
ముంబై: పిల్లల సంరక్షణ బాధ్యతల్లో నిత్యం తలమునకలయ్యే తల్లులు తమ సొంత అవసరాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చాటి చెప్పేలా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గిల్ట్‌ఫ్రీమామ్స్ పేరిట డిజిటల్ ఫిలిమ్ ఆవిష్కరించింది. సాధారణంగా పిల్లలు పుట్టాక మహిళలు తమకు ఇష్టమైన వ్యాపకాల వైపు మళ్లాలంటే కొంత అపరాధ భావనతో జంకుతుంటారని ఎస్‌బీఐ లైఫ్ సీఎస్‌ఆర్ విభాగం చీఫ్ రవీంద్ర శర్మ తెలిపారు.
అలాంటి సంకోచాలను పక్కన పెట్టి ఇటు వ్యక్తిగత అవసరాలు, అటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు తల్లులు పాటించతగిన విధానాలను ఈ వీడియోలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. శ్రేయా గౌతమ్, యువికాఆబ్రోల్ మొదలైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ ఫిలిమ్‌లో తమ ప్రస్థానాలను వివరించారు.
చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!