
న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్ నికర లాభం మార్చి క్వార్టర్‌లో 28 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.43 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.923 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.1,189 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
ఒక్కో ఈక్విటీ షేర్‌కు 75 పైసలు డివిడెండ్‌గా ఇవ్వనున్నామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం ç 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.3,583 కోట్ల నుంచి 10% పెరిగి రూ.3,939 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేర్ 1.6 శాతం లాభంతో రూ.372 వద్ద ముగిసింది.