
ముంబై: ప్రైవేట్ రంగ బీమా కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ4లో రూ.364 కోట్ల నికర లాభం సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తెలిపింది. పరిశ్రమని మించిన వృద్ధిని సాధిస్తున్నామని, లాభదాయకతలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ విభా పడాల్కర్ తెలిపారు.
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,109 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.1,277 కోట్లకు పెరిగిందని విభా పేర్కొన్నారు. మార్కెట్ వాటా పరంగా కొత్త వ్యాపార ప్రీమియమ్ 19.1 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ. 399.35 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment