కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జీవిత బీమా సంస్థ ఖాతాదారులకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎస్పీ జె.ప్రభాకరరావు కొని యాడారు. జీవిత బీమా సంస్థ 57వ బీమా వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక టౌన్‌హాలులో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంస్థ సిబ్బంది అంకితభావంతో సేవలు అందించటం వల్ల దేశ వ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిందన్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై పాలసీదారులకు ఎంతో అవగాహన కల్పించి ఎక్కువ మంది పాలసీలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఖాతాదారులు ఆర్థికాభివృద్ధి చేకూరేలా ప్రయత్నం చేయాల న్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వారోత్సవాలను పురస్కరించుకుని జీవితా బీమా సంస్థ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు ముఖ్యఅతిథి ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజరు రంగారావు, మార్కెటింగ్ మేనేజరు తపన్‌కుమార్‌పట్నాయక్, సీఆర్‌ఎం మేనేజరు ఎన్.ఎన్.శ్రీహరి, సేల్స్ మేనేజర్లు సీహెచ్.సాంబశివరావు, కె.ఆదినారాయణ, సిబ్బంది, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.
జీవిత బీమా సంస్థ సేవలు అభినందనీయం
Published Sun, Sep 8 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement