SBI Life Insurance
-
ఎస్బీఐ లైఫ్ లాభం అప్
ముంబై: ప్రయివేట్ రంగ జీవిత బీమా దిగ్గజం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1,083 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం, మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వ్యక్తిగత కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం జంప్‌చేసి రూ. 17,762 కోట్లను తాకింది. వార్షిక ప్రీమియం పాలసీల ఆదాయం(ఏపీఈ) 17 శాతం పుంజుకుని రూ. 14,389 కోట్లయ్యింది. కొత్త బిజినెస్ విలువ(వీఎన్‌బీ) 11 శాతం బలపడి రూ. 4,038 కోట్లకు చేరింది. వీఎన్‌బీ మార్జిన్ 28.1 శాతంగా నమోదైంది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ. 21,512 కోట్ల నుంచి రూ. 26,000 కోట్లకు పురోగమించింది. రక్షణ సంబంధ కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం అధికమై రూ. 2,972 కోట్లుగా నమోదైంది. యాన్యుటీ, పెన్షన్ కొత్త బిజినెస్ 12 శాతం వృద్ధితో రూ. 6,787 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,381 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 24/7 ఇన్‌బౌండ్ కాంటాక్ట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఎస్బీఐ లైఫ్ ఆఫర్ చేసే పాలసీలకు సంబంధించి అన్ని రకాల విచారణలకు, కొనుగోలుకు ముందు, కొనుగోలు తర్వాత కావాల్సిన సమాచారాన్ని ఈ కాంటాక్ట్ సెంటర్ ద్వారా పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి చార్జీలు పడని 18002679090 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది. 24/7 కాంటాక్ట్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు రంగ బీమా సంస్థ తమదేనని తెలిపింది. ఈ కాల్ సెంటర్ ఏడాదిలో అన్ని రోజులు, అన్ని సమయాల్లోనూ సేవలు అందిస్తుంది. (రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం) ఇదీ చదవండి: ఆటోసార్లో టాటా టెక్నాలజీస్ న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ తాజాగా ఆటోమోటివ్ ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో (ఆటోసార్) చేరింది. ఇంటెలిజెంట్ మొబిలిటీ కోసం ప్రామాణిక సాఫ్ట్వేర్ ఫ్రేమ్‌వర్క్, ఓపెన్ ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వ్యవస్థ అభివృద్ధి, స్థాపనకు వాహన, సాఫ్ట్వేర్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలతో అంతర్జాతీయంగా ఆటోసార్ వేదిక ఏర్పడింది. బీఎండబ్లు్య, ఫోక్స్‌వ్యాగన్, టయోటా, ఫోర్డ్, జీఎం, దైమ్లర్ క్రిస్లర్, బాష్, సీమెన్స్ వంటి 280కిపైగా సంస్థలు ఇందులో ఉన్నాయి. (పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం) -
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
7 దిగ్గజ కంపెనీలకు అప్పులు అసలే లేవు, ఆదాయం మాత్రం లక్షల కోట్లలోనే!
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ దేశ ఆర్ధిక వృద్ది కోసం ఆర్బీఐ స్వల్ప కాలానికి తక్కువ వడ్డీ రేట్లను అమలు చేసింది. క్రమేపీ ఆ వడ్డీ రేట్లను పెంచింది. ఈ తరుణంలో ఆర్బీఐ అమలు చేసిన తక్కువ ఇంట్రస్ట్ రేట్లతో పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపార కార్యకలాపాల కోసం భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాయి. అయితే రుణాలు తీసుకొని, అనుకున్న ఫలితాలు రాబట్టలేక, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా కొన్ని సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ-50లో నమోదైన మొత్తం 7దిగ్గజ కంపెనీలు సున్నా రుణం లేని సంస్థలుగా అవతరించాయి. ఈ ఏడు నిఫ్టీ 50 కంపెనీలు కలిపి రూ.31 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆ సంస్థల ఆర్ధిక స్థితి గతుల్ని పరిశీలిస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సున్నా రుణంతో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. 12లక్షల మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఆర్ధిక సంవత్సరం 2022లో 26బిలియన్లకు పైగా ఆదాయం గడించింది. 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర లాభంతో కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్‌తో పోటీ పడుతుంది. ఆర్ధిక సంవత్సరం 2022లో దాని ఆదాయం 16 బిలియన్లకు పైగా ఉండగా నికర లాభం దాదాపు 3 బిలియన్లుగా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంది. 14 విభాగాల్లో దాదాపూ 44 బ్రాండ్లతో మార్కెట్‌ను శాసిస్తున్న హెచ్‌యూఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాని ఆదాయం దాదాపు 2.4 నుంచి 6.5 బిలియన్ డాలర్ల వృద్దిని సాధించింది. ఐటీసీ టుబాకో-టు-పేపర్ దిగ్గజం ఐటీసీ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. కాగితం, పొగాకు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో రాణిస్తుంది. కంపెనీ ఆర్ధిక సంవత్సరం 2022లో ఆదాయం 8.4 బిలియన్గా ఉంది. నికర లాభం దాదాపు 2 బిలియన్లకు చేరింది. మారుతీ సుజుకి ఇండియా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సున్నా రుణం లేని సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ 2.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో.. మారుతి సుజుకి ఆర్ధిక సంవత్సరం 11 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.దాని లాభం 497 మిలియన్లకు చేరుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1.08 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఆర్ధిక సంవత్సరం ఆదాయం 10.6 బిలియన్లు కాగా, నికర ఆదాయం 193 మిలియన్లుగా ఉంది. దివీస్ లాబొరేటరీస్ రూ.96వేల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఫార్మా రంగం నుండి రుణ రహిత సంస్థగా దివిస్ లాబొరేటరీస్ అవతరించింది. జెనరిక్స్, న్యూట్రాస్యూటికల్ తయారీ కంపెనీ దివీస్ ఆదాయం1.2 బిలియన్లు కాగా నికర లాభం 378 మిలియన్లుగా ఉంది. చదవండి👉బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా! కానీ.. -
SBI Life: గిల్ట్ ఫ్రీ మామ్స్.. ప్రత్యేకతలు ఇవే!
ముంబై: పిల్లల సంరక్షణ బాధ్యతల్లో నిత్యం తలమునకలయ్యే తల్లులు తమ సొంత అవసరాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చాటి చెప్పేలా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గిల్ట్ఫ్రీమామ్స్ పేరిట డిజిటల్ ఫిలిమ్ ఆవిష్కరించింది. సాధారణంగా పిల్లలు పుట్టాక మహిళలు తమకు ఇష్టమైన వ్యాపకాల వైపు మళ్లాలంటే కొంత అపరాధ భావనతో జంకుతుంటారని ఎస్బీఐ లైఫ్ సీఎస్ఆర్ విభాగం చీఫ్ రవీంద్ర శర్మ తెలిపారు. అలాంటి సంకోచాలను పక్కన పెట్టి ఇటు వ్యక్తిగత అవసరాలు, అటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు తల్లులు పాటించతగిన విధానాలను ఈ వీడియోలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. శ్రేయా గౌతమ్, యువికాఆబ్రోల్ మొదలైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ఫిలిమ్‌లో తమ ప్రస్థానాలను వివరించారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త! -
భారీగా పెరిగిన జీవిత బీమా పాలసీల ప్రీమియం వసూళ్లు: ఐఆర్డీఐఏ
జీవిత బీమా పాలసీల తొలి ప్రీమియం వసూళ్లు నవంబరులో 42 శాతం మేరకు పెరిగాయి. జీవిత బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది నవంబర్ నెలలో దాదాపు 42 శాతం పెరిగి రూ.27,177.26 కోట్లకు చేరుకుందని ఐఆర్డీఐఏ డేటా వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు కలిపి రూ.19,159.30 కోట్ల మేరకు బీమా ప్రీమియాన్ని ఆర్జించాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఐఏ) వెల్లడించిన డేటా ప్రకారం.. భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు 32 శాతానికి పైగా పెరిగి మొత్తం రూ.15,967.51 కోట్లను వసూలు చేసింది. ప్రైవేట్ రంగానికి చెందిన మిగతా 23 సంస్థలూ కలిపి 58.63శాతం వృద్ధితో రూ.11,209.75 కోట్లను వసూలు చేశాయి. గత ఏడాది క్రితం ఈ ప్రీమియం వసూళ్లు రూ.7,066.64 కోట్లు. క్యుమిలేటివ్ ప్రాతిపదికన ఏప్రిల్-నవంబర్ కాలంలో అన్ని బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే నుంచి 8.46శాతం పెరిగి, రూ.1,80,765 కోట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఎల్ఐసీ మొదటి ఏడాది ప్రీమియం వాటా 0.93 శాతం తగ్గి రూ.1,14,580.89 కోట్లకు పడిపోయింది. మిగత ప్రైవేటు బీమా సంస్థలు ఈ ఎనిమిది నెలల కాలంలో 30 శాతం వృద్ధితో రూ.66,184.52 కోట్లు వసూలు చేశాయి. మార్కెట్ ఆధిపత్యం పరంగా ఎల్ఐసీ అత్యధిక వాటాను 63.39 శాతంగా కలిగి ఉంది. ఆ తర్వాత ఎస్బీఐ లైఫ్ 8.77, హెచ్డీఎఫ్సీ లైఫ్ 7.86%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 4.91%, మ్యాక్స్ లైఫ్ 2.36%, బజాజ్ అలియాంజ్ లైఫ్ 2.62% మార్కెట్ వాటా సాధించాయి. (చదవండి: స్టాక్ మార్కెట్లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు!) -
ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ
ముంబై: ప్రైవేట్ రంగ బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘ఈషీల్డ్ నెక్ట్స్’ ప్లాన్ ఆవిష్కరించింది. జీవితంలో వివిధ దశలకు (వివాహం, ఇంటి కొనుగోలు మొదలైనవి) అనుగుణంగా కవరేజీ పెరిగే సౌలభ్యం ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత. లెవెల్ కవర్, పెరిగే కవరేజీ ప్రయోజనం, ఫ్యూచర్ ప్రూఫింగ్ ప్రయోజనంతో లెవెల్ కవర్ అంటూ మూడు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఎంచుకున్న ఆప్షనే చివరిదాకా కొనసాగుతుంది. మధ్యలో మార్చుకోవడానికి ఉం డదు. రెగ్యులర్‌గా లేదా ఏకమొత్తంగా లేదా పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపారు. -
ఎస్బీఐ లైఫ్‌కు స్టోక్..కార్లయిల్ ఔట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వైదొలగింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.9 శాతం వాటాను విక్రయించింది. షేరుకి రూ. 1,130 సగటు ధరలో ఎస్బీఐ లైఫ్లోగల 1.9 శాతం వాటాను అనుబంధ సంస్థ సీఏ ఎమరాల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 2,147 కోట్లు. 2021 జూన్‌కల్లా ఎస్బీఐ లైఫ్‌లో సీఏ ఎమరాల్డ్ 1.9 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. ఈ షేర్లను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింగపూర్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలతోపాటు. పలు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.5 శాతం బలపడి రూ. 1,151 వద్ద ముగిసింది. -
ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, కోవిడ్–19 క్లెయిములు భారీగా పెరిగాయ్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 220 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 390 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 క్లెయిములకు చెల్లింపులు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో 8,956 క్లెయిములు నమోదైనట్లు వెల్లడించింది. ఇవి 2020–21 పూర్తి ఏడాదితో పోలిస్తే దాదాపు 1.3 రెట్లు అధికమని తెలియజేసింది. దీంతో నికర రీఇన్సూరెన్స్ రూ. 570 కోట్లుగా నమోదైంది. ప్రీమియంల తీరు క్యూ1లో ఎస్బీఐ లైఫ్ స్థూల రిటెన్ ప్రీమియం 10 శాతం పుంజుకుని రూ. 8,380 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ ప్రీమియం 9 శాతం వృద్ధితో రూ. 3,350 కోట్లకు చేరగా.. వ్యక్తిగత విభాగంలో 37 శాతం అధికంగా రూ. 1,840 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ విలువ(వీవోఎన్‌బీ) 52 శాతం జంప్‌చేసి రూ. 390 కోట్లయ్యింది. రూ. 1,390 కోట్ల వ్యక్తిగత రేటెడ్ ప్రీమియంతో కంపెనీ ప్రయివేట్ మార్కెట్లో 18.9 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వివరించింది. నిర్వహణలోని ఆస్తులు 32 శాతం బలపడి రూ. 2.3 లక్షల కోట్లను తాకగా.. కోవిడ్ సంబంధ క్లెయిముల కోసం రూ. 440 కోట్ల అదనపు రిజర్వులను ఏర్పాటు చేసింది. చదవండి: అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా -
ఎస్బీఐ లైఫ్ నుంచి బీఎన్పీ పరిబాస్ ఎగ్జిట్!
ముంబై: దేశీ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), గ్లోబల్ దిగ్గజం బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 5.2 శాతం వాటాను బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ విక్రయించేందుకు నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బ్లాక్ డీల్ ద్వారా ఈ వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా 5.2 శాతం వాటాకు రూ. 4,312 కోట్లు లభించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు శుక్రవారం రూ. 863 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 8 శాతం లాభపడింది. విక్రయాల బాట దేశీ భాగస్వామ్య సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను గత రెండేళ్లుగా యూరోపియన్ దిగ్గజం బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ విక్రయిస్తూ వస్తోంది. 2019 జూన్‌లో ఎస్బీఐ లైఫ్‌లో 2.5 శాతం వాటాను బీఎన్పీ పరిబాస్ రూ. 1,625 కోట్లకు విక్రయించింది. ఈ బాటలో 2019 మార్చిలో 5 శాతం వాటాను రూ. 2,889 కోట్లకు అమ్మివేసింది. తదుపరి మరో 9.2 శాతం వాటాను రూ. 4,751 కోట్లకు విక్రయించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కంటే బ్లాక్‌డీల్ ద్వారా వాటా విక్రయాన్ని వేగంగా చేపట్టవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్‌లో ప్రమోటర్‌గా ఉన్న బీఎన్పీ పరిబాస్ కార్డఫ్కు 5.2 శాతం వాటా మాత్రమే ఉంది. మరోవైపు ఈ జేవీలో ప్రమోటర్‌గా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 55 శాతం వాటాను కలిగి ఉంది. 5 శాతం మించితే కంపెనీ ఈక్విటీలో 5 శాతం వాటాకు మించి విక్రయం, కొనుగోలు లేదా తనఖా చేపట్టదలిస్తే.. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుందంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2020 జులైలో స్పష్టం చేసింది. కాగా.. బీఎన్పీ పరిబాస్ వాటా విక్రయ అంశంపై ఎస్బీఐ లైఫ్.. మార్కెట్ అంచనాలపై తాము స్పందించబోమంటూ వ్యాఖ్యానించింది. జేవీ బ్యాక్‌గ్రౌండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2001లో భాగస్వామ్య సంస్థ(జేవీ)గా ఏర్పాటైంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్, బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ ప్రమోటర్లు కాగా.. 2017 అక్టోబర్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికల్లా బీమా రంగ మార్కెట్లో 11.7 శాతం వాటాను కలిగి ఉంది. బీమా రంగ గ్లోబల్ కంపెనీ బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ 33 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 2019లో 29.8 బిలియన్ యూరోల స్థూల రిటెన్ ప్రీమియంల విలువను సాధించింది. -
నిఫ్టీలో దివీస్ ల్యాబ్- ఎస్బీఐ లైఫ్- షేర్ల జోరు
మార్కెట్ల నడకను ప్రతిబింబించే ప్రధాన ఇండెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీలో చోటు లభిస్తున్న వార్తలతో ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్.. బీమా రంగ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్ 25 నుంచీ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ-50కి ఈ రెండు కంపెనీలూ ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇందుకు వీలుగా భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లను నిఫ్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ కౌంటర్లకు ఆకర్షణ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ వచ్చే నెల నుంచీ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించనున్న వార్తలతో దివీస్ ల్యాబొరేటరీస్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 3315 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,335 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ1లో దివీస్ ల్యాబ్ నికర లాభం రూ. 272 కోట్ల నుంచి రూ. 492 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు పెరిగిన విషయం విదితమే. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చే నెల నుంచీ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించనున్న వార్తలతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.3 శాతం జంప్‌చేసి రూ. 881 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 890 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ1లో ఎస్బీఐ లైఫ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 390 కోట్లకు ఎగసింది. స్థూల ప్రీమియం 14 శాతం పెరిగి రూ. 7,640 కోట్లకు చేరిన విషయం విదితమే. హెచ్డీఎఫ్సీ లైఫ్ తదుపరి నిఫ్టీలో చోటు సాధించిన రెండో కంపెనీగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నిలవనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎస్బీఐ లాభాల ఖాతా
న్యూఢిల్లీ: ఎస్బీఐ లాభం జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్యాంకు 2.1 శాతం వాటాను జూన్ క్వార్టర్లో విక్రయించడం ద్వారా రూ.1,540 కోట్లను సమకూర్చుకుంది. దీంతో బ్యాంకు స్టాండలోన్ లాభం రూ.4,189 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,312 కోట్లుగా ఉంది. వాటాల విక్రయం అనంతరం ఎస్బీఐ లైఫ్‌లో ఎస్బీఐ వాటా 55.60 శాతానికి తగ్గింది. ఇక బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.70,653 కోట్ల నుంచి రూ.74,458 కోట్లకు వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 36 శాతం పెరిగి రూ.18,061 కోట్లుగా ఉంటే, వడ్డీ ఆదాయం సైతం రూ.62,638 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.66,500 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.24 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గిపోయింది. తగ్గిన మొండిబకాయిలు.. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) గతేడాది ఇదే త్రైమాసికంలో 7.53 శాతంగా ఉంటే, తాజాగా 5.44 శాతానికి క్షీణించాయి. అదే విధంగా నికర ఎన్పీఏలు కూడా 3.07 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమయ్యాయి. ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు కూడా రూ.9,420 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఎన్పీఏలకు బ్యాంకు రూ.11,648 కోట్లను పక్కన పెట్టడం గమనార్హం. ముఖ్యంగా కరోనా కారణంగా ఎగవేతలను దృష్టిలో ఉంచుకుని రూ.1,836 కోట్లను కేటాయించింది. ప్రొవిజన్ కవరేజీ రేషియో 86.32 శాతానికి చేరింది. సీఏఆర్ 13.40 శాతానికి పెరిగింది. సబ్సిడరీలతో కలసి చూస్తే.. కన్సాలిడేటెడ్‌గా ఎస్బీఐ నికర లాభం 62 శాతం దూసుకుపోయింది. రూ.4,776 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.2,950 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.83,274 కోట్ల నుంచి రూ.87,984 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో రుణ వృద్ధి 6.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా రిటైల్ విభాగంలో (వ్యక్తిగత రుణాలు) 12.85 శాతం, విదేశీ బ్రాంచ్‌ల ద్వారా 11 శాతం మేర అధిక రుణాలు పంపిణీ చేసింది. నిధుల సమస్య లేదు.. మూలధన నిధుల పరంగా అదనపు మద్దతు సాయం, క్షీణిస్తున్న నగదు ప్రవాహాల రూపంలో తమకు సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. -
నిఫ్టీ-50లో ఎస్బీఐ లైఫ్, దివీస్, డాబర్!
ఏడాదికి రెండుసార్లు ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే కంపెనీల జాబితాను ఎన్ఎస్ఈ.. సమీక్షిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇండెక్స్ షేర్లలో మార్పులు చేపడుతుంటుంది. సాధారణంగా జనవరి 31, జులై 31న సవరణలు ప్రతిపాదిస్తుంటుంది. నిఫ్టీ-50లో విభిన్న రంగాలకు చెందిన 50 బ్లూచిప్ కంపెనీల షేర్లు ప్రాతినిధ్యం వహించే సంగతి తెలిసిందే. ఈ సారి సమీక్షలో భాగంగా మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్, పీఎస్‌యూ.. గెయిల్ ఇండియా, టెలికం కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ నిఫ్టీలో చోటు కోల్పోవచ్చని తెలుస్తోంది. వీటి స్థానే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్, డాబర్ ఇండియా నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించవచ్చని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక తాజాగా అంచనా వేసింది. 3 నెలలే స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొత్తగా లిస్టయ్యే సెక్యూరిటీల విషయంలో ఆరు నెలలకు బదులుగా మూడు నెలల గణాంకాలనే పరిగణించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఫ్లోటింగ్ స్టాక్ సర్దుబాటులో భాగంగా మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) విధానం ప్రకారం నిఫ్టీ షేర్లలో సవరణలుంటాయని ఐడీబీఐ నివేదిక తెలియజేసింది. ఇండెక్స్ విలువపై ప్రభావం చూపని షేర్ల విభజన, రైట్స్ ఇష్యూ తదితరాలకు సైతం ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. లాభాల్లో ఏస్ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఈ జనవరి నుంచి చూస్తే దివీస్ ల్యాబ్ షేరు 39 శాతం జంప్‌చేయగా.. డాబర్ 7.3 శాతం బలపడింది. అయితే ఎస్బీఐ లైఫ్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, జీ 5-52 శాతం మధ్య క్షీణించాయి. ఇండెక్స్‌లో ఎంపిక చేసుకునే కంపెనీలకు సంబంధించి వ్యాపార పునర్వ్యవస్థీకరణ, అనుబంధ సంస్థల విడతీత తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉంటుందని, అయితే రికార్డ్ డేట్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక వివరించింది. డీలిస్టింగ్ బాట పట్టిన వేదాంతా స్థానే ఇటీవల హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను నిఫ్టీ-50 ఇండెక్స్‌లో పొందుపరచిన విషయం విదితమే. -
జీవిత బీమా షేర్లు ప్లస్సూ.. మైనస్సూ!
కోవిడ్-19 నేపథ్యంలోనూ జూన్‌లో కొత్త బిజినెస్ ప్రీమియం(ఎన్బీపీ)లపై పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించకపోవడంతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఏప్రిల్- మే నెలల స్థాయిలోనే ఎన్‌బీపీలు క్షీణించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లో మాత్రం అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం.. రికవరీ బాట కరోనా వైరస్ సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జీవిత బీమా కంపెనీల ఎన్‌బీపీలు వార్షిక ప్రాతిపదికన 32.6 శాతం క్షీణించాయి. మే నెలలోనూ 25.4 శాతం వెనకడుగు వేయగా.. జూన్‌లో 10.5 శాతమే తగ్గాయి. వెరసి జూన్‌లో జీవిత బీమా కంపెనీల మొత్తం ఎన్‌బీపీలు రూ. 28,869 కోట్లను తాకాయి. లాభాలలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 2.2 శాతం లాభంతో రూ. 858 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 872 వరకూ జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.3 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 600 వరకూ జంప్‌చేసింది. నేలచూపు.. జూన్‌లో ఎన్‌బీపీలు 37 శాతం క్షీణించి రూ. 565 కోట్లను తాకినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇవి 32.6 శాతం తక్కువగా రూ. 1499 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ ప్రు లైఫ్ షేరు 3.5 శాతం పతనమై రూ. 418 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 416 వరకూ నీరసించింది. -
ఇన్సూరెన్స్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా..!?
స్టాక్ మార్కెట్ నుంచి వేదాంత షేరు స్వచ్ఛందంగా డీలిస్ట్ కావడంతో దాని స్థానంలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరును చేర్చారు. అలాగే ఆగస్ట్ చివరిలో నిఫ్టీ-50 ఇండెక్స్ మార్పు చేర్పుల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్ షేరు స్థానంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో నిఫ్టీ-50 ఆదాయ వృద్ధి ప్రొఫైల్‌ను మెరుగుపడుతుందని ఇండెక్స్‌లో నాన్లెండింగ్ ఫైనాన్స్ సర్వీస్ స్టాక్‌ల వెయిటేజీని పెంచుతుందని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఇండెక్స్ నుంచి ఒక షేరు తొలగించినంత మాత్రమే షేరును అమ్మకం గానీ, అలాగే చేర్చిన షేరును కొనుగోలు చేయడం మంచి పద్దతి కాదని వారంటున్నారు. ఇండెక్స్‌లో స్థానం ఇందుకే: నిఫ్టీ-50 ఇండెక్స్‌లో చేర్పు/తొలిగింపు అనే అంశం సంబంధిత స్టాక్ పనితీరు ప్రతిబింబిస్తుంది. అలాగే మార్కెట్లో ఆయా రంంగాల డిమాండ్‌ను తెలియజేస్తుంది. భారత్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌కు అధిక సామర్థ్యం ఉంది. అందుకే ఇన్సూరెన్స్ స్టాకులను ఇండెక్స్‌లో స్థానం కల్పిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ‘‘భారత్‌లో గత 17ఏళ్లలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ దాదాపు 15శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మార్కెట్లో 50శాతం వాటాను కలిగి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో భీమా వ్యాపారం తక్కువగా ఉంది. దేశం వృద్ధిని సాధిస్తే గొప్ప పనితీరును కనబరిచే రంగాల్లో ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటిగా ఉంటుంది. దీర్ఘకాలికం దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లలో పెట్టబడులు పెట్టవచ్చు.’’ అని ఐడీబీఐ క్యాపిటల్ రీటైల్ హెచ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ తన అభిప్రాయాలను తెలిపింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: ఏజెంట్‌కు చెల్లించే కమిషన్ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అత్యల్పంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 23వేల ఎస్బీఐ శాఖల ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతుంది. ఈ రెండు అంశాలు కంపెనీ వ్యయాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎస్బీఐలో లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి, అది వ్యాపారంగా రూపాంతరం చెందితే, అది చాలా బాగా పనిచేయవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ తెలిపింది. అలాగే షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.892గా నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్: ఇండెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత రీ-రేటింగ్‌ను చూడవచ్చు. కోవిడ్-19 సంక్షోభంతో చాలా కస్టమర్లు ప్రీమియం చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ ఏడాది అది ఆశించిన స్థాయిలో రాణించకపోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మంచి రాణించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాల ప్రదర్శన దృష్టా్య షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను రూ.568 గా నిర్ణయించినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లతో పాటు మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐడీబీఐ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
ఎస్బీఐ లైఫ్–సిండికేట్ బ్యాంక్ జట్టు
బెంగళూరు: సిండికేట్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ల మధ్య బ్యాంక్అష్యూరెన్స్ ఒప్పందం కుదిరింది. ఖాతాదారులకు సమగ్రమైన ఫైనాన్షియల్ ప్లానిం గ్ సొల్యూషన్‌ను అందించడానికి ఈ ఒప్పం దం కుదు ర్చుకున్నట్లు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందంపై సిండికేట్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ మృత్యుంజయ్ మహాపాత్ర, ఎస్బీఐ లైఫ్ సీఈఓ, ఎమ్డీ సంజీవ్ నౌతియాల్ సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 3,000 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న సిండికేట్ బ్యాంక్ తన బ్రాంచ్‌ల ద్వారా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన పాలసీలను విక్రయిస్తుంది. ఎసాప్స్ ద్వారా రూ.500 కోట్లు... ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ఎసాప్స్) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేసి రూ.500 కోట్లు సమీకరించనున్నామని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. -
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం11% అప్
న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.225 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.251 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్ ఆదాయం రూ.5,460 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ 0.1 శాతం నష్టంతో రూ.561 వద్ద ముగిసింది. ఎంఫసిస్ లాభం 37 శాతం అప్.. ఐటీ కంపెనీ ఎంఫసిస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 37 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.271 కోట్లకు పెరిగిందని ఎంఫసిస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,642 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.1,962 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎంఫసిస్ షేర్ 4.2 శాతం నష్టంతో రూ.1,075 వద్ద ముగిసింది. -
బ్యాంకులకు.. డబ్బులు కావాలి!!
ముంబై: వసూలుకాని మొండి బకాయిలకు (ఎన్పీఏ) భారీగా నిధులు కేటాయిస్తూ నిధుల కటకటను ఎదుర్కొంటున్న బ్యాంకులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాయి. వ్యాపార కార్యకలాపాలకు నిధులు కరువవటంతో గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీల్లో వాటాలను విక్రయించటం మొదలు పెట్టాయి. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే ఆ దిశగా అడుగులేశాయి. స్టాక్ మార్కెట్లో 34 లిస్టెడ్ బ్యాంకుల ఉమ్మడి ఎన్పీఏలు రూ.9 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటికి చేస్తున్న కేటాయింపులతో నిధులు అడుగంటిపోయిన పరిస్థితుల్లో సబ్సిడరీల్లో తమకున్న వాటాలను అమ్మి సొమ్ము చేసుకోవడం మినహా వాటికి వేరే మార్గం కనిపించడం లేదు. దీంతో సబ్సిడరీల్లో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో లేదా ఏక మొత్తంలో వాటాను ఒకేసారి విక్రయించడమో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వాటాలను విక్రయిస్తే వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల తమ స్టేట్మెంట్లలో ఇతర ఆదాయం లేదా ట్రెజరీ ఆదాయంగా పేర్కొంటాయి. అయితే, సబ్సిడరీల్లో నికర పెట్టుబడి వివరాలు తెలియనందున వాటాల విక్రయం వల్ల ఒనగూరే అసలు ప్రయోజనం ఎంతన్నది వాటాదారులకు తెలియడం కష్టమే. వాటాలను విక్రయించిన బ్యాంకులు గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ తన అనుబంధ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కొంత వాటాలను ఐపీవో ద్వారా విక్రయించింది. దీని ద్వారా రూ.5436 కోట్లను సమీకరించింది. దీంతో ఎస్బీఐ లైఫ్ కూడా లిస్టెడ్ సంస్థగా మారి... ఎస్బీఐ వాటాలకు మరింత విలువ సమకూరేలా మార్గం సుగమం అయింది. ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు సైతం ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఏడు శాతం వాటాలను ఐపీవో ద్వారా విక్రయించి సుమారు రూ.2,100 కోట్ల నిధుల్ని పొందింది. 2017–18లో ఈ వాటాల విక్రయం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు కన్సాలిడేటెడ్ ఖాతాల్లో నికరంగా పొందిన ప్రయోజనం రూ.1,711 కోట్లు. అలాగే, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో 20.78 శాతం వాటాను ఐపీవో ద్వారా విక్రయించి రూ.3,480 కోట్లను సమీకరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2016–17లోనే ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో కొంత వాటాను విక్రయించి రూ.6,000 కోట్ల వరకూ సమకూర్చుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఐడీబీఐ బ్యాంకు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. స్థూల ఎన్పీఏలు 28 శాతానికి చేరాయి. ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే ఎన్ఎస్ఈ, ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాటాల విక్రయం ద్వారా రూ.200 కోట్లు, రూ.112 కోట్ల చొప్పున నిధుల్ని పొందింది. నీరవ్ మోదీ దెబ్బకు చతికిల పడిన పంజాబ్ నేషనల్ బ్యాంకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.3,250 కోట్ల వరకు పొం దింది. యూనియన్ బ్యాంకు సైతం యూనియన్ అసెట్ మేనేజ్మెంట్లో తనకున్న 39.62% వాటాను సహ భాగస్వామి దైచీ లైఫ్ హోల్డింగ్స్ కొనుగోలు చేసినట్టు ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాదిలో మరిన్ని... ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వాటాల విక్రయాన్ని కొనసాగించనుంది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో 3–5% వాటాలు, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌లో 24–49 శాతం వరకు వాటాను అమ్మే ప్రణాళికలతో ఉంది. తమ సబ్సిడరీలన్నీ చక్కటి పనితీరును ప్రదర్శిస్తున్నాయని, ప్రస్తుత ఏడాది, వచ్చే ఏడాది కూడా వాటిలోని వాటాల నుంచి సొమ్ము చేసుకోవడం జరుగుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని 2019– 20లో లిస్ట్ చేయాలనుకుంటున్నట్టు ఎస్బీఐ ఎండీ దినేష్ ఖరా చెప్పారు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు తన సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లిస్ట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక బ్యాంకు: యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్‌లో 8.26 శాతం వాటా విక్రయించే ప్రతిపాదనతో ఉంది. ఐడీబీఐ బ్యాంకు: ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్‌లో వాటాలను విక్రయించనుంది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో తనుకున్న 30 శాతం వాటా విక్రయించే యత్నాల్లో ఉంది. ఫెడరల్ బ్యాంకు: నాన్ బ్యాంకింగ్ సంస్థ ఫెడ్ఫినాలో 26 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. పీఎన్బీ: పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలనే ప్రతిపాదనతో ఉంది. పెట్టుబడుల్లేని బ్యాంకుల పరిస్థితి? అనుబంధ సంస్థలు, ఇతర సంస్థల్లో పెట్టుబడులు లేని బ్యాంకులు కార్యకలాపాలను కుదించుకునే చర్యల్ని చేపట్టడం గడ్డు పరిస్థితికి నిదర్శనం. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులు విదేశీ కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నాయి. ఉదాహరణకు బ్యాంకు ఆఫ్ బరోడా 2017–18లో బహ్రెయిన్, బహమాస్, దక్షిణాఫ్రికా కార్యకలాపాలను మూసివేసినట్టు ఇటీవలే ప్రకటించింది. -
ఎస్బీఐ లైఫ్ లాభం 13 శాతం అప్
న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 13 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.336 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.381 కోట్లకు పెరిగిందని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.10,776 కోట్ల నుంచి రూ.10,052 కోట్లకు తగ్గిందని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.955 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ1,150 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.30,276 కోట్ల నుంచి రూ.33,761 కోట్లకు పెరిగాయని పేర్కొంది. కొత్త వ్యాపార విలువ (వీఎన్‌బీ–వేల్యూ ఆఫ్ న్యూ బిజినెస్) 34 శాతం వృద్ధితో రూ.1,390 కోట్లకు, ఎంబెడెడ్ వేల్యూ 15 శాతం వృద్ధితో రూ.19,070 కోట్లకు పెరిగాయని వివరించింది. వ్యక్తిగత ప్రీమియమ్ పరంగా చూస్తే, తమ మార్కెట్ వాటా 20.7 శాతం నుంచి 21.8 శాతానికి పెరిగిందని, మొత్తం మార్కెట్ వాటా 11.1 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్ 0.4 శాతం నష్టంతో రూ.762 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లైఫ్ లాభం 21% అప్
న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 21 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.190 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.230 కోట్లకు ఎగసిందని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,060 కోట్ల నుంచి రూ.9,720 కోట్లకు పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.5,240 కోట్ల నుంచి 30 శాతం పెరిగి రూ.6,780 కోట్లకు ఎగసింది. రిటైల్ కొత్త వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపార రెన్యూవల్ ప్రీమియం కూడా పెరగడం వల్ల నికర ప్రీమియం ఆదాయం పెరిగిందని పేర్కొంది. 23 శాతంపెరిగిన నిర్వహణ ఆస్తులు... గత క్యూ3లో రూ.90,720 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ క్యూ3లో 23 శాతం వృద్ధి చెంది రూ.1,11,630 కోట్లకు పెరిగాయని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. సాల్వెన్సీ రేషియో 2.09 శాతం నుంచి 2.06 శాతానికి చేరిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్ 2 శాతం నష్టపోయి రూ.669 వద్ద ముగిసింది. -
లైఫ్, హెల్త్ల కలయికతో టర్మ్ పాలసీ!
కోల్‌కతా: ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఎస్బీఐ లైఫ్’ తాజాగా సరికొత్త టర్మ్ పాలసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘ఎస్బీఐ లైఫ్ పూర్ణ సురక్ష’ పేరుతో ఆవిష్కరించిన ఈ పాలసీలో ఇన్‌బిల్ట్ క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ ఉండటం ప్రత్యేకమైన అంశం. ఈ క్రిటికల్ ఇల్నెస్ కవర్ 36 వ్యాధులకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. పాలసీ విశేషాలివీ... టర్మ్: 10– 30 ఏళ్లు, కవరేజ్: రూ.25 లక్షలు– రూ.2.5 కోట్లు ప్రీమియం: నెల, 6 నెలలు, ఏడాది మెచ్యూరిటీ బెనిఫిట్స్: ఉండవు ప్రత్యేకతలు ♦ పాలసీ కాలం మొత్తం స్థిర ప్రీమియం ఉంటుంది. ♦ లైఫ్ స్టేజ్ రీబ్యాలెన్సింగ్: పాలసీ తీసుకున్న వ్యక్తి వయసు పెరిగే కొద్ది క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి ఏడాది లైఫ్ కవరేజ్ తగ్గుతూ వస్తుంది. ♦ క్రిటికల్ ఇల్నెస్: క్రిటికల్ ఇల్నెస్ కవర్ 36 వ్యాధులకు వర్తిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యుర్ వంటి వాటికి. పాలసీలో బిల్లు అమౌంట్‌తో నిమిత్తం లేకుండా క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్‌ను ఒకేసారి మొత్తంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎలాంటి హెల్త్ కవరేజ్ లభించదు. ♦ పాలసీదారుడు తన వ్యాధికి డయాగ్నసిస్ చేయించుకున్న తేదీ మొదలు 14 రోజల తర్వాతనే క్లెయిమ్ మొత్తాన్ని పొందుగలడు. ఒకవేళ ఈ 14 రోజుల్లోపే పాలసీదారుడు మరణిస్తే ఎలాంటి క్లెయిమ్ మొత్తం రాదు. ఇక పాలసీ వెయిటింగ్ పీరియడ్ 90 రోజులు. అంటే పాలసీ తీసుకున్న తేదీ నుంచి 90 రోజుల తర్వాతనే హెల్త్ బెనిఫిట్ లభిస్తుంది. ♦ ప్రీమియం చెల్లింపులు రద్దు: పాలసీదారుడు డయాగ్నసిస్ చేయించుకున్న తర్వాత భవిష్యత్ పాలసీ ప్రీమియంను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక లైఫ్ కవరేజ్ మాత్రం కొనసాగుతుంది. ♦ సెక్షన్ 80సీ, 80డీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ♦ 18 నుంచి 65 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ‘వ్యక్తికి కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఇవి తగ్గుతూ వస్తాయి. ఇదే సమయంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే రీబ్యాలెన్సింగ్ ఫీచర్‌తో ఈ పాలసీని రూపొందించాం. పాలసీ కాలం గడిచేకొద్ది లైఫ్ కవరేజ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. అదే సమయంలో క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ పెరుగుతుంది’ – ఎస్బీఐ లైఫ్ ప్రెసిడెంట్ రవీంద్ర కుమార్ -
కొత్త ప్రీమియంలో 40 శాతం వృద్ధి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియం వసూళ్లలో దాదాపు 40 శాతం వృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అరిజిత్ బసు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం వ్యక్తిగత పాలసీల ప్రీమియం వసూళ్లు సుమారు రూ. 7,100 కోట్లు కాగా.. ఈ సారి రూ. 9,800 కోట్ల దాకా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక, స్థూలంగా మొత్తం ప్రీమియం వసూళ్లు దాదాపు రూ. 21,000 కోట్లు ఉండగా.. ఈసారి రూ. 25,000 కోట్ల మేర అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యక్తిగత పాలసీల కొత్త ప్రీమియం వసూళ్లు ఈ ఏడాది ఇప్పటిదాకా 46 శాతం వృద్ధితో దాదాపు రూ. 4,700 కోట్లుగా ఉన్నాయని, మిగతా నాలుగు నెలల్లో మరింత మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ ఎస్బీఐ లైఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్ రీజియన్ రీజనల్ డైరెక్టర్ దేబాసిస్ చటర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్ రీజియన్‌లో కొత్త పాలసీల ప్రీమియం వసూళ్లు సెప్టెంబర్ ఆఖరు నాటికి రూ. 145 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు పెరిగినట్లు బసు చెప్పారు. 70 శాతం డిజిటల్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమకు 96,000 మంది ఏజెంట్లు ఉండగా.. హైదరాబాద్ రీజియన్‌లో 4,978 మంది ఉన్నారని బసు పేర్కొన్నారు. సంస్థ వ్యాపారంలో బ్యాంకెష్యూరెన్స్ చానల్ వాటా 65 శాతంగాను, ఏజెన్సీ చానల్‌ది 32 శాతంగాను ఉంటోందని ఆయన వివరించారు. కొత్తగా మరో రెండు బ్యాంకులు.. తమ బ్యాంకెష్యూరెన్స్ చానల్‌కి తోడవుతున్నట్లు చెప్పారు. మరోవైపు, వచ్చే నెలలో ’పూర్ణ సురక్ష’ పేరిట నాలుగు రకాల క్రిటికల్ ఇల్నెస్ సమస్యలకు సమగ్రమైన కవరేజీ ఇచ్చే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బసు తెలిపారు. తమ వ్యాపారంలో దాదాపు 60–70 శాతం డిజిటల్ మాధ్యమంలో.. ట్యాబ్‌లు, మొబైల్స్ ద్వారానే ఉంటోందని పేర్కొన్నారు. పూర్తి ఆన్లైన్ విధానానికి సంబంధించి మూడు పాలసీలు అందిస్తున్నామని.. ఏటా సుమారు 20,000 పాలసీలను విక్రయిస్తున్నామన్నారు. దేశీయంగా ఉన్న దాదాపు 23 బీమా సంస్థల్లో చాలామటుకు కంపెనీలు మెరుగైన లాభాలు సాధిస్తూనే ఉన్న నేపథ్యంలో కన్సాలిడేషన్ అవకాశాలు తక్కువే ఉండొచ్చని బసు చెప్పారు. -
న్యూ ఇండియా అష్యూరెన్స్‌దీ అదే దారి!
ముంబై: మొన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్... నిన్న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్... నేడు న్యూ ఇండియా అష్యూరెన్స్!!. పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన ప్రభుత్వ బీమా కంపెనీలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచటం మాట అటుంచి... లిస్టింగ్ రోజే నష్టాలు చూపిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూకు ఎందుకు దరఖాస్తు చేశామా..! అని ఆలోచించేలా చేస్తున్నాయి. సోమవారం నాడు ప్రభుత్వ రంగ న్యూ ఇండియా అష్యూరెన్స్ షేర్లు మార్కెట్లో లిస్టవుతూనే... కుదేలయ్యాయి. ఇష్యూ ధర రూ.800తో పోలిస్తే ఏకంగా 9 శాతానికిపైగా క్షీణించాయి. సోమవారం బీఎస్ఈలో ప్రారంభంలోనే 6.38% తగ్గి రూ.748.90 వద్ద ఈ షేర్లు లిస్టయ్యాయి. ఒక దశలో 10.28% మేర పతనమై రూ.717.75 స్థాయిని కూడా తాకాయి. చివరికి 9.36% నష్టంతో రూ.725.05 వద్ద క్లోజయ్యాయి. ఎన్ఎస్ఈలో 9.11% తగ్గుదలతో రూ. 727.10 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో 4.3 లక్షలు, ఎన్ఎస్ఈలో 25 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.59,744 కోట్లుగా ఉంది. దాదాపు రూ. 9,600 కోట్ల సమీకరణ కోసం నవంబర్ 1–3 మధ్య వచ్చిన న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవో 1.19 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. చిన్న మదుపరులు కనక ఐపీఓకు దరఖాస్తు చేసుకోకుండా సోమవారం లిస్టింగ్ తరువాత కొనుగోలు చేసి ఉంటే... ఈ షేర్లు 10% తక్కువ ధరకే లభ్యమై ఉండేవి. ఈ ఐపీఓకు ఎక్కువ మంది దరఖాస్తు చేయకపోవటంతో చేసినవారికి పూర్తి స్థాయిలో షేర్లు అలాట్ కావటం గమనార్హం. ఎస్బీఐ లైఫ్, జీఐసీ కూడా అంతే..!! ఇటీవల పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇదే తరహాలో ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. ఎస్బీఐ లైఫ్ షేర్లు రూ.700 చొప్పున అలాట్ చేయగా... లిస్టింగ్ నాడు మాత్రమే కొంత పెరిగాయి. ఆ తరువాత నుంచీ తగ్గుతూ వచ్చి... ప్రస్తుతం రూ.665 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ (జీఐసీ) షేరును రూ.912 చొప్పున ఇష్యూ చేశారు. కానీ లిస్టింగ్ నుంచీ నష్టాలే చూపిస్తూ.. ప్రస్తుతం రూ.811 వద్ద ట్రేడవుతోంది. ఈ బీమా సంస్థలను లిస్ట్ చేయటం ద్వారా ప్రభుత్వం వాటిలో తనకున్న వాటాను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత సమీకరించాలనేది ప్రభుత్వం ముందే టార్గెట్ పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఆయా కంపెనీల షేర్లను భారీ ప్రీమియానికి విక్రయిస్తుండటంతో విలువ ఎక్కువ ఉందనే కారణంతో కొనుగోలుదార్లు ముందుకు రావటం లేదన్నది విశ్లేషకుల మాట. దీంతో పబ్లిక్ ఇష్యూకు స్పందన కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. ఫలితం!! లిస్టింగ్ అయ్యాక ఆయా షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. -
ఎస్బీఐ లైఫ్‌కి యాంకర్
►ఇన్వెస్టర్ల నుంచి రూ.2,200 కోట్లు ►ప్రారంభమైన ఐపీఓ న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన బుధవారం..యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,226 కోట్లు సమీకరించింది. ఈ ఆఫర్లో బ్లాక్‌రాక్, కెనడా పెన్షన్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, అబుదాభి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్ఎస్బీసీ, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, కొటక్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్ తదితర 69 యాంకర్ ఇన్వెస్టింగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి. ఈ సంస్థలకు రూ. 700 ధరపై 3.18 కోట్ల షేర్లను ఎస్బీఐ లైఫ్ కేటాయించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్పీ పారిబా కాడ్రిఫ్ల మధ్య జాయింట్ వెంచర్ అయిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేస్తున్న ఐపీఓలో ప్రమోటర్లు 12 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. రూ. 685–700 ప్రైస్‌బ్యాండ్‌తో ప్రారంభమైన ఐపీఓ సెప్టెంబర్ 22న ముగుస్తుంది. ఆఫర్ ద్వారా రూ. 8,400 కోట్లు సమకూరతాయని అంచనా. -
ఐపీఓకు ఎస్బీఐ లైఫ్ దరఖాస్తు
రూ.6,500–రూ.7,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదన ముంబై: జీవిత బీమా రంగంలోని ప్రముఖ కంపెనీ ఎస్బీఐ లైఫ్ తొలి పబ్లిక్ ఆఫర్ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.6,500–7,000 కోట్లను సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 12 కోట్ల షేర్లను ఐపీవోలో భాగంగా ప్రమోటర్లు విక్రయించనున్నారు. మొత్తం జారీ మూలధనంలో 12 శాతానికి సమానం. ఎస్బీఐ 8 కోట్ల షేర్లు, బీఎన్పీ పారిబా కార్డిఫ్ ఎస్ఏ 4 కోట్ల షేర్లను జారీ చేస్తాయి. ఈ రెండు సంస్థలు ఎస్బీఐ ప్రమోటర్లుగా ఉన్నాయి. 20 లక్షల షేర్లను ఎస్బీఐ ఉద్యోగులకు, 1.2 కోట్ల షేర్లను ఎస్బీఐ వాటాదారులకు రిజర్వ్ చేస్తారు. జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, బీఎన్పీ పారిబా, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డాయిష్ సెక్యూరిటీస్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహింద్రా క్యాపిటల్ కంపెనీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా సేవలు అందించనున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తర్వాత ఐపీవోకి రానున్న రెండో బీమా కంపెనీ ఇది. -
వారు వాడుతుంటే మీరేం చేస్తున్నారు?
పేరు, లోగో వ్యవహారంలో ఎస్బీఐని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరు, లోగోను ప్రైవేటు కంపెనీలైన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లు వాడుకుంటుండటంపై దాఖలైన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎస్బీఐ చైర్పర్సన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ యాజమాన్యాలను ఆదేశిస్తూ... నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏజేఐ) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు... ఎస్బీఐకి సంబంధం లేదని, అయినప్పటికీ ఆ కంపెనీలు ఎస్బీఐ పేరు, లోగో వాడుతున్నా ఎస్బీఐ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన వి.బి.కృష్ణమూర్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి... ఈ సందర్భంగా కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ... ప్రైవేటు కంపెనీలైన ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థయిన ఎస్బీఐ లోగోను వాడుకునే అధికారం లేదన్నారు. ఈ విషయాన్ని ఎస్బీఐని అడిగితే... వారు తమ లోగోను వాడుకోవడానికి ఎవరికీ అనుమతినివ్వలేదని తెలిపారన్నారు. అశోక చక్రం, అశోక స్తూపం తదితరాలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వినియోగించకుండా చట్టంలో నిషేధం ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ఎస్బీఐ లోగో కూడా ఆ చట్ట నిషేధిత జాబితాలో ఉందా.. లేదా.. పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామంటూ ఆ మేర నోటీసులిచ్చింది. -
ఐపీవోపై త్వరలో నిర్ణయం...
10% వాటాల విక్రయ అవకాశం ఎస్బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉండొచ్చని, దీనిపై తొలి త్రైమాసికంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అరిజిత్ బసు తెలిపారు. సాధారణంగా ఐపీవోలో పది శాతం వాటాల విక్రయం ఉండగలదన్నారు. ఎస్బీఐ లైఫ్‌లో బీఎన్పీ పారిబాకు 26 శాతం వుంది. ఎస్బీఐకి 74 శాతం వాటా వుండగా, ఇటీవల ఎస్బీఐ 3.9 శాతం వాటాలు విక్రయించింది. తాజాగా ఐపీవోలో ఎస్బీఐ 10 శాతం వాటాలు విక్రయించవచ్చని..లేదా ఒకవేళ బీఎన్పీ కూడా పాలుపంచుకునే పక్షంలో ఇరు సంస్థలు చెరి అయిదు శాతం విక్రయించే అవకాశాలూ ఉన్నాయని బసు చెప్పారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. సోమవారమిక్కడ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని బీమా రంగ నియంత్రణ సంస్థ సభ్యుడు నీలేష్ సాథే ప్రారంభించిన సందర్భంగా బసు ఈ విషయాలు వివరించారు. మరోవైపు, కొత్తగా క్యాన్సర్ కవరేజికి సంబంధించిన పాలసీని త్వరలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని బసు పేర్కొన్నారు. ఏటా 3–4 పాలసీలు ప్రవేశపెడుతున్నామని వివరించిన బసు.. ప్రస్తుతం మొత్తం 28 ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు. ఇక వ్యాపార గణాంకాల విషయానికొస్తే .. డిసెంబర్ దాకా 9 నెలల్లో ప్రీమియం వసూళ్లు 39% మేర వృద్ధి చెందాయని బసు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో వ్యక్తిగత పాలసీలకు సంబంధించి మొత్తం న్యూ బిజినెస్ ప్రీమియం 28 శాతం పెరిగి రూ. 397 కోట్ల నుంచి రూ. 508 కోట్లకి పెరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం కొత్త బిజినెస్ ప్రీమియంలు 25 శాతం పెరుగుదలతో రూ. 518 కోట్ల నుంచి రూ. 647 కోట్లకు ఎగిశాయన్నారు. డీమోనిటైజేషన్‌కి సంబంధించి తమపై పెద్దగా ప్రభావం లేదని బసు చెప్పారు. మరోవైపు 2015 డిసెంబర్ నాటికి 18 శాతంగా ఉన్న మార్కెట్ వాటా గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి 21 శాతానికి పెరిగిందన్నారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 92,000 కోట్ల స్థాయిలో ఉందని వివరించారు. టర్మ్, సంప్రదాయ పాలసీల అమ్మకాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు బసు చెప్పారు. -
ఎస్బీఐ లైఫ్‌లో టెమాసెక్, కేకేఆర్‌కు వాటాలు
• 3.9% విక్రయిస్తున్న ఎస్బీఐ • డీల్ విలువ రూ. 1,794 కోట్లు • సంస్థ విలువ రూ. 46,000 కోట్లు ముంబై: అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెమాసెక్, కేకేఆర్ తాజాగా బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.9 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ వాటాలను విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రు. 1,794 కోట్లు (దాదాపు 264 మిలియన్ డాలర్లు). షేరు ఒక్కింటికి రూ. 460 చొప్పున జీవిత బీమా వ్యాపార సంస్థలో 3.9 కోట్ల షేర్లను (3.9 శాతం వాటా) విక్రరుుంచేందుకు శుక్రవారం బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదముద్ర వేసిందని ఎస్బీఐ వెల్లడించింది. కేకేఆర్, టెమాసెక్లు తమ తమ అనుబంధ సంస్థల ద్వారా చెరి 1.95 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈలావాదేవీతో ఎస్బీఐ లైఫ్ వేల్యుయేషన్ సుమారు రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉండగలదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. అత్యుత్తమ సంస్థగా ఎదగడంలో ఎస్బీఐ లైఫ్‌కి గల నిబద్ధతకు కేకేఆర్, టెమాసెక్ల భాగస్వామ్యం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని ఎస్బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. 2001లో ఏర్పాటైన ఎస్బీఐ లైఫ్‌లో ఎస్బీఐకి 74 శాతం, బీఎన్పీ పారిబా కార్డిఫ్లకు 26 శాతం వాటాలు ఉన్నారుు. -
ఎస్బీఐ లైఫ్‌లో 5% వరకూ వాటా విక్రయిస్తాం: ఎస్బీఐ
ముంబై: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 5 శాతం వరకూ వాటాను విక్రయించనున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. శుక్రవారం జరిగిన తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్(ఈసీసీబీ) ఈ వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని వివరించింది. ఎస్బీఐ, బీఎన్పీ పారిబా కార్డిఫ్‌తో కలిసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఎస్బీఐకు 74 శాతం వాటా, బీఎన్పీ పారిబా కార్డిఫ్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి? -
ఎస్బీఐ నుంచి స్మార్ట్ ప్రివిలేజ్ పాలసీ...
హైదరాబాద్: అధిక నెట్‌వర్త్ కలిగిన వ్యక్తుల (హెచ్ఎన్ఐ) కోసం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ‘స్మార్ట్ ప్రివిలేజ్’ పేరుతో యూనిట్ ఆధారిత జీవిత బీమా పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా 8 రకాల ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫండ్ల మధ్య స్విచ్చింగ్ (మార్పిడి), ప్రీమియం మార్పిడిని పాలసీ కాల వ్యవధిలో ఎన్ని సార్లయినా చేసుకునే వీలుంది. ఒకే విడత ప్రీమియం, పరిమిత కాల ప్రీమియం లేదా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే సౌలభ్యం ఉంది. పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 8 నుంచి 13 సంవత్సరాలు. గరిష్ట వయసు 55 సంవత్సరాలు. అలాగే, పాలసీ కాల వ్యవధి 5 నుంచి 30 సంవత్సరాలుగా ఉంది. పాలసీ కాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఫండ్ విలువ లేదా బీమా ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. గడువు తీరే వరకూ జీవించి ఉంటే ఫండ్ విలువను చెల్లిస్తారు. కావాలంటే దీన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా తీసుకోవచ్చు. -
రూ. 5,500 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయ లక్ష్యం
ఎస్బీఐ లైఫ్ ఎండీ, సీఈవో అరిజిత్ బసు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 5,500 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయం, రూ. 8,000 కోట్ల రెన్యువల్ ప్రీమియం ఆదాయం ఆర్జించాలని ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది కంపెనీ రూ. 5,529 కోట్ల కొత్త ప్రీమియం, రూ, 7,338 కోట్ల రెన్యువల్ ప్రీమియాన్ని ఆర్జించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ. 2,975 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎస్బీఐ లైఫ్ ఎండి, సీఈవో అరిజిత్ బసు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ‘మెగా సేల్స్ కాన్క్లేవ్’లో పాల్గొన్న బసు విలేకరులతో మాట్లాడారు. యులిప్ అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. గత నెల వరకు ప్రతీ నెలా రూ. 1500 - 1800 కోట్ల నికర అమ్మకాలు ఉం డగా ఈ నెల నుంచి రూ. 2,000 కోట్లకు పైగా వస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా.. జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 6 పాలసీలను ప్రవేశపెట్టామని, వచ్చే మూడు నెలల్లో మరో రెండు పాలసీలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెం బర్‌లోగా మహిళల కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ‘స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్’ పేరుతో ప్రవేశపెట్టే ఈ పాలసీలో మహిళలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు రక్షణ (క్రిటికల్ ఇల్నెస్) కల్పించే విధంగా తీర్చిదిద్దనట్లు తెలిపారు. అలాగే వచ్చే జనవరిలో అధికాదాయ వర్గాల వారి కోసం ‘స్మార్ట్ ప్రివిలేజ్’ పేరుతో యులిప్ పాలసీని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కనీసం 7-10 వేల మంది ఏజెంట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 86,000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఇప్పట్లో ఐపీవో ఆలోచన లేదు... ఇప్పట్లో ఐపీవోకి వచ్చే ఆలోచన లేదని ఎస్బీఐ లైఫ్ ఎండీ, సీఈవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
కథలన్నీ మనువాదానికి చెందినవే..
ఎల్జీబీటీ హక్కుల నేత నవదీప్ హైదరాబాద్: ప్రస్తుతం ప్రచురితమయ్యే కథలన్నీ మనువాదానికి చెందినవే ఉన్నాయని ఎల్జీబీటీ(లెస్బియన్ గే బెసైక్సువల్ ట్రాన్స్‌జెండర్) రైట్స్ యాక్టివిస్ట్ నవదీప్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథా ఉత్సవం-2015 జరిగింది. ఈ సందర్భంగా 2014లో వెలువడిన ఉత్తమ కథల సంకలనం ‘‘ప్రాతినిధ్య-2014’’ను నవదీప్ ఆవిష్కరించారు. నేటి సమాజంలో స్వలింగ సంపర్కులను అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కులను సినిమా, మీడియా వాళ్లు అణచివేత ధోరణితోనే చూస్తున్నారని, ఇది పోవాలంటే విస్తృతమైన చర్చ జరగాలన్నారు. ముఖ్యఅతిథి ప్రముఖకవి సతీష్ చందర్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో కూడిన రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్స్‌లెన్సీ అవార్డు ఫర్ లిటరరీ క్రిటిసిజం సాహితీవేత్త సి.విజయభారతికి, సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్సెలెన్సీ అవార్డ్ ఫర్ స్టోరీ రైటింగ్‌ను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజుకు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సీఐడీ ఐజీపీ పి.వి.సునీల్ కుమార్, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మి నారాయణ, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొన్నారు. -
ఎస్బీఐ లైఫ్‌లో 10% వాటా విక్రయం
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన జీవిత బీమా విభాగమైన ఎస్బీఐ లైఫ్‌లో 10 శాతం వాటాను విక్రయించనున్నది. ఈ మేరకు తమ సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపిందని ఎస్బీఐ పేర్కొంది. భారత్‌కు చెందిన ఎస్బీఐ ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్పీ పారిబస్ కార్డిఫ్‌తో కలసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ జేవీలో ఎస్బీఐకు 74 శాతం, బీఎన్పీ పారిబస్కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి. సాధారణ బీమా విభాగమైన ఎస్బీఐ జనరల్‌ను ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్(ఐఏజీ)తో కలసి ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఐఏజీ తనకున్న 26 శాతం వాటాను 49 శాతానికి పెంచుకోనున్నదని గత వారమే ఎస్బీఐ వెల్లడించింది.