ముంబై: జీవిత బీమా రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పనితీరు జూన్ త్రైమాసికంలో అంచనాలకు అందుకుంది. నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు చేరుకుంది. పాలసీల రెన్యువల్ నిష్పత్తి గరిష్ట స్థాయిలో ఉండడం మార్జిన్లు పెరిగేందుకు దారితీసింది.
మొత్తం ప్రీమియం ఆదాయం 23 శాతం పెరిగి రూ.9,396 కోట్లుగా నమోదైంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7,656 కోట్లుగా ఉంది. దీన్ని మరింత వివరంగా చూస్తే.. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి) 27 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment