
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.336 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.381 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.10,776 కోట్ల నుంచి రూ.10,052 కోట్లకు తగ్గిందని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.955 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ1,150 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.30,276 కోట్ల నుంచి రూ.33,761 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
కొత్త వ్యాపార విలువ (వీఎన్‌బీ–వేల్యూ ఆఫ్ న్యూ బిజినెస్) 34 శాతం వృద్ధితో రూ.1,390 కోట్లకు, ఎంబెడెడ్ వేల్యూ 15 శాతం వృద్ధితో రూ.19,070 కోట్లకు పెరిగాయని వివరించింది. వ్యక్తిగత ప్రీమియమ్ పరంగా చూస్తే, తమ మార్కెట్ వాటా 20.7 శాతం నుంచి 21.8 శాతానికి పెరిగిందని, మొత్తం మార్కెట్ వాటా 11.1 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్ 0.4 శాతం నష్టంతో రూ.762 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment