న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన ఐటీ సిస్టమ్స్‌లో డేటా లీక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉల్లంఘనల తీవ్రత, ప్రభావాలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. కస్టమర్లకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు ఒక గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చినట్లు, ఎవరో దురుద్దేశంతోనే ఇదంతా చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
వీటికి మూలకారణాలను తెలుసుకునేందుకు, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించినట్లు వివరించింది. పాలసీదారుల డేటా లీక్ ఉదంతాల నేపథ్యంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఇటీవలే ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయించాల్సిందిగా రెండు బీమా సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఉదంతం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment