JK Lakshmi Cement
-
జేకే లక్ష్మీ సిమెంట్ జోరు- చెన్నై పెట్రో పతనం
ప్రోత్సాహకర విదేశీ సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు ఎగసి 30,956కు చేరగా.. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 9,105 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో చెన్నై పెట్రోలియం కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్ లాభాలతో సందడి చేస్తుంటే.. చెన్నై పెట్రోలియం షేరు డీలా పడింది. వివరాలు చూద్దాం.. జేకే లక్ష్మీ సిమెంట్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జేకే లక్ష్మీ సిమెంట్ రూ. 99 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 143 శాతం అధికంకాగా..మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం క్షీణించి రూ. 1157 కోట్లకు పరిమితమైంది. ఇబిటా రూ. 148 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు ఎగసింది. లాజిస్టిక్ వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టుల విక్రయాలు పుంజుకోవడం తదితరాలు లాభదాయకత మెరుగుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో జేకే లక్ష్మీ సిమెంట్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 211 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 218 వరకూ ఎగసింది. బుధవారం సైతం ఈ షేరు 2.5 శాతం పెరిగి రూ. 200 సమీపంలో ముగిసింది. చెన్నై పెట్రోలియం గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో చెన్నై పెట్రోలియం నికర నష్టం భారీగా పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టం రూ. 25 కోట్ల నుంచి రూ. 1625 కోట్లకు ఎగసింది. మొత్తం అమ్మకాలు సైతం 14 శాతం క్షీణించి రూ. 8585 కోట్లకు పరిమితమయ్యాయి. చమురు బ్యారల్‌పై సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 3.7 డాలర్ల నుంచి 1.2 డాలర్లకు నీరసించాయి. చమురు ధరల పతనంకారణంగా నిల్వలపై నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. ఇది మార్జిన్లను ప్రభావితం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో చెన్నై పెట్రోలియం షేరు 5 శాతం పతనమై రూ. 51 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 50 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. -
జేకే లక్ష్మీ సిమెంట్ లాభం రూ.43 కోట్లు
న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్ నికర లాభం మార్చి క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.43 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.923 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.1,189 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 75 పైసలు డివిడెండ్‌గా ఇవ్వనున్నామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం ç 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.3,583 కోట్ల నుంచి 10% పెరిగి రూ.3,939 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేర్ 1.6 శాతం లాభంతో రూ.372 వద్ద ముగిసింది. -
జేకే లక్ష్మి సిమెంట్ 15 శాతం డివిడెండ్
న్యూఢిల్లీ: జేకే లక్ష్మి సిమెంట్ క్యూ4లో రూ.34 కోట్ల (స్టాండెలోన్) నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 21 కోట్లతో పోలిస్తే ఇది 62 % అధికం. తాజాగా క్యూ4లో ఆదాయం రూ. 923 కోట్లు కాగా, గత క్యూ4లో రూ. 931 కోట్లు. గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని సంస్థ తెలిపింది. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై 0.75 పైసలు చొప్పున (15%) డివిడెండ్ చెల్లించాలంటూ కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. కాగా పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జేకే లక్ష్మి సిమెంట్ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 87 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం రూ. 3,414 కోట్ల నుంచి రూ. 3,929 కోట్లకు పెరిగింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 0.04% పెరిగి రూ. 383 వద్ద ముగిసింది. -
ఆన్లైన్లో జేకే లక్ష్మి సిమెంట్ ఉత్పత్తులు
ముంబై: జేకే లక్ష్మి సిమెంట్ ఉత్పత్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని జేకే లక్ష్మి సిమెంట్ శుక్రవారం తెలిపింది. తమ ఉత్పత్తులు-సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆర్ఎంసీ, ఏఏసీ బ్లాక్‌లు, జిప్సమ్ ప్లాస్టర్ తదితర ఉత్పత్తులను ఆన్లైన్లో స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ హోల్ టైమ్ డెరైక్టర్ శైలేంద్ర చోక్సి తెలిపారు. ఈ తరహా ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అందిస్తున్న తొలి కంపెనీ తమదేనని పేర్కొన్నారు. కనీస ఆర్డర్ పది బ్యాగ్‌లకు తగ్గకూడదని వివరించారు.