HDFC Life Insurance
-
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
బీమా రంగంలో అపార అవకాశాలు
న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి. ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్ రైటింగ్ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ ఎండీ ఆనంద్ పెజావర్ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరుస విలీనాలు.. ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డీఎఫ్సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్అండ్టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్ బీమాలో టాప్–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ అవినాష్ సింగ్ తెలిపారు. విస్తరణ మార్గాలు.. ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
అంచనాలు మించిన హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు!
ముంబై: జీవిత బీమా రంగంలోని హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు జూన్ త్రైమాసికంలో అంచనాలకు అందుకుంది. నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు చేరుకుంది. పాలసీల రెన్యువల్ నిష్పత్తి గరిష్ట స్థాయిలో ఉండడం మార్జిన్లు పెరిగేందుకు దారితీసింది. మొత్తం ప్రీమియం ఆదాయం 23 శాతం పెరిగి రూ.9,396 కోట్లుగా నమోదైంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7,656 కోట్లుగా ఉంది. దీన్ని మరింత వివరంగా చూస్తే.. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి) 27 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ చేతికి ఎక్సైడ్ లైఫ్
ముంబై: ప్రైవేట్ బీమా రంగంలో సరికొత్త డీల్‌కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ తెరతీసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నుంచి బీమా అనుబంధ సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.6,687 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్‌కు అటు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇటు ఎక్సైడ్ లైఫ్ కంపెనీల బోర్డులు తాజాగా ఆమోదముద్ర వేశాయి. ఒప్పందంలో భాగంగా ఎక్సైడ్ లైఫ్‌లో 100% వాటాను సొంతం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ వెల్లడించింది. షేరుకి రూ.685 ధరలో 8.7 కోట్లకుపైగా హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లను ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు జారీ చేయనుంది. తద్వారా కొనుగోలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా మరో రూ. 726 కోట్లను నగదు రూపంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. లావాదేవీ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు 4.1% వాటాను పొందనుంది. విలీనంవైపు..: పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే ఎక్సైడ్ లైఫ్‌ను విలీనం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏతోపాటు, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. వీటితోపాటు రెండు కంపెనీల వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక కొనుగోలు లావాదేవీని పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. దేశీ బీమా రంగంలో ఈ డీల్ ల్యాండ్‌మార్క్ వంటిదని హెచ్డీఎఫ్సీ లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. దీంతో మరింత మందికి బీమా రక్షణ లభించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్సైడ్ బ్రాండు వినియోగానికి రెండేళ్ల కాలపరిమితి లభించనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో విభా పడల్కర్ వెల్లడించారు. ఎక్సైడ్ లైఫ్ తీరిదీ..: 2001–02లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎక్సైడ్ లైఫ్ 2021 జూన్‌కల్లా రూ.2,711 కోట్ల అసలు విలువను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో మొత్తం రూ. 3,325 కోట్ల విలువైన ప్రీమియంను అందుకుంది. జూన్‌కల్లా రూ. 18,780 కోట్ల విలువైన ఏయూఎంను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం పతనమై రూ. 734 వద్ద ముగిసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ముగిసింది. -
జీవిత బీమా షేర్లు ప్లస్సూ.. మైనస్సూ!
కోవిడ్-19 నేపథ్యంలోనూ జూన్‌లో కొత్త బిజినెస్ ప్రీమియం(ఎన్బీపీ)లపై పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించకపోవడంతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఏప్రిల్- మే నెలల స్థాయిలోనే ఎన్‌బీపీలు క్షీణించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లో మాత్రం అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం.. రికవరీ బాట కరోనా వైరస్ సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జీవిత బీమా కంపెనీల ఎన్‌బీపీలు వార్షిక ప్రాతిపదికన 32.6 శాతం క్షీణించాయి. మే నెలలోనూ 25.4 శాతం వెనకడుగు వేయగా.. జూన్‌లో 10.5 శాతమే తగ్గాయి. వెరసి జూన్‌లో జీవిత బీమా కంపెనీల మొత్తం ఎన్‌బీపీలు రూ. 28,869 కోట్లను తాకాయి. లాభాలలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 2.2 శాతం లాభంతో రూ. 858 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 872 వరకూ జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.3 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 600 వరకూ జంప్‌చేసింది. నేలచూపు.. జూన్‌లో ఎన్‌బీపీలు 37 శాతం క్షీణించి రూ. 565 కోట్లను తాకినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇవి 32.6 శాతం తక్కువగా రూ. 1499 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ ప్రు లైఫ్ షేరు 3.5 శాతం పతనమై రూ. 418 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 416 వరకూ నీరసించింది. -
ఇన్సూరెన్స్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా..!?
స్టాక్ మార్కెట్ నుంచి వేదాంత షేరు స్వచ్ఛందంగా డీలిస్ట్ కావడంతో దాని స్థానంలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరును చేర్చారు. అలాగే ఆగస్ట్ చివరిలో నిఫ్టీ-50 ఇండెక్స్ మార్పు చేర్పుల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ షేరు స్థానంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో నిఫ్టీ-50 ఆదాయ వృద్ధి ప్రొఫైల్‌ను మెరుగుపడుతుందని ఇండెక్స్‌లో నాన్లెండింగ్ ఫైనాన్స్ సర్వీస్ స్టాక్‌ల వెయిటేజీని పెంచుతుందని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఇండెక్స్ నుంచి ఒక షేరు తొలగించినంత మాత్రమే షేరును అమ్మకం గానీ, అలాగే చేర్చిన షేరును కొనుగోలు చేయడం మంచి పద్దతి కాదని వారంటున్నారు. ఇండెక్స్‌లో స్థానం ఇందుకే: నిఫ్టీ-50 ఇండెక్స్‌లో చేర్పు/తొలిగింపు అనే అంశం సంబంధిత స్టాక్ పనితీరు ప్రతిబింబిస్తుంది. అలాగే మార్కెట్లో ఆయా రంంగాల డిమాండ్‌ను తెలియజేస్తుంది. భారత్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌కు అధిక సామర్థ్యం ఉంది. అందుకే ఇన్సూరెన్స్ స్టాకులను ఇండెక్స్‌లో స్థానం కల్పిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ‘‘భారత్‌లో గత 17ఏళ్లలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ దాదాపు 15శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మార్కెట్లో 50శాతం వాటాను కలిగి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో భీమా వ్యాపారం తక్కువగా ఉంది. దేశం వృద్ధిని సాధిస్తే గొప్ప పనితీరును కనబరిచే రంగాల్లో ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటిగా ఉంటుంది. దీర్ఘకాలికం దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లలో పెట్టబడులు పెట్టవచ్చు.’’ అని ఐడీబీఐ క్యాపిటల్ రీటైల్ హెచ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ తన అభిప్రాయాలను తెలిపింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: ఏజెంట్‌కు చెల్లించే కమిషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అత్యల్పంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 23వేల ఎస్బీఐ శాఖల ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతుంది. ఈ రెండు అంశాలు కంపెనీ వ్యయాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎస్బీఐలో లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి, అది వ్యాపారంగా రూపాంతరం చెందితే, అది చాలా బాగా పనిచేయవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ తెలిపింది. అలాగే షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.892గా నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్: ఇండెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత రీ-రేటింగ్‌ను చూడవచ్చు. కోవిడ్-19 సంక్షోభంతో చాలా కస్టమర్లు ప్రీమియం చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ ఏడాది అది ఆశించిన స్థాయిలో రాణించకపోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మంచి రాణించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాల ప్రదర్శన దృష్టా్య షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను రూ.568 గా నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లతో పాటు మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ జోరు- మదర్సన్ డీలా
మార్కెట్ల ప్రధాన ఇండెక్సులలో ఒకటైన నిఫ్టీ-50లో చోటు సాధించనుండటంతో ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క బిజినెస్ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు వెల్లడించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం మదర్సన్ సుమీ సిస్టమ్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. మదర్సన్ సుమీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు(31) నుంచీ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ-50లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చోటు లభించనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌కానున్న వేదాంతా లిమిటెడ్ స్థానంలో హెచ్డీఎఫ్సీ లైఫ్‌కు చోటు సాధిస్తోంది. నిఫ్టీ ఇతర ఇండెక్సులలో ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్స్ షేరు వేదాంతా ను రీప్లేస్ చేయనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. మెటల్ ఇండెక్స్‌లో మాత్రం వేదాంతా స్థానే పీఎస్‌యూ మిధానీ చోటు సంపాదించనుంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 572 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 576 వరకూ ఎగసింది. మదర్సన్ సుమీ సిస్టమ్స్ వ్యవస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ఆటో విడిభాగాల దిగ్గజం మదర్సన్ సుమీ సిస్టమ్స్ తాజాగా ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీ వైరింగ్, హారన్ బిజినెస్‌ను అనుబంధ సంస్థగా విడదీయనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో సంవర్ధన మదర్సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్‌ను విలీనం చేసుకోనున్నట్లు పేర్కొంది. తదుపరి కాలంలో వైరింగ్ బిజినెస్ కలిగిన కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో మదర్సన్ సుమీ కౌంటర్ బలహీనపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 98 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 94 వరకూ తిరోగమించింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్- అరబిందో జోరు
ఆటుపోట్ల మధ్య వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఉదయం 10.40 ప్రాంతంలో సెన్సెక్స్ 69 పాయింట్లు పుంజుకుని 34,179కు చేరగా.. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,081 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ 1.28 శాతం ఈక్విటీ వాటాను విక్రయించిన వార్తలతో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్ బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 524 వరకూ ఎగసింది. గత రెండు వారాలలో ఈ కౌంటర్ 9 శాతం పుంజుకోవడం గమనార్హం! షేరుకి రూ. 490.22 ధరలో హెచ్డీఎఫ్సీ బల్క్‌డీల్ ద్వారా 2.6 కోట్ల హెచ్డీఎఫ్సీ లైఫ్ ఈక్విటీ షేర్లను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 1275 కోట్లు. కాగా.. భాగస్వామ్య సంస్థ స్టాండర్డ్ లైఫ్ సైతం హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 2 శాతం వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అరబిందో ఫార్మా నికర లాభం 45 శాతం ఎగసి రూ. 850 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6158 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో అరబిందో కౌంటర్‌కు న్యూట్రల్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ పేర్కొంది. రూ. 665 టార్గెట్‌ను ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అరబిందో షేరు 2.7 శాతం లాభపడి రూ. 770 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 791 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. క్యూ4లో అరబిందో మంచి పనితీరును చూపినట్లు క్రెడిట్ స్వీస్ తెలియజేసింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన అమెరికాలో ఇంజక్టబుల్స్ అమ్మకాలు 23 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. -
85 ఏళ్ల వరకు కవరేజీ
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారుల అవసరాలను గుర్తిస్తూ ప్రజాదరణ పొందిన ‘క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్’ ప్లాన్‌లో బీమా కవరేజీ గరిష్ట వయసును పెంచింది. ఇప్పటి వరకు గరిష్టంగా 75 ఏళ్లు వచ్చే వరకే బీమా కవరేజీ పొందే ఆప్షన్ ఇందులో ఉండగా, దీన్ని 85 సంవత్సరాలు చేసింది. తమ నిరంతర ఉత్పత్తుల పరిశోధనలో భాగంగా... మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవనంతో పెరుగుతున్న ఆయుర్దాయం నేపథ్యంలో గరిష్ట వయసు వరకు (రిటైర్మెంట్ తర్వాత కూడా) పాలసీదారులకు బీమా అవసరాన్ని గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. దీనికితోడు యువతలో టర్మ్ ప్లాన్లపై అవగాహన పెరుగుతున్న దృష్ట్యా క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్ పాలసీలో గరిష్ట కాలాన్ని 85 ఏళ్ల వరకు పెంచామని, 85లో తమ వయసును తీసివేయగా మిగిలిన కాలానికి కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. లైఫ్ ఆప్షన్, ఎక్స్ట్రా లైఫ్ ఆప్షన్, 3డీ లైఫ్ ఆప్షన్ అలాగే, మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం తిరిగి చెల్లించే ఆప్షన్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభం రూ.364 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బీమా కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ4లో రూ.364 కోట్ల నికర లాభం సాధించామని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. పరిశ్రమని మించిన వృద్ధిని సాధిస్తున్నామని, లాభదాయకతలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ విభా పడాల్కర్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,109 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.1,277 కోట్లకు పెరిగిందని విభా పేర్కొన్నారు. మార్కెట్ వాటా పరంగా కొత్త వ్యాపార ప్రీమియమ్ 19.1 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ. 399.35 వద్ద ముగిసింది. -
బ్రీఫ్స్..
హెచ్డీఎఫ్సీ క్లిక్ 2 రిటైర్ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘క్లిక్ 2 రిటైర్’ పేరుతో యూనిట్ లింక్డ్ ఆన్లైన్ రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో మాత్రమే లభించే ఈ పథకానికి ప్రీమియం ఒకేసారిగా లేదా కాలపరిమితి పూర్తయ్యే వరకు చెల్లించవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. అతి తక్కువ వ్యయాలతో రూపొందించిన ఈ పథకంలో 100 శాతం ప్రీమియంను ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ పేర్కొంది. చెల్లించిన ప్రీమియంపై 101 శాతం నుంచి 135 శాతం లేదా ఫండ్ వేల్యూ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది బీమా రక్షణగా ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం అలకేషన్, పాలసీ అడ్మినిస్ట్రేషన్, డిస్కంటిన్యూ చార్జీలు ఏమీ లేకపోవడం ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణలు. ఐడీబీఐ డివిడెండ్ ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈక్విటీ అడ్వాంటేజ్ పథకంపై 14 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీని సెప్టెంబర్ 15గా నిర్ణయించారు. మంగళవారంలోగా యూనిట్లు కలిగిన ప్రతీ యూనిట్‌పై రూ. 1.40 డివిడెండ్‌గా లభిస్తుంది. ప్రస్తుతం యూనిట్ విలువ రూ. 19.33గా ఉంది. ఐసీఐసీఐ బిజినెస్ సైకిల్ ఫండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ బిజినెస్ సైకిల్ ఫండ్‌లో మొదటి సిరీస్‌ను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1,281 రోజులు వరకు వైదొలగడానికి వీలులేదు. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ. 5,000. ఎల్ఐసీ ఫిక్స్డ్ టర్మ్ ఎల్ఐసీ నొమూరా మ్యూచులవ్ ఫండ్ సంస్థ డ్యూయల్ అడ్వాంటేజ్ ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్‌లో సిరీస్2ను విడుదల చేసింది. ఈ పథకం కాలపరిమితి 43 నెలలు. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తంలో గరిష్టంగా 35 శాతం ఈక్విటీల్లో మిగిలిన మొత్తం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సెప్టెంబర్ 10న ప్రారంభమైన ఎన్ఎఫ్వో సెప్టెంబర్ 24తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 5,000.