శాన్‌ఫ్రాన్సిస్కో: ఇంతకుముందు అంచనా వేసినట్లు 5 కోట్ల మందివి కాకుండా 2.9 కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమచారమే హ్యాకర్ల చేతికి వెళ్లిందని ఫేస్‌బుక్ శుక్రవారం చెప్పింది. వీరిలో 1.5 కోట్ల మంది వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లను హ్యాకర్లు సంపాదించారనీ, మరో 1.4 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించి మరింత వ్యక్తిగత వివరాలైన లింగం, మతం, ఊరు, పుట్టినతేదీ, ఇటీవల చెక్–ఇన్ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని ఫేస్‌బుక్ తెలిపింది. 5 కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ గతనెల చివరి వారంలో వార్తలు రావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment