కోల్‌కతా: ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఎస్‌బీఐ లైఫ్’ తాజాగా సరికొత్త టర్మ్ పాలసీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ‘ఎస్‌బీఐ లైఫ్ పూర్ణ సురక్ష’ పేరుతో ఆవిష్కరించిన ఈ పాలసీలో ఇన్‌బిల్ట్ క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ ఉండటం ప్రత్యేకమైన అంశం. ఈ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ 36 వ్యాధులకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. పాలసీ విశేషాలివీ...
టర్మ్: 10– 30 ఏళ్లు,
కవరేజ్: రూ.25 లక్షలు– రూ.2.5 కోట్లు
ప్రీమియం: నెల, 6 నెలలు, ఏడాది
మెచ్యూరిటీ బెనిఫిట్స్: ఉండవు
ప్రత్యేకతలు
♦ పాలసీ కాలం మొత్తం స్థిర ప్రీమియం ఉంటుంది.
♦ లైఫ్ స్టేజ్ రీబ్యాలెన్సింగ్: పాలసీ తీసుకున్న వ్యక్తి వయసు పెరిగే కొద్ది క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి ఏడాది లైఫ్ కవరేజ్ తగ్గుతూ వస్తుంది.
♦ క్రిటికల్ ఇల్‌నెస్: క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ 36 వ్యాధులకు వర్తిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యుర్ వంటి వాటికి. పాలసీలో బిల్లు అమౌంట్‌తో నిమిత్తం లేకుండా క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్‌ను ఒకేసారి మొత్తంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎలాంటి హెల్త్ కవరేజ్ లభించదు.
♦ పాలసీదారుడు తన వ్యాధికి డయాగ్నసిస్ చేయించుకున్న తేదీ మొదలు 14 రోజల తర్వాతనే క్లెయిమ్ మొత్తాన్ని పొందుగలడు. ఒకవేళ ఈ 14 రోజుల్లోపే పాలసీదారుడు మరణిస్తే ఎలాంటి క్లెయిమ్ మొత్తం రాదు. ఇక పాలసీ వెయిటింగ్ పీరియడ్ 90 రోజులు. అంటే పాలసీ తీసుకున్న తేదీ నుంచి 90 రోజుల తర్వాతనే హెల్త్ బెనిఫిట్ లభిస్తుంది.
♦ ప్రీమియం చెల్లింపులు రద్దు: పాలసీదారుడు డయాగ్నసిస్ చేయించుకున్న తర్వాత భవిష్యత్ పాలసీ ప్రీమియంను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక లైఫ్ కవరేజ్ మాత్రం కొనసాగుతుంది.
♦ సెక్షన్ 80సీ, 80డీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి.
♦ 18 నుంచి 65 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.
‘వ్యక్తికి కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఇవి తగ్గుతూ వస్తాయి. ఇదే సమయంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే రీబ్యాలెన్సింగ్ ఫీచర్‌తో ఈ పాలసీని రూపొందించాం. పాలసీ కాలం గడిచేకొద్ది లైఫ్ కవరేజ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. అదే సమయంలో క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ పెరుగుతుంది’ – ఎస్‌బీఐ లైఫ్ ప్రెసిడెంట్ రవీంద్ర కుమార్
Comments
Please login to add a commentAdd a comment