
ఎస్‌బీఐ లైఫ్‌లో 10% వాటా విక్రయం
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన జీవిత బీమా విభాగమైన ఎస్‌బీఐ లైఫ్‌లో 10 శాతం వాటాను విక్రయించనున్నది. ఈ మేరకు తమ సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపిందని ఎస్‌బీఐ పేర్కొంది. భారత్‌కు చెందిన ఎస్‌బీఐ ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్‌పీ పారిబస్ కార్డిఫ్‌తో కలసి ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ జేవీలో ఎస్‌బీఐకు 74 శాతం, బీఎన్‌పీ పారిబస్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి. సాధారణ బీమా విభాగమైన ఎస్‌బీఐ జనరల్‌ను ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్(ఐఏజీ)తో కలసి ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఐఏజీ తనకున్న 26 శాతం వాటాను 49 శాతానికి పెంచుకోనున్నదని గత వారమే ఎస్‌బీఐ వెల్లడించింది.