స్టాక్ మార్కెట్ నుంచి వేదాంత షేరు స్వచ్ఛందంగా డీలిస్ట్ కావడంతో దాని స్థానంలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరును చేర్చారు. అలాగే ఆగస్ట్ చివరిలో నిఫ్టీ-50 ఇండెక్స్ మార్పు చేర్పుల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు స్థానంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో నిఫ్టీ-50 ఆదాయ వృద్ధి ప్రొఫైల్‌ను మెరుగుపడుతుందని ఇండెక్స్‌లో నాన్‌లెండింగ్ ఫైనాన్స్ సర్వీస్ స్టాక్‌ల వెయిటేజీని పెంచుతుందని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఇండెక్స్ నుంచి ఒక షేరు తొలగించినంత మాత్రమే షేరును అమ్మకం గానీ, అలాగే చేర్చిన షేరును కొనుగోలు చేయడం మంచి పద్దతి కాదని వారంటున్నారు.
ఇండెక్స్‌లో స్థానం ఇందుకే:
నిఫ్టీ-50 ఇండెక్స్‌లో చేర్పు/తొలిగింపు అనే అంశం సంబంధిత స్టాక్ పనితీరు ప్రతిబింబిస్తుంది. అలాగే మార్కెట్లో ఆయా రంంగాల డిమాండ్‌ను తెలియజేస్తుంది. భారత్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌కు అధిక సామర్థ్యం ఉంది. అందుకే ఇన్సూరెన్స్ స్టాకులను ఇండెక్స్‌లో స్థానం కల్పిస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు.
‘‘భారత్‌లో గత 17ఏళ్లలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ దాదాపు 15శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మార్కెట్లో 50శాతం వాటాను కలిగి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో భీమా వ్యాపారం తక్కువగా ఉంది. దేశం వృద్ధిని సాధిస్తే గొప్ప పనితీరును కనబరిచే రంగాల్లో ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటిగా ఉంటుంది. దీర్ఘకాలికం దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లలో పెట్టబడులు పెట్టవచ్చు.’’ అని ఐడీబీఐ క్యాపిటల్ రీటైల్ హెచ్ ఏకే ప్రభాకర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ తన అభిప్రాయాలను తెలిపింది.
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: ఏజెంట్‌కు చెల్లించే కమిషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అత్యల్పంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 23వేల ఎస్‌బీఐ శాఖల ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతుంది. ఈ రెండు అంశాలు కంపెనీ వ్యయాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎస్‌బీఐలో లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి, అది వ్యాపారంగా రూపాంతరం చెందితే, అది చాలా బాగా పనిచేయవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ తెలిపింది. అలాగే షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.892గా నిర్ణయించింది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్: ఇండెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత రీ-రేటింగ్‌ను చూడవచ్చు. కోవిడ్-19 సంక్షోభంతో చాలా కస్టమర్లు ప్రీమియం చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ ఏడాది అది ఆశించిన స్థాయిలో రాణించకపోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మంచి రాణించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాల ప్రదర్శన దృష్టా‍్య షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను రూ.568 గా నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లతో పాటు మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment