Life insurance company
-
జీవిత బీమా కొత్త పాలసీలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త పాలసీల ప్రీమియం రూ.35,020 కోట్లు నమోదు చేశాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రీమియం 14 శాతం పెరగడం విశేషం. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెప్టెంబర్ గణాంకాల ప్రకారం.. బీమా రక్షణ పట్ల వ్యక్తిగత కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడంతో సెప్టెంబర్‌లో జారీ అయిన కొత్త పాలసీల సంఖ్య 45.49 శాతం దూసుకెళ్లి 32,17,880 నమోదైంది.ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం 13 శాతం అధికమై రూ.5,142 కోట్లు సాధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 25 శాతం వృద్ధితో నూతన ప్రీమియం రూ.20,369 కోట్లు అందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో నూతన పాలసీల ద్వారా అందుకున్న ప్రీమియం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం ఎగసి రూ.1,89,214 కోట్లకు చేరుకుంది. -
మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్ఐసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమ సంస్థ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చ రించింది.‘కంపెనీ సమ్మతి లేకుండా మా సీనియర్ అధికారి, మాజీ అధికారుల ఫొటోలు, లోగో, బ్రాండ్ పేరును దురి్వనియోగం చేయడం ద్వారా నిర్దిష్ట వ్యక్తులు/సంస్థలు వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనల్లో అనధికార పద్ధతిలో నిమగ్నమై ఉన్నాయని మా దృష్టికి వచి్చంది. పాలసీదారులు, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి మోసపూరిత ప్రకటనల యూ ఆర్ఎల్ లింక్‌లను ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నివేదించండి’ అని ఎల్ఐసీ కోరింది. -
కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) ఇండివిడ్యువల్ (వ్యక్తుల) సింగిల్ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్ సింగిల్ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) -
మేలో కొత్త వ్యాపార ప్రీమియం రూ.23,448 కోట్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) మే నెలలో 4.1 శాతం తగ్గి రూ.23,448 కోట్లకు పరిమితమైంది. 24 జీవిత బీమా కంపెనీలు క్రితం ఏడాది ఇదే నెలలో ఉమ్మడిగా రూ.24,480 కోట్లు ప్రీమియం ఆదాయం సంపాదించాయి. నూతన వ్యాపార ప్రీమియం పరంగా ఎల్ఐసీ 11.26 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సంస్థకు నూతన పాలసీల రూపంలో మే నెలలో రూ.14,056 కోట్ల ప్రీమియం సమకూరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఎల్ఐసీకి వచ్చిన ఆదాయం రూ.15,840 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన 23 జీవిత బీమా సంస్థల ఉమ్మడి ప్రీమియం ఆదాయం 9 శాతం పెరిగి రూ.9,421 కోట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 24 జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.36,043 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.42,420 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎల్ఐసీ నూతన వ్యాపార ప్రీమియం 28 శాతం క్షీణించి రూ.19,866 కోట్లకు పరిమితమైంది. -
ఆరోగ్య బీమా పట్ల జీవిత బీమా కంపెనీల ఆసక్తి
ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించేందుకు జీవిత బీమా కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి తిరిగి అనుమతించే అంశాన్ని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సానుకూలంగా పరిశీలిస్తుండడం వాటిల్లో ఉత్సాహానికి కారణం. ఎల్ఐసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు 2016లో ఐఆర్డీఏఐ నిషేధం విధించే వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించినవే. ఐఆర్డీఏఐ ఆదేశాలతో నాటి నుంచి ఇవి కేవలం ఫిక్స్డ్ బెనిఫిట్ హెల్త్ ప్లాన్లకు పరిమితం అయ్యాయి. ఇండెమ్నిటీ (హాస్పిటల్లో చేరినప్పుడు చెల్లించేవి) పాలసీలను విక్రయించేందుకు అనుమతి లేదు. జీవిత బీమా కంపెనీలను తిరిగి హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి అనుమతించడానికి ఇది సరైన తరుణమని, లాభ, నష్టాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవలే ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా సంకేతం ఇవ్వడం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో తిరిగి ఆశావహ పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవాలి. 2030 నాటి కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను చేరువ చేయాలన్న లక్ష్యంతో మరిన్ని సంస్థలను ఈ విభాగంలోకి అనుమతించాలన్నది ఐఆర్డీఏఐ యోచనగా ఉంది. సిద్ధంగా ఉన్నాం.. హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్టు ఎల్ఐసీ పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారానికి హెల్త్ ఇన్సూరెన్స్ సమన్వయంగా ఉంటుందని తెలిపింది. ‘‘మేము ఇప్పటికే దీర్ఘకాల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను, గ్యారంటీడ్ హెల్త్ ప్లాన్లను విక్రయిస్తున్నాం. ఐఆర్డీఏఐ చేసిన సూచనను పరిశీస్తున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ ఎంటీ కుమార్ తెలిపారు. అచ్చమైన హెల్త్ ప్లాన్ల విక్రయం తమకు కష్టమేమీ కాదని, ఇప్పటికే తాము కొన్ని రకాల హెల్త్ ప్లాన్లను (ఫిక్స్డ్ బెనిఫిట్) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు 24.50 లక్షల మంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు 3.60 లక్షలకు మించి లేరు. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలను సైతం హెల్త్ ఇన్సూరెన్స్‌కు అనుమతిస్తే అప్పుడు భారీగా ఏజెంట్లు ఆయా ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేయగలరన్న అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలను ఒకే సంస్థ మార్కెట్ చేసుకునే విధానం ఉందని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇప్పటికీ 2.63 లక్షల మంది కస్టమర్లకు ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్కవరేజీని అందిస్తోంది. 2016లో నిషేధం తర్వాత మిగిలిన కస్టమర్లు పోర్ట్ పెట్టుకుని వెళ్లిపోగా, వీరు ఇంకా మిగిలే ఉన్నారు. అలాగే, హెచ్డీఎఫ్సీ లైఫ్ వద్ద కూడా ఇలాంటి కస్టమర్లు కొందరు మిగిలే ఉన్నారు. అందుకనే ఈ సంస్థలు మళ్లీ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సైతం తాము హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించింది. తమకు ఈ విభాగంలో ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్పింది. -
భారీగా పెరిగిన జీవిత బీమా పాలసీల ప్రీమియం వసూళ్లు: ఐఆర్డీఐఏ
జీవిత బీమా పాలసీల తొలి ప్రీమియం వసూళ్లు నవంబరులో 42 శాతం మేరకు పెరిగాయి. జీవిత బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది నవంబర్ నెలలో దాదాపు 42 శాతం పెరిగి రూ.27,177.26 కోట్లకు చేరుకుందని ఐఆర్డీఐఏ డేటా వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు కలిపి రూ.19,159.30 కోట్ల మేరకు బీమా ప్రీమియాన్ని ఆర్జించాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఐఏ) వెల్లడించిన డేటా ప్రకారం.. భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు 32 శాతానికి పైగా పెరిగి మొత్తం రూ.15,967.51 కోట్లను వసూలు చేసింది. ప్రైవేట్ రంగానికి చెందిన మిగతా 23 సంస్థలూ కలిపి 58.63శాతం వృద్ధితో రూ.11,209.75 కోట్లను వసూలు చేశాయి. గత ఏడాది క్రితం ఈ ప్రీమియం వసూళ్లు రూ.7,066.64 కోట్లు. క్యుమిలేటివ్ ప్రాతిపదికన ఏప్రిల్-నవంబర్ కాలంలో అన్ని బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే నుంచి 8.46శాతం పెరిగి, రూ.1,80,765 కోట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఎల్ఐసీ మొదటి ఏడాది ప్రీమియం వాటా 0.93 శాతం తగ్గి రూ.1,14,580.89 కోట్లకు పడిపోయింది. మిగత ప్రైవేటు బీమా సంస్థలు ఈ ఎనిమిది నెలల కాలంలో 30 శాతం వృద్ధితో రూ.66,184.52 కోట్లు వసూలు చేశాయి. మార్కెట్ ఆధిపత్యం పరంగా ఎల్ఐసీ అత్యధిక వాటాను 63.39 శాతంగా కలిగి ఉంది. ఆ తర్వాత ఎస్బీఐ లైఫ్ 8.77, హెచ్డీఎఫ్సీ లైఫ్ 7.86%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 4.91%, మ్యాక్స్ లైఫ్ 2.36%, బజాజ్ అలియాంజ్ లైఫ్ 2.62% మార్కెట్ వాటా సాధించాయి. (చదవండి: స్టాక్ మార్కెట్లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు!) -
జూన్‌లోనూ జీవిత బీమా జోరు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు జూన్‌లోనూ మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల నుంచి వచ్చే మొదటి ఏడాది ప్రీమియం(న్యూ బిజినెన్ ప్రీమియం)లో 4% వృద్ధి నమోదైంది. ఈ రూపంలో రూ.30,009 కోట్ల ఆదాయం వచ్చినట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది జూన్ నెలలో అన్ని జీవిత బీమా కంపెనీల కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.28,869 కోట్లుగా ఉండడం గమనార్హం. దేశంలో 24 జీవితబీమా కంపెనీలుండగా.. ఎల్ఐసీ అతిపెద్ద మార్కెట్ వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయం ఈ ఏడాది జూన్‌లో 4.14 శాతం పడిపోయింది. 2020 జూన్‌లో కొత్త పాలసీల రూపంలో రూ.22,737 కోట్ల మేర ప్రీమియం ఆదాయం ఎల్ఐసీకి సమకూరగా.. 2021 జూన్‌లో ఆదాయం రూ.21,796 కోట్లకు పరిమితమైంది. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీల రూపంలో ఆదాయం 34% పెరిగి రూ.6,132 కోట్ల నుంచి రూ.8,213 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి... ఈ ఏడాది (2021–22) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలోనూ 24 జీవిత బీమా సంస్థల నూతన వ్యాపార ప్రీమియం 7% పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే) రూ.53,725 కోట్లుగా నమోదైంది. ఎల్ఐసీ వరకే చూస్తే తొలి త్రైమాసికంలో ప్రీమియం ఆదాయం 2.54% తగ్గి రూ.25,601 కోట్లుగా ఉంది. 23 ప్రైవేటు జీవిత బీమా సంస్థల తొలి ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 34% వృద్ధితో రూ.17,124 కోట్లుగా నమోదైంది. 2021 జూన్ నాటికి మొత్తం జీవిత బీమా కవరేజీ (సమ్ అష్యూర్డ్) పరంగా చూస్తే ఎల్ఐసీ మార్కెట్ వాటా 12.55%గా ఉంటే, మిగిలిన 23 జీవిత బీమా కంపెనీలకు సంబంధించి సమ్ అష్యూర్డ్ 87.45%. ఎల్ఐసీ ఎక్కువగా ఎండోమెంట్ పాలసీలను విక్రయిస్తుంటుంది. వీటిపై జీవిత బీమా కవరేజీ తక్కువగా ఉండడం వల్లే ఇంత అంతరం కనిపిస్తోంది. ప్రొటెక్షన్ పాలసీల్లో (టర్మ్‌ప్లాన్లు) ప్రైవేటు బీమా సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉంటోంది. జీవిత బీమా అంటేనే.. జీవితానికి రక్షణ కల్పించేదని అర్థం. ఇందుకు ఉదాహరణ టర్మ్ ప్లాన్లు. కానీ, నామమాత్రపు కవరేజీనిస్తూ.. 4–5% రాబడులిచ్చే ఎండోమెంట్ ప్లాన్లనే ఇప్పటికీ ఎక్కువ మంది తీసుకోవడం గమనార్హం. సాధారణ బీమా సైతం వృద్ధి పథమే సాధారణ బీమా సంస్థల (జీవిత బీమా కంపెనీలు కాకుండా) స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం జూన్ నెలలో 7 శాతం వృద్ధితో రూ14,809 కోట్లుగా నమోదైంది. దేశంలో 32 సాధారణ బీమా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి క్రితం ఏడాది జూన్‌లో రూ.13,842 కోట్ల స్థూల ప్రత్యక్ష ఆదాయాన్ని పొందడం గమనార్హం. 25 సాధారణ బీమా సంస్థలకు సంబంధించి ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 5 శాతం పెరిగి రూ.13,041 కోట్లుగా ఉంది. ఐదు స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదా యం ఏకంగా 47 శాతం వృద్ధితో రూ.1,557 కోట్లకు చేరుకుంది. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంతో.. వీటిని తీసుకునే వారు పెరుగుతున్నారు. -
బజాజ్ అలయంజ్ నుంచి సమగ్ర టర్మ్ ప్లాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల విద్యాభ్యాసం మొదలుకుని ప్రాణాంతకమైన 55 వ్యాధుల దాకా వివిధ అవసరాలకు అనుగుణంగా కవరేజీనిచ్చే వేరియంట్లతో ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ కొత్తగా సమగ్రమైన టర్మ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. లైఫ్ స్మార్ట్ ప్రొటెక్ట్ గోల్ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌లో.. జీవిత భాగస్వామికి కూడా కవరేజీ పొందవచ్చు. కట్టిన ప్రీమియంలను కూడా తిరిగి పొందవచ్చు. ఇందుకు సంబంధించి మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ప్లాన్ లభిస్తుందని బజాజ్ అలయంజ్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ఇనిస్టిట్యూషనల్) ధీరజ్ సెహ్గల్ గురువారమిక్కడ తెలిపారు. రూ. 1 కోటి పాలసీ తీసుకునే పాతికేళ్ల వ్యక్తికి ప్రీమియం అత్యంత తక్కువగా రోజుకు రూ. 13 నుంచి ఉంటుందని ఆయన తెలిపారు. లైఫ్ కవర్, లైఫ్ కవర్ విత్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా కవర్ (సీఈఈసీ) వంటి వేరియంట్లలో ఈ పాలసీ లభిస్తుందని సెహ్గల్ చెప్పారు. -
వచ్చే ఏడాది పాలసీల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్ డిప్యూటీ సీఈవో రుషభ్ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2019–20లో కంపెనీ సుమారు రూ.3,200 కోట్ల వ్యాపారం అంచనా వేస్తోందని తెలిపారు. ఇందులో నూతన వ్యాపారం రూ.1,000 కోట్లు ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సాండ్‌బాక్స్ పేరుతో ఐఆర్డీఏ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీలకు భిన్నంగా.. కస్టమర్లకు అనుకూలంగా ఉండే పాలసీలను రూపొందించేలా బీమా కంపెనీలను ప్రోత్సహిస్తోంది. సాండ్‌బాక్స్ కింద అనుమతి పొందిన బీమా ప్లాన్‌కు తొలుత నియంత్రణ పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. పరిమిత కాలానికి, పరిమిత సంఖ్యలో పాలసీలను కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. ఫలితాలనుబట్టి అట్టి ప్లాన్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఐఆర్డీఏ నిర్ణయిస్తుంది. -
లైఫ్, హెల్త్ల కలయికతో టర్మ్ పాలసీ!
కోల్‌కతా: ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఎస్బీఐ లైఫ్’ తాజాగా సరికొత్త టర్మ్ పాలసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘ఎస్బీఐ లైఫ్ పూర్ణ సురక్ష’ పేరుతో ఆవిష్కరించిన ఈ పాలసీలో ఇన్‌బిల్ట్ క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ ఉండటం ప్రత్యేకమైన అంశం. ఈ క్రిటికల్ ఇల్నెస్ కవర్ 36 వ్యాధులకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. పాలసీ విశేషాలివీ... టర్మ్: 10– 30 ఏళ్లు, కవరేజ్: రూ.25 లక్షలు– రూ.2.5 కోట్లు ప్రీమియం: నెల, 6 నెలలు, ఏడాది మెచ్యూరిటీ బెనిఫిట్స్: ఉండవు ప్రత్యేకతలు ♦ పాలసీ కాలం మొత్తం స్థిర ప్రీమియం ఉంటుంది. ♦ లైఫ్ స్టేజ్ రీబ్యాలెన్సింగ్: పాలసీ తీసుకున్న వ్యక్తి వయసు పెరిగే కొద్ది క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి ఏడాది లైఫ్ కవరేజ్ తగ్గుతూ వస్తుంది. ♦ క్రిటికల్ ఇల్నెస్: క్రిటికల్ ఇల్నెస్ కవర్ 36 వ్యాధులకు వర్తిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యుర్ వంటి వాటికి. పాలసీలో బిల్లు అమౌంట్‌తో నిమిత్తం లేకుండా క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్‌ను ఒకేసారి మొత్తంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎలాంటి హెల్త్ కవరేజ్ లభించదు. ♦ పాలసీదారుడు తన వ్యాధికి డయాగ్నసిస్ చేయించుకున్న తేదీ మొదలు 14 రోజల తర్వాతనే క్లెయిమ్ మొత్తాన్ని పొందుగలడు. ఒకవేళ ఈ 14 రోజుల్లోపే పాలసీదారుడు మరణిస్తే ఎలాంటి క్లెయిమ్ మొత్తం రాదు. ఇక పాలసీ వెయిటింగ్ పీరియడ్ 90 రోజులు. అంటే పాలసీ తీసుకున్న తేదీ నుంచి 90 రోజుల తర్వాతనే హెల్త్ బెనిఫిట్ లభిస్తుంది. ♦ ప్రీమియం చెల్లింపులు రద్దు: పాలసీదారుడు డయాగ్నసిస్ చేయించుకున్న తర్వాత భవిష్యత్ పాలసీ ప్రీమియంను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక లైఫ్ కవరేజ్ మాత్రం కొనసాగుతుంది. ♦ సెక్షన్ 80సీ, 80డీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ♦ 18 నుంచి 65 ఏళ్లలోపు వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ‘వ్యక్తికి కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఇవి తగ్గుతూ వస్తాయి. ఇదే సమయంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే రీబ్యాలెన్సింగ్ ఫీచర్‌తో ఈ పాలసీని రూపొందించాం. పాలసీ కాలం గడిచేకొద్ది లైఫ్ కవరేజ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. అదే సమయంలో క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ పెరుగుతుంది’ – ఎస్బీఐ లైఫ్ ప్రెసిడెంట్ రవీంద్ర కుమార్ -
బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 24 జీవిత బీమా కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయంలో జూలై నెలలో 47.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది రూ.20,428 కోట్లకు చేరింది. కాగా గతేడాది ఇదే కాలంలో సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,854 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ తాజా గణాంకాల ప్రకారం.. ఒకే ఒక ప్రభుత్వ రంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం 51 శాతం వృద్ధితో రూ.10,738 కోట్ల నుంచి రూ.16,255 కోట్లకు పెరిగింది. ఇక మిగిలిన 23 ప్రైవేట్ సంస్థల ప్రీమియం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.3,117 కోట్ల నుంచి రూ.4,173 కోట్లకు ఎగసింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.848 కోట్లకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రీమియం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.759 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ప్రీమియం ఆదాయంలో 69 శాతం వృద్ధి చెందింది. ఇది రూ.521 కోట్ల నుంచి రూ.880 కోట్లకు పెరిగింది. బిర్లా సన్ లైఫ్ ప్రీమియం ఆదాయం 57 శాతం వృద్ధితో రూ.196 కోట్లకు, కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ప్రీమియం ఆదాయం 75 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు చేరింది. -
జీవిత బీమా కంపెనీల లాభాల్లో కోత
న్యూఢిల్లీ: దేశీయ జీవిత బీమా కంపెనీల లాభాలు 2015–16లో కొద్దిగా క్షీణించాయి. రూ.7,415 కోట్ల పన్ను అనంతర లాభాల్ని ఆర్జించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.7,611 కోట్లతో పోలిస్తే ఈ రంగం లాభాలు మొత్తం మీద 2.57 శాతం తగ్గాయి. జీవిత బీమా రంగంలో మొత్తం 24 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా గత ఆర్థిక సంవత్సరం నాటికి 19 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఈ మేరకు జీవిత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) నివేదిక విడుదల చేసింది. లాభాల్లో ఉన్న 19 కంపెనీల్లో... ప్రభుత్వరంగ ఎల్ఐసీ రూ.2,517 కోట్ల లాభంతో అగ్ర స్థానంలో ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలతో పోలిస్తే 38% పెరిగాయి. నష్టాల్లో ఉన్న జీవిత బీమా కంపెనీల్లో ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఆక్సా, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ నిప్పన్ ఉన్నాయి. మిగిలినవన్నీ లాభాల్లో ఉన్నవే. ఇక జీవిత బీమాయేతర రంగం నికర లాభం సైతం 2014–15లో రూ.4,639 కోట్లుగా ఉండగా... గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,238 కోట్లకు క్షీణించింది. -
జీవిత బీమా కంపెనీలకు... కొత్త పాలసీల జోరు
జూలైలో రూ.13,854 కోట్ల నూతన ప్రీమియం.. రూ.10,737 కోట్లతో ఎల్ఐసీ అగ్ర వాటా న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలకు నూతన పాలసీ ప్రీమియంల ఆదాయం జూలైలో 4 శాతం పెరిగి రూ.13,854కోట్లు వసూలు అయింది. గతేడాది జూలైలో నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.13,319 కోట్లుగా ఉంది. కొత్త పాలసీల్లో అగ్ర వాటా ఎప్పటిలాగే ప్రభుత్వరంగ ఎల్ఐసీకే దక్కింది. ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం 3 శాతం పెరిగి రూ.10,737కోట్లకు చేరుకుంది. మిగిలిన 23 జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార (నూతన పాలసీలు) ఆదాయం 7.5 శాతం వృద్ధి చెంది రూ.3,116 కోట్లకు చేరుకుంది. గతేడాది జూలైలో వీటి ఆదాయం రూ.2,898 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం... {Oపెవేటు రంగ బీమా కంపెనీల్లో ఎస్బీఐ లైఫ్ అధిక వృద్ధి కనబరిచింది. నూతన పాలసీల ద్వారా రూ.676 కోట్ల ఆదాయాన్ని గడించింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ.497 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారం 17 శాతం వృద్ధి చెంది రూ.521 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో ఆదాయం రూ.445 కోట్లు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన పాలసీల వ్యాపారం సైతం 16.5 శాతం వృద్ధి చెంది రూ.565 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీల ఆదాయం తగ్గింది జూలై నెలలో నూతన పాలసీల ద్వారా ఆదాయం కోల్పోయిన వాటిల్లో కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ, అవివా లైఫ్, రెలియన్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ లైఫ్ ఆదాయం సగానికి పడిపోయి రూ.62 కోట్లకు పరిమితం అయింది. -
డీఈసీఈ.. ఇంటర్‌తో సమానమే!
ఎల్ఐసీ, మహిళా ఉద్యోగి వివాదంలో హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆంధ్రా, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించిన మూడేళ్ల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమో(డీఈసీఈ) కోర్సు రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సుతో సమానం కాదన్న జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) వాదనలను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. రెండు అత్యున్నత విద్యా సంస్థలు డీఈసీఈ డిప్లొమో కోర్సును ఇంటర్ తత్సమాన కోర్సుగా గుర్తించినప్పుడు, ఎల్ఐసీ అందుకు విరుద్ధమైన వైఖరిని తీసుకోవడం అర్థం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. డీఈసీఈ డిప్లొమో చేసిన ఓ మహిళకు అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చి, ఆ తరువాత డీఈసీఈ డిప్లొమో ఇంటర్ తత్సమాన కోర్సు కాదంటూ ఆమెను ఉద్యోగంలోని నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ బి.శివశంకరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. -
ఆన్లైన్ అమ్మకాలపైనే దృష్టి
* కొత్తగా రెండు ఆన్లైన్ పథకాలు ఆవిష్కరణ * ఎగాన్ రెలిగేర్ లైఫ్ సీవోవో యతీష్ శ్రీవాత్సవ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ బీమా వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ ప్రకటించింది. దేశంలో స్మార్ట్ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కంటే మరిన్ని సేవలను అన్లైన్లో అందించడంపై దృష్టిసారిస్తున్నట్లు ఎగాన్ రెలిగేర్ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యతీష్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం బీమా పథకాల అమ్మకాల్లో 21 శాతం, కొత్త ప్రీమియం ఆదాయంలో 14 శాతం ఆన్లైన్ ద్వారా వస్తోందని, రానున్న కాలంలో దీన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రెండు ఆన్లైన్ బీమా పథకాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీవాత్సవ మాట్లాడుతూ ఇన్వెస్టర్లు ఇప్పుడిప్పుడే యులిప్ పథకాల కేసి చూస్తున్నట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్లు పెరుగుతుండటం, మ్యూచువల్ ఫండ్ రాబడులకు తగ్గట్టుగా యులిప్స్ రాబడులు ఉండటం, చార్జీలు తగ్గడం వంటి అంశాలు యులిప్స్‌ను ఆకర్షించేటట్లు చేస్తున్నాయన్నారు. అందుకోసమే కేవలం ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే విధంగా ‘ఐ మాగ్జిమైజ్’ పేరుతో యులిప్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు యతీష్ శ్రీవాత్సవ తెలిపారు. 2018 తర్వాతే లాభాల్లోకి! వచ్చే మూడేళ్లలో లాభనష్ట రహిత స్థితికి చేరుకోగలమన్న ధీమాను శ్రీవాత్సవ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొమ్మిది నెలల కాలంలో దేశీయ బీమా రంగం 8 శాతం వృద్ధిని నమోదు చేస్తే తాము 30% వృద్ధిని సాధించినట్లు తెలిపారు. కొత్త పథకాలు ఇవీ... అంతకుముందు ఆన్లైన్ యులిప్ పథకం ‘ఐ మాగ్జిమైజ్’, ఆన్లైన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ పథకం ‘ఐ రిటన్’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఐ మాగ్జిమైజ్లో ఇన్వెస్మెంట్కు మూడు రకాల ఫండ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. కనీస వార్షిక ప్రీమియం రూ. 24,000. అదే ‘ఐ రిటన్’ విషయానికి వస్తే కనీస బీమా మొత్తం రూ. 30 లక్షల కోసం 30 ఏళ్ళ వ్యక్తి 20 ఏళ్లకు ఐ రిటర్న్ పాలసీ తీసుకుంటే ఏటా సుమారు రూ. 10,950 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
జీవిత బీమా సంస్థ సేవలు అభినందనీయం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జీవిత బీమా సంస్థ ఖాతాదారులకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎస్పీ జె.ప్రభాకరరావు కొని యాడారు. జీవిత బీమా సంస్థ 57వ బీమా వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక టౌన్‌హాలులో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంస్థ సిబ్బంది అంకితభావంతో సేవలు అందించటం వల్ల దేశ వ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై పాలసీదారులకు ఎంతో అవగాహన కల్పించి ఎక్కువ మంది పాలసీలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఖాతాదారులు ఆర్థికాభివృద్ధి చేకూరేలా ప్రయత్నం చేయాల న్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారోత్సవాలను పురస్కరించుకుని జీవితా బీమా సంస్థ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు ముఖ్యఅతిథి ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజరు రంగారావు, మార్కెటింగ్ మేనేజరు తపన్కుమార్పట్నాయక్, సీఆర్ఎం మేనేజరు ఎన్.ఎన్.శ్రీహరి, సేల్స్ మేనేజర్లు సీహెచ్.సాంబశివరావు, కె.ఆదినారాయణ, సిబ్బంది, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.