సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్‌కు 161 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నలుగురి ఐటీ గ్రిడ్ ఉద్యోగులకి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పి ఎవరో తీసుకెళ్లారని హైకోర్టులో సంస్థ సీఈఓ అశోక్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఏపీ పోలీసుల బెదిరింపులపై లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ను క్లోడ్ సర్వర్ లో భద్రపరచగా హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ను డీకోడ్ చేసే పనిలో ఐటీ నిపుణులు నిమగ్నమయ్యారు. టీడీపీకి సేవలందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసులు నిన్న సాయంత్రం సోదాలు నిర్వహించారు. దీంతో వివాదం రాజుకుని హైకోర్టులో పిటిషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment