పరిస్థితి చాలా ఘోరం: ఆపిల్‌ సీఈవో | AppleCEO Tim Cook comments on Facebook data breach scandal | Sakshi
Sakshi News home page

పరిస్థితి చాలా ఘోరం: ఆపిల్‌ సీఈవో

Published Mon, Mar 26 2018 10:04 AM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

AppleCEO Tim Cook comments on Facebook data breach scandal - Sakshi

ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌పై టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సీఈవో  టిమ్‌ కుక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా డెవలప్మెంట్ ఫోరంలో అమెరికా, చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలపై ప్రసగించిన  ఆయన   ఫేస్‌బుక్‌ యూజర్ డేటా ఉల్లంఘన కుంభకోణంపై స్పందించారు.  పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఈ ఉదంతం యూజర‍్ల డేటాభద్రతపై రెగ్యులేటరీ తీసుకోవాల్సిన  కఠిన నిబంధనలను మరోసారి గుర్తు చేసిందన్నారు. అదీ ఫేస్‌బుక్‌ లాంటి సంస్థ ఇలాంటి వివాదాల్లో ముందువరసలో ఉండటం మరింత విచారకరమని ఆయన  వ్యాఖ్యానించారు. 

ఫేస్‌బుక్‌లో 5కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు లీక్‌పై ప్రశ్నించినపుడు కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం చాలా భయంకరమైందనీ కుక్‌  వ్యాఖ్యానించారు. ఈ వివాదం యూజర్ డేటా  రక్షణపై రూపొందించాల్సిన కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపిల్ వినియోగ దారుల గోప్యతకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామన్నారు. గతకొన్ని సంవత్సరాలుగా చాలాదేశాల్లో  డేటా ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేపుతోందన్నారు.  వినియోగదారుల  గోప్యతపై  ఈ అంచనాలు మరోసారి  నిజం కావడం దురదృష్టకరమన్నారు.  యూజర్లు అనేక సంవత్సరాలుగా ఏమి బ్రౌజ్ చేస్తున్నారు, వారి స్నేహితుల జాబితా, మళ్లీ ఆ  స్నేహితుల లిస్ట్‌లోని వారి పరిచయాలు,  లైక్స్‌, డిస్‌లైక్స్‌ ..ఇలా  వ్యక్తుల జీవితాల్లోని అత్యంత కీలకమైన అంశాలు   వేరే వ్యక్తుల చేతుల్లోకి పోకూడదన్నారు. వ్యక్తిగత వివరాలు  బహిర్గతం కాకూడదని కుక్‌ అభిప్రాయపడ్డారు.

కాగా యూజర్ల సమాచారం విక్రయానికి గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే టాప్‌సంస్థలు  తీవ్రంగా స్పందించడం ఫేస్‌బుక్‌ కు ప్రతికూల అంశం. ముఖ్యంగా వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్‌ ఆక్టన్‌ డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమం,  ఫేస్‌బుక్‌ పేజీలను డిలీట్‌ చేస్తున్నట్టు స్సేస్‌ ఎక్స్‌  అధిపతి ఎలన్‌ మస్క్‌ ప్రకటించడం మరింత ఆందోళన రేపింది. తాజాగా  ఆపిల్‌ సీఈవో వ్యాఖ్యలు, వెలిబుచ్చిన ఆందోళన ఫేస్‌బుక్‌పై ఒత్తిడిని తీవ్రం చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement