్ లేకుండా యాక్సెస్ కావచ్చని నివేదిక బాంబు పేల్చింది. ఎస్ఎంఎస్ స్పామ్స్, ఫిషింగ్ దాడుల కోసం ఈ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. డేటా లీక్ గురించి తెలియగానే డేటాబేస్ ఐపీ అడ్రస్‌ల ద్వారా దాన్ని సర్వర్ల నుంచి తొలగించేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను దియచెంకో సంప్రదించారు. అయితే డేటాబేస్ యాక్సెస్‌ను సర్వీస్ ప్రొవైడర్ నిరోధించిన రెండు వారాలకు ముందే ఈ డేటాబేస్ ఆన్లైన్లో హల్చల్ చేసింది. దీన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేందుకు ఏకంగా ఈ డేటాబేస్‌ను హ్యాకర్ ఫోరంలో పోస్ట్ చేశారు. కోట్లాది ఎఫ్బీ యూజర్ల డేటాబేస్ ఎలా సాధ్యమైందనేది వివరిస్తూ ఫేస్బుక్ ఏపీఐలో భద్రతా లోపాల కారణంగానే హ్యాకర్లు ఈ పనికి పాల్పడి ఉంటారని దియచెంకో అంచనా వేశారు. కాగా తాజా లీక్‌పై ఫేస్బుక్ స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని యూజర్ల సమాచారాన్ని కాపాడేందుకు తాము మార్పులు చేపట్టక ముందు ఇది జరిగి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. -
వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు
న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న భారత్ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ తెలిపింది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఎన్‌ఎన్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌తో భారత్‌లోని జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంతోపాటు, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను ఆదేశించింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ...‘పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం. సైబర్ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. అయితే, ఇటీవల పలుమార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు. -
అమ్మకానికి 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా..
న్యూఢిల్లీ : భారత బ్యాంక్ కస్టమర్లకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక డేటా డార్క్ వెబ్‌లో బహిరంగ అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీటి అమ్మకంతో సైబర్ క్రిమినల్స్ 130 మిలియన్ డాలర్లు సొమ్ము చేసుకునేందుకు లక్షలాది బ్యాంకు కస్టమర్ల కీలక డేటాను అమ్మకానికి పెట్టారు. జడ్డీనెట్ అందించిన వివరాల ప్రకారం దేశీ కస్టమర్లకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు జోకర్స్ స్టాష్‌లో అందుబాటులో ఉన్నాయి. డార్క్ వెబ్‌లోని పురాతన కార్డ్ షాపులలో ఒకటైన జోకర్స్స్టాష్ ప్రధాన హ్యాకర్లు కార్డ్ డంప్‌లను విక్రయించే ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. అనైతిక కార్యకలాపాలు సాగించేందుకు ఐపీ అడ్రస్ పసిగట్టకుండా వెబ్ మాఫియా డార్క్ వెబ్‌ను అడ్డాగా చేసుకుని చెలరేగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డార్క్ వెబ్‌లో జోకర్స్ స్టాష్ ఇండియా మిక్స్ న్యూ-01 అనే శీర్షికతో ప్రకటన ఇస్తోందని సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీఏకు చెందిన పరిశోధకులు గుర్తించారు. భారత్‌కు చెందిన పలు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను ఒక్కోటి రూ 100 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద కార్డ్ డంప్‌గా సెక్యూరిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) సిస్టమ్స్ వద్ద ఏర్పాటు చేసిన స్కిమ్మింగ్ పరికరాలతో కార్డు వివరాలను హ్యాకర్లు రాబడుతున్నట్టు డేటా అనాలిసిస్ ద్వారా గుర్తించామని ఆ నివేదికలో పరిశోధకులు తెలిపారు. జోకర్స్ స్టాష్ నుంచి కార్డు వివరాలను కొనుగోలు చేసిన నేరగాళ్లు వాటి ఆ వివరాలతో క్లోనింగ్ ద్వారా సరైన కార్డులు రూపొందించి ఏటీఎంల నుంచి దర్జాగా నగదు విత్‌డ్రా చేస్తారు. ఫిబ్రవరిలో జోకర్స్ స్టాష్‌లో 25 లక్షల మంది అమెరికన్ల కార్డు వివరాలు అమ్మకానికి పెట్టారు. గత ఐదేళ్లుగా టార్గెట్, వాల్‌మార్ట్, లార్డ్ అండ్ టేలర్, బ్రిటిష్ ఎయిర్వేస్ వంటి కంపెనీల నుంచి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ దొంగిలించిన క్రెడిట్ కార్డుల డేటాను విక్రయిస్తూ ప్రముఖ అండర్‌గ్రౌండ్ క్రెడిట్ కార్డు షాప్‌గా పేరొందింది. దీనివద్ద 53 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు ఉన్నట్టు సైబర్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
41 కోట్ల యూజర్ల వివరాలు లీక్
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్బుక్ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు బయటకు పొక్కాయని టెక్ క్రంచ్ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ఘటనలో యూజర్ల ఫోన్ నంబర్లు, లింగం, నివాస ప్రాంతం తదితర వివరాలు బయటకు వచ్చేశాయని పేర్కొంది. సంబంధిత ఫేస్బుక్ సర్వర్‌కు పాస్వర్డ్ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందని చెప్పింది. ఈ విషయాన్ని తాము ఫేస్బుక్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. మరోవైపు ఈ విషయమై ఫేస్బుక్ స్పందిస్తూ.. దాదాపు 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయనీ, ఈ సమాచారమంతా చాలా పాతదని వివరణ ఇచ్చింది. -
ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!
వాషింగ్టన్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించనున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌ల గోప్యత, సమాచార రక్షణలో లోపాలు వంటి కారణాలకు గానూ ఫేస్‌బుక్‌పై జరిమానా విధించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) సిద్ధమవుతోంది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌పై రూ.34,280 కోట్ల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన వివరాలను వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది. వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీజరిమానా విధించడం ఇదే తొలిసారి. దీనికి అమెరికా న్యాయశాఖ ఇంకా ఆమోదించలేదు. సెటిల్మెంట్లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌బుక్‌కు కొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌తో ప్రైవసీ సెటిల్మెంట్ చేసుకుంది. దీని ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయని పక్షంలో జరిమానా విధించే హక్కు ఉంటుంది. -
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
లీకైన పత్రాలు చెల్లుతాయి
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు మార్గం సుగమమైంది. పిటిషన్‌దార్లు సమర్పించిన లీకేజీ పత్రాల ఆధారంగా విచారణ జరుపుతామని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆ పత్రాలపై విశిష్ట అధికారం ప్రభుత్వానిదే అని, అక్రమంగా సేకరించిన సమాచారంతో వేసిన పిటిషన్ల విచారణార్హతపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం అంతా సవ్యంగానే ఉందని గత డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌దార్లు దాఖలుచేసిన పత్రాల యోగ్యత ఆధారంగా రివ్యూ పిటిషన్లను విచారిస్తామని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ల విచారణకు ప్రత్యేక తేదీని ప్రకటిస్తామంది. ఈసారి విచారణలో రఫేల్ విమానాల ధరల నిర్ధారణతో పాటు భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపికపై దృష్టిసారిస్తామంది. తన తరఫున, జస్టిస్ కౌల్ తరపున జస్టిస్ గొగోయ్ తీర్పును రాయగా, వేరుగా తీర్పు వెలువరించిన జస్టిస్ జోసెఫ్ మిగిలిన ఇద్దరు సభ్యులతో ఏకీభవించారు. ‘హిందూ’ ప్రచురణ స్వేచ్ఛా హక్కే రఫేల్ ఒప్పందం వివరాలు ‘ది హిందూ’ పత్రికలో ప్రచురితం కావడం భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని కోర్టు తెలిపింది. గతంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు తమకు గుర్తొచ్చాయని పేర్కొంది. పెంటగాన్ పత్రాల ప్రచురణకు సంబంధించి ‘న్యూయార్క్ టైమ్స్ వర్సెస్ యునెటెడ్ స్టేట్స్’ కేసులో పత్రికలపై ప్రభుత్వ నియంత్రణను అమెరికా కోర్టు గుర్తించలేదని తెలిపింది. ఇదే కేసు రఫేల్కూ వర్తిస్తుందని జస్టిస్ గొగోయ్, జస్టిస్ కౌల్ తమ తీర్పులో పేర్కొన్నారు. రహస్య పత్రాల ప్రచురణను నిలిపేసేలా ప్రభుత్వ విభాగాలకు విశేషాధికారులు కట్టబెడుతూ అధికారిక రహస్యాల చట్టంలో నిబంధనలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ కేంద్రం ఆర్టీఐ కింద ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెట్టకూడదని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ‘ అడిగినంత మాత్రాన సమాచారం వెల్లడించకూడదనడంలో సందేహం లేదు. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించడం కన్నా దాచితే ఎక్కువ నష్టం అని దరఖాస్తుదారుడు నిరూపించాలి. దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడిగే హక్కును ఆర్టీఐ పౌరుడికి కట్టబెట్టింది. ఆæ సమాచారం ప్రజా ప్రయోజనం కోసమే ఉద్దేశించినదవ్వాలి’ అని ఆయన అన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా?: రాహుల్ రఫేల్ ఒప్పందం, నోట్లరద్దు అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘రఫేల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు తనకు క్లీన్చిట్ ఇచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. కానీ, చౌకీదార్‌జీ అవినీతికి పాల్పడినట్లుగా సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. వైమానిక దళం డబ్బును చౌకీదార్‌జీ(మోదీ) పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి అప్పగించారనే విషయాన్ని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నా. దీనిపై కోర్టు దర్యాప్తు చేయబోతోంది. మోదీ, అంబానీ పేర్లు బయటకు రానున్నాయి’ అని అన్నారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో మిమ్మల్ని సవాల్ చేస్తున్నా.. బహిరంగ చర్చకు రండి. అవినీతి, నోట్లరద్దు, రఫేల్ ఒప్పందం, బీజేపీ చీఫ్ అమిత్ షా తనయుడు జై షా అవినీతి తదితర అంశాలపై దేశ ప్రజలు మీ నుంచి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని అన్నారు. ఎవరేమన్నారంటే.. ► నిజాలపై మూత ఎగిరిపోయింది: కాంగ్రెస్ మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరకు నిజం బయటకు వస్తుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ నిజాలు దాచేందుకు మోదీ పెట్టిన మూత కొట్టుకుపోయిందని ఎద్దేవా చేసింది. ‘రఫేల్ అవినీతిన బయటపెట్టిన పాత్రికేయులపై అధికారిక రహస్యాల చట్టాన్ని ప్రయోగించాలని మోదీ ప్రభుత్వం భావించింది’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ► దేశభద్రతపై కేంద్రం రాజీ పడిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ ఆరోపించారు. ► సుప్రీం తీర్పును పిటిషనర్లలో ఒకరైన అరుణ్ శౌరీ స్వాగతించారు. ► అసమగ్ర సమాచారం: రక్షణ శాఖ జాతీయ భద్రతపై జరిగిన చర్చలకు సంబంధించి అసంపూర్ణ సమాచారం ఇవ్వడమే పిటిషన్‌దారుల ఉద్దేశమని రక్షణ శాఖ పేర్కొంది. ‘గోప్యంగా ఉంచాల్సిన సున్నిత సమాచారం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఆందోళనకరం’ అని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది. ► రాహుల్‌ది కోర్టు ధిక్కారం: బీజేపీ కోర్టు తన తీర్పులో చెప్పని మాటలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించి తీవ్ర కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రాహుల్ సుప్రీం తీర్పులోని సగం పేరాను కూడా చదవలేదని, కోర్టు చెప్పని మాటలు చెప్పినట్లు వ్యాఖ్యానించి తన నైరాశ్యాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడేం జరిగింది ⇒ 2007, ఆగస్టు 28: 126 మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల (ఎంఎంసీఏ) కొనుగోలుకు ప్రకటన జారీ ⇒ 2011 మే: రఫేల్, యూరో ఫైటర్ జెట్ విమానాలతో తుది జాబితా తయారీ ⇒ 2012, జూన్ 30: తక్కువ మొత్తానికి బిడ్ దాఖలుచేసిన ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ⇒ 2014, మార్చి 13: 108 విమానాల కోసం 70, 30 శాతం చొప్పున పని చేయడానికి హాల్, డసాల్ట్ మధ్య కుదిరిన ఒప్పందం ⇒ 2015, ఏప్రిల్: ఫ్రాన్స్ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాల కొనుగోలుకు కొత్త ఒప్పందం ఖరారు ⇒ సెప్టెంబర్ 23: ఇరు దేశాల మధ్య అంతర ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు ⇒ నవంబర్ 18: ఒక్కో విమానం ఖర్చు రూ.670 కోట్లు అని ప్రకటించిన ప్రభుత్వం ⇒ 2016, డిసెంబర్ 31: 36 విమానాల ఖర్చు రూ.60 వేల కోట్లని డసాల్ట్ నివేదికలో వెల్లడి. ఈ మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మొత్తంపై రెట్టింపు కన్నా అధికం ⇒ 2018 మార్చి 13: రఫేల్ కొనుగోలుపై సుప్రీంలో పిటిషన్ ⇒ అక్టోబర్ 10: రఫేల్ కొనుగోలుకు నిర్ణయాలు తీసుకున్న విధానంపై వివరాలు సీల్డ్ కవర్లో సమర్పించాలన్న సుప్రీంకోర్టు ⇒ డిసెంబర్ 14: ప్రభుత్వ నిర్ణయాల్లో సంశయించాల్సిందేం లేదని తీర్పు ⇒ 2019, జనవరి 2: ఈ తీర్పును సమీక్షించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలు ⇒ మార్చి 6: రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు తెలిపిన కేంద్రం ⇒ మార్చి 13: లీకేజీ పత్రాలతో విచారణ వద్దని కోర్టుకు విన్నవించిన కేంద్రం ⇒ ఏప్రిల్ 10: లీకేజీ పత్రాలను విచారణలో పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం నేపథ్యమిదీ.. రివ్యూ పిటిషన్ల దాఖలుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు మార్చి 14న తన తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన కీలక సమాచారం మీడియాలో ప్రచురితం కావడం అప్పట్లో కలకలం రేపింది. ప్రధాని కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరపడంపై రక్షణ శాఖ అయిష్టత వ్యక్తం చేసినట్లు ‘ది హిందూ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, సమాచారంపై కేంద్రానికే పూర్తి హక్కులుంటాయని, సంబంధిత విభాగం అనుమతి లేనిదే వాటిని కోర్టుకు సమర్పించరాదని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. -
చార్జిషీటు లీకేజీపై విచారణ
న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల అగస్టావెస్ట్‌ల్యాండ్ కుంభకోణం చార్జిషీటు వివరాలు బయటకు వెల్లడి కావడంపై దర్యాప్తు చేయించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా, చార్జిషీటులోని వివరాలను ఎలా సంపాదించారో తెలపాలంటూ సదరు వార్తా సంస్థను ఆదేశించాలని ఈడీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న ఈడీపై విచారణ జరపాలంటూ క్రిస్టియన్ మిషెల్ పిటిషన్లు వేశారు. ‘కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతులను ఈ కేసులోని నిందితులకు మేం ఇంకా ఇవ్వనేలేదు. అయినా అందులో ఏముందో మిషెల్ లాయర్లకు తెలిసింది. ఆ ప్రకారమే వారు పిటిషన్ వేశారు. దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. చార్జిషీటు వివరాలు వెల్లడిపై దర్యాప్తు జరగాలి’ అని ఈడీ వాదించింది. తమ క్లయింట్‌కు చార్జిషీటు కాపీని ఇవ్వకమునుపే ఈడీ మీడియాకు లీక్ చేసిందని మిషెల్ లాయర్ ఆరోపించారు. కోర్టు ప్రత్యేక జడ్జి ఈ వ్యవహారంపై 11న విచారిస్తామన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతిని సీల్డు కవర్లో భద్రపరచాలని ఈడీని ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం అప్పటి కేంద్రప్రభుత్వం, అగస్టావెస్ట్‌ల్యాండ్‌ల మధ్య 2010నాటి ఒప్పందం వల్ల ఖజానాకు రూ.2,666 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ గతంలో తెలిపింది. -
ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం దిగజారుస్తోంది
-
చోరీ డేటా అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
-
పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్
-
రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు...
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ దాకవరం తమ దగ్గరే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరించారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అశోక్ ఎక్కుడున్నాడన్న మీడియా ప్రశ్నకు స్పష్టత ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో అశోక్ బయటకు వస్తాడని చంద్రబాబు తెలిపారు. నేరం చేయని వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంత అవమానమని, వారిని ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తుందని అన్నారు. దీంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో ఏపీ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడన్న విషయాన్ని చంద్రబాబు నిర్థారించినట్లు అయింది. మరోవైపు మీడియా సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. డేటా చోరీ కేసులో నిందితుడుగా ఉన్న అశోక్‌పై ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా అశోక్ తమ దగ్గరే ఉన్నట్లు టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఇంఛార్జ్ మల్యాద్రి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అశోక్‌కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 161 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అయితే అశోక్ తమ దగ్గరే ఉన్నారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మల్యాద్రి వెల్లడించారు. అశోక్‌తో తాము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నామని... అంతేకాకుండా తెలంగాణ పోలీసులకు అశోక్‌ను అప్పగించబోమని అన్నారు. మరోవైపు తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని అశోక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
మా దగ్గర సమాచారం ఉంటే మీకేంటి?
సాక్షి, అమరావతి: ఓటర్ల సమాచారం తమ పార్టీ కార్యకర్తల వద్ద ఉంటే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల దగ్గర ఓటర్ల జాబితాలుంటాయని, వారిలో ఎవరున్నారు, ఎవరికి ఓటేస్తారనే వివరాలు సేకరిస్తారని.. అది తప్పెలా అవుతుందని అన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో గురువారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం డేటా చోరీ అంశంపై మాట్లాడారు. 20 సంవత్సరాల నుంచి తమ కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్ చేసుకున్నామని, ఆ సమాచారాన్ని దొంగిలించి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. ఎవరో వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తే వారికి అభ్యంతరమేంటని తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాచారం ఏ ఫార్మాట్లో ఉంటే వారికి నష్టమేంటన్నారు. అయినా ఒక ప్రైవేటు కంపెనీపై ఏ చట్టం ప్రకారం దాడులు చేస్తారని ప్రశ్నించారు. తమ డేటా తీసుకుపోవడానికి వాళ్లెవరని, తమ సమాచారం కొట్టేసి తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. దీనిపై ఎన్నికల సంఘం వద్ద పోరాటం చేస్తామని, కోర్టుకు వెళతామని చెప్పారు. సమాచారం పోయిందనడానికి వారెవరు? తమ సమాచారం పోలేదని చెబుతుంటే.. పోయిందని చెప్పడానికి వారెవరని తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. తమకు సర్వీసు అందిస్తున్న ఒక ప్రైవేటు కంపెనీకి వెళ్లి అక్కడి ఉద్యోగుల్ని భయపెట్టడం ఏమిటన్నారు. దీనివల్ల నాలుగైదు రోజులనుంచి తమ పార్టీ కార్యకలాపాలు ఆగిపోయాయన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమవారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారని, పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వం కలసి తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని, టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సాంకేతిక సమస్యల్ని చూపించి భయపెడుతున్నారని, తన వద్దకు ఒక నాయకుడొచ్చి సీబీఐని చూస్తుంటే భయమేస్తోందని, పోటీ చేయలేనని చెప్పాడన్నారు. ఫారం–7 ఇస్తే నేరం.. ఫారం–7లు పెట్టి ఓట్లు తీసేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఫారం–7లు పెట్టడం నేరమని, వైఎస్సార్సీపీ ఈ ఫారంలు పెట్టి ఎనిమిది లక్షల ఓట్లు తీసేసిందని ఆరోపణ చేశారు. ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదులు పెట్టి ఓట్లు తొలగించడం నేరమన్నారు. ఎవరైనా ఫారం–7 ఇస్తే నేరమని చెప్పారు. జగన్‌కి తెలంగాణ ప్రభుత్వం రక్షణగా ఉందని, తాను ఓడిపోతే జగన్‌ను సామంతరాజుగా చేసి కప్పం కట్టించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బిహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తమ రాష్ట్రంతో వారికేం సంబంధమని టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పంద పత్రాల్ని దొంగిలించారని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడమేంటన్నారు. గతంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్నారు. హిందూ పత్రిక రామ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కాగా, పసుపు కుంకుమ పథకం రెండవ విడత కింద రూ.3,500ను శుక్రవారం మహిళల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. ఉండవల్లిలో గురువారం రాత్రి జరిగిన విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో ఈ విషయం చెప్పారు. ఈ 50 రోజులు భోజనానికి, నిద్రకు మాత్రమే ఇంటికెళ్లాలని, మిగతా సమయమంతా పార్టీకోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సాక్షిపై మరోసారి అక్కసు.. సాక్షి పత్రికపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఓటర్ల తొలగింపుపై సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చిందులు తొక్కారు. తాను ‘సాక్షి’కి సమాధానం చెప్పనని, అది పార్టీ పత్రిక అని, జగన్మోహన్రెడ్డి పంపితే మీరు వచ్చారని సాక్షి ప్రతినిధిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇప్పటివరకూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ప్రశ్న అడగడమే తప్పంటే ఎలాగని సాక్షి ప్రతినిధి అనగా.. ప్రజాస్వామ్యం వేరు, ఇది వేరని, మిగిలిన వాళ్లకు చెబుతానని, ‘సాక్షి’కి చెప్పనని సీఎం అన్నారు. పార్టీ పరంగా సాక్షిని బహిష్కరిస్తామని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అరాచకాలు చేస్తున్నారని ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అదేం న్యాయమని అడగ్గా.. గౌరవంగా చెబుతున్నానని, మాట్లాడకూడదని బెదిరింపులకు దిగడం గమనార్హం. -
దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు
-
'టీడీపీ ఫేక్ హ్యాష్ ట్యాగ్‌లపై పక్కా ఆధారాలు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందని టీఆర్ఎస్ యూత్ వింగ్ సభ్యులు మండిపడ్డారు. ఫేక్ ట్వీట్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన టీడీపీనేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ఐటీ వింగ్ నుండే సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని టీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు జగన్ పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ల నుండి తెలుగు భాషలో పెద్ద మొత్తంలో తప్పుడు ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లను పోస్ట్ చేపించడంలోనే టీడీపీ వక్రబుద్ది బయటపడిందని అన్నారు. -
అశోక్ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...
సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల డేటాను కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ తీసుకుందని, ఈ కేసులో ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన నిందితుడు అశోక్ అమరావతిలో ఉన్నా...అమెరికాలో ఉన్నా వదిలేది లేదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చూస్తున్నామన్నారు. చదవండి...(‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైన ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేకు అనుమానాలు వచ్చాయన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. సిట్‌లో 9మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని, అయితే ఈ కేసు దర్యాప్తుపై మీడియా కూడా సంయమనం పాటించాలని స్టీఫెన్ రవీంద్ర కోరారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా వచ్చింది?. విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రయివేట్ సంస్థకు ఎవరిచ్చారు?. తెలంగాణ ప్రజల డేటాతో ఎవరికి ప్రయోజనం కలిగించాలనుకుంటున్నారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టామన్నారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని అన్నారు. ఇక డేటా గ్రిడ్స్ సీఈవో అశోక్ ఎక్కడున్నాడనేది ఇంకా తెలియలేదని, అతడి కోసం గాలిస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థపై గతంలో సోదాలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రజల డేటాను గుర్తించామని, ఆ డేటాతో పాటు వారికి చెందిన ఆధార్ వివరాలు ఉన్నాయన్నారు. అలాగే ఈ కేసులో అమెజాన్, గూగుల్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని, ఇంకా వాటి దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. డేటా చోరీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవామిత్రలో ఉన్న కొన్ని యాప్స్ తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసు వివరాలను ప్రతిరోజు తెలియచేస్తామని సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. -
‘సాక్షి’ ప్రతినిధిపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు
-
‘సాక్షి’ ప్రతినిధిపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ‘సాక్షి’ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై సీఎం మండిపడ్డారు. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ...ఒకసారి చెబితే వినాలంటూ సీఎం భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని చంద్రబాబు పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. అందుకు ప్రతిగా సాక్షి ప్రతినిధి... మీరు పిలిస్తేనే మీడియా సమావేశానికి వచ్చామని తెలిపారు. అసలు మిమ్మల్ని ప్రభుత్వ సమావేశాలకు కూడా రానివ్వనంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబుతో పాటు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు కూడా రెచ్చిపోయారు. చేయి చూపిస్తూ కుర్చోవాలని బెదిరించారు. గతంలో కూడా చాలాసార్లు సాక్షి మీడియాపై చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా అవాకులు, చవాకులు పేలిన విషయం విదితమే. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? కాగా ఇదే సమావేశంలో డేటా చోరీ అంశంపై చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగారు. కేంద్రంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ‘ మా సమాచారం కొట్టేసి మా మీదే కేసులు పెడతారా?. మా రాష్ట్రంలో డేటా సేకరిస్తే మీకేమి సంబంధం. ప్రజల సమాచారం దుర్వినియోగం జరిగిందంటూ నాపై బురదజల్లి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఏదైనా అయితే మాకు ఉండాలి కానీ. నా మీద అంత ప్రేమ ఎందుకో. ఈ వ్యవహారంతో అసలు కేసీఆర్‌కు ఏం సంబంధం. మీకు అధికారం ఉందని అహంకారమా?. మా సమాచారాన్నే మీరు దొంగలించి..మమ్మల్నే బెదిరిస్తున్నారు. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? డోంట్ మైన్.. కేంద్రం దాడులకు భయపడేది లేదు. అదేమని ప్రశ్నిస్తే ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తూ టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబులో వణుకు
-
ఓట్ల తొలగింపులో చేసిందంతా టీడీపీయే
-
డేటా చోరీ కేసు దర్యాప్తు సిట్‌కు అప్పగింత
-
ప్రభుత్వమే ఓట్లను తొలగించింది
-
డేటా చోరీ కేసు: కోడ్ లాంగ్వేజ్ వాడిన కీలక వ్యక్తి!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్, టీడీపీ సర్కార్ మహా పన్నాగం బట్టబయలు అయింది. తెలుగుదేశం పార్టీ సైబర్ కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపుకు సంబంధించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వివరించారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్ కంపెనీ సర్వర్‌లో నిక్షిప్తమై ఉందని ఆయన తెలిపారు. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ ’సేవామిత్ర’ వాడుకుంటోందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని, అతడు కోడ్ భాషలో మాట్లాడుతున్నాడని, ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆ కీలక వ్యక్తి ఎవరనేది త్వరలోనే తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ...‘ఆంధ్రప్రదేశ్‌లో సేవామిత్ర యాప్ ద్వారా సర్వే చేపడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ చాలామంది సర్వేయర్లను నియమించుకున్నారు. సర్వేలో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అన్నది తెలుసుకున్నారు. సర్వేయర్ల ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారం టీడీపీ బూత్ లెవల్ అధికారులకు వెళుతుంది. సేవామిత్ర వెబ్సైట్లో బూత్ కన్వీనర్లు, డ్యాష్ బోర్డు వివరాలున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారో సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలైన ఆధార్, ఓటర్ ఐడీ వివరాలు సేకరించారు. ఆ క్వశ్చనీర్లోనే ఎన్నికల సరళిపై సర్వే చేయడంతో పాటు, ఏ పార్టీకి ఓటేస్తారని ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. డేటా చోరీ, ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అందుకే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ ఫిర్యాదుపై ఐటీ గ్రిడ్స్ సంస్థ మీద ఐపీసీ 420,467,468,471,120బీ కింద కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుదారు వాంగ్మూలం తీసుకున్నాం. విజయవాడకు చెందిన కందుల రమేశ్, కందుల నాగమణికి ఓటర్ ఐడీ ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో వీరి పేర్లు గల్లంతయ్యాయి. వారి వివరాలు ఆన్లైన్ వెరిఫికేషన్‌లో రావడం లేదు. దశరథ రామిరెడ్డి ఫిర్యాదులో 2018 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో 3వేల మంది మైనార్టి ఓటర్లను తీసేశారాని పేర్కొన్నారు. సైబారాబాద్ పోలీసులు ఇప్పటికే ఐటి గ్రిడ్స్ సంస్థపై విచారణ జరుపుతున్నారు. సైబారాబాద్ పోలీసులతో కలిపి విచారణ జరుపుతాం. ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తాం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది కనుక్కోవాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఇక సర్వర్ నుంచి డేటా ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్, అమెజాన్ సంస్థలపై ఉంది. ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చాం, త్వరలో సమాధానం వస్తుంది.’ అని సీపీ తెలిపారు. -
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు
-
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. డేటా చోరీపై చంద్రబాబు చేసిన పనిని గవర్నర్‌కు వివరించారు. ఒక పద్ధతి, పథకం ప్రకారం డేటా చోరీ.. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా?. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి. సేవా మిత్ర టీడీపీకి సంబంధించిన యాప్. ఆ యాప్‌ను తయారు చేసింది ఐటీ గ్రిడ్స్ కంపెనీ. ఆధార్ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదు. సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా?. కలర్ ఫోటోతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకు వచ్చింది. ఆ జాబితా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్లలో ఎలా కనబడతోంది. ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఎలా ఉన్నాయి. వ్యక్తిగత వివరాలు ప్రయివేట్ సంస్థల వద్ద ఉండనే ఉండకూడదు. ప్రభుత్వమే ఇంటింటికి పంపి సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్రలో పొందుపరిచారు. రెండేళ్ల నుంచి పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారు. మేం ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం. రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలుస్తాం. ఒక ప్రయివేట్ కంపెనీలో డేటా దొరకడం సబబేనా?. ఇది నేరం కాదా?. ఓటర్ల డేటా, కలర్ ఫోటోలతో మాస్టర్ కాపీ ఎలా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్స్‌లో కనబడుతుంది. కేంద్ర, సీఈసీ, హోంశాఖ పరిధఙలోని డేటా ఎలా వచ్చింది. బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. వ్యక్తుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, కలర్ ఫోటోలతో ఓటర్ల వివరాలు మీ దగ్గర ఉన్నాయి. దీనితో మీరు ఏమి చేసినా ప్రజలు నాశం అవ్వరా?. ఇలాంటి సైబర్ క్రైం రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా జరిగి ఉండదేమో. ఐటి గ్రిడ్స్ అనే కంపెనిపై దాడులు జరిగినపుడు అనేక వివరాలు బయటకు వచ్చాయి. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్. ఇది ఎవరు తయారు చేశారు అంటే ఐటీ గ్రిడ్స్ అనే సంస్ధ. ఈ యాప్ వద్ద ఉండకూడని డేటా ఉంది. ప్రైవేటు వ్యక్తులు సంస్థల వద్ద ఉండకూడని సమాచారం ఏ రకంగా కనబడతున్నాయి. ఆధార్ వివరాలు ప్రైవేటు కంపెని కంప్యూటర్లలో దొరకడం సబబేనా?. ఇది క్రైమ్ కాదా?. ఆధార్ వివరాలు కాకుండా ఓటర్ ఐడీ, డేటా విత్ కలర్ ఫోటోస్...మాస్టర్ కాపీ అనేది ఎవరికి అందుబాటులో ఉండదు. ఏ రకంగా అది ఐటి గ్రిడ్స్ కంపెనీలో కనబడుతోంది. టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఏ రకంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు కూడా వారి వద్ద లభించాయి. ఇవి ఏరకంగా ప్రత్యక్షం అవుతున్నాయి. సేవామిత్రాలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి?. గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేయించారు. అవన్నీ కూడా సేవా మిత్రలో అనుసంధానం చేశారు. ఈ డేటాను టీడీపీ నేతలకు పంపారు. ఆ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారు. ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను ఓ పద్దతి ప్రకారం డిలీట్ చేయడం మొదలు పెట్టారు. వారికి ఓటేస్తారని తెలిసినవారి ఓట్లు రెండుగా నమోదు చేయించారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తా ఉన్నారు. ఇలా జరుగుతుందని 2018 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఎందుకంటే గతంలో మేం కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. మా స్టడీలో 59 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు కనిపించాయి. జనవరిలో ఎన్నికల కమిషన్‌ను కలసి 24 పెన్ డ్రైవ్‌లు ఇచ్చి 54 లక్షల ఓట్లకు సంబంధించి సమాచారం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని ఫిర్యాదు చేసి వచ్చాం. దానిలో భాగంగా ఫారం-7 పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించమని విచారణ చేసి ఆ నిర్ణయం తీసుకోమన్నాం. మేం ఈ కార్యక్రమం చేస్తుంటే ఏపీ పోలీసులను పంపించి ఫారం-7 పెట్టిన వారిపై వేధింపులు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఫారం 7 పూర్తి చేసి,1950 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే మీరు ఓటర్ అవునా కాదా అనే విషయం తెలుస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పౌరుడి భాధ్యత. చంద్రబాబు నాయుడు దీనిపై విచారణ జరపకుండానే ఎల్లో మీడియాను ఉపయోగించి చేయాల్సిందంతా చేస్తున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు చేస్తున్న అక్రమాలను బయటపెట్టాల్సిన వారు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేటు సంస్దల వద్ద ఆధార్, కలర్ ఓటర్ జాబితాలు, బ్యాంక్ అకౌంట్లు ఉండటం నేరం. ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఏమాత్రం తప్పు చేస్తున్నామనే భావన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఓటర్లను తొలగించడం, అక్రమంగా నకిలీ ఓట్లు నమోదు చేయించడం నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం దారుణం. ఈ విషయాలు అన్నీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా చేసింది జైలుకు వెళ్లాల్సిన నేరాలు. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫారం 7 దరఖాస్తు చేయడం తప్పన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఐటి గ్రిడ్స్ చేయకూడని పనులు హైదరాబాద్‌లో చేస్తుంటే ఇక్కడే కేసు పెడతారు కదా. ఇదేదో ఆంధ్రాకు, తెలంగాణా రాష్ట్రాల మధ్య గొడవన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. 59 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వెరిపై చేసి దానిలో తప్పుంటే తీసేయండి అని కోరాం. ఫారం 7 అనేది రిక్వెస్ట్ ఫర్ ఎంక్వయిరీ. అలా చేయడం తప్పు కాదు, నేరం కాదు.’ అని అన్నారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలుసు పార్థసారధి, రాజన్న దొర, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని తదితరులు ఉన్నారు. -
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
-
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సర్కార్ చేస్తున్న అరాచకాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. -
వైఎస్ఆర్సీపీ ఓట్లే టార్గెట్
-
కడప ఓట్ల తొలగింపులో కొత్త నాటకం
-
ఓట్ల అక్రమాల పై చంద్రబాబు దొంగాట
-
బాబుల బరితెగింపు!
-
చిన్నబాబు..పెద్ద ఫ్రాడ్..
-
లోకేష్‌కు,బ్లూ ఫ్రాగ్‌కు సంబంధమేమిటి?
-
డాటా చోర్
-
ఉల్టాచోర్ కొత్వల్ డాంటే
-
ఐటీ గ్రిడ్స్ స్కాం: నెల్లూరులో అలజడి
సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ వ్యవహారం తాజాగా నెల్లూరు జిల్లాలో అలజడి రేపుతోంది. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాకవరం అశోక్ స్వస్థలం నెల్లూరు జిల్లా అల్లూరు. కాగా జిల్లాకు చెందిన బీదా సోదరులకు అశోక్ అత్యంత సన్నిహితుడు. టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సహకారంతోనే అశోక్ ...మంత్రి నారా లోకేష్ వద్ద చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కోసమే అశోక్... ఐటీ గ్రిడ్స్ సంస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. చదవండి.... (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) మరోవైపు పరారీలో ఉన్న దాకవరం అశోక్ కోసం సైబరాబాద్ క్రైం పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అశోక్ ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. డేటా చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన నిన్న కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో దాకవరం అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక ఐటీ గ్రిడ్స్ సంస్థపై హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం మరో కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారంటూ దశరధరామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో అశోక్‌పై ఐపీసీ 420, 419, 467, 468, 120 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షులను విచారిస్తున్నారు. -
నా జోలికి వస్తే వదిలిపెట్టను, మూలాలు కదిలిస్తా: బాబు
సాక్షి, చిత్తూరు : ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎదురుదాడికి దిగారు. డేటా వ్యక్తిగత ఆస్తి అని, పార్టీ డేటాను అప్డేట్ చేస్తుంటే కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మిమ్మల్ని వదిలిపెట్టను, మీ మూలాలను కదిలిస్తా, నా జోలికి వస్తే వదిలేది లేదంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ...‘టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మీ మూలాలను కదిలిస్తా. కాంగ్రెస్ కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నేనే తెచ్చా. మీరు వాడే సెల్‌ఫోన్ కూడా నేనే కనిపెట్టాను. రాష్ట్ర విభజనతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం. అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యేలేదు. ఎంతమంది కలిసినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మీ ఆటలు సాగనివ్వను. 37ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉంది. కేసీఆర్ నన్ను ఓడిస్తామంటున్నారు. ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రధాని మోదీతో కలిసి ఆయన ఇలా బెదిరిస్తున్నారు. అందుకే మీకు రోషం రావాలి.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. (డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు) -
ఐటీగ్రిడ్స్ స్కాం : కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేశాం
-
డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు
-
ఐటీగ్రిడ్స్ స్కాం : కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ సంస్థ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులు సమక్షంలోనే సోదాలు జరిపామన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్ గౌడ్, చంద్ర శేఖర్, ఫణి కుమార్, భాస్కర్ల సమక్షంలోనే ఆదారాలు సేకరించామని తెలిపారు. కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) ఐబాల్, డెల్ కంప్యూటర్, ట్యాబ్‌టాప్, డెల్ సీపీయూ, మొబైల్ ఫోన్స్, ఇతర పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఎంక్యాబ్ సిరీస్ ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశామని చెప్పారు. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సోదాల్లో లభించాయన్నారు. ఐటీ గ్రిడ్ డేటా అమెజాన్ సర్విస్‌లో భద్రపరినట్లు విచారణలో తేలిందన్నారు. నియోజకవర్గాల వారిగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ అక్రమంగా సేకరించిందన్నారు. అక్రమంగా డేటా సేకరించి, ఓట్లు తొలగిస్తున్నట్లు కొంతమంది చేసిన ఫిర్యాదుపై దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెజాన్ వెబ్ సర్వేసెస్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీల ప్రతినిధులతో కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు సంస్థలు కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఎలాంటి అనుభవం లేకపోయినా... ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడు తమ శాఖల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు. కుటుంబ వికారం, సమాజ వికాసం ప్రాజెక్ట్‌ను ఏపీ సర్కార్...బ్లూ ఫ్రాగ్ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు మంత్రి లోకేష్ చేతిలోని పంచాయతీ రాజ్ శాఖ ఓ జీవోను జారీ చేసింది. ఇందుకోసం ఈ ఏడాది జనవరి 29న హై లెవల్ ఎంపిక కమిటీని నియమించి, అన్ని శాఖల సమాచారం అందించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక 2017లో పంటల సలహా కాంట్రాక్ట్‌ను రూ.30 కోట్లకు బ్లూ ఫ్రాగ్‌కు అప్పగించింది. అయితే ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో 2018లో ఆ సంస్థను అధికారులు తప్పించారు. మరోవైపు కరెంట్ స్తంభాల జియో ట్యాగింగ్ కాంట్రాక్ట్‌ను కూడా ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. కాగా ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించాయి. -
డేటా స్కాం కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో సంచలనం సృష్టిస్తున్న భారీ డేటా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగుల అదుపుకు సంబంధించి విచారణ ముగిసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్‌లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సోమవారం హైకోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన విషయం విదితమే. డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులను తాము అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణ నిమిత్తం పిలిచామని టీఎస్ ఏజీ బీఎస్ ప్రసాద్ ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పిందని ఆయన తెలిపాపారు. కాగా తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ ఉద్యోగులు కనిపించడం లేదంటూ సంస్థ డైరెక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. (ఐటీ గ్రిడ్స్ స్కాం: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు) ఇక డేటా చోరీ కేసులో కీలక నిందితుడు అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు విజయవాడ, నెల్లూరు, విశాఖ, బెంగళూరులో గాలిస్తున్నాయి. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. -
ఐటీ గ్రిడ్ నిర్వాహకులకు సీఎం పేషీలో ఏం పని..?
-
జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు
-
ఐటీగ్రిడ్స్ స్కాం: జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉద్యోగులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్‌లను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కుందన్‌బాగ్‌లోని హైకోర్టు జడ్జి నివాసం వద్దకు వారిని తీసుకువచ్చారు. వారితో పాటు తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివాస్ కూడా హాజరైయారు. ఇదిలావుండగా తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ కంపెనీ యాజమాన్యం హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ ఉద్యోగులు కనిపించడంలేదంటూ సంస్థ డైరెక్టర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. టీడీపీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే పౌరుల డేటా చోరీ స్కామ్‌కు పాల్పడినట్టు గుట్టురటైన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వారివద్ద ఉందని తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఐటీగ్రిడ్స్‌పై నగరంలో మరోకేసు నమోదైంది. సేవమిత్ర ఆప్ పేరుతో ప్రభుత్వ లబ్దిదారుల సమాచారాన్ని చోరీ చేశారంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్‌కు చెందిన రామ్‌రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరుకు విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) -
డేటా స్కామ్!
-
ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!
సాక్షి, హైదరాబాద్ / అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడానికి ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదార్లు తొక్కుతోంది. ఇందుకోసం 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వాడుకుంటోంది. ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతి రేకంగా ఉన్నవారి ఓట్లను తొల గించడానికి, ఎన్నికల సమయంలో ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేయడానికి కుట్ర పన్నుతోంది. హైదరాబాద్‌లో బయటపడ్డ డేటా చోరీ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే ఈ డేటా చోరీ స్కామ్‌కు పాల్పడినట్టు గుట్టురట్టు కావడంతో ‘పచ్చ’నేతల్లో వణుకు మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. ఈ కుంభకోణంపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తుమ్మల లోకేశ్వర్‌రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ఏపీ పోలీసులు ఆదివారం ప్రయత్నించడం గమనార్హం. (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారితోపాటు ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని వారి కలర్ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. అంటే ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్‌కు అందజేసిందన్నమాట. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్‌నకు ప్రజల ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, రాష్ట్రంలో దాదాపు 3.50 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికార పార్టీ యాప్‌లో చేర్చారు. ప్రజల ఆధార్, ఓటర్ ఐడీల వివరాలు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. దీన్ని గుర్తించిన సామాజిక కార్యకర్త, ఇందూ ఫార్టూన్ ఫీల్డ్స్ వాసి తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు 2019 ఓటర్ల జాబితాలో లేకపోవడాన్ని లోకేశ్వరరెడ్డి గుర్తించారు. (ఐటీగ్రిడ్స్ స్కాం: అధికారుల్లో టెన్షన్.. టెన్షన్) లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు 120(బి), 379, 420, 188 ఐపీసీ, సెక్షన్ 66(బి), 72 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి కొండాపూర్, కేపీహెచ్‌బీ కాలనీల్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌ను సైతం ఆధీనంలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆ సంస్థ ఉద్యోగులైన రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్‌లు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన ఆదివారం విచారణకు హాజరు కాలేదు. డాకవరం అశోక్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. (చంద్రబాబు, లోకేష్‌ల కుట్రే) కీలక సమాచారం తొలగింపు! డేటా స్కామ్‌సై గత నెల ఆఖరి వారంలో సైబరాబాద్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయం ఫిబ్రవరి 26న మీడియాలో వచ్చింది. దీంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్‌లో మార్పులు చేర్పులు చేసి, అప్‌గ్రేడ్ చేసినట్లు స్పష్టమైంది. దీనికి సంబంధించిన ఫొటో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమ వద్ద ఉన్న ప్రజల వ్యక్తిగత, ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ డేటాను తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేవామిత్ర యాప్‌ను లోకేశ్వర్‌రెడ్డి గమనించినప్పుడు అందులో ఓటర్ జాబితా ప్రకారం ప్రజల ఫొటోలు, వివరాలు కనిపించాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలియడంతో ఐటీ గ్రిడ్స్ సర్వర్ నుంచి కీలక సమాచారాన్ని డిలీట్ చేయడంతోపాటు సర్వర్లను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసుల కొన్ని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. (ఐటీ గ్రిడ్ డేటా స్కామ్ సూత్రధారి బాబే) లోకేశ్వర్‌రెడ్డి కిడ్నాప్‌కు ఏపీ పోలీసుల యత్నం ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన లోకేశ్వర్‌రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. గుంటూరుకు చెందిన డీఎస్పీ కులశేఖర్, ఇన్స్పెక్టర్ బాలమురళీ కృష్ణ సహా నలుగురు పోలీసులు లోకేశ్వర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుర్భాషలాడారు. ఫిర్యాదు చేయడానికి డేటా ఎక్కడి నుంచి వచ్చిదంటూ బెదిరించారు. ఓ దశలో కిడ్నాప్ చేసి తమతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆయన ఫోన్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేపీహెచ్‌బీ, మియాపూర్ ఇన్స్పెక్టర్లు లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. భాస్కర్ అనే ఉద్యోగి అదృశ్యంపై గుంటూరులోని ఓ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని, దర్యాప్తులో భాగంగా లోకేశ్వర్‌రెడ్డిని ఏపీకి తరలిస్తున్నామంటూ ఏపీ పోలీసులు వాదించారు. తమ సంస్థ ఉద్యోగిభాస్కర్ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్స్ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పడం గమనార్హం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారు? కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ పోలీసులు నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం లోకేశ్వర్‌రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో అధికారులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరిగారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేయడం గమనార్హం. అడ్వొకేట్ జనరల్‌తో చంద్రబాబు మంత్రాంగం ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాకం బయటపడి, తామే దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఈ కేసు నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై ఆదివారం ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీధర్‌తో గంటన్నరపాటు చర్చించారు. డేటా స్కామ్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఎదురు కేసు పెట్టాలా? మరేదైనా చేయాలా? అనేదానిపై సమాలోచనలు జరిపారు. డేటా చోరీ కుంభకోణాన్ని తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య వివాదంగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హడావుడిగా మీడియాకు లీకులు ఇచ్చి ఇదేదో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగాను, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీలపై నెపాన్ని నెట్టేందుకు పాట్లు పడ్డారు. ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ సీరియస్ క్రైమ్ ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురికావడం సీరియస్ క్రైమ్ అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్‌నకు ఎలా అనుసంధానిస్తారని సైబర్ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇదే పని యూరప్, అమెరికా దేశాల్లో చేస్తే తక్షణమే జైలులో పెడతారని గుర్తుచేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ నెంబర్(ఆధార్ కార్డు) లాంటి వాటిని చట్ట వ్యతిరేకంగా వాడినా, ప్రైవేట్ వ్యక్తులకి అందచేసినా అది తీవ్రమైన నేరమే. ఇలాంటి నేలరకు కఠిన శిక్షలు అమలు చేయాలని డేటా ప్రైవసీ చట్టాలు చెబుతున్నాయి. ఈ కేసు విచారణ సక్రమంగా జరపాలని, రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడానికి ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, దీనిపై చంద్రబాబు, లోకేశ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కుంభకోణంలో అధికారుల పాత్ర! ఆధార్ డేటాబేస్ అనేది పూర్తిగా వ్యక్తిగత వివరాలతో కూడి ఉంటుంది. ఆధార్ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ డేటా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సహా ఎవరి వద్దా ఉండకూడదు. కనీసం నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు, పోలీసులకు కూడా ఈ డేటాబేస్‌లోకి యాక్సెస్ ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంక్షేమ పథకాలకు సంబం«ధించిన లబ్ధిదారుల జాబితాలను వ్యక్తిగత వివరాలతో సహా ఎవరికీ/ప్రైవేట్ సంస్థలకు అందించకూడదు. తాజాగా బయటపడిన డేటా చోరీ కుంభకోణంలో ప్రభుత్వ అధికారుల పాత్ర (ఐపీసీ 188) కూడా ఉందని అనుమానిస్తున్నారు. చోరీ (ఐపీసీ 370) ద్వారానే డేటా సంగ్రహించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. దీన్ని వినియోగించి సేవామిత్ర సంబంధీకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని (ఐపీసీ 420) కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్ కేంద్రంగా జరగడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 66, 72 సెక్షన్లనూ ఈ కేసులో జోడించారు. సేవామిత్ర యాప్‌తో ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు పకడ్బందీగా స్కెచ్ వేశారు. సేవామిత్ర యాప్‌ను డౌన్లోడ్ చేసిన ట్యాబ్‌లను తమ బృందాలకు ఇచ్చి, మైక్రో లెవెల్ సర్వేలు అంటూ గ్రామాల్లో పంపిస్తున్నారు. ఈ యాప్‌లో ప్రజలందరి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. బృందాలుగా వెళ్లే యువకులు ఓటర్లను స్వయంగా కలుసుకుంటున్నారు. మీరు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని నచ్చజెబుతున్నారు. సదరు ఓటరును టీడీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా? ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు? తదితర ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాబ్‌ల్లోనే సమాధానాలు నమోదు చేసి, పార్టీ పెద్దలకు అందజేస్తున్నారు. సర్కారు పనితీరుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసిన, ప్రతిపక్షానికి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇందుకోసం తమ ఓటును తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఆన్లైన్లో ఫారం–7 సమర్పిస్తున్నారు. యాప్‌లో ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఓట్లు కొనేయడానికి నేరుగా నగదు జమ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ‘మిస్సింగ్’ డ్రామా తమ ఉద్యోగి కన్పించడం లేదని ఒక సంస్థ నిర్వాహకుడు ఇచ్చిన వాట్సాప్ మెసేజ్‌పై ఏపీ పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. రాత్రికి రాత్రే కేసు నమోదు చేసారు. అంతేవేగంగా వందలాది మంది పోలీసులు అర్ధరాత్రికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయం వద్దకు చేరి కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం గాలించేందుకు వచ్చామన్నారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ స్కామ్ గుట్టురట్టు కావడంతో శనివారం రాత్రి జరిగిన ‘మిస్సింగ్ హైడ్రామా’ ఇది. డేటా చోరీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకుడు రేగండ్ల అశోక్ తమ ఉద్యోగి కటకం భాస్కర్ కన్పించడం లేదంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు శనివారం రాత్రి వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గత నెల 28న పెదకాకాని ప్రాంతంలోని ఐజేఎం అపార్టుమెంట్‌కు వచ్చిన భాస్కర్ హైదరాబాద్‌కు తిరిగిరాలేదంటూ అశోక్ పంపిన వాట్సాప్ మెసేజ్‌ను ఎస్పీ పెదకాకాని సీఐకి పంపించి కేసు నమోదు చేయించినట్టు సమాచారం. పెదకాకాని పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేయగా, కేవలం గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ ఆఫీస్‌కు చేరుకున్నారు. భాస్కర్ మిస్సింగ్ కేసు నమోదైనందునా అతని ఆచూకీ కోసం వచ్చినట్టు చెప్పిన ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ వద్ద సోదాలు చేసే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్‌కు పాల్పడిందని, దానిపై కేసు నమోదు చేసి భాస్కర్‌తోపాటు మరికొందరు ఉద్యోగులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్టు తేల్చిచెప్పారు. -
ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్‌కు నోటీసులు
-
ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్‌కు 161 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నలుగురి ఐటీ గ్రిడ్ ఉద్యోగులకి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పి ఎవరో తీసుకెళ్లారని హైకోర్టులో సంస్థ సీఈఓ అశోక్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఏపీ పోలీసుల బెదిరింపులపై లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ను క్లోడ్ సర్వర్ లో భద్రపరచగా హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ను డీకోడ్ చేసే పనిలో ఐటీ నిపుణులు నిమగ్నమయ్యారు. టీడీపీకి సేవలందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసులు నిన్న సాయంత్రం సోదాలు నిర్వహించారు. దీంతో వివాదం రాజుకుని హైకోర్టులో పిటిషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. -
మరో ఆధార్ డేటా లీక్ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యతపై వినియోగదారుల్లో ఆందోళన కొనసాగుతుండగానే భారీ ఎత్తున ఆధార్ డేటా లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ గ్యాస్ (ఇండేన్) కంపెనీ వినియోగదారులకు షాకిచ్చే నివేదికను టెక్ క్రంచ్ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. టెక్ క్రంచ్. కాంం అందించిన నివేదిక ప్రకారం 67 లక్షల ఆధార్ సభ్యుల వివరాలు లీక్ అయ్యాయి. దేశీయ గ్యాస్ పంపిణీ కంపెనీ ఇండేన్ నుంచి ఆధార్ వినియోగదారులు ఫోన్ నెంబర్లు, చిరునామా, తదితర వివరాలు లీక్ అయ్యాయని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఇండేన్ వెబ్సైట్ లోకి ఎవరైనా చొరబడి లాగిన్ వివరాలను తస్కరించడంతోపాటు, భారీ డాటాబేస్‌కు కూడా యాక్సెస్ సాధించవచ్చని పేర్కొంది. పేరు చెప్పడానికి ఇష్టపడని సెక్యూరిటీ పరిశోధకుడు డేటాబేస్‌ను కొనుగొన్నట్టు వెల్లడించింది. ఇలా ఇండేన్ కెందిన 11వేల డీలర్ల వద్ద, వినియోగదారుల ఆధార్ నెంబర్ సహా, ఇతర వ్యక్తిగత వివరాలను కనుగొన్నట్టు టెక్ క్రంచ్ నివేదించింది. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)కి చెందిన వంటగ్యాస్ పంపిణీ సంస్థ ఇండేన్ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు లక్షలాది మంది కస్టమర్ల డేటా లీకైందని ఎథికల్ హ్యాకర్ ఎలియాట్ ఆల్డర్సన్ చెబుతున్నారు. స్థానిక డీలర్లు ఆథెంటికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్ నెంబర్లు లీక్ అయ్యాయని ఆయన వాదిస్తున్నారు. ఆధార్ డేటా లీక్ అంశాన్ని ఫిబ్రవరి 10న దీన్ని గుర్తించామని, ఇదే విషయాన్ని ఫిబ్రవరి 16న గ్యాస్ కంపెనీ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపింది. అయితే కంపనీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీన్నినేడు (ఫిబ్రవరి 19న బహిర్గతం చేసినట్టు చెప్పింది. అటు ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కూడా ఎలాంటి స్పందన రాలేదని టెక్ క్రంచ్ స్పష్టం చేసింది. ఈ నివేదికపై అటు ఇండేన్ కంపెనీగానీ, ఇటు యుఐడీఏఐ గానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
ఎస్బీఐ ఖాతాదారుల డేటా లీక్ సంచలనం
సోషల్ మీడియా అకౌంట్ల డేటా లీక్ వార్తలు వినియోగదారులకు షాకిస్తోంటే...తాజాగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతా దారుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. ఎస్బీఐకు చెందిన లక్షలాది ఖాతాదారుల డాటా భద్రతకు సంబంధించి టెక్ క్రంచ్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని, ఇప్పటికే లక్షలాది కస్టమర్ల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు, తదితర వివరాలు లీకయ్యాయని ప్రకటించింది. దీంతో ఎస్బీఐ కస్టమర్లలో కలకలం రేగింది. మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకింగ్ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే సదుపాయమే 'ఎస్బీఐ క్విక్'. ముంబైలోని సర్వర్ డేటా సెంటర్‌కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదని, తద్వారా హ్యాకర్లు ఎవరైనా చాలా సులువుగా లక్షలాదిమంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్ క్రంచ్ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్బీఐ కున్న సుమారు 42 కోట్లకు పైగా ఖాతాలకు సంబంధించిన డేటా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్మార్ట్ఫోన్లు ఉపయోగించని కస్టమర్లు ఎస్బీఐ క్విక్ ద్వారా కస్టమర్లు టెక్స్ట్ మెసేజ్‌లతో వివరాలను తెలుసుకునే సదుపాయం. ఎస్బీఐ సూచించిన కీవర్డ్స్ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్నుంచి ఈ సమాచారాన్ని ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యగా బ్యాలెన్స్ ఎంక్వైరీ, చివరి ఐదు లావాదేవీలు, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, గృహ, వాహనరుణాలకు సంబంధించిన సమాచారం పొందొచ్చు. ఇలా ఎస్బీఐ క్విక్‌కు రోజూ మెసేజ్‌లు బట్వాడా అవుతాయనీ, అయితే పాస్వర్డ్ లేని డేటాబేస్కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని చెబుతోంది. పేరు చెప్పడానికి సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఒక్క సోమవారం రోజే ఇలాంటి దాదాపు 30లక్షల నకిలీ మెసేజ్‌లు ఎస్బీఐ కస్టమర్లకు అందాయని టెక్ క్రంచ్ ఆరోపించింది. గత రెండు నెలల కాలంలో హ్యాకర్లు కస్టమర్లకు భారీ నష్టాన్ని కలిగించి వుండవచ్చని అంచనా వేసింది. ఎస్బీఐ వివరణ అయితే దీనిపై ఎస్బీఐ ట్విటర్ ద్వారా స్పందించింది. అత్యున్నత విలువలతో సేవలందిస్తున్న ఎస్బీఐ వినియోగదారుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. అలాగే డాటాలీక్పై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. In light of the recent news item, regarding an alleged data incident, please find below our statement: pic.twitter.com/mu4xn12QgL — State Bank of India (@TheOfficialSBI) January 31, 2019 -
మీ డేటా విలువ రూ.3,580 మాత్రమే!
మాస్కో: డేటా లీక్, డేటా హ్యాకింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అంశం. సంపాదన నుంచి సంసారమంతా డిజిటల్ లైఫ్‌తో ముడిపడటమే దీనికి కారణం. అయితే సోషల్ మీడియా ఖాతాల సమాచారం మొదలు మన బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగిలించి కేవలం రూ.3,580కే సైబర్ నేరస్తులు అమ్ముతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. రష్యాలోని సైబర్ సెక్యూరిటీ కంపెనీకి చెందిన క్యాస్పర్‌స్కీ ల్యాబ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న తీరు, వారు ఎంత ధరకు అమ్ముతున్నారో వంటి విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ‘డార్క్ వెబ్’మార్కెట్లపై పరిశోధనాత్మక దర్యాప్తు చేపట్టారు. డార్క్ వెబ్‌లు ఇంటర్నెట్లోనే ఉంటాయి కానీ, సెర్చ్ ఇంజన్లో కనపడవు. వాటి యాక్సెస్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరమవుతుంది. సోషల్ మీడియా ఖాతా, బ్యాంకింగ్ సమాచారంతో పాటు ఉబర్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి పాపులర్ సర్వీస్ వెబ్సైట్లలోనూ డేటా చోరీకి గురవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటితో పాటు గేమింగ్ వెబ్‌సైట్స్, డేటింగ్ యాప్స్, పోర్న్ వెబ్‌సైట్స్, క్రెడిట్ కార్డ్‌ల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించి రూ.72 నుంచి రూ.3,580కు అమ్ముతున్నట్లు అంచనా వేశారు. డేటా చోరీ వల్ల వ్యక్తి డబ్బుతో పాటు హోదా, గౌరవం దెబ్బతింటుందని, సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉండటానికి ఒకే విధమైన పాస్వర్డ్ వాడకపోవడమే మార్గమని శాస్త్రవేత్త డేవిడ్ జాకోబి సూచించారు. -
డేటా.. కాసుల మూట..!
సాక్షి, హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌లో ఉండే.. ఓ ఓటరు ఫోన్‌కు సందేశం వచ్చింది. ‘‘సికింద్రా బాద్ నుంచి మీరు తప్పకుండా నన్నే గెలిపించాలి’’అన్నది దాని సారాంశం. ఇది చదివి ఓటరు బిత్తరపోయాడు’. కోరుట్లలో ఉండే ఓ వ్యాపారికి ‘మనవాళ్లు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు మీరు తప్పకుండా రావాలి’’అని ఫోన్లో సందేశం అందింది. తన సామాజిక వర్గం తెలుసుకుని మరీ ఎలా ఫోన్ చేశారబ్బా.. అని అతను జుత్తుపీక్కున్నాడు. అసలు బొత్తిగా పరిచయం లేని వ్యక్తులకు ఫోన్‌నెంబర్లు ఎలా తెలిశాయన్నది ఇక్కడ మొదటి పాయింట్. కాగా, ఒక ప్రాంతంలో నివసించి, ఇపుడు చిరునామా మారినా వారికి ఇంకా పాత ప్రాంతం నేతల నుంచి ఆహ్వానాలు, వినతులు వస్తుండటం రెండోపాయింట్. ఎలాంటి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోన్ నంబర్లను సంగ్రహించ డాన్ని ప్రజలు తప్పుబడుతుంటే, సామాజిక వర్గం తెలుసుకుని మరీ ప్రచారం మొదలుపెట్టడాన్ని విద్యావంతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. డేటా ఎలా లీకవుతోంది? నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి, అభ్యర్థుల ఖరారు అంశం కొలిక్కి వచ్చింది. ఇక దాదాపు అందరు నేతలు ప్రచారపర్వంలోకి దూకారు. ప్రచారమూ మొదలు పెట్టారు. తమకు ఓటేయాలంటూ ప్రతీరోజు వీడియో, ఆడియో, రికార్డ్ వాయిస్ సందేశాల ద్వారా మోత మోగిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 2.80 కోట్ల మంది ఫోన్ నెంబర్లలో అధికశాతం ఫోన్‌నెంబర్లు కొందరు ఏజెంట్ల వద్ద ఉన్నాయి. వీరికి హైదరాబాద్‌తోపాటు, తెలంగాణ జిల్లాల్లో ఫోన్‌నెంబర్లు సేకరించడమే పని. ఇందుకోసం వారు కేబుల్, కాలనీ సంక్షేమ సంఘాలు, టౌన్షిప్ ఆఫీసులు, గ్యాస్ ఏజెన్సీ, జిరాక్స్, మీసేవా కేంద్రాల్లో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులను వశం చేసుకుంటారు. పదో పరకో ఇచ్చి.. మొత్తం డేటాతోపాటు, వ్యక్తుల ఫోన్నెంబర్లను కూడా సంగ్రహిస్తున్నారు. ఇక జిల్లాల్లో అయితే జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వాళ్లు ఫోన్ నంబర్లతోపాటు వాళ్ల సామాజికవర్గం కూడా తెలుసుకుని అందిస్తున్నారు. ఈ డేటానే ఏజెంట్లు రాజకీయ నేతలకు అందిస్తూ అందినకాడికి రాబడుతున్నారు. నేతలకూ టోకరా.. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో చాలా నెంబర్లు ఏడాది కింద సేకరించినవే. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది చిరునామాలు మారాయి. ఓట్లు కూడా బదిలీ అయ్యాయి. ఈ విషయం తెలియకుండా ముందే డేటా కొనేసిన రాజకీయ నేతల అనుచరులు వారికి కూడా సందేశాలు పంపిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇదేం ఖర్మరా నాయనా అనుకుంటూ పౌరులు చికాకుపడుతున్నారు. ఇలా వెళుతున్న రికార్డెడ్ వాయిస్‌లు, సంక్షిప్త సందేశాల్లో చాలావరకు నియోజవకర్గంతో సంబంధం లేని వారికే వెళ్తుండటం గమనార్హం. వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బందే.. వ్యక్తుల సమాచారం వారి అనుమతి లేకుండా సంగ్రహించడం నేరం. అదే విధంగా వివిధ వ్యక్తుల ఫోన్లకు వేళాపాలా లేకుండా ఫోన్లు చేసి విసిగించడం ముమ్మాటికీ తప్పేనని టెలీకామ్ అధికారులు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు పౌరుల కులం కనుక్కుని కార్తీక వనభోజనాలు, కుల సంఘాల మీటింగుల పేరిట ఆహ్వానాలు పంపడంపైనా చాలామంది మండిపడుతున్నారు. అయితే, ఈ విషయంలో ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. అభ్యర్థులను నేరుగా నిలదీయలేరు. అలాగని ఇలాంటి ఆహ్వానాలకు స్పందించలేక విసుక్కుంటున్నారు. -
ఫేస్బుక్ చైర్మన్‌గా జుకర్‌బర్గ్ తొలగింపు?
-
ఫేస్బుక్ చైర్మన్‌గా జుకర్‌బర్గ్ తొలగింపు?
వాషింగ్టన్ : ఫేస్బుక్లో చోటు చేసుకున్న డేటా హ్యాక్ ప్రకంపనాలు, ఫేక్ న్యూస్ ఇష్యూ ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఎసరు తెచ్చి పెడుతున్నాయి. ఈ సోషల్ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫేస్బుక్ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న నాలుగు దిగ్గజ అమెరికా పబ్లిక్ ఫండ్స్ బుధవారం మార్క్ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాయి. కంపెనీలో అతిపెద్ద అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకే ఓకే చేస్తారని అవి ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదన దాఖలు చేసిన వాటిలో ఇల్లినోయిస్, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనే ఫేస్బుక్లో 2017లో ఒకసారి వచ్చింది. తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన ఎంతో కీలకమైనదని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ వెల్లడించింది. డేటా హ్యాక్, కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ వంటి సమస్యల నుంచి ఫేస్‌బుక్‌ను బయటపడేయడానికి ఇదే మార్గమని పేర్కొంది. వార్షిక సమావేశంలో ఎలాగైనా ఈ ప్రతిపాదనన చర్చించేలా చేస్తామని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్ సేథ్ మాగజైనర్ చెప్పారు. ఈ విషయంపై స్పందించడానికి ఫేస్బుక్ అధికార ప్రతినిధి నిరాకరించారు. కంపెనీ వార్షిక సమావేశం 2019 మేలో జరగనుంది. స్వతంత్ర బోర్డ్ చైర్‌ను నియమించాలని బోర్డును కోరతామని తెలిపారు. ఫేస్బుక్లో ప్రస్తుతం నడుస్తున్న ఈ లుకలుకలు ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్‌గా పేరున్న ఈ కంపెనీ ప్రతిష్టను బజారుకు ఈడస్తున్నాయి. బుధవారం ఫేస్బుక్ షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. కాగా, పెన్సిల్వేనియా ట్రెజరీ 38,737 షేర్లను, ఇల్లినోయిస్ ట్రెజరీ 1,90,712 షేర్లు, రోడ్ ఐలండ్ ట్రెజరీ 1,68,230 షేర్లను కలిగి ఉంది. అయితే జుకర్‌బర్గ్ 60శాతం ఓటింగ్ హక్కులు ఉండటంతో, ఈ ప్రతిపాదన ఈ సారైనా ఆమోదం అవుతుందో లేదో చూడాల్సి ఉంది. -
ఇక డేటా అంతా లోకల్
డేటా లోకలైజేషన్.. వినియోగదారుల సమాచారాన్నంతటినీ దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకోసం పేమెంట్ కంపెనీలకు ఆర్బీఐ విధించిన గడువు సోమవారంతో పూర్తయింది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా భారత్ భూభాగంలోని సర్వర్లలోనే ఏ కంపెనీలైనా నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల భారత్‌లోని అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరిగిపోతోంది. గతంలో కొన్ని టెక్ సంస్థలు డేటా లోకలైజేషన్ నిబంధనలు సరికావని, వాటిని సడలించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు.‘‘డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. పౌరుల సమాచారం గోప్యంగా ఉంచడానికి కంపెనీలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడు డేటాను నిల్వ చేసే సర్వర్లు ఎక్కడ ఉంటే వచ్చే నష్టమేమిటి’’ అంటూ ఆ సెనేటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ అంశంలో అమెరికా, భారత్ ప్రజా ప్రతినిధుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. లేదంటే విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరించారు. అంతర్జాతీయ కంపెనీలపై భారం ఎలా ? అంతర్జాతీయ కంపెనీలన్నీ డేలా నిల్వ చేయడం కోసం భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు తడిసి మోపెడైపోతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాలు ఉండడం వల్ల అదే పని తిరిగి చేయాల్సి వస్తుంది. మానవ వనరుల్ని భారత్‌లో వినియోగించాల్సి రావడం కూడా ఆ కంపెనీలకు అదనపు భారమే కేవలం చెల్లింపు సంస్థలు మాత్రమే కాకుండా, ఇతరత్రా అన్ని రకాల కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని స్థానికంగా నిల్వ చేయడం వల్ల మార్కెటింగ్ వ్యూహాలను రచించడం కోసం వినియోగదారుల సమాచార సేకరణ సంక్లిష్టంగా మారుతుంది. దేశీయంగా వరం ఎలా ? అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక మోసాలు, అక్రమాలు జరిగినప్పుడు భద్రతా సంస్థలకి సమాచార సేకరణ సులభమవుతుంది. డేటా అనలిస్టులు,సైంటిస్టుల వంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. భారత్‌లో పేమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద వరం. వ్యాపారాల నిర్వహణలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో వాటికీ సమాన అవకాశాలు లభిస్తాయి. డేటాలో కలైజేషన్ అంటే వివిధ రకాలైన ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు, వినియోగదారులతో వ్యవహారాలు ముడిపడే ఇతర సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వినియోగదారుల సమాచారం ఏ అమెరికాలోనో, ఐరోపాలోని సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత గాల్లో దీపంలా మారింది. సమాచార భద్రతా ముసాయిదా బిల్లులో భాగంగా డేటాను దేశీయంగా ఉండే సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలన్న సూచనలు ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత సమాచార భద్రతా బిల్లులో అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో కేంద్రం ఉంది. అది చట్టరూపం దాల్చేలోగానే డేటాను లోకలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆరు నెలల క్రితం ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ కంపెనీలన్నీ దేశీయంగా సమాచారాన్ని నిల్వ చేయాలంటూ అక్టోబర్ 15వరకు గడువు విధించింది. కంపెనీల దారెటు ? అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు కంపెనీలైన వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఫేస్బుక్, పేపాల్, మాస్టర్‌కార్డు, గూగుల్ వంటి సంస్థలపై ఈ లోకలైజేషన్ ప్రభావం పడుతుంది. అయితే ఆర్బీఐ నిబంధనల్ని పాటిస్తూ స్థానికంగా వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేసే ప్రక్రియ వాట్సాప్ పూర్తి చేస్తే, అలా చేయడానికి గూగుల్ అంగీకరించింది. దేశంలోని మొత్తం 80 పేమెంట్స్ సర్వీసుల్లో 64 కంపెనీలు డేటా లోకల్‌గా నిల్వ చేయడానికి సిద్ధమని ప్రకటించాయి. మరో 16 సంస్థలు గడువు కోరాయి. అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మాత్రం డేటా లోకలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల అమెరికా, భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత క్షీణిస్తాయంటూ ఆ సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు చేశాయి. ఆర్బీఐ వేచి చూసే ధోరణి డేటా లోకలైజేషన్ అంశంలో పలు గ్లోబల్ పేమెంట్ కంపెనీలు గడువు పెంచాలని కోరినప్పటికీ ఆర్బీఐ నిరాకరించింది. ఆరు నెలల సమయం ఇచ్చామని, ఇక ఇచ్చే పని లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ సెంటర్లు ఏర్పాటు చేయని కంపెనీలు క్లౌడ్ విధానం ద్వారా సమాచారాన్ని నిల్వ చేసి, అతి త్వరలోనే భారత్ సెంటర్లకి మార్చాలని సూచించింది. అంతవరకు కంపెనీలపై వేచి చూసే ధోరణి అవలింబించాలని నిర్ణయించింది. -
ఫేస్బుక్లో మరోసారి డేటాలీక్
-
లీకైంది 2.9 కోట్ల మంది డేటానే
శాన్ఫ్రాన్సిస్కో: ఇంతకుముందు అంచనా వేసినట్లు 5 కోట్ల మందివి కాకుండా 2.9 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమచారమే హ్యాకర్ల చేతికి వెళ్లిందని ఫేస్బుక్ శుక్రవారం చెప్పింది. వీరిలో 1.5 కోట్ల మంది వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లను హ్యాకర్లు సంపాదించారనీ, మరో 1.4 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించి మరింత వ్యక్తిగత వివరాలైన లింగం, మతం, ఊరు, పుట్టినతేదీ, ఇటీవల చెక్–ఇన్ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని ఫేస్బుక్ తెలిపింది. 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ గతనెల చివరి వారంలో వార్తలు రావడం తెలిసిందే. -
5 లక్షల గూగుల్ ప్లస్ ఖాతాల డేటా లీక్?
కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్ ప్లస్ కార్పొరేట్ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్ ప్లస్‌లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్ తెలిపింది. విచారణ సంస్థలకు భయపడి గూగుల్ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
‘బ్రహ్మోస్’లో శత్రు గూఢచారి!
నాగ్‌పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్‌లోని డీఆర్డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్ క్షిపణి పరిశోధన కేంద్రం’లో నిశాంత్ అగ్రవాల్ గత నాలుగేళ్ల నుంచి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్ చేరవేసినట్లు భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో సోమవారం ఉదయం 5.30 గంటలకు నిశాంత్ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్త బృందం అతడిని అరెస్ట్ చేసింది. అనంతరం సాయంత్రం వరకూ ఆ ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో నిశాంత్ ల్యాప్‌టాప్‌లో బ్రహ్మోస్‌తో పాటు క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కీలకమైన సమాచారం లభ్యమైందని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐజీ అసీమ్ అరుణ్ తెలిపారు. పక్కా సమాచారంతోనే నిశాంత్ ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులతో నిశాంత్ ఫేస్బుక్ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అసీమ్ అరుణ్ వెల్లడించారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న నిశాంత్.. ఇక్కడి వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. ఈ విషయమై ఇంటి యజమాని మనోహర్ కాలే మాట్లాడుతూ.. దాదాపు ఏడాదికాలంగా నిశాంత్ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అద్దెకు దిగేందుకు ఆధార్ కార్డు కాపీతో పాటు డీఆర్డీవో జారీచేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాడన్నారు. ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నిశాంత్ స్వస్థలమని వెల్లడించారు. భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం(ఎన్పీవోఎం) సంయుక్తంగా ఏర్పాటుచేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ‘బ్రహ్మోస్ క్షిపణి’ని తయారుచేసింది. బ్రహ్మోస్ విశేషాలు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కోసం భారత్, రష్యా ప్రభుత్వాలు 1998, ఫిబ్రవరి 12న ఒప్పందం చేసుకున్నాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్కోవా నదుల పేరు మీదుగా ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. ఈ క్షిపణిని ట్రక్కులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. గతేడాది నవంబర్‌లో సుఖోయ్–30 యుద్ధవిమానం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 8.4 మీటర్ల పొడవు, 3,000 కేజీల బరువున్న ఈ క్షిపణి 200 కిలోల అణ్వాయుధాలు లేదా సంప్రదాయ వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. మొబైల్ లాంఛర్లు, యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్ 450 కి.మీ, యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్ 400 కి.మీ దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. -
బ్రహ్మోస్ రహస్యాలు పాక్‌కు లీక్ : డీఆర్డీఓ ఉద్యోగి అరెస్ట్
ముంబై : బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడనే అనుమానంతో డీఆర్డీఓలో పనిచేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఆర్డీఓ ఉద్యోగి నుంచి అనుమానాస్పద మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. స్ధానిక పోలీసుల సహకారంతో యూపీ ఏటీఎస్, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసకున్న వ్యక్తిని నిషాంత్ అగర్వాల్‌గా గుర్తించారు. నిషాంత్ అగర్వాల్ గత నాలుగేళ్లుగా నాగపూర్‌కు సమీపంలోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పాక్ సంస్ధలతో బ్రహ్మోస్ క్షిపణి గురించిన నిర్ధిష్ట సమాచారం, సాంకేతిక డేటాను అగర్వాల్ పంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఫేస్బుక్లో భారతీయుల వివరాలు తస్కరించిందన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం ప్రాథమిక విచారణను ప్రారంభించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్బుక్ యూజర్ల వివరాలను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. సీఏ అనుబంధ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీస్ భారత్‌లోనూ పనిచేసింది. -
‘ఆధార్’తో నా డేటా బయటికి రాలేదు
న్యూఢిల్లీ: ‘ఆధార్ చాలెంజ్’తో తనకు సంబంధించిన సమాచారమేదీ బహిర్గతం కాలేదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టంచేశారు. కీలకమైన విధానపర నిర్ణయాలను చర్చించేందుకు సోషల్ మీడియా తగిన వేదిక కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వివరాలు బయటపెట్టాలని సవాలు విసురుతూ శర్మ ఆధార్ సంఖ్యను వెల్లడించడం తెల్సిందే. దీంతో ఆయన ఆధార్‌నంబర్ సాయంతో కొందరు నెటిజన్లు శర్మ ఈ మెయిల్ సమాచారాన్ని సంపాదించారు. ట్రాయ్ చైర్మన్‌గా నేడు రిటైర్‌కానున్న శర్మ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్ లేకుండానే తెలుసుకోవచ్చు. ఆధార్ సవాలును నేనే విసిరినట్లు భావిస్తున్నారు. ఒకరు విసిరిన సవాలుకు స్పందించానంతే’ అని అన్నారు. -
ఫేస్బుక్ డేటా దుర్వినియోగంపై విచారణ
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్రం తెలిపింది. ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాకు నోటీసులు జారీచేయగా, డేటా చౌర్యం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ బదులిచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. మనుషుల అక్రమరవాణా బిల్లు ఆమోదం మనుషుల అక్రమ రవాణా నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్, సీపీఎం బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేయగా, చట్టం చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ బదులిచ్చారు. బాధితులను దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తెస్తున్నామని, దోషులకు శిక్షలు పడే రేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, సాక్షులు, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మూడేళ్లలో అధ్యాపక పోస్టుల భర్తీ వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను మూడేళ్లలోగా భర్తీ చేయాలని వర్సిటీలను కేంద్రం ఆదేశించింది. ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016–17 ప్రకారం దేశవ్యాప్తంగా 3,06,017 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రి జవడేకర్ చెప్పారు. వీటిలో 1,37,298 పోస్టులు పట్టణ ప్రాంతాల్లో, 1,68,719 అధ్యాపక పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మహిళల సాధికారతకు కొత్త పథకం ప్రజల భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘మహిళా శక్తి కేంద్ర’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర‡ రాజ్యసభకు తెలిపారు. 2017–20 మధ్యకాలంలో ఈ పథకం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పంచాయితీ స్థాయి కార్యక్రమంలో భాగంగా 115 జిల్లాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థి వాలంటీర్లు గ్రామీణ మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో పాటు ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని కుమార్ పేర్కొన్నారు. -
‘నీట్’గా అమ్మకానికి పెట్టేశారు!
ఇటీవల ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీకై ఎన్నికలను ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నీట్ అభ్యర్థుల డేటా లీకేజీ కోచింగ్ సెంటర్లకు కల్పతరువుగా మారుతోంది. దాదాపు రెండున్నర లక్షల మంది నీట్ అభ్యర్థుల డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య, దంత వైద్య కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) గత మేలో జరిగింది. జూన్ 4న ఫలితాలొచ్చా యి. మొత్తం 13 లక్షల మంది నీట్ పరీక్ష రాశా రు. అందులో 2.5 లక్షల మంది డేటాను ఓ వెబ్సైట్ అమ్మకానికి పెట్టింది. దీంతో మన దేశంలో సమాచార గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. నీట్ డేటాబేస్‌లో విద్యార్థి పేరు, నీట్లో వారికొచ్చిన స్కోర్, ర్యాంకు, చిరునామా, పుట్టిన తేదీ, సెల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ ఇలా అన్నీ ఉన్నాయి. సరైనదో కాదో ఎలా తెలుస్తుంది ? వెబ్సైట్ ఓపెన్ చేయగానే మచ్చుకి ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల డేటా అందులో కనిపిస్తుంది. డేటా కొనుగోలు చేయాలనుకునే వారు అభ్యర్థు ల సమాచారం సరైందో కాదో ఫోన్ ద్వారా సం ప్రదించి తెలుసుకోవచ్చు. సరైన సమాచారమే ఇస్తున్నారన్న నమ్మకం కుదిరితే 2 లక్షల మంది డేటాకు 2.4 లక్షలు చెల్లించాలి. డేటా కొనుగోలు చేసే వాళ్లకి ఈ వెబ్సైట్ మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. విద్యార్థుల్ని ఆకర్షించడానికి ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తామంటోంది. విద్యార్థుల నుంచే వివిధ మార్గాల్లో ఈ డేటాను సేకరిస్తున్నారు. ఫేస్బుక్లో కెరీర్ కౌన్సిలర్స్కి సంబంధించి యాడ్స్ కనిపిస్తే విద్యార్థులే తమకు ఎక్కడ సీటు వస్తుందో అన్న ఆతృతతో వివరాలన్నీ ఇస్తున్నారు. వాటిని సేకరించిన కొందరు డేటా బ్రోకర్లు ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. అలాగే కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు తమ వివరాలన్నీ అందించాల్సి ఉంటుంది. అలా సేకరించిన డేటానే అమ్మకానికి పెడుతున్నారు. ఎవరు కొంటారు? విద్యార్థుల డేటా లీకేజీ వ్యవహారం రెండు మూడేళ్లుగా చర్చనీయాంశమవుతోంది. 2017లో ఎంబీఏ ఎంట్రన్స్ రాసిన 15 లక్షల మంది విద్యార్థుల డేటా ఆన్లైన్లో అమ్ముడుపోయింది. అప్ప ట్లో కొన్ని వెబ్సైట్లు విద్యార్థుల డేటాను అమ్మకానికి పెట్టాయి. నీట్లో సరైన స్కోర్ రాని వారి ఫోన్ నంబర్లను తీసుకొని ఆ విద్యార్థుల వెంటబడుతున్నాయి కొన్ని కోచింగ్ సెంటర్లు. తమ వద్ద చేరితే వచ్చే ఏడాది సీటు గ్యారెంటీ అంటూ మభ్యపెడుతున్నాయి. ‘నీట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి రోజూ నాకు నాలుగైదు కాల్స్ వస్తున్నాయి. ప్రత్యేకమైన కోర్సులు చేయాలంటే మా కాలేజీలో చేరండంటూ పదే పదే కాల్స్ చేస్తున్నారు’అంటూ యూపీకి చెందిన ఒక అభ్యర్థి చెప్పారు. చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2008 సరిగ్గా వినియోగంలో లేదని అంటున్నారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల వరకు డేటా బ్రోకర్ సంస్థలున్నాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగానే డేటా వెల్లడిస్తున్న ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కోటి వరకు ఉన్నాయి. డేటా లీకేజ్ అవాస్తవం ఈ డేటా లీకేజీ అంతా అవాస్తమని నీట్–యూజీ 2018 డైరెక్టర్ డాక్టర్ సాన్యమ్ భరద్వాజ్ చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు, యూట్యూబ్ చానెల్స్‌లో వీడియోలు చూసి లీకేజ్ ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీబీఎస్ఈ పకడ్బందీ గా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మీ ఫోన్.. మీపైనే నిఘా..!
న్యూయార్క్: మీ స్మార్ట్‌ఫోన్ ఏయే పనులు చేస్తుందో తెలుసా..? కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా కనెక్టింగ్ ఇలా అన్ని పనులు చేస్తుందం టారా..? అయితే ఇవన్నీ మీకు తెలిసి.. మీరు చేస్తే జరుగుతున్న పనులు. మరీ మీకు తెలియకుండా మీ స్మార్ట్‌ఫోన్ చేస్తున్న దొంగపనుల సంగతేంటీ..! అని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలియకుండా స్మార్ట్‌ఫోన్‌లోని అనేక ప్రముఖ యాప్‌లు మీరు చేసే ప్రతీ పనిని గమనిస్తున్నాయి. కాదు.. కాదు.. మీ మీద నిరంతరం నిఘా పెడుతున్నాయి. అలాగే మీ విషయాలను స్క్రీన్షాట్లు, వీడియోలు కూడా తీసుకుని.. థర్డ్‌పార్టీలకు చేరవేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ఈ వీడియోలు, స్క్రీన్షాట్లలో యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారంతోపాటు మీకు సంబంధించిన ప్రతీ వ్యక్తిగత సమాచారం కూడా అవతలి వ్యక్తులు లేదా సంస్థలకు చేరిపోతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఫోన్లో మనం చేసే ప్రతీ యాక్టివిటీనీ రికార్డు చేసే సామర్థ్యం ప్రతీ యాప్‌కు ఉందని తాము కనుగొన్నట్లు బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ చోఫిన్స్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా వాడే 17 వేలకు పైగా యాప్‌లను పరిశోధకులు పరీక్షించారు. వీటిలో 9 వేల యాప్‌లకు స్క్రీన్షాట్లు తీయగల సామర్థ్యం ఉందని.. వీటిలో ఏ యాప్ కూడా స్క్రీన్షాట్లు తీస్తున్నట్లు మనకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా పంపకపోవడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఈ అధ్యయనాన్ని కేవలం ఆండ్రాయిడ్ ఆపరే టింగ్ సిస్టమ్ ఆధారిత యాప్‌ల మీద చేసినప్పటికీ.. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఏమంత సురక్షితమైనవి కావని వెల్లడించారు. మెడికల్ యాప్‌లు సమాచారాన్ని ఇతరులతో పంచుకుం టున్నాయని తెలిపారు. ఈ అధ్యయన ఫలి తాలను బార్సిలోనాలో జరగనున్న ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీ సింపోజియమ్ సమావేశంలో సమర్పించనున్నారు. -
మరోసారి డేటాలీక్ బాంబు పేల్చిన ఫేస్బుక్
-
52 కంపెనీలకు డేటా లీక్
వాషింగ్టన్: తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా 52 కంపెనీలతో పంచుకున్నామని, వాటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్‌కు శుక్రవారం ఆ కంపెనీ యాజమాన్యం వివరణిచ్చింది. ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్ ప్రతినిధుల సభకు చెందిన హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి ఫేస్బుక్ సమర్పించింది. యాపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, శాంసంగ్, అలీబాబా, క్వాల్‌కాం, పాన్‌టెక్ మొదలైన వాటితో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా ఆ దేశ నిఘా విభాగం పేర్కొన్న నాలుగు చైనా కంపెనీలు హ్యువాయ్, లెనోవో, ఒప్పో, టీసీఎల్లు కూడా ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, అలాగే ఆయా కంపెనీ ఉత్పత్తులతో ఫేస్బుక్ యాప్ అనుంధానం కోసం వివరాలు అందచేశామని ఫేస్బుక్ తెలిపింది.మొత్తం 52 కంపెనీల్లో 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని, జూలైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని ఫేస్బుక్ తెలిపింది. తాజా వివరాలపై ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ సభ్యుడు ఫ్రాంక్ పల్లోనే స్పందిస్తూ.. ‘ఫేస్బుక్ స్పందన సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఫేస్బుక్లో నేమ్‌టెక్ట్స్ చేశారా, ఇక అంతే!
ఇటీవల ఫేస్బుక్లో బాగా పాపులర్ అవుతున్న నేమ్‌టెక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. మీరు ఏ డిస్ని రాణి? మీరు ఎలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నారు? అనుకుంటూ పలు పాపులర్ సోషల్ క్విజ్‌లను నేమ్‌టెక్ట్స్ అనే యాప్ నిర్వహిస్తూ ఉంటుంది. ఫేస్‌బుల్ చక్కర్లు కొడుతున్న ఈ యాప్‌ను, ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కసారి ఓపెన్ చేసిన క్విజ్ ఆడి ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమట. ఈ నేమ్‌టెక్ట్స్ యాప్ 12 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటా బట్టబయలు చేసిందని ఓ రీసెర్చర్ వెల్లడించారు. క్విజ్‌ల ద్వారా ఫేస్బుక్ యూజర్ పేరు, ప్రాంతం, పుట్టిన తేదీ, వయసు, ఫేస్బుక్ ఐడీ, ప్రొపైల్ ఫోటోలు, భాష, స్నేహితుల జాబితా వంటి వ్యక్తిగత వివరాలను ఇది సేకరిస్తుందని తెలిసింది. ఈ విషయాన్ని సెక్యురిటీ రీసెర్చర్ ఇంటి దే స్యూకెలైర్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. ఇలా గత కొన్నేళ్లుగా మిలియన్ల కొద్దీ యూజర్ల డేటాను నేమ్‌టెక్ట్స్ సేకరించిందని తెలిపారు. ఫేస్బుక్ బగ్ బౌంటీ ప్రొగ్రామ్లోపాల్గొనాలని నిర్ణయించుకున్న ఈ రీసెర్చర్, క్విజ్‌లపై పరిశోధన చేపట్టారు. ఆ సమయంలో నేమ్‌టెక్ట్స్.కామ్ గ్లోబల్‌గా 12 కోట్ల మంది యూజర్ల డేటాను బహిర్గతం చేస్తుందని తెలుసుకున్నారు. ఫేస్బుక్ యూజర్ల డేటాను దాని పేజీలో డిస్ప్లే చేస్తుందని కనుగొన్నారు. అంతేకాక, ప్రమాదశాత్తు ఈ డేటా అన్ని థర్డ్ పార్టీలకు అందుబాటులో ఉందన్నారు. ఒకవేళ ఈ యాప్‌ను యూజర్లు డిలీట్ చేసినా కూడా యూజర్ల గుర్తింపునూ ఇది బహిర్గతం చేస్తుందని వెల్లడించారు. దీని బారి నుంచి బయటపడటానికి, యూజర్ తమ డివైజ్‌పై ఉన్న కుక్కీలను మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సి ఉంటుందని రీసెర్చర్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఫేస్బుక్లో ఈ లోపాన్ని కనుగొన్న రీసెర్చర్, ఫేస్బుక్ డేటా అబ్యూజ్ ప్రొగ్రామ్‌కు రిపోర్టు చేశారు. ఈ లోపాన్ని పరిష్కరించాలని నేమ్టెక్ట్స్కు కూడా లేఖ రాశారు. ఫేస్బుక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. నేమ్‌టెక్ట్స్.కామ్‌తో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి పనిచేశామని, జూన్‌లోనే ఇది పరిష్కారమైందని ఫేస్బుక్ ప్రొడక్ట్ పార్టనర్షిప్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్ ఆర్చిబాంగ్ తెలిపారు. -
చిక్కుల్లో ఫేస్బుక్!
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై మరో ఆరోపణ వచ్చింది. వినియోగదారుల వివరాలు పొందేందుకు కొన్ని సంస్థలకు ఫేస్బుక్ ప్రత్యేక అనుమతి ఇచ్చినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. యూజర్ల ఫోన్ నంబర్లు, ఎఫ్బీ ఖాతాలో ఫ్రెండ్స్ తదితర వివరాలను అందించేందుకు సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని, వీటిని ‘వైట్లిస్ట్స్’ అంటారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, నిస్సాన్ మోటార్ తదితర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. తాము అతికొద్దిమంది భాగస్వాములకు డేటా పొందేందుకు అనుమతినిచ్చినట్టు ఫేస్బుక్ వెల్లడించింది. -
1.4 కోట్ల మంది సమాచారం బహిర్గతం
న్యూయార్క్: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ సాంకేతిక సమస్య కారణంగా యూజర్లు తమ స్నేహితులతో పంచుకున్న ఫొటోలు, పోస్ట్‌లు బహిర్గతమయ్యాయని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఎగన్ తెలిపారు. మే 18 నుంచి 27 వరకూ ఈ సమస్య కారణంగా 1.4 కోట్లమంది యూజర్లు ప్రభావితమయ్యారని చెప్పారు. ఫేస్బుక్లో తమ పోస్ట్‌లు, ఫొటోలను స్నేహితులు మాత్రమే చూసేలా యూజర్లు పెట్టుకున్న ‘ఫ్రెండ్స్ ఓన్లీ’ సెట్టింగ్ తాజా సాంకేతిక సమస్యతో ఆటోమేటిక్‌గా ‘పబ్లిక్’ సెట్టింగ్‌కు మారిపోయిందన్నారు. ఈ ఘటనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ చేపట్టే వీలుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
లండన్: ఫేస్బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే కేంబ్రిడ్జ్ అనలిటికాను మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిన కేంబ్రిడ్జ్ అనలిటికా ఆ సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు.. భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని సేకరించి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూడటంతో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలను తక్షణం ఆపేస్తున్నామని, దివాళా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కేంబ్రిడ్జ్ అనలిటికా ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే తాము ఎటువంటి తప్పూ చేయలేదని, మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల వల్ల తమకు క్లయింట్లు లేకుండా పోయారని, దీనికితోడు లీగల్ ఫీజుల భారం పెరిగి పోవడంతో మూసివేత నిర్ణయం తప్పలేదని సీఏ యాజమాన్యం స్పష్టం చేసింది. -
కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
న్యూఢిల్లీ : ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాలు మూతపడినట్లు ఆ సంస్థల యాజమాన్యం వెల్లడించింది. సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని, మీడియా ప్రతికూల ప్రచారం వల్ల ఖాతాదారులు లేకుండా పోయారని పేర్కొంది. సంస్థ మూసివేయడానికి కావాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మేనేజర్లు పేర్కొన్నారు. సంస్థపై ఆరోపణలు ఉన్నప్పటికి ఉద్యోగులు విలువలతో, న్యాయంగా పని చేశారని యాజమాన్యం పేర్కొంది. డేటా లీక్ వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జి అనాలిటికా తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఆ సమాచారాన్ని వాడినట్టు వెల్లడి కావడం, అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు వెలుగు చూడటంతో వివాదాల్లో చిక్కుకుంది. భారత్‌లో కూడా ఫేస్బుక్ డేటా లీకేజీపై రాజకీయ దుమారం రేగింది. 2014లో బీజేపీ 272 లోక్‌సభ సీట్లు గెలువడానికి డేటా లీకేజీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా బీజేపీ కూడా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేసింది. ఫేస్బుక్ డేటా లీకేజీపై వివరణ ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం కేంబ్రిడ్జ్ అనలిటికా ఆదేశించింది. కానీ సంస్థ మాత్రం సంతృప్తికరమైన వివరణను ఇవ్వలేదు. -
భారత్‌లోనూ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’లు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అంతకు మించిన సమాచార కుంభకోణాలు మన దేశంలోనే జరుగుతున్న విషయం ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో తాజాగా తేటతెల్లమైంది. ఆన్లైన్ వ్యవస్థ, సమాచారంపై దేశంలో సరైన నియంత్రణ, చట్టాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజల ఓట్లను ప్రభావితం చేయడం కోసం భారత్‌లోనూ వివిధ ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినప్పుడు, షాపింగ్ యాప్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డులు వాడినప్పుడు, బ్యాంకులు, టెలికం, డీటీహెచ్ సేవలను ఉపయోగించుకున్నప్పుడు.. ఇలా ప్రతీ సందర్భంలోనూ కోట్లాది మంది ప్రజల అమూల్యమైన సమాచారాన్ని అవి తస్కరిస్తున్నాయి. తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకుని వినియోగదారుల అభిరుచులను బట్టి వారి ఓట్లను ప్రభావితం చేసేలా వివిధ రాజకీయ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌తోపాటు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేస్తాం.. ఢిల్లీకి చెందిన ‘జనాధార్’ అనే కన్సల్టెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు మనీశ్ మాట్లాడుతూ అనేక మార్గాల్లో సేకరించిన ఓటర్ల జాబితా తమ వద్ద ఉందనీ, ఈ నెలలోనే జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తామని ఇండియా టుడే విలేకరికి హామీనిచ్చాడు. రెండోసారి విలేకరి మనీశ్‌ను కలిసినప్పటికి దక్షిణ బెంగళూరు నియోజకవర్గానికి చెందిన రెండు లక్షల ఓటర్ల వివరాలను అతను సేకరించి పెట్టాడు. ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నంబర్, పాన్, ఆధార్ నంబర్, ఆర్థిక పరమైన వివరాలు కూడా ఉన్నాయి.‘ఎవరైనా ఉద్యోగం కోసం జాబ్ పోర్టళ్లలో రెజ్యూమె పెట్టినా, క్రెడిట్ కార్డు వాడినా, లాయల్టీ ప్రోగ్రాంలలో సభ్యత్వం తీసుకున్నా వారికి సంబంధించిన సమాచారం నాకు అందుతుంది. వారు వారి సమాచారాన్ని ఎక్కడ ఇచ్చినా అది నాకు చేరుతుంది’ అని మనీశ్ చెప్పుకొచ్చాడు. అయితే బెంగళూరు నగరంలోని ఒక నియోజకవర్గ ఓటర్ల సమాచారాన్ని ఇచ్చేందుకే అతను ఏకంగా 1.2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. టెలికం అధికారులతో లాలూచీ.. టెలికాం కంపెనీల అధికారులతో కుమ్మక్కయ్యి ఒక్కో ప్రాంతంలోని టవర్ల నుంచి ప్రతి వినియోగదారుడి సమాచారాన్ని తాము సేకరిస్తున్నామని పోల్స్టర్ అనే మరో సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే ఓటు హక్కుపై అవగాహన కల్పించే నెపంతో తమ సిబ్బంది వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఈ విధంగా వచ్చిన సమాచారంతో కనీసం 5 నుంచి 6 శాతం ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వివరించారు. ఢిల్లీకి చెందిన మావరిక్ డిజిటల్, ముంబై కేంద్రంగా పనిచేసే క్రోనో డిజిటల్ తదితర కంపెనీలు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండియా టుడే పరిశీలనలో బయటపడింది. -
ఓటర్లను ‘ఫేస్బుక్’ చేద్దాం!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజీతో ప్రకంపనలు సృష్టించిన కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం రూ.2.5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. ఫేస్బుక్ డేటా ఉల్లంఘన కుంభకోణం బహిర్గతం కావడానికి కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు సీఏ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సీఏ ప్రతిపాదించినట్లుగా భావిస్తున్న 49 పేజీల పత్రంలో ఈ విషయాలున్నాయి. ప్రస్తుతం ఈ పత్రం సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ డేటాను వినియోగించి ఓటర్లను ప్రభావితం చేద్దామని సీఏ అందులో ప్రతిపాదించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సీఏ సేవలను తాము ఉపయోగించుకోలేదని వివరణ ఇచ్చింది. ‘కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఇలాంటి ప్రతిపాదనలు రోజూ ఎన్నో వస్తాయి. ప్రచారానికి సంబంధించి సీఏతో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదరలేదు’ అని ఆ పార్టీ డేటా అనలిటిక్స్ ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఇటీవల కుంభకోణం నేపథ్యంలో వేటుకు గురైన సీఏ మాజీ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ ఈ ప్రతిపాదనను 2017 ఆగస్టులో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సంధి కాలంలో ఉన్న సమయంలో ఈ ఆఫర్ ఇస్తున్నామని అందులో పేర్కొంది. -
అకౌంట్ లేకున్నా డేటా సేకరిస్తాం
-
ఎన్నికలపై డేటా లీకేజీ ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: ఆధార్ సమాచార లీకేజీ ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలదని, ప్రజాస్వామ్య అస్థిత్వానికే తీవ్ర ముప్పు కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారం ఉల్లంఘనకు గురవుతోందన్న భయాందోళనలు సహేతుకమేనని పేర్కొంది. సమాచార భద్రతకు పటిష్టమైన చట్టం లేని పక్షంలో అలాంటి ఆందోళనలను తేలిగ్గా తీసుకోలేమంది. ఆధార్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ మంగళవారం కొనసాగింది. ఆధార్ ధ్రువీకరణ చేపడుతున్న సంస్థల నుంచి వ్యక్తుల సమాచారం బయటకు పొక్కే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘డేటా అనలిటికా లీక్ చేసిన సమాచారంతో ఇతర దేశాల ఎన్నికలు ప్రభావితమయ్యాయి. మనం నివసిస్తున్న ప్రపంచంలో ఇలాంటి సమస్యలు సర్వ సాధారణమయ్యాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫేస్బుక్, గూగుల్ మాదిరిగా వినియోగదారుల సమాచారాన్ని విశ్లేషించే అల్గారిథమ్ యూఐడీఏఐ వద్ద లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తరఫున లాయర్ రాకేశ్ ద్వివేది తెలిపారు. ఆధార్ ధ్రువీకరణ చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అనుమతిస్తున్నారని కోర్టు అడిగిన ప్రశ్నకు ద్వివేది బదులిస్తూ.. ‘టీ , పాన్ అమ్మకందారుల వంటి చిన్నాచితకా వ్యాపారులు ఆధార్ వివరాలు కోరలేరు. ఆధార్ ధ్రువీకరణను కోరే సంస్థల ఉద్దేశాలు, కార్యకాలపాల పట్ల యూఐడీఏఐ సంతృప్తి చెందితేనే వాటికి ఆ అవకాశం దక్కుతుంది’ అని అన్నారు. చట్టంలో పౌరుల సమాచార భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, డేటా చౌర్యానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు ప్రతిపాదించారని తెలిపారు. బయోమెట్రిక్ వివరాల్లోకి ఇతరులు చొరబడేందుకు అవకాశాల్లేవని, ఆధార్ తక్షణ ధ్రువీకరణకే వాటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అసంపూర్తిగా ముగిసిన ఈ విచారణ బుధవారం కొనసాగనుంది. -
విచారణలో ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్: కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో అమెరికా సెనెట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీల ముందు తొలిరోజు విచారణకు హాజరైన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను సెనెటర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫేస్ బుక్‌లో ఖాతాదారుల వివరాలు, సమాచార గోప్యతపై 44 మంది సభ్యులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. రాత్రి మీరు ఏ హోటల్లో బస చేశారో చెప్పగలరా? అని సెనెటర్ డిక్ డర్బిన్ అడిగిన ప్రశ్నకు జవాబివ్వడానికి జుకర్‌బర్గ్ తటపటాయించారు. దీం తో వ్యక్తిగత గోప్యత అలాంటిదేనంటూ ఆయ న జుకర్‌బర్గ్‌కు చురకలంటించారు. ఫేస్బుక్ భవిష్యత్‌లోనూ స్వీయ నియంత్రణను పాటిస్తుందన్న నమ్మకం తమకు లేదని మెజారిటీ సెనెటర్లు అభిప్రాయపడ్డారు. కేంబ్రిడ్జి అనలిటికా యూజర్ల వివరాలను డిలీట్ చేసిందని నమ్మడం పెద్ద తప్పిదమేనని జుకర్‌బర్గ్ అంగీకరించారు. వినియోగదారుల సంభాషణలపై తాము నిఘా పెట్టబోమని స్పష్టం చేశారు. కేంబ్రిడ్జి అనలిటికా తనతో పాటు కోట్లాది మంది ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాల్ని దొంగలించి అమ్ముకుందని జుకర్‌బర్గ్ తెలిపారు. లీకేజీపై ఫేస్బుక్ స్పందిస్తూ.. ‘‘మీ స్నేహితుడు ఒకరు ‘దిస్ ఈజ్ మై డిజిటల్ లైఫ్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో మీ సమాచారం ఈ యాప్ ద్వారా సీఏకు చేరింది’’ ఖాతాదారులకు అలర్ట్స్ పంపింది. ఫేస్బుక్లో ఇకపై ఇవి చేయలేం ఫేస్బుక్లో ఫోన్ నెంబర్లు, ఈ–మెయిల్ ఐడీల ద్వారా ఇతర వ్యక్తుల్ని ఇకపై మనం సెర్చ్ చేయలేమని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇతరుల పోస్టులను షేర్ చేయడానికి కొన్ని పరిమితుల్ని విధించామన్నారు. యాప్ డెవలపర్స్ ఇక ఫేస్బుక్లో డేటాను వాడుకోలేరన్నారు. ఎఫ్బీఐతో కలసి పనిచేస్తున్నాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు జరుపుతున్న ఎఫ్బీఐతో ఫేస్బుక్ కలసి పనిచేస్తోందని జుకర్‌బర్గ్ తెలిపారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ తనను వ్యక్తిగతంగా విచారించలేదన్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యన్ హ్యాకర్లు మరిన్ని సైబర్‌దాడులు చేస్తారనుకున్నామనీ, ఫేస్‌బుక్‌ను దుర్వినియోగం చేస్తారని ఊహించలేకపోయామని సెనెటర్లకు వివరించారు. ఇకపై కొత్తగా ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని, లొకేషన్‌ను ఇవ్వాల్సిందిగా యూజర్లను కోరతామనీ, దీనివల్ల రష్యాలో ఉండి అమెరికాలో ఉంటున్నామని చెప్పడం కుదరదని పేర్కొన్నారు. భారత్ ఎన్నికల సమగ్రతని కాపాడతాం అమెరికా సహా భారత్, బ్రెజిల్, పాకిస్తాన్, మెక్సికో దేశాల్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల సమగ్రతను కాపాడటానికి కృషి చేస్తామని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా 13.3 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడటంతో పాటు 20,000 మంది సిబ్బందిని మోహరిస్తామన్నారు. ముందే ప్రశ్నలు తెలుసా ? అమెరికా సెనెటర్లు అడిగిన ప్రశ్నలు జుకర్‌బర్గ్‌కు ముందే తెలుసునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ ఎదుర్కోవడానికి ముందు జుకర్‌బర్గ్ లాబీయింగ్‌లో భాగంగా పలువురు సెనెటర్లను కలుసుకున్నారు. ఆ సమయంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, డేటా లీకేజీపై వారి ఆందోళన చూసిన జుకర్‌బర్గ్ ప్రశ్నల విషయంలో ఒక అంచనాకు వచ్చి ఉంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా రు. అయితే సెనెట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీలు గత పదేళ్లలో ఫేస్బుక్ నుంచి 6.4 లక్షల డాలర్ల విరాళాలు అందుకున్నాయి. భారతీయుల వివరాలు సేకరించలేదు: సీఏ ఫేస్బుక్ ఆధారంగా భారతీయులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించలేదని కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) స్పష్టం చేసింది. సమాచార దుర్వినియోగంపై ఏప్రిల్ 7న కేంద్రం రాసిన లేఖకు సీఏ ఈ మేరకు జవాబిచ్చింది. డేటా లీకేజీ ఉదంతంలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు దుర్వినియోగమయ్యాయని ఫేస్బుక్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్బుక్, సీఏ సమాధానాల్లో వ్యత్యాసమున్న నేపథ్యంలో మరిన్ని విషయాల్లో ఈ రెండు సంస్థల నుంచి స్పష్టతకోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
డేటా లీక్‌పై ప్రధాని : భారత్‌లోనే సర్వర్లకు సిఫార్సు
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్, సోషల్ మీడియా దిగ్గజాలచే యూజర్ల సమాచారం బహిర్గతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించాలని, దేశంలోనే ఆయా సర్వర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించినట్టు అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థలు యూజర్ల సమాచారన్ని బహిర్గతం చేసిన అంశం ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజాల సర్వర్లు భారత్‌లోనే ఉండాలని ప్రధాని సూచించారని సమాచారం. దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం సమగ్ర సమీక్ష చేపట్టిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వర్లలో అత్యధికంగా యూజర్ల సమాచారం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో నమోదవుతోంది. ఈ సర్వర్లలో నిక్షిప్తమైన సమాచారం పొందాలంటే అమెరికన్ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి వ్యవహరించాల్సిమ ఉంటుంది. యూజర్ల సమాచారాన్ని స్ధానికంగానే భద్రపరచాలని, దీనిపై గట్టి నియంత్రణ ఉండాలని ప్రధాని చేసిన సూచనను ఐటీ మంత్రిత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. సమాచార రక్షణకు ప్రభుత్వం ఇతర మార్గాలనూ పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
పరీక్షకు ప్రిపేరవుతున్న జుకర్‌బర్గ్
ఒక పరీక్షకు ముందు విద్యార్థి ఎలా ప్రిపేర్ అవుతాడు ? భవిష్యత్‌ను నిర్ణయించే ఎంట్రన్స్ టెస్ట్ రాసేముందు ఎంత ఒత్తిడికి లోనవుతాడు? ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పరిస్థితి కూడా అలాంటి విద్యార్థిలాగే ఉంది. ఫేస్బుక్ డేటా లీకేజీ కేసుకు సంబంధించి జుకర్‌బర్గ్ ఈ నెల 10, 11 తేదీలలో అమెరికన్ సెనేట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల నుంచి చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయన్న అంచనాల నేపథ్యంలో విచారణను ఎలా ఫేస్ చేయాలా అని జుకర్‌బర్గ్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిపుణుల నుంచి సూచనలు, సలహాలు.. గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలా అన్న సమాలోచనలు, ఒత్తిడి నుంచి బయటపడడానికి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. జుకర్‌బర్గ్‌కి సహజసిద్ధంగానే అద్భుతమైన వాదనాపటిమ ఉంది కానీ పదిమందిలో మాట్లాడాలంటే ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఫేస్‌బుక్‌కి సంబంధించిన ఏ ప్రకటనలైనా ఆయనకు నమ్మకస్తులైన సహాయకులే చేస్తారు. అయితే ఇప్పుడు అమెరికా ప్రజాప్రతినిధులు చేసే విచారణ అంతా మీడియాలో లైవ్ కవరేజ్ ఇవ్వనున్నారు. దీంతో జుకర్‌బర్గ్ పరిస్థితి పరీక్షని ఎదుర్కొనే విద్యార్థిలా ఉందని అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి, ఒత్తిడిని అధిగమించడానికి జుకర్‌బర్గ్ గత కొద్ది రోజులుగా 500మందికి పైగా కమ్యూనికేషన్ నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ దగ్గర ప్రత్యేక సహాయకుడిగా పనిచేసిన రెజినాల్డ్ జె బ్రౌన్ స్వయంగా జుకర్‌బర్గ్‌కి కొన్ని టిప్స్ చెబుతున్నారు. సెనేటర్లు అడిగే ప్రశ్నల్ని ఎలా ఎదుర్కోవాలో తన అనుభవాన్ని రంగరించి మరీ వివరిస్తున్నారు. ఫేస్బుక్ వినియోగదారుల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికా అనే సంస్థ లీక్ చేసి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు దోహదం చేయడంతో పాటు, భారత్ సహా వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు డేటాను అందించిందన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ డేటా లీకేజీ నిజమేనని, తమ వైపు నుంచి తప్పు జరిగిదంటూ జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఫేస్బుక్లో డేటా భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు కూడా చేపట్టారు. అయితే ఫేస్బుక్ వినియోగదారుల్లో 8.7 కోట్ల మంది డేటా ఇప్పటికే లీక్ అయిందన్న వార్తలు ఆందోళనను పెంచుతున్నాయి. ఫేస్ బుక్‌లో తప్పుడు వార్తలు, ఫేక్ అకౌంట్లు కూడా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరుకానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే ప్రశ్నలు ఇవే ? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడం ద్వారా రష్యన్ ట్రాల్స్ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఫేస్బుక్ స్పందన, వ్యవహారశైలి సరిగా లేదంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారి నుంచి జుకర్‌బర్గ్‌ను ఇరుకున పెట్టే ప్రశ్నలే ఎదురవుతాయనే ప్రచారం జరుగుతోంది. జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే ప్రశ్నావళి ఎలా ఉంటుందో రకరకాల అంచనాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1.తమ డేటాకు రక్షణ ఉంటుందని వినియోగదారులు ఎందుకు ఫేస్‌బుక్‌ని నమ్మాలి ? 2.రష్యా చేతిలో ఎంతమంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా ఉంది ? 3. ఫేస్‌బుక్‌పై కఠినమైన నియంత్రణ ఎందుకు విధించకూడదు ? 4. వినియోగదారుల డేటా దుర్వినియోగం అవుతుందని తెలిసి కూడా ఫేస్బుక్ ఎందుకు సత్వర చర్యలు తీసుకోలేకపోయింది ? 5.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్ని రకాల తప్పుడు ట్రాల్స్ ఫేస్బుక్లో షేర్ అయ్యాయి ? 6. సంస్థ లాభాల కంటే ఫేస్బుక్ వినియోగదారుల ప్రయోజనాలే ∙ముఖ్యమని మీరు అంగీకరించగలరా? 7. ఫేస్‌బుక్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ఎందుకు వినియోగదారుల్ని గట్టిగా హెచ్చరించలేకపోయారు ? 8. ఫేక్ వార్తల్ని అరికడుతున్నామంటూ తీసుకుంటున్న చర్యలు సెన్సార్షిప్ను అడ్డుకోవడానికి సాకులేనా ? 9. ఫేస్‌బుక్‌లాంటి అతి పెద్ద సంస్థని ఒక వ్యక్తి ఎలా నియంత్రించగలడు ? (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘కేంబ్రిడ్జి అనలిటికా’లు ఇంకెన్నో?
న్యూయార్క్/వాషింగ్టన్: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా మాదిరిగా మరికొన్ని సంస్థలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని ఫేస్బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పుడే నిర్ధారించలేమనీ, వివరాలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఎన్నికల కోసం వాడుకోవడం తెల్సిందే. ఫేస్బుక్లో రాజకీయపరమైన ప్రకటనలు ఇచ్చేందుకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ప్రకటన ఇస్తున్న వారి చిరునామా సహా మిగిలిన గుర్తింపు వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రకటనలు తీసుకుంటామని ఫేస్బుక్ ప్రకటించింది. ఫేస్బుక్లో ‘అన్‌సెండ్’ ఫీచర్ ఫేస్బుక్లో ఎవరికైనా మెసేజ్ పంపితే దానిని డిలీట్ లేదా మార్పు చేసే వీల్లేదు. వాట్సాప్‌లో ఇలాంటి అవకాశముంది. ఇకపై ఇతరులకు పంపిన సందేశాలను డిలీట్ చేసేలా ‘అన్‌సెండ్’ ఫీచర్‌ను ఫేస్బుక్ ప్రవేశపెట్టబోతున్నట్లు సాంకేతిక వార్తల వెబ్సైట్ టెక్‌క్రంచ్ తెలిపింది. ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేంతవరకూ జుకర్‌బర్గ్ గతంలో కస్టమర్లకు పంపిన మెసేజ్‌లను సంస్థ డిలీట్ చేయదు. -
డేటా లీక్‌లపై స్పందించిన వాట్సాప్
వాషింగ్టన్ : ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్‌లను ట్రాక్ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్ కొట్టిపారేసింది. చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే కలెక్ట్ చేశామని, కానీ ప్రతి మెసేజ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్గా వాట్సాప్ పేర్కొంది. భారత్‌లో 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగి ఉన్న ఈ వాట్సాప్ సెక్యూర్ కాదంటూ పలువురు విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేశారు. యూజర్ ఒప్పందాలపై కొన్ని నియమాలపై ప్రశ్నలు సంధించారు. అయితే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపే మెసేజ్‌లను తాము ట్రాక్ చేయడం లేదని, చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే తాము సేకరించామని, కానీ ప్రతి మెసేజ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్గా వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. యూజర్ల గోప్యత, భద్రత తమకెంతో ముఖ్యమని చెప్పారు. ఇటీవల ఫేస్బుక్ డేటా, కేంబ్రిడ్జ్ అనలిటికాకు లీక్ అయ్యిందనే ఆరోపణలతో వాట్సాప్ యూజర్ల డేటా లీక్‌పై కూడా పలు రిపోర్టులు వచ్చాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ అనంతరం విమర్శకుల నుంచి వాట్సాప్ కూడా పలు విమర్శలు పొందింది. దీనికి గల ప్రధాన కారణం ఈ పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌పామ్‌ను 2014లో ఫేస్బుక్ సొంతం చేసుకోవడమే. ఫేస్బుక్లో పోస్టు చేసే పోస్టింగ్స్ కంటే కూడా వాట్సాప్‌లోని గ్రూప్ చాట్ ఫీచరే యూజర్లకు అతిపెద్ద ముప్పు అని టాప్ అమెరికన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రిన్యూర్ వివేక్ వాద్వా కూడా వాదిస్తున్నారు. గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా వాట్సాప్ ఫోన్ నెంబర్లు బయటికి వస్తాయన్నారు. -
ఫేస్‘బుక్’!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్బుక్ డేటా లీక్ ఘటనలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు ఉండొచ్చని ఫేస్బుక్ గురువారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొదట ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు భావించినప్పటికీ.. తాజా వివరాల ప్రకారం ఇది 8.7 కోట్లు ఉండొచ్చని ఫేస్బుక్ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారుల సమాచారం మాత్రమే లీకైందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అలెగ్జాండర్ కోగాన్ ఈ యాప్‌ను రూపొందించగా.. దీన్నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సమాచారాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ‘భారత్‌లో మొత్తం 20 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులున్నారు. ఇందులో కేవలం 335 మంది మాత్రమే నేరుగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటంతో వీరిపై ప్రత్యక్ష ప్రభావం ఉంది. 5,62,120 మందిపై పరోక్షంగా దీని ప్రభావం ఉండొచ్చు’ అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ఈ డేటా సేకరణ పూర్తిగా అనధికారికంగా జరిగిందని.. ఫేస్బుక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు వివరాలు తీసుకునేందుకు ఎప్పుడూ అనుమతివ్వలేదన్నారు. డేటా లీక్‌పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫేస్బుక్ సమాధానం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. భారీ తప్పిదమే: ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా దుర్వినియోగం.. భారీ తప్పిదమని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత పొరపాటేనని.. ఇకపై తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. డేటా దుర్వినియోగం కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది అమెరికా వినియోగదారులే. -
భారత్‌లోనూ ఎస్సీఎల్ కదలికలు...!
అయిదు ఖండాలు...32 దేశాలు..వందకు పైగా ఎన్నికల ప్రచారాలు.. ఇదీ డేటా లీక్ వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జి అనాలిటికా (సీఏ)కు మాతృసంస్థగా ఉన్న స్ట్రేటజిక్ కమ్యు నికేషన్ లాబరేటరీస్ (ఎస్సీఎల్) గ్రూపు ట్రాక్‌రికార్డ్. ఎన్నికలకు సంబంధించి వివిధ దేశాల్లో తాము నిర్వహించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ సంస్థే ప్రకటించుకున్న విషయమిది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార వ్యూహాలకు ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని వారికి తెలియకుండా ఉపయోగించినట్టు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్‌లో నిర్వహించిన పాత్రపై ఇప్పటివరకు సీఏపైనే ఫోకసంతా కేంద్రీకృతమైంది. అయితే 2013 నుంచి ఎస్సీఎల్ కంపెనీ డాక్యుమెంట్లు విశ్లేషించాక ఓ ఆన్లైన్ ఇంగ్లిష్ వెబ్‌పత్రిక భారత్‌తో సహా వివిధ దేశాల్లో ఎన్నికల సంబంధిత వ్యవహారాల్లో ఈ సంస్థ ప్రమేయాన్ని వెల్లడించింది. ఐరోపా, ఉత్తర,దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల వ్యాప్తంగా 32 దేశాల్లో ఎస్సీఎల్ పనిచేసినట్టు తెలిపింది. ఆయా దేశాల్లో క్లయింట్లుగా ఉన్న రాజకీయనాయకులు, పార్టీల అవసరాలను బట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సర్వీస్‌ను ఈ సంస్థ అందజేసింది. భారత్‌లో.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే భారత్‌లో 300 మంది పర్మినెంట్ సిబ్బంది, 1,400 కన్సల్టెంట్ స్టాఫ్‌ను ఎస్సీఎల్ నియమించినట్టు ఆ సంస్థ డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. తమది అత్యంత అధునాతన రాజకీయ పరిశోధన, డేటా కేంద్రంగా అభివర్ణిస్తూ ఎన్నికలకు పూర్వమే ప్రధాన రాజకీయపార్టీల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది.ఈ ప్రతిపాదిత ‘ఆపరేషన్ సెంటర్’లో సీనియర్ లాయర్లు, మీడియా పర్యవేక్షక వృత్తినిపుణులు, పరిశోధనాధారిత సమాచారాన్నిచ్చే నిపుణులు, పార్టీ కార్యకర్తలకు సలహాలు, సూచనలిచ్చే బృందాలు,సిబ్బందితో సేవలు అందించనున్నట్టు తెలిపింది. తమ క్లయింట్లు మేనేజ్ చేసుకునే విధంగా యాప్ తయారుచేసి ఇస్తామని, దాని ద్వారా ఆయా సర్వీసులు పొందవచ్చునని సూచించింది. దీని ద్వారా ప్రచారవ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేసి సంబంధిత పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగేలా దోహదపడేలా ఏర్పాట్లు చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎస్సీఎల్ లేదా సీఏ సంస్థల సేవలను దేశంలోని ఏ రాజకీయపార్టీ అయినా ప్రత్యక్షంగా ఉపయోగించుకుందా లేదా అన్నది ఇంకా స్పష్టంకాలేదు. ఇలాంటి సెంటర్లనే బ్రిటన్, థాయ్‌లాండ్, కెన్యా, ఇండోనేషియాలలో నెలకొల్పినట్టు ఎస్సీఎల్ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. దేశంలో ఎస్సీఎల్ అడుగు జాడలు... భారత్‌లో ఒకే ఒక ప్రాజెక్టు గురించి తన వెబ్సైట్లో సీఏ సంస్థ వెల్లడించింది. అయితే మనదేశంలో హైదరాబాద్ మొదలుకుని బెంగళూరు, కోల్‌కతా, పట్నా, పుణె, ఇండోర్, అహ్మదాబాద్, కటక్, ఘజియాబాద్, గువహటి నగరాల్లో ఎస్సీఎల్ కార్యాలయాలున్నట్టు వెల్లడైంది. 2003 నుంచి ఈ గ్రూపు కనీసం 8 ‘అసైన్మెంట్ల’పె పనిచేసినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎస్సీఎల్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనేక సర్వేలు నిర్వహించినట్లు ఆ సంస్థ డాక్యుమెంట్‌ను బట్టి తెలుస్తోంది. 2012లో ఉత్తరప్రదేశ్‌లో ఓ జాతీయపార్టీ కోసం కులాలవారీగా జనాభా వివరాల సేకరణ 2011లో యూపీ వ్యాప్తంగా కుటుంబాల (హోస్హోల్డ్స్) వారీగా 20 కోట్ల మంది ఓటర్ల కులాలను బట్టి ఓటర్ల గుర్తింపు 2010 బిహార్ ఎన్నికల సందర్భంగా జేడీ(యూ) పార్టీ కోసం ఎన్నికల పరిశోధన, వ్యూహాల రూపకల్పన 2009 లోక్‌సభ ఎన్నికలపుడు పలువురు అభ్యర్థుల ప్రచార నిర్వహణ 2007లో యూపీలో ఓ జాతీయపార్టీ కోసం పూర్తిస్థాయి రాజకీయ సర్వే నిర్వహణ 2007లో కేరళ, బెంగాల్, అసోం, బిహార్, జార్ఘండ్, యూపీలలో ఎన్నికల ప్రచారానికి పరిశోధన 2003 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఊగిసలాటలో ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ఓ జాతీయ పార్టీ కోసం అధ్యయనం, ఓపీనియన్ పోల్ నిర్వహణ 2003 రాజస్థాన్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీ సంస్థాగత బలం, ఆ రాష్ట్రంలో ఓటు వేసేవారి ప్రవృత్తి, అలవాట్లు, రాజకీయంగా చురుకుగా ఉన్న వ్యక్తుల ప్రవృత్తి పై అధ్యయనం అయితే ఎస్సీఎల్కు గతంలో భాగస్వామిగా ఉన్న అవ్నీష్రాయ్ మాత్రం ఈ ప్రాజెక్టులు తానే చేపట్టినట్టు, ఈ పరిశోధనపై ఎస్సీఎల్ ఆమోదముద్ర వేసిందని చెబుతున్నారు. ఇవీ సేవలూ... భారత్‌లో రిసెర్చి, డేటా హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయపార్టీలకు వివిధరకాల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎస్సీఎల్ 2014 ఎన్నికల సందర్భంగా పేర్కొంది. రాజకీయపార్టీల మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించి ఓటింగ్ సందర్భంగా ప్రభావితం చేసేందుకు వీలుగా రాజకీయపార్టీలకు మద్దతుగా పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడం, ఓటర్ల సమీకరణ, న్యాయపరమైన మద్దతు, ఎన్నికల ప్రణాళిక, నిర్వహణ, మీడియా పర్యవేక్షణ, పార్టీ కమ్యూనికేషన్ల వ్యవస్థ పటిష్టం చేయడం... రాజకీయ పరిశోధన సర్వీసులు కులాలపై పరిశోధన, ఓటర్ల ప్రవృత్తిపరంగా పోలింగ్, పార్టీ ఆడిట్ నిర్వహణ,ప్రభుత్వ కార్యక్రమాలు, సమస్యల విశ్లేషణ, అభ్యర్థుల ఎంపికపై పరిశోధన, చారిత్రకాంశాల విశ్లేషణ, ఎన్నికల్లో విజయంపై ముందస్తు అంచనాలు, జోస్యం వంటివి... –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఫేస్‌బుక్‌కు షాక్ ఇచ్చిన ప్లేబాయ్!
డాటా లీక్ కుంభకోణం నేపథ్యంలో ప్రముఖ మ్యాగజీన్ ప్లేబాయ్ ఫేస్‌బుక్‌కు షాక్ ఇచ్చింది. ఫేస్బుక్ నుంచి తన అధికారిక పేజీని డియాక్టివేట్ చేసింది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం లీక్ చేసి.. రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న కథనాలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కథనాల నేపథ్యంలో ఇప్పటికే టెల్సా, స్పెస్ ఎక్స్ సంస్థలు తమ అధికారిక పేజీలను ఫేస్బుక్ నుంచి తొలగించాయి. ప్లేబాయ్ మ్యాగజీన్ వ్యవస్థాపకుడి తనయుడు, చీఫ్ క్రియేటివ్ అధికారి కూపర్ హెఫ్నర్ తాజాగా తమ అధికారిక ఫేస్బుక్ పేజీని తొలగించినట్టు ట్వీట్ చేశారు. ఫేస్బుక్ సమాచార మార్గదర్శకాలు, కార్పొరేట్ పాలసీలు ప్లేబాయ్ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని, లైంగిక సమాచార అణచివేతకు వేదికగా ఫేస్బుక్ మారిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 5 కోట్లమంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం లీక్ అయిందన్న వార్తల నేపథ్యంలో తమ పేజీని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. దాదాపు 25 లక్షలమంది వినియోగదారులు ఫేస్‌బుక్‌లోని వివిధ ప్లేబాయ్ పేజీలను వీక్షిస్తారని, వీరి సమాచారాన్ని బయటపెట్టడం ఇష్టం లేక తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్లేబాయ్ వ్యక్తిగత స్వేచ్ఛను, శృంగార ఆస్వాదనను గౌరవిస్తుందని, ఫేస్బుక్ విధానం వినియోగదారుల అధిక సమాచారాన్ని బయటపెట్టేలా ఉందని పేర్కొంది. అయితే, ప్లేబాయ్ ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌లో కొనసాగనుంది. -
ఫేస్బుక్ డాటా లీక్.. రంగంలోకి కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డాటా లీక్‌పై సమాచారం ఇవ్వాలని, ఏప్రిల్ 7లోగా పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌ను కోరింది. కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి ఎన్నికలతోపాటు ఇతర ప్రయోజనాలకు వాడుకున్నట్టు వెలుగుచూడటం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నుంచి ఈ మేరకు సంజాయిషీ కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ లేఖ రాసింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఫేస్బుక్ సమాచారాన్ని తస్కరించి.. అవకతవకలకు పాల్పడ్డట్టూ కేంబ్రిడ్జ్ అనాలిటికా (సీఏ) ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సంస్థకు కూడా కేంద్రం ఈ నెల 23న నోటీసులు పంపింది. ఫేస్బుక్ నుంచి సమాచార ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కోరింది. భారతీయ ఓటర్లు, భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం విషయంలో సీఏ ఏమైనా ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడిందా? ఫేస్బుక్ లేదా దాని అనుబంధ సంస్థలు ఫేస్బుక్ సమాచారాన్ని ఉపయోగించుకొని గతంలో భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయా? అన్నది తెలుపాలని కోరింది. ఫేస్బుక్ సమాచార ఉల్లంఘనలపై మరింత వివరాలు తెలుసుకోవాల్సిన అవసరముందని, అందుకే తాము ఫేస్‌బుక్‌కు ఈ మేరకు లేఖలు పంపామని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. -
ఫేస్బుక్ వాడుతున్నారా..తస్మాత్ జాగ్రత్త..!
-
బిగ్‌బాస్..ఛోటా భీమ్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం దుర్వినియోగంపై కాంగ్రెస్–బీజేపీల మధ్య మాటల యుద్ధం సద్దుమణగక ముందే మొబైల్ యాప్స్ ద్వారా డేటా లీకేజీ వివాదం వేడిపుట్టిస్తోంది. ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ (మారుపేరు) ఈ సమాచార చౌర్యాన్ని వెలుగులోకి తీసుకురాగా.. రెండు జాతీయ పార్టీలు సోమవారం ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించుకున్నాయి. ప్రధాని మోదీ అధికారిక ‘నమో’ యాప్ నుంచి వ్యక్తిగత సమాచారం యూజర్ల అనుమతి లేకుండా మూడో పార్టీకి చేరుతోందని ఎలియట్ ఆరోపణలతో ఈ వివాదానికి బీజం పడగా...నమో యాప్‌పై ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ యాప్ ‘విత్ ఐఎన్‌సీ’ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోతోందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లోని సభ్యత్వ నమోదు లింక్‌ను తొలగించారని, కాంగ్రెస్ ఏదో దాస్తోందని బీజేపీ ఆరోపించింది. సరిగా పనిచేయనందునే లింక్ తొలగించామని కాంగ్రెస్ కౌంటరిచ్చింది. గతంలో ఆధార్ సాఫ్ట్‌వేర్‌లోని లొసుగుల్ని బయటపెట్టిన ఎలియట్ అల్డర్సన్ ‘నమో’ యాప్ యూజర్ల సమాచారం నుంచి అమెరికాలోని కంపెనీకి తరలిపోతోందని శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఆదివారం మరో ట్వీట్ చేస్తూ.. తన ట్వీట్లతో అప్రమత్తమై నమో యాప్‌లోని ప్రైవసీ పాలసీలో ఎవరికీ అనుమానం రాకుండా మార్పులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యాప్ నుంచి కూడా వ్యక్తిగత సమాచారం తరలిపోయిందని అల్డర్సన్ తప్పుపట్టారు. ‘డిలీట్‌నమోయాప్’ : రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘నమో’ యాప్‌పై సోమవారం ఆరోపణల్ని కొనసాగిస్తూ .. ‘ఆడియో, వీడియోలు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కాంటాక్ట్‌లను మోదీ ‘నమో’ యాప్ రికార్డు చేయడంతో పాటు మీరు ఎక్కడ ఉన్నారన్నదీ జీపీఎస్ ద్వారా తెల్సుకుంటున్నారు. భారతీయులపై గూఢచర్యం చేసేందుకు ఇష్టపడే బిగ్‌బాస్ మోదీ’ అని ట్వీట్ చేశారు. మన పిల్లల సమాచారాన్ని మోదీ కోరుకుంటున్నారని, 13 లక్షల ఎన్సీసీ క్యాడెట్స్‌తో బలవంతంగా నమో యాప్‌ను డౌన్లోడ్ చేయించారని పేర్కొంటూ ‘డిలీట్‌నమోయాప్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ‘నమో యాప్‌లోని కోట్లాది భారతీయుల డేటాతో తన వ్యక్తిగత డేటాబేస్‌ను రూపొందించేందుకు మోదీ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో దేశంతో సంభాషించాలని ఆయన కోరుకుంటే ఎలాంటి సమస్యా లేదు. అయితే అందుకు అధికారిక పీఎంఓ యాప్‌ను వాడుతున్నారు. ఈ డేటా దేశానిది. మోదీది కాదు’ అని విమర్శించారు. ఫేస్బుక్ సమాచారం దుర్వినియోగంలో కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ సంబంధాలపై వాస్తవాల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ ట్వీట్లను బీజేపీ కూడా తిప్పికొట్టింది. యాప్‌ని ఎందుకు తొలగించారు: బీజేపీ రాహుల్ ఆరోపణలల్నిమంత్రి స్మృతీ ఇరానీ ట్విటర్లో ఎద్దేవా చేశారు. ‘రాహుల్ జీ.. యాప్స్ ఇన్స్టాల్ సమయంలో అడిగే సాధారణ అనుమతులు గూఢచర్యంతో సమానం కాదని ‘చోటా భీమ్’కి కూడా తెలుసు. ‘డిలీట్‌నమోయాప్’కి బదులు చివరకు మీ కాంగ్రెస్ యాప్‌నే తొలగించారు. సింగపూర్ సర్వర్లకు మీ యాప్ ద్వారా కాంగ్రెస్ ఎందుకు సమాచారం పంపుతుందో జవాబిస్తారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేస్తూ.. ‘కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వెబ్సైట్ లింక్ తొలగించారు. membership.inc.in లింక్‌లోకి వెళ్లి సభ్యత్వ నమోదుకు ప్రయత్నిస్తే ‘స్వల్ప మార్పులు చేస్తున్నాం. తర్వాత ప్రయత్నించండి’ అని సందేశమొస్తుంది. ఏం దాచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అని తప్పుపట్టారు. ‘హాయ్.. నా పేరు రాహుల్. దేశంలోని పురాతన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని.. మీరు మా అధికారిక యాప్‌లోకి సైనప్ అయితే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని నా స్నేహితులకు చేరవేస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ వంటి సాంకేతిక నిరక్షరాస్యుడిని భారత రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తామని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. నమో యాప్ ద్వారా మోదీ, బీజేపీలు ఈవీఎంలకు అనుంధానమై హ్యాక్ చేయడం వల్లే వరుసగా ఎన్నికల్లో గెలుస్తున్నారని కూడా రాహుల్ ఆరోపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ‘విత్ఐఎన్సీ’ యాప్‌ని ఐదు నెలలుగా వాడడం లేదు: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ దివ్య స్పందన స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్ సభ్యత్వ లింకు పేజీ సరిగా పనిచేయడం లేదు. అందువల్ల కాంగ్రెస్ వెబ్సైట్ ద్వారానే కొద్దికాలం సభ్యత్వ నమోదు అందుబాటులో ఉంటుంది’ తెలిపారు. కాంగ్రెస్ కూడా ట్వీట్ చేస్తూ ‘విత్ఐఎన్సీ’ యాప్ గత ఐదునెలలుగా వాడడం లేదని.. నవంబర్ 16, 2017 నుంచి సభ్యత్వ నమోదును http://www.inc.in వెబ్‌సైట్‌కు మార్చామని తెలిపింది. ఒక ప్రభుత్వ యాప్ 15 అంశాల్లో అనుమతి కోరుతోందని, నమో యాప్ మాత్రం 22 అంశాల్లో అనుమతి అడుగుతోందని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. 10 వేల ఏటీఎంల డేటా లీక్ అయిందని, 32 లక్షల ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారుల సమాచారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్ని ఆయన ఉదహరించారు. -
పరిస్థితి చాలా ఘోరం: ఆపిల్ సీఈవో
ఫేస్బుక్ డేటా బ్రీచ్‌పై టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా డెవలప్మెంట్ ఫోరంలో అమెరికా, చైనా ట్రేడ్‌వార్ ఆందోళనలపై ప్రసగించిన ఆయన ఫేస్బుక్ యూజర్ డేటా ఉల్లంఘన కుంభకోణంపై స్పందించారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఈ ఉదంతం యూజర్ల డేటాభద్రతపై రెగ్యులేటరీ తీసుకోవాల్సిన కఠిన నిబంధనలను మరోసారి గుర్తు చేసిందన్నారు. అదీ ఫేస్బుక్ లాంటి సంస్థ ఇలాంటి వివాదాల్లో ముందువరసలో ఉండటం మరింత విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఫేస్బుక్లో 5కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు లీక్‌పై ప్రశ్నించినపుడు కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం చాలా భయంకరమైందనీ కుక్ వ్యాఖ్యానించారు. ఈ వివాదం యూజర్ డేటా రక్షణపై రూపొందించాల్సిన కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపిల్ వినియోగ దారుల గోప్యతకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామన్నారు. గతకొన్ని సంవత్సరాలుగా చాలాదేశాల్లో డేటా ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేపుతోందన్నారు. వినియోగదారుల గోప్యతపై ఈ అంచనాలు మరోసారి నిజం కావడం దురదృష్టకరమన్నారు. యూజర్లు అనేక సంవత్సరాలుగా ఏమి బ్రౌజ్ చేస్తున్నారు, వారి స్నేహితుల జాబితా, మళ్లీ ఆ స్నేహితుల లిస్ట్‌లోని వారి పరిచయాలు, లైక్స్, డిస్‌లైక్స్ ..ఇలా వ్యక్తుల జీవితాల్లోని అత్యంత కీలకమైన అంశాలు వేరే వ్యక్తుల చేతుల్లోకి పోకూడదన్నారు. వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకూడదని కుక్ అభిప్రాయపడ్డారు. కాగా యూజర్ల సమాచారం విక్రయానికి గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే టాప్‌సంస్థలు తీవ్రంగా స్పందించడం ఫేస్బుక్ కు ప్రతికూల అంశం. ముఖ్యంగా వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టన్ డిలీట్ ఫేస్బుక్ ఉద్యమం, ఫేస్బుక్ పేజీలను డిలీట్ చేస్తున్నట్టు స్సేస్ ఎక్స్ అధిపతి ఎలన్ మస్క్ ప్రకటించడం మరింత ఆందోళన రేపింది. తాజాగా ఆపిల్ సీఈవో వ్యాఖ్యలు, వెలిబుచ్చిన ఆందోళన ఫేస్‌బుక్‌పై ఒత్తిడిని తీవ్రం చేసింది. -
భారత్‌పై సీఏ కుట్ర!
ఫేస్బుక్ డేటా లీకేజీ ఘటనతో తెరపైకి వచ్చిన పేరు కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ). ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ఎన్నికల ఫలితాలను తమ సర్వేలు, వ్యూహాలతో తారుమారు చేసిన రికార్డు ఈ సంస్థకుంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, కెన్యా సహా పలు ఆఫ్రికా దేశాల ఎన్నికల్లో, బ్రెగ్జిట్ రెఫరెండంలోనూ వేలుపెట్టిన సీఏ 2014లో భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలనూ మార్చేందుకు ప్రయత్నించింది. ఆనాడు అసలేం జరిగింది? ఎందుకు వీరి ప్రయత్నం బెడిసికొట్టింది? ఆనాటి బృందంలో సభ్యుడైన ఎలక్షన్ కన్సల్టెంట్ అవ్నీ శ్ కుమార్ ‘ద ప్రింట్’ సంస్థకు వెల్లడించిన వివరాలు.. భారత ఎస్సీఎల్ కంపెనీ ఏర్పాటు కేంబ్రిడ్జ్ అనలిటికా మాతృ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఎస్సీఎల్) భారత్‌లో కాలుమోపేందుకు ఎస్సీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించింది. ఇందులో అలెగ్జాండర్ జేమ్స్, అష్బర్నర్ నిక్స్, అలెగ్జాండర్ ఓక్స్ (ముగ్గురూ బ్రిటీషర్లు) అమ్రీశ్ త్యాగి, అవ్నీశ్ కుమార్ రాయ్ (ఇద్దరు భారతీయులు) డైరెక్టర్లుగా ఉన్నారు. జేమ్స్, నిక్స్ ఇద్దరూ ఎస్సీఎల్ (యూకే) వ్యవస్థాపకులు. అమ్రీశ్ త్యాగి జేడీయూ నేత కేసీ త్యాగి కుమారుడు, ప్రస్తుతం సీఏతో కలిసి పనిచేస్తున్న ఓవ్లినో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) యజమాని. రాయ్ 1984నుంచీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఓటర్ల మనసును చదివి.. 2009లో యూపీలోని గౌతమబుద్ధ నగర్ పార్లమెంటు స్థానం ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థి మహేశ్ శర్మ (ప్రస్తుత కేంద్ర మంత్రి)కు రాయ్ సహకరించినా 16వేల ఓట్లతో శర్మ ఓడిపోయారు. ఫలితాన్ని సమీక్షించుకుంటున్న నేపథ్యంలో ఎస్సీఎల్–యూకే హెడ్ డాన్ మురేసన్తో రాయ్‌కు పరిచయమైంది. రాయ్ కోరిక మేరకు ముగ్గురు బిహేవియరల్ డైనమిక్స్ ఇన్స్టిట్యూట్ నిపుణులతో భారత్ వచ్చిన మురేసన్.. తనదైన శైలిలో సర్వే నిర్వహించి శర్మ ఓటమికి కారణాలు వెల్లడించారు. దీనికి ముచ్చటపడిన రాయ్.. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేలు నిర్వహించేందుకు మురేసన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు రాయ్ సహకరించారు. ఈ అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు. డేటాను అమ్ముకుంటేనే! రాయ్ విజ్ఞప్తి మేరకు లండన్ నుంచి ఎస్సీఎల్ నిపుణుల బృందం (అలెగ్జాండర్ నిక్స్ సహా) భారత్‌కు వచ్చింది. అప్పటికే రాయ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జనాభా వివరాలను సేకరించి (కుల, మత, లింగ తదితర) వారి రాజకీయ అభిప్రాయాలను క్రోడీకరించే పనిలో ఉన్నారు. డేటాను మరింత శాస్త్రీయంగా రూపొందించి 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అమ్ముకోవాలని ఎస్సీఎల్ బృందం సూచించింది. ఇందుకోసం నిక్స్, మురేసన్, త్యాగి, రాయ్‌లు వివిధ పార్టీల నేతలను కలిశారు. పార్టీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ మొదట్లోనే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ చూద్దాం అన్నట్లు వ్యవహరించింది. నైతికత కాదు.. డబ్బే ముఖ్యం: నిక్స్ అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో జతకలిస్తే ఎక్కువ డబ్బులొస్తాయని నిక్స్ వీరందరినీ ఒప్పించారు. కాంగ్రెస్ నేతలను ఒప్పించేందుకు మరింత పకడ్బందీగా శాంపిల్ డేటా సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే ఓటర్లను అడగాల్సిన ప్రశ్నలు.. ప్రజానాడిని తెలుసుకునే బదులు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంలాగా కనిపించటంతో రాయ్ అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉండే ఓ గుజరాతీ ఎన్నారై ఒకరు రాయ్ బృందాన్ని కలిసి.. కాంగ్రెస్ ఓడిపోయేందుకు డీల్ కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కాంట్రాక్ట్ తీసుకుందామనుకుని వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనైతికమని రాయ్ చెప్పినా నిక్స్ వినలేదు. భారత్‌కు వచ్చింది డబ్బులు సంపాదించుకునేందుకేనని నిక్స్ చెప్పాడు. సర్వే వివరాలన్నీ భారత సర్వర్లలో దాచిపెట్టాలని రాయ్ చెప్పినా వినకుండా కావాలని నిక్స్ యూఎస్ సర్వర్లలో భద్రపరచటంతో రాయ్ అసంతృప్తితో టీమ్ నుంచి బయటకొచ్చారు. జనాభా లెక్కల ప్రకారం వివరాల విశ్లేషణలో రాయ్ పాత్ర కీలకం కావటంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటినుంచి రాయ్ సొంతంగా పనిచేస్తుండగా సీఏ టీం త్యాగితో పనిచేస్తోంది. ఈ మధ్యలోనే కెన్యా ఎన్నికల పనికోసం నైరోబీ వెళ్లిన మురేసన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేవలం డబ్బుకోసమే పనిచేసే నిక్స్ కావాలనే మురేసన్ను చంపించాడని సీఏ యూకే ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
మాధ్యమాల మాయాజాలం
ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లమంది క్రియాశీల వినియోగదారులతో వెలిగిపోతూ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఫేస్‌బుక్‌పై మరోసారి నీలినీడలు కమ్ముకు న్నాయి. ఆ సామాజిక మాధ్యమంలో ఉన్న వినియోగదారుల వివరాలు, వారి ఇష్టా యిష్టాలు సంతలో సరుకులా మారాయని... బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) సంస్థ వాటిని ఎడాపెడా ఉపయోగించుకున్నదని, పలు దేశాల్లోని రాజకీయ పక్షాలకు ఎన్నికల్లో వాటి ఆధారంగానే వ్యూహాలు రూపొందించిందని తాజాగా బయటపడింది. అంతేకాదు... మన దేశంలోని పార్టీలు కూడా ఆ మాదిరి సేవలను పొందుతున్నాయని సీఏకు భారతీయ భాగస్వామిగా ఉన్న ఒవలెనొ బిజి నెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) తన వెబ్సైట్లో ప్రకటించింది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ) తమ క్లయింట్లుగా ఉన్నాయని తెలిపింది. మన దేశంలో ఫేస్బుక్ వినియోగదారులు అమెరికాతో పోల్చినా ఎక్కువే. ఇక్కడ 24 కోట్లకుపైగా క్రియాశీల వినియోగదారులున్నారు. కనుక ఎలాంటి అవాంఛనీయ పోకడలకు ఆస్కారమిచ్చినా వాటి పర్యవసానాలు ప్రమాదకరంగా మారతాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి అత్యంత కీలకమైనవి. ఎన్నికల ద్వారా ఓటర్లు తమ అభీష్టాన్ని వ్యక్తం చేస్తారని, ఆ రకంగా తమ భవిష్యత్తును తామే ఉమ్మడిగా నిర్దే శించుకుంటారని అంటారు. ఈ ప్రక్రియను ఏమార్చడానికి, ఇందులో కుల మత ప్రమేయాలనూ, ధన ప్రభావాన్ని జొప్పించి లాభపడటానికి చాన్నాళ్లుగా ప్రయ త్నాలు సాగుతున్నాయి. కానీ ఆ ఓటర్లను వారి వారి వయసులరీత్యా, వారి అలవాట్లరీత్యా, వారి ఇష్టాయిష్టాలరీత్యా వర్గీకరించి సమాజంలో ఏ వర్గం ఏం కోరుకుంటున్నదో ఆనుపానులు తెలుసుకోవడంతోపాటు వారిని ప్రభావితం చేసేలా తప్పుడు సమాచారాన్ని వెదజల్లి ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ఈమధ్య కాలంలో ప్రారంభమయ్యాయి. కుల, మత, ధన ప్రభావాలైతే నేరుగా తెలిసిపోతాయి. అలాంటి తప్పుడు పనులపై చట్టం దృష్టి పడుతుంది. చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. దొరికితే అభాసుపాలవుతామన్న భయం పార్టీల్లో ఎంతో కొంతైనా ఉంటుంది. పైగా చాలామంది ఈ ప్రలోభాలకు దూరంగా ఉంటారు. తమ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. కనుకనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కనీసం ఈ మాదిరిగా అయినా మిగిలింది. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా మాయ చేసే వారికి ఈ బాదరబందీ ఉండదు. ఓటర్లు తప్పుడు సమాచారం ప్రభావంతో తమ ఇష్టాలను మలుచుకుంటారు. నిర్ణయాలు తీసుకుంటారు. కనీ సం తాము మాయలో పడ్డామని గ్రహించే ఎరుక కూడా వారికుండదు. అంతా తెలుసుకునేసరికి ఏమీ మిగ లదు. అమెరికా పౌరులు అనుభవపూర్వకంగా ఆ సంగతి ఇప్పుడిప్పుడు గ్రహిస్తు న్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సీఏ సంస్థ డోనాల్డ్ ట్రంప్ కోసం ఎన్ని మాయలు చేసిందీ ఇప్పటికే కొంత బయటపడింది. ఆ విషయంలో అక్కడ దర్యాప్తు సాగు తోంది. అమెరికా ఎన్నికలు మాత్రమే కాదు... యూరప్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికి రావాలని బ్రిటన్ పౌరులు దృఢంగా నిర్ణయించుకునేలా చేసింది కూడా సీఏ సంస్థే. పలు యూరప్ దేశాల్లోనూ దీని లీలలు బయటపడుతున్నాయి. బ్రెగ్జిట్ వ్యవహారంలో సీఏ పాత్రపై బ్రిటన్ విచారణ చేయిస్తోంది. సామాజిక మాధ్యమాలవల్ల భావ వ్యక్తీకరణ విస్తృతి పెరిగింది. సామాన్యులు సైతం క్రియాశీలంగా వ్యవహరించేందుకు అవి వేదికలయ్యాయి. ఏ మూల ఏ అన్యాయం జరిగినా అది క్షణాల్లో సామాజిక మాధ్యమాలకెక్కుతోంది. ప్రభుత్వాల కది కంటగింపుగా మారింది. ఏదో ఒక చర్య తీసుకున్నట్టు కనిపించడానికి అవి తాపత్రయపడుతున్నాయి. అయితే ఇదే సమయంలో సీఏ లాంటి సంస్థలు సైతం తమ దొంగ వ్యవహారాలను చడీచప్పుడు లేకుండా కానిచ్చేందుకు ఆ మాధ్యమా లను దుర్వినియోగం చేస్తున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ‘సమ్మతి’ని లేదా ‘అసమ్మతి’ని సృష్టిస్తున్నాయి. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు తమలో చేరేవారికి కొన్ని ప్రశ్నలేసి జవాబులు రాబట్టి, వారి నుంచి కొన్ని అంశాలపై ఆమోదం తీసుకుని వినియోగ దారులుగా చేర్చుకుంటాయి. ఇలా ఆమోదం ఇవ్వడం ద్వారా తామేం చేస్తు న్నామో, అది దేనికి దారితీస్తుందో వినియోగదారులు గ్రహించలేక పోతున్నారు. ఆ మాధ్యమాల చేతుల్లో తెలియకుండానే మర మనుషులుగా మారుతున్నారు. సామా జిక మాధ్యమాలు రూపొందించే ఉపకరణాలు, అవి సేకరించే డేటా పౌరులపైనా, వారి ద్వారా మొత్తంగా ప్రజాస్వామ్యంపైనా ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. డేటా చౌర్యాన్ని నిరోధించడానికి, విని యోగదారుల వ్యక్తిగత విషయాలు బయటకు పోకుండా ఉండటానికి రకరకాల ఫిల్టర్లను అందుబాటులోకి తెచ్చామని ఫేస్బుక్ చెబుతున్నా వాటిని నిరర్ధకం చేసే ఉపకరణాలు కూడా ఆ వెంటనే తయారవుతున్నాయి. సీఏ సంస్థ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోవడంతో ఇదంతా బట్టబయలైంది. ఆ సంగతలా ఉంచి ప్రజాస్వామ్యాన్ని ‘కరి మింగిన వెల గపండు’ మాదిరిగా మార్చే ఇలాంటి అనైతిక సంస్థల ప్రాపకాన్ని పొందడానికి ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు వెంపర్లాడాయన్న వార్తలు దిగ్భ్రాం తికలిగిస్తాయి. ఈ పార్టీల నేతలు ఎవరికి వారు సచ్చీలురమని చెప్పుకోవడంతో పాటు ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో నిజానిజాలేమిటో రాగలరోజుల్లో నిర్ధారణవుతుంది. మన వినియోగదారుల వివరాలు దుర్వినియోగ మైతే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతు న్నారు. మంచిదే. ఓటర్లను స్వీయ ఆలోచనల్లేని వ్యక్తులుగా, మరమనుషులుగా మార్చి పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, ఒక ప్రైవేటు సంస్థ ప్రయత్నించినా ఆ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడమే అవుతుంది. ఈ మాధ్యమాల మాయలో తాము పడకుండా ఉంటే, జాగ్రత్తగా వ్యవహరిస్తే అది తమకూ, ప్రజాస్వామ్యానికి కూడా క్షేమదాయకమని మన పాలకులు, ప్రధాన రాజకీయ పక్షాలు తెలుసుకోవాలి. -
ఫేస్బుక్ డేటా లీకేజీ కుంభకోణంపై స్పందించిన రాహుల్
-
బీజేపీకి రాహుల్ ఘాటు కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఫేస్బుక్ సమాచారం లీకేజీ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మౌనం వీడారు. ఉద్దేశ పూర్వకంగా ఈ అవాస్తవపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పైకి తీసుకొచ్చిందని అన్నారు. ఇరాక్‌లో 39మంది భారతీయులు ప్రాణాలుకోల్పోయారని, ఆ విషయంలో కేంద్రం వైఫల్యం ఉందని, దానిని న ఉంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీపై అవాస్తవపు ఆరోపణలు బీజేపీ చేస్తుందంటూ ట్విటర్ ద్వారా తెలిపారు. గతంలో కంటే భిన్నంగా ఆయన ఆరోపణలు చేశారు. 'సమస్య : 39 మంది భారతీయులు చనిపోయారు. ప్రభుత్వం తెరమీదకు వచ్చి అబద్ధాలు ఆడుతూ దొరికిపోయింది. పరిష్కారం : కాంగ్రెస్‌పై సమాచారం దొంగిలింపు అని ఓ కొత్త కథను కనుగొంది. ఫలితం : మీడియాలో దీనిపై ఎప్పటిలాగే విస్తృత చర్చ.. 39మంది భారతీయులు రాడార్ నుంచి కనుమరుగు.. సమస్యకు పరిష్కారం.' అంటూ రాహుల్ వినూత్నంగా ట్వీట్ చేశారు. ఫేస్బుక్ డేటా లీకేజీపై రాహుల్ తొలి స్పందన ఇదే. 2019 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంబ్రిడ్జి ఎనాలిటికా అనే సంస్థ సాయంతో కలిసి పనిచేస్తూ పలువురి వ్యక్తిగత డేటాను కొల్లగొట్టిందని బీజేపీ ఆరోపించగా ఎప్పుడూ అబద్ధాలు వండి వార్చే బీజేపీ మరో కొత్త అబద్ధాన్ని కథగా తెరపైకి తెచ్చిందంటూ కాంగ్రెస్ ప్రతిదాడి చేసింది. పైగా ఈ సంస్థతో బీజేపీ పలుసార్లు పనిచేయించుకుందని, 2014 ఎన్నికల్లో కూడా ఈ సంస్థను బీజేపీ వాడుకుందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. Problem: 39 Indians dead; Govt on the mat, caught lying. Solution: Invent story on Congress & Data Theft. Result: Media networks bite bait; 39 Indians vanish from radar. Problem solved. — Rahul Gandhi (@RahulGandhi) March 22, 2018 -
ఫేస్బుక్ వార్!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజ్ వివాదం భారత్‌కూ పాకింది. కోట్లాది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను పలు దేశాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు అక్రమంగా వినియోగించిన సంస్థ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ)’తో భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం ఉందన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ తదితర పార్టీలు తమ క్లయింట్లేనంటూ ఆ సంస్థ భారతీయ భాగస్వామి ఓబీఐ (ఒవలెనొ బిజినెస్ ఇంటలిజెన్స్) తన వెబ్సైట్లో ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. సీఏతో అంటకాగింది, సంబంధాలు కొనసాగిస్తోంది మీరంటే.. మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించారు. సోషల్‌మీడియాలో రాహుల్ విస్తృతి వెనుక ఉన్నది ‘సీఏ’నేనని, ఓటర్లను ఆకర్షించేందుకు ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ నేత, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు, బిహార్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ ఈ సంస్థ సేవలను వినియోగించుకుందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు ఉద్దేశించిన ‘బ్రెగ్జిట్’ ఉద్యమంలో ‘సీఏ’ పాత్రపై వివాదం చెలరేగి, పలు దేశాల్లో దర్యాప్తులు కొనసాగుతున్న వేళ.. భారత్‌నూ ఈ అంశం కుదిపేయడం రానున్న రోజుల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని కళ్లకు కడుతోంది. కాంగ్రెస్ జవాబివ్వాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతిలో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకున్న సంబంధమేంటో రాహుల్ గాంధీ చెప్పాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. ‘ఈ డేటా విశ్లేషణ సంస్థ సెక్స్, అనైతిక మార్గాలు, అసత్యపు వార్తల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది. ఇలాంటి సంస్థతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ‘2019 ఎన్నికల ప్రచారంలో మోదీపై కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం అంటూ మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే ఏమో అనుకున్నాం. అది ఇదేనా. సీఏ సంస్థ అమ్మాయిలను ఎరగా వేసి, డబ్బులు ఆశజూపి రాజకీయ నాయకులను ఉచ్చులోకి దించుతుంది, ఫేస్బుక్ డేటాను చోరీ చేస్తుంది. ఇదేనా కాంగ్రెస్ చేయాలనుకున్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సంస్థ డేటా విశ్లేషణ వివరాల ద్వారానే ఓటర్లను ఆకర్షిస్తోందా?’ అని ప్రశ్నించారు. ఫేస్బుక్కూ వార్నింగ్ ఫేస్బుక్ వినియోగిస్తున్న 20 కోట్ల మంది భారతీయ వినియోగదారుల వివరాలను దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే.. ఫేస్బుక్ సంస్థపై కఠిన చర్యలు తప్పవని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఎన్నికల విధానాన్ని అనైతిక పద్ధతుల్లో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. భారత ప్రభుత్వం మీడియా, భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తుందని, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకోవటం తప్పుకాదన్న మంత్రి.. దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకోబోమన్నారు. ‘దేశ ప్రయోజనాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయమిది. భారత ప్రజాస్వామ్య విధానాన్ని ప్రభావితం చేసే ఏ అంశాన్నైనా సీరియస్‌గా తీసుకుంటాం. అవసరమైతే.. జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పించి విచారిస్తాం’ అని ఆయన అన్నారు. బీజేపీతోనే సంబంధాలు బీజేపీయే ఈ సంస్థతో సంబంధాలు పెట్టుకుందని.. అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. బిహార్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ సంస్థ సేవలను బీజేపీ వినియోగించుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. పార్టీకి గానీ, రాహుల్‌కు గానీ సీఏ సంస్థతో సంబంధాల్లేవన్నారు. ఇతర సమస్యలనుంచి దేశం దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. ‘అవాస్తవాలను ప్రచారం చేయటంలో దిట్ట అయిన బీజేపీ నేడు మరో అసత్యాన్ని తెరపైకి తెచ్చింది. అబద్ధపు ప్రెస్ కాన్ఫరెన్స్, అసత్యాల ఎజెండా, అనైతిక వ్యూహం, అసత్య ప్రకటనలు బీజేపీ, న్యాయంలేని న్యాయశాఖ మంత్రి దినచర్యలో భాగమయ్యాయి’ అని సుర్జేవాలా విమర్శించారు. బిహార్ ఎన్డీయే నేత కుమారుడే సీఏ భారతీయ సంస్థ ఓవిలేనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ)ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూఎస్, యూకేల్లో విచారణలు ఐదుకోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను తస్కరించడంపై అమెరికా, బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాలు విచారణకు ఆదేశించాయి. తమ ముందు విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించాయి. అమెరికాలో ఈ కేసును ఆ దేశ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) విచారిస్తోంది. విచారణకు తమ ముందు హాజరవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ 2016 ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించింది. చిత్తశుద్ధితో చేస్తున్నాం: ఫేస్బుక్ ఫేస్బుక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని.. అందువల్ల ఈ సంస్థపై 40వేల డాలర్ల (దాదాపు రూ. 26 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. తాజా వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు బుధవారం మరో 2.6 శాతం పడిపోయాయి. కాగా, ఓ రాజకీయ కన్సల్టెన్సీ తమ వినియోగదారుల డేటా చోరీ చేయటంపై ఆందోళనలో ఉన్నట్లు ఫేస్బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మేం మోసపోయామని అర్థమైంది. మా పాలసీలకు అనుగుణంగా వినియోగదారుల భద్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. జుకర్‌బర్గ్ సహా మిగిలిన ఉన్నతాధికారులంతా రాత్రింబవళ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఫేస్బుక్ పేర్కొంది. ‘డిలీట్ ఫేస్బుక్’ ఉద్యమం వ్యక్తిగత డేటా లీకేజీ ఘటన అనంతరం.. ఫేస్బుక్ అకౌంట్‌ను తొలగించాలంటూ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ పేర్కొన్నారు. ‘డిలీట్ ఫేస్బుక్.. ఇదే సరైన సమయం’ అని బ్రయాన్ ఆక్టన్ పేర్కొన్నారు. అటు డిలీట్ ఫేస్బుక్ ప్రచారం మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాలిఫోర్నియాకు చెందిన వాట్సాప్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ 2009లో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. 2014లో ఫేస్బుక్ సంస్థ 19 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)కు ఈ సంస్థను కొనుగోలు చేసింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌లోనే బ్రయాన్ ఫేస్‌బుక్‌ను వదిలి కొత్త సంస్థలో చేరారు. ఫేస్బుక్ డేటాతో ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారిలో దాదాపు ప్రతీ ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నవారే. తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలను అందులో పొందుపర్చినవారే. రాజకీయం, సామాజికం, సాహిత్యం సహా దాదాపు అన్ని సమకాలీన అంశాలు, ఘటనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నవారే. ఫేస్బుక్ వినియోగదారుల వివరాలతో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఏం చేసింది? ఆ వివరాలను ఎందుకు, ఎలా వినియోగించింది? దాంతో తమకేం నష్టం?.. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ఎన్నో వినియోగదారులను వేధిస్తున్నాయి. అలెగ్జాండర్ నిక్స్ సీఏ చేసే పనేంటి? స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబొరేటరీస్ (ఎస్సీఎల్) అనే సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) అనే సంస్థ ఉంది. ఇది క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా డేటా విశ్లేషణలో సహకరిస్తుంది. ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని తమ క్లయింట్ల ఎన్నికల ప్రచారానికి వ్యూహాలను సీఏ రూపొందిస్తుంది. ఏ పార్టీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారనే అంతర్గత సమాచారం, వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా క్లయింట్ల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు అసత్యవార్తలను ఫేస్బుక్లో ప్రచారం చేయటం, మాజీ గూఢచారులతో వ్యూహాలు రూపొందించటం కూడా సీఏ పనే. అవసరమైతే ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సీఏ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ బీబీసీ ఛానెల్ 4 ‘స్టింగ్ ఆపరేషన్’లో అడ్డంగా దొరికిపోవడం ద్వారానే ఈ డొంకంతా కదిలింది. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్తోపాటు, బ్రిటన్, ఇజ్రాయిల్‌లలో రాజకీయ నేతల తెరవెనక సమాచార సేకరణ కోసం మాజీ గూఢచారుల సేవలను వినియోగించుకున్నామని కూడా నిక్స్ వెల్లడించాడు. యాప్‌లతో కొట్టేస్తారు.. ఫేస్బుక్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థ సేకరించి అధ్యయనం చేస్తుంది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే కంపెనీ ‘పర్సనాలిటీ క్విజ్’ అనే యాప్‌ను రూపొందించింది. దీన్ని దాదాపు 3 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను తెరిచేందుకు ఫేస్‌బుక్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు.. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులతోపాటు వారి ఫేస్బుక్ మిత్రుల (మొత్తం సంఖ్య కోట్లలోనే) వివరాలు, వారి ఇష్టాయిష్టాలను ఈ సంస్థ తెలుసుకోగలిగింది. ఇలా అక్రమంగా సేకరించిన సమాచారంతో సీఏ ‘సైకలాజికల్ ప్రొఫైల్స్’ను సృష్టించి విశ్లేషిస్తుంది. ఏం చేస్తే ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు? వ్యతిరేకతనుంచి గట్టెక్కేందుకు ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి? అనే వివరాలనూ ఈ సంస్థ సూచిస్తుంది. ట్రంప్ వెనకా, బ్రెగ్జిట్ ముందూ.. సీఏనే! ఒక్కో అమెరికా ఓటర్ నాడిని, మానసిక స్థితిని తెలుసుకోవటం కోసమే.. 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో సీఏ పనిచేసిందని స్పష్టమైంది. తద్వారా ట్రంప్ అనుకూల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. అటు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్ ఓటర్లనూ ప్రభావితం చేయడంపై బ్రిటన్ విచారణ జరుపుతోంది. భారత్‌లో ఇప్పటికే పునాదులు భారత్‌లోని ఒవిలెనో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) గ్రూపు.. సీఏ మాతృ సంస్థ అయిన ఎస్సీఎల్తో 2010 నుంచి కలిసి పనిచేస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కోసం ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్‌లను సంప్రదించినా డీల్ కుదరలేదని సమాచారం. 2019 ఎన్నికల కోసం ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్‌లోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ క్లయింట్లేనని ఓబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. 2016లో ఓ ప్రాంతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా గ్రూపు ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడలేదు’ అని ఒబీఐ హెడ్ అమ్రిష్ త్యాగి (జేడీయూ మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి కుమారుడు) పేర్కొన్నారు. 2010 బిహార్ ఎన్నికల్లో.. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ‘లోతైన ఎన్నికల విశ్లేషణ’ జరిపినట్టు ఓబీఐ పేర్కొంది. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా వివిధ పార్టీల వైపు ఆసక్తి చూపే ఓటర్లను గుర్తించామని తెలిపింది. తమ సంస్థ పనిచేసిన సీట్లలో 90 శాతానికి పైగా స్థానాల్లో తమ క్లయింట్ విజయం సాధించినట్టు ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. అత్యధిక యువ ఓటర్లున్న భారత్‌లో యువత వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. 2019 ఎన్నికల్లో దేశంలోని 13.30 కోట్ల మంది ఓటర్లు తొలిసారి పోలింగ్ బూత్‌లకు రానున్న నేపథ్యంలో వారి నాడిని పసిగట్టేందుకు సామాజిక మాధ్యమాలే కీలకం కానున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘వాట్సాప్ లీక్’ సంస్థలపై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా లిస్టెడ్ కంపెనీల కీలక ఆర్థిక ఫలితాల లీకేజీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ,స్టాక్ ఎక్స్చేంజ్ లు దృష్టి సారించాయి. రెండు డజన్లకు పైగా కంపెనీల వ్యాపార లావాదేవీలను పరిశీలించడం ప్రారంభించాయి. పలు లిస్టెడ్ బ్లూ–చిప్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సదరు కంపెనీలు నిబంధనలేమైనా ఉల్లంఘించాయా అన్న కోణంలో.. గడిచిన పన్నెండు నెలల్లో ఆయా సంస్థల ట్రేడింగ్ వివరాలను స్టాక్ ఎక్స్చేంజ్ లు విశ్లేషిస్తున్నాయి. అటు సెబీ సైతం డేటా వేర్‌హౌస్, సొంత ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ సహాయం ద్వారా ఈ అంశాలను పరిశీలిస్తోందని సమాచారం. సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ధరను ప్రభావితం చేసే ఆర్థికాంశం ఏదైనా సరే లిస్టెడ్ కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజ్ ద్వారానే బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కాల్ డేటా రికార్డుల మీదా కన్ను.. లిస్టెడ్ సంస్థల ఆర్థికాంశాలను వాట్సాప్‌లో లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కాల్ డేటాపైనా సెబీ దృష్టి పెట్టింది. ఆయా వ్యక్తుల కాల్ డేటా రికార్డులు (సీడీఆర్) ఇవ్వాలంటూ టెలికం కంపెనీలను సెబీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు పేరొందిన బ్రోకరేజి సంస్థల పేరుతో లిస్టెడ్ కంపెనీల సమాచారం ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలతో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బైటికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటివి అరికట్టేందుకు సెబీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
హ్యాకర్ల కొత్త ఎత్తుగడలు.. స్టార్టప్సే లక్ష్యం..
♦ డేటా లీక్ అయ్యిందంటూ హెచ్చరికలు ♦ అటుపై సాయమందిస్తామంటూ హామీ ♦ చివరకు సేవల పేరుతో ఆదాయం ముంబై: మోసపూరిత ఈ–మెయిల్స్/కాల్స్.. బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవడం.. క్రెడిట్ కార్డుల సమాచారం కొట్టేయడం.. ఇలా వివిధ మార్గాల్లో హ్యాకర్లు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీరు స్టార్టప్స్‌పై పడుతున్నారు. వీటిని భయపెట్టి ఆదాయం పొందాలని చూస్తున్నారు. అదెలాగంటే.. దేశీ క్రెడిట్ స్కోర్ మేనేజ్మెంట్ కంపెనీ ‘క్రెడిట్‌సేవ’ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని సర్వర్‌లో నిక్షిప్తమై ఉన్న దాదాపు 40,000 మంది రుణగ్రహీతల వివరాలు లీక్ అయ్యాయని ఒక యూరోపియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ దీన్ని హెచ్చరించింది. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సాయమందిస్తామని హామీ కూడా ఇచ్చింది. అలర్ట్ అయిన క్రెడిట్‌సేవ సంస్థ వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో డేటా భద్రంగానే ఉందని, ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని ఊపిరి పీల్చుకుంది. అయితే లండన్‌కు చెందిన ఒక బ్లాగర్ కూడా డేటా లీక్ జరిగిందని కథనం వడ్డించేసింది. కానీ క్రెడిట్‌సేవ సీఈవో సత్య విష్ణుభొట్ల మాత్రం డేటా లీక్ అవ్వలేదని, భద్రంగానే ఉందని స్పష్టం చేశారు. సమస్య సృష్టించేదీ...సొల్యూషన్ ఇచ్చేదీ వారే... ఇక్కడ మరొక కొత్త సమస్య ఉత్పన్నమౌతోంది. కొందరు నిష్ణాతులైన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇండియన్ కంపెనీలను భయపెడుతున్నారు. వీరు ఎలాంటి వారంటే వ్యాపారం కోసం సిస్టమ్ హ్యాక్ చేయడానికి కూడా వెనకాడరు. అంటే వారే సమస్యను సృష్టించి, దానికి సొల్యూషన్‌ను అందిస్తారు. స్టార్టప్స్ ఈ ఉదాహరణను ఒక హెచ్చరిక లాగా తీసుకోవాలని స్థానిక సెక్యూరిటీ సంస్థ ఒకటి హెచ్చరించింది. ఫిన్‌టెక్ విభాగంలో బిజినెస్‌కు సంబంధించి సెక్యూరిటీ అనేది ముఖ్యమైన అంశమని తెలిపింది. స్టార్టప్స్ ఎప్పుడూ వ్యాపార విస్తరణతో పాటు సైబర్ దాడులు, డేటా భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. స్టార్టప్‌ను నడిపించడం కష్టమైన పనే. మీ సిస్టమ్‌లో లోపాలున్నాయని, సమస్య పరిష్కారానికి మా సేవలు ఉపయోగపడతాయని కొందరు సెక్యూరిటీ కన్సల్టెంట్స్ మీ వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టార్టప్ నిర్వహణ మరింత కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి సేవలు తీసుకోవడానికి మనం నిరాకరిస్తే.. డేటా లీక్ అయ్యిందంటూ వీరు మీడియాకు తెలియజేస్తారు. మా పోర్ట్‌ఫోలియోలోని ఒక కంపెనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మీ వరకు కూడా ఈ సమస్య రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త. – స్టీవెన్ టంగ్ , బూట్‌క్యాంప్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్, క్రెడిట్‌సేవ ఇన్వెస్టర్ -
డేటాలీక్‌పై జియో యూ టర్న్
న్యూడిల్లీ: వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అత్యంతర భద్రం, డేటా లీక్ కాలేదంటూ ప్రగల్భాలు పలికిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ యూ టర్న్ తీసుకుంది. తమ వినియోగదారుల సమాచారం లీక్ అయిందంటూ పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపింది. డేటా మేజర్ లీక్ అయిందంటూ జియో తమకు ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి బుధవారం తెలిపారు. తమ కంప్యూటర్ వ్యవస్థలోకి అక్రమ చొరబాట్లు జరిగాయంటూ ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రిలయన్స్ జియో ఆరోపించిందని దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ కస్టమర్ల సమాచారం భారీగా లీక్ అయిందన్న వార్తలను నమ్మొద్దంటూ కొట్టిపారేసిన జియో, డేటాలీక్‌ను అధికారికంగా ధృవీకరించినట్టయింది. ఈ వ్యవహారంపై బెంగళూరుకు చెందిన వెబ్ భద్రతా సలహాదారు ఆకాష్ మహాజన్ స్పందిస్తూ డేటాలీక్ అనేది కంపెనీ భద్రతా డొల్లతనాన్ని ప్రదర్శిస్తుందన్నారు. అందుకే ఇండియాలో చాలా కంపెనీలు డేటా ఉల్లంఘనలను తరచూ అంగీకరించడం లేదని పేర్కొన్నారు. కాగా మాజిక్ ఏపీకే వెబ్సైట్లో జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం ఆందోళన రేపింది. వినియోగదారుల ఈమెయిల్, ఆధార్‌నెం, మొబైల్ నంబర్లను ఈ వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. మరోవైపు లీకేజీకు సంబంధించి రాజస్థాన్‌కు ఇమ్రాన్ చింపా అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చింపాను ముంబైకి తరలించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 లోని సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ యొక్క 379 సెక్షన్. ప్రకారం కేసు నమోదు చేశారు. దాదాపు 12 కోట్ల మంది జియో వినియోగదారులు తన ఆధార్ కార్డ్ నమోదు ద్వారా జియో సిమ్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే.