సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీల ప్రతినిధులతో కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు సంస్థలు కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఎలాంటి అనుభవం లేకపోయినా... ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడు తమ శాఖల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు.
కుటుంబ వికారం, సమాజ వికాసం ప్రాజెక్ట్‌ను ఏపీ సర్కార్...బ్లూ ఫ్రాగ్ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు మంత్రి లోకేష్ చేతిలోని పంచాయతీ రాజ్ శాఖ ఓ జీవోను జారీ చేసింది. ఇందుకోసం ఈ ఏడాది జనవరి 29న హై లెవల్ ఎంపిక కమిటీని నియమించి, అన్ని శాఖల సమాచారం అందించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక 2017లో పంటల సలహా కాంట్రాక్ట్‌ను రూ.30 కోట్లకు బ్లూ ఫ్రాగ్‌కు అప్పగించింది. అయితే ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో 2018లో ఆ సంస్థను అధికారులు తప్పించారు. మరోవైపు కరెంట్ స్తంభాల జియో ట్యాగింగ్ కాంట్రాక్ట్‌ను కూడా ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. కాగా ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించాయి.
Comments
Please login to add a commentAdd a comment