న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 21 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.190 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.230 కోట్లకు ఎగసిందని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,060 కోట్ల నుంచి రూ.9,720 కోట్లకు పెరిగింది.
నికర ప్రీమియం ఆదాయం రూ.5,240 కోట్ల నుంచి 30 శాతం పెరిగి రూ.6,780 కోట్లకు ఎగసింది. రిటైల్ కొత్త వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపార రెన్యూవల్ ప్రీమియం కూడా పెరగడం వల్ల నికర ప్రీమియం ఆదాయం పెరిగిందని పేర్కొంది.
23 శాతంపెరిగిన నిర్వహణ ఆస్తులు...
గత క్యూ3లో రూ.90,720 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ క్యూ3లో 23 శాతం వృద్ధి చెంది రూ.1,11,630 కోట్లకు పెరిగాయని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. సాల్వెన్సీ రేషియో 2.09 శాతం నుంచి 2.06 శాతానికి చేరిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్ 2 శాతం నష్టపోయి రూ.669 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment