ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ దేశ ఆర్ధిక వృద్ది కోసం ఆర్బీఐ స్వల్ప కాలానికి తక్కువ వడ్డీ రేట్లను అమలు చేసింది. క్రమేపీ ఆ వడ్డీ రేట్లను పెంచింది. ఈ తరుణంలో ఆర్బీఐ అమలు చేసిన తక్కువ ఇంట్రస్ట్ రేట్లతో పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపార కార్యకలాపాల కోసం భారీ ఎత‍్తున రుణాలు తీసుకున్నాయి. అయితే రుణాలు తీసుకొని, అనుకున్న ఫలితాలు రాబట్టలేక, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా కొన్ని సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి.
అయితే దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ-50లో నమోదైన మొత్తం 7దిగ్గజ కంపెనీలు సున్నా రుణం లేని సంస్థలుగా అవతరించాయి. ఈ ఏడు నిఫ్టీ 50 కంపెనీలు కలిపి రూ.31 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆ సంస్థల ఆర్ధిక స్థితి గతుల్ని పరిశీలిస్తే..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సున్నా రుణంతో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. 12లక్షల మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఆర్ధిక సంవత్సరం 2022లో 26బిలియన్లకు పైగా ఆదాయం గడించింది. 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర లాభంతో కొనసాగుతుంది.
ఇన్ఫోసిస్
మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్‌తో పోటీ పడుతుంది. ఆర్ధిక సంవత్సరం 2022లో దాని ఆదాయం 16 బిలియన్లకు పైగా ఉండగా నికర లాభం దాదాపు 3 బిలియన్లుగా ఉంది.
హిందుస్థాన్ యూనిలీవర్
దేశీయ అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంది. 14 విభాగాల్లో దాదాపూ 44 బ్రాండ్‌లతో మార్కెట్‌ను శాసిస్తున్న హెచ్‌యూఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాని ఆదాయం దాదాపు 2.4 నుంచి 6.5 బిలియన్ డాలర్ల వృద్దిని సాధించింది.
ఐటీసీ
టుబాకో-టు-పేపర్ దిగ్గజం ఐటీసీ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. కాగితం, పొగాకు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో రాణిస్తుంది. కంపెనీ ఆర్ధిక సంవత్సరం 2022లో ఆదాయం 8.4 బిలియన్‌గా ఉంది. నికర లాభం దాదాపు 2 బిలియన్లకు చేరింది.
మారుతీ సుజుకి ఇండియా
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సున్నా రుణం లేని సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ 2.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో.. మారుతి సుజుకి ఆర్ధిక సంవత్సరం 11 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.దాని లాభం 497 మిలియన్లకు చేరుకుంది.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
ఎస్‌బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1.08 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఆర్ధిక సంవత్సరం ఆదాయం 10.6 బిలియన్లు కాగా, నికర ఆదాయం 193 మిలియన్లుగా ఉంది.
దివీస్ లాబొరేటరీస్
రూ.96వేల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఫార్మా రంగం నుండి రుణ రహిత సంస్థగా దివిస్ లాబొరేటరీస్ అవతరించింది. జెనరిక్స్, న్యూట్రాస్యూటికల్ తయారీ కంపెనీ దివీస్ ఆదాయం1.2 బిలియన్లు కాగా నికర లాభం 378 మిలియన్లుగా ఉంది.
చదవండి👉బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా! కానీ..
Comments
Please login to add a commentAdd a comment