![ఆన్‌లైన్‌లో జేకే లక్ష్మి సిమెంట్ ఉత్పత్తులు](/styles/webp/s3/article_images/2017/09/3/71430507525_625x300.jpg.webp?itok=fWVKW4i6)
ఆన్‌లైన్‌లో జేకే లక్ష్మి సిమెంట్ ఉత్పత్తులు
ముంబై: జేకే లక్ష్మి సిమెంట్ ఉత్పత్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని జేకే లక్ష్మి సిమెంట్ శుక్రవారం తెలిపింది. తమ ఉత్పత్తులు-సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆర్‌ఎంసీ, ఏఏసీ బ్లాక్‌లు, జిప్సమ్ ప్లాస్టర్ తదితర ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ హోల్ టైమ్ డెరైక్టర్ శైలేంద్ర చోక్సి తెలిపారు. ఈ తరహా ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న తొలి కంపెనీ తమదేనని పేర్కొన్నారు. కనీస ఆర్డర్ పది బ్యాగ్‌లకు తగ్గకూడదని వివరించారు.