Service activities
-
సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం
న్యూఢిల్లీ: సేవల రంగం సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 57.7 వద్ద ముగిసింది. గడచిన 10 నెలల కాలంలో సూచీ ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్త వ్యాపారం, అంతర్జాతీయ అమ్మకాలు, ఉత్పత్తిలో వృద్ధి మందగించినట్లు నెలవారీ సర్వే పేర్కొంది.తీవ్ర పోటీ పరిస్థితులు, ద్రవ్యోల్బణ సవాళ్లు, వినియోగదారుల ఎంపికలో మార్పు (ఆన్లైన్ సర్వీసుల్లోకి మారడం), కొత్త ఎగుమతి ఆర్డర్లలో అంతగా పెరుగుదల లేకపోవడం వంటి అంశాలు కూడా సేవల రంగం మందగమనానికి కారణమయ్యాయి. ఆగస్టులో సూచీ 60.9 వద్ద ఉంది. కాగా సూచీ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. అయితే 2024లో సూచీ 60 లో పునకు పడిపోవడం సెపె్టంబర్‌లోనే మొదటిసారి. ఇదీ చదవండి: జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!తయారీ–సేవలు కలిపినా డౌన్...సేవలు–తయారీ రంగం కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్‌పుట్ ఇండెక్స్ ఆగస్టులో 60.7 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో 58.3కు తగ్గింది. అయితే సూచీలో మందగమనం చోటుచేసుకున్నప్పటికీ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన మెరుగ్గానే ఉందని, ఆగస్టు నుంచి వ్యాపార ధోరణి పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఒక్క తయారీ రంగమే సెప్టెంబర్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.5కు తగ్గింది. గడచిన ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టులో సూచీ 57.5 వద్ద ఉంది. 400 తయారీ సంస్థల ప్యానల్లోని పర్చేజింగ్ మేనేజర్లకు పంపబడిన ప్రశ్నపత్రాల ప్రతిస్పందనలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసి, హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐని రూపొందిస్తుంది. భారత్ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా మెజారిటీ కాగా, పారిశ్రామిక రంగం వాటా దాదాపు 25 శాతం. ఇందులో తయారీ రంగం వాటా దాదాపు 75 శాతం. -
కరోనా దెబ్బ : పద్నాలుగేళ్ల కనిష్టానికి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి దెబ్బతో సేవల కొనుగోలు నిర్వాహకుల సూచిక (పీఎంఐ) రికార్డుకనిష్టానికి పతనమైంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా అమలువుతున్న లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఏప్రిల్‌లో ఇది 5.4 కు క్షీణించింది. బుధవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం 14 సంవత్సరాలలో ఇంతటి క్షీణత నమోదు కాలేదు. మార్చిలో 49.3 శాతంగా వుంది డిసెంబర్ 2005 లో డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుండి సేవల ఉత్పత్తిలో తీవ్ర పతనాన్ని నమోదు చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిందని, కఠిన లాక్ డౌన్ నిబంధనలతో 40 పాయింట్లకు పైగా పడిపోయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ ఆర్థిక వేత్త జో హేస్ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా భారీ ప్రభావం పడిందన్నారు. (పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు) ఐహెచ్ఎస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో విపరీతంగా క్షీణించి 5.4 కు చేరుకుంది. గ్లోబల్ కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారి కారణంగా విదేశీ డిమాండ్ పడిపోయింది. ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సర్వే ప్రకారం సేవల విదేశీ డిమాండ్ ఏకంగా 0.0కు పడిపోయింది. మొత్తంగా సేవా కార్యకలాపాలు రికార్డ్ కనిష్టానికి తగ్గాయి. సేవల కార్యక్రమాలతో కలిసి మార్చిలో మిశ్రమ పీఎంఐ 50.6 ఉండగా గత నెలలో ఆల్ టైమ్ లో 7.2 కనిష్టస్థాయికి పడిపోయింది. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించడం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడవచ్చునని చెబుతున్నారు. సేవల రంగంలో మందగమనం ఉత్పాదక రంగం కంటే దారుణంగా ఉందని డేటా సూచించింది. గత వారం విడుదల చేసిన డేటా ప్రకారం, తయారీ పీఎంఐ మార్చిలో 51.8 నుండి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 27.4 కి పడిపోయింది. గత నెల అంటే ఏప్రిల్ 7వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ డేటాను కలెక్ట్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పౌరుల కదలికపై ఆంక్షలు, సమాచార సాంకేతికత, హాస్పిటాలిటీ, రవాణా వంటి ముఖ్యమైన సేవలు నిలిచిపోయాయి. అత్యవసరాలు తప్ప అన్ని వ్యాపారాల కార్యకాలపాలు రద్దయ్యాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే చేసిన 500 కంపెనీలలో ఉత్పత్తి 97శాతం క్షీణించింది. కాగా కరోనా కట్టడికోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను తొలుత ఏప్రిల్ 14 వరకు ఆ తర్వాత మే 3వ తేదీ వరకు, మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించింది. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. -
సింగరేణి సంస్థ సేవలకు గుర్తింపు
గోదావరిఖని(రామగుండం) కరీంనగర్ : సింగరేణి సంస్థ సేవలకు గుర్తింపు లభించింది. సంస్థ చేపట్టిన సామాజిక సేవలకు అవార్డు దక్కింది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏటా అందించే ఉత్తమ సేవా అవార్డు సీఎండీ శ్రీధర్ శుక్రవారం గవర్నర్ నర్సింహన్ చేతులమీదుగా అందుకున్నారు.సింగరేణి సంస్థ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్నేళ్లుగా రెడ్‌క్రాస్ సొసైటీ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు తనవంతుగా సహకారం అందిస్తోంది. తలసేమియా బాధితులు, సికిల్‌సన్ వ్యాధిగ్రస్తుల కోసం రక్తనిధి, రక్తశుద్ధికి సంబంధించిన విడాస్ (ఆర్) బయోమిరియక్స్ మిషన్, సీరం పెర్రిటిన్ టెస్ట్కిట్లను రూ.17.18 లక్షలతో కొనుగోలు చేసి రెడ్‌క్రాస్ సొసైటీ అందజేసింది. బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో స్థానిక ప్రజల కోసం పలుమార్లు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించింది. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సిం గరేణి అధికారులు, కార్మికులు, రెస్క్యూ సిబ్బంది తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు. ప్రతిసారీ 100కు పైగా సింగరేణి ఉద్యోగులు రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. 2008 నుంచి సింగరేణి సంస్థ తలసేమియా బాధితులను ఆదుకోవడం కోసం రక్తనిధి నిర్వహణకు ఉచితంగా పలురకాల ఎక్విప్మెంట్లను అందజేసింది. రూ.25 లక్షల విలువైన మూడు రకాల రిఫ్రిజిరేటర్లు, సెంట్రీప్యూడ్, మూడు రకాల రక్తనిధి రిఫ్రిజిరేటర్లతో పాటు మైక్రో స్కోపులు, హాట్ ఎయిర్ ఓపెన్, ఇంక్యూబేటర్లు, ఎలీషా రీడర్, ఎలీషావాషర్లు సమకూర్చింది. సింగరేణి కార్మికుల కుటుంబాలు, సమీప గ్రామాల్లోని తలసేమియా సికిల్‌సన్ వ్యాధిగ్రస్తుల సేవల కోసం సింగరేణి ఆస్పత్రిలో పనిచేసే పాథాలజిస్ట్ డాక్టర్ కృష్ణమూర్తిని 2012 నుంచి డిప్యూటేషన్‌పై రెడ్‌క్రాస్ ఆస్పత్రికి కేటాయించి వైద్యసేవలు అందజేస్తోంది. గత ఏడాది సుమారు రూ.40 కోట్లతో గ్రామాలు, పట్టణాల్లో మౌలి క సదుపాయాల కల్పనకు పలురకాల పనులు చేపట్టింది. సంస్థ విశిష్ట సేవలకుగాను గుర్తింపుగా రెడ్‌క్రాస్ సొసైటీ ఉత్తమ సేవా అవార్డు 2017–18 సంవత్సరానికి గాను సీఎండీకి అందజేసింది. -
డాక్టరు చాగంటి ఇక లేరు..
సామర్లకోట (పెద్దాపురం): స్థానిక ప్రముఖ వైద్యులు చాగంటి శ్రీరామ రత్నంరాజు గురువారం ఉదయం మృతి చెందారు. 1929లో జన్మించిన ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చైర్మన్‌గా ఉన్నారు. 1972లో ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారులు, కుమార్తెలు, మనవలు, మనుమరాళ్లు కూడా డాక్టర్లు కావడం విశేషం. సుమారు ఆయన ఇంట 18 మంది డాక్టర్లు ఉన్న విశేష కుటుంబంగా పేరు పొందింది. రత్నంరాజు మృతితో సామర్లకోట పట్టణం మూగ బొయింది. ఆయన మృతి పట్ల అనేక మంది ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టరు చందలాడ అనంతపద్మనాభం, డాక్టరు ఐవీ రావు, డాక్టరు పసల సత్యానందరావు, పారిశ్రామిక వేత్తలు పసల పద్మరాఘవ రావు, ఆర్వీ సుబ్బరాజు, వీరభద్రరావు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు అవాల లక్ష్మీనారాయణ, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మద్దాల శ్రీను, టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్ర రావు తదితరులు పాల్గొన్ని మృత దేహం వద్ద నివాళ్లు అర్పించారు. -
అతడే ఒక సైన్యం
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు..సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు ఆ వైద్యుడు. సమాజాన్ని పీడిస్తున్న రోగాలకు చికిత్స చేసేందుకు పోరాటబాట ఎంచుకున్నారు. ఓ వైపు ఉచితవైద్యశిబిరాల ద్వారా సేవలందిస్తూనే.. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెండేళ్లుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయనే జగిత్యాలకు చెందిన యువ వైద్యుడు సిరికొండ రవిశంకర్. – జగిత్యాలజోన్ రవిశంకర్‌కు చిన్నప్పటి నుంచి సమాజస్పృహ ఎక్కువ. ప్రజలు వేసిన ఓట్లతో గెలుపొంది వారినే నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులపై పోరాడేతత్వం ఆయనది. 2002– 08 వరకు ఖమ్మంలో ఎంబీబీఎస్ చదివారు. కోర్సు అనంతరం వైద్యుడిగా పలు ఆస్పత్రుల్లో సేవలు అందించారు. 2014లో జగిత్యాలకు వచ్చిన రవిశంకర్ ఓ ఆస్పత్రిని ప్రారంభించారు. రెండేళ్లపాటు వైద్యసేవలందించారు. ఓ వైపు ఆస్పత్రి నిర్వహిస్తూనే మరో వైపు ఖాళీ సమయాల్లో గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిచారు. ఇందుకు ఓ అంబులెన్స్ కొనుగోలు చేశారు. దాదాపు 500 వరకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. అయినా ఆయనకు ఏదో అసంతృప్తి. అదే సమాజంలోని సమస్యలపై పోరాటలకు ప్రేరణగా నిలిచింది. ప్రజా సమస్యలపై పోరుబాట రోగులకు ఉచిత వైద్యం అందిస్తూనే... 2016 నుంచి పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాటం ప్రారంభించారు. ఉచిత వైద్యశిబిరాల ద్వారా గ్రామీణుల వద్దకు వెళ్లి వారిని పీడిస్తున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేక గ్రామీణులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి.. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. దాదాపు 200 రోజులుగా నిరసన దీక్షలు చేశారు. రోజుకో సమస్యపై తన ఇంటి నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు చేరుకొని వినతిపత్రం ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 120 సమస్యలపై ఫోకస్ చేశారు. అంతేకాకుండా దాదాపు వెయ్యి వేపమొక్కలను నాటడం, ఇంకుడుగుంతలపై గ్రామీణులకు సైతం అవగాహన కల్పించారు. ముందు డాక్టర్.. వెనుక అంబులెన్స్ డాక్టర్ నిరసన వినూత్న శైలిలో ఉంటుంది. రోజుకో సమస్యపై ఫ్లెక్సీతో ముందు డాక్టర్ వెళ్తుంటే.. వెనుక అంబులెన్స్ అనుసరిస్తుంటుంది. అంబులెన్స్‌లోని స్పీకటర్ల ద్వారా వచ్చే పాటలతో ప్రజలను ఆయా సమస్యలపై ఉత్తేజితులను చేస్తుంటారు. పిచ్చోడు అన్నవారే.. మద్దతుగా.. రోజుకో సమస్యపై ఇలా పాదయాత్రగా డాక్టర్ వెళ్తుంటే..మొదట పిచ్చోడు అన్నవారే నేడు మద్దతుగా నిలుస్తున్నారు. వైద్యుడిగా పనిచేస్తే వచ్చే డబ్బులను వదులుకొని ఇలా చేయడం ఏంటని హేళనగా మాట్లాడిన వారే.. ఆయన పట్టుదల చూసి వెంట నడుస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా.. డాక్టర్ ఎప్పటికప్పుడు తాను చేసే కార్యక్రమాల వివరాలను సోషల్‌మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తుంటారు. తాను చేసిన కార్యక్రమాలకు మద్దతుగా ఎవరిని సాయం కోరడం కానీ, డబ్బు సాయం కానీ అడగరు. ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. తాను చేసే కార్యక్రమాలకు సైతం రోజుకు రూ.100 నుంచి రూ.200లోపే ఖర్చు అవుతున్నట్లు డాక్టర్ తెలిపారు. తన పోరాటం ద్వారా ఒక్క సమస్య పరిష్కారమైన విజయంగానే భావిస్తానని రవిశంకర్ స్పష్టం చేస్తున్నారు. -
ఘనంగా వైఎస్సార్ జయంతి
♦ అభివృద్ధిలో మహానేతకు సాటిలేరు ♦ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గైనికాడి విజయలక్ష్మి ♦ ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వినాయక్‌నగర్ : పేదల కోసం ఎన్నో సంక్షేమం పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జనం మెచ్చిన నేతగా, రాష్ట్రానికి పెద్దన్నలా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గైనికాడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌లో వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రికి చేర్చేందుకు అంబులెన్స్‌లు, పేదలకు ఖరీదైన వైద్యం అందడానికి ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, రాధిక, సోని, యమున, శశికళ, నర్సవ్వ, సంగీత, అరుణ, మల్లవ్వ, మంజుల, సత్తమ్మ, రాణి, జమున, గంగమ్మ పాల్గొన్నారు. కాంగ్రెస్‌భవన్‌లో.. నిజామాబాద్ సిటీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. డీసీసీ, సీసీసీ అధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, కేశవేణులు కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బంటు బలరాం, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు(వెంకుల్), కిసాన్‌కేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్ హైమద్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ మోహన్, నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నకర్, మహిళా నాయకులు స్వర్ణలత, పోలా ఉషా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బంటు రాము, రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు విపుల్‌గౌడ్, ఎస్సీసెల్ నగర చైర్మన్ రాజ్‌గగన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబా.. బ్లాక్‌షీప్
ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ‘నేనే దైవం.. నీ కష్టాలను నాతో చెప్పుకో తీరుస్తా’ అంటూ తామే దేవుళ్లమని ప్రజలను నమ్మించి కొందరు స్వామీజీల ముసుగులో ఉన్న నేరగాళ్లు అందిన కాడికి దోచుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. తాజాగా శివస్వామి లీలలు బయటపడ్డాయి. గతంలో జరిగిన కొందరు బాబాల మోసాలను పరిశీలిస్తే ప్రజల బలహీనతలే వారి ఆయుధాలని తేటతెల్లమౌతోంది. జాగ్రత్తగా ఉండకపోతే మూఢవిశ్వాసం ముంచేస్తుంది. - నెల్లూరు (క్రైమ్) ‘ప్రేమే దైవం.. ప్రేమతోనే మోక్షం.. ఉన్న దానిని కష్టాల్లో ఉన్నవారికి పంచితే దేవుని వద్దకు చేరుకుంటారు.’ ఇలా ప్రజలను మాయలో దించాడు. వారిని భక్తులుగా చేసుకున్నాడు. వారి వద్దనుంచి రూ.50 లక్షలు తీసుకొని ఉడాయించాడో స్వామీజీ. నెల్లూరు ఉడ్‌హౌస్ సంఘానికి చెందిన పాశం సురేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. యువకులకు కరాటే, పెద్దలకు, మహిళలకు యోగా నేర్పించేవాడు. కీళ్లనొప్పులు, పక్షవాతం, క్యాన్సర్ తది తర వ్యాధులకు ఆయుర్వేద వైద్యం చేసేవాడు. ప్రతి రోజు సమయం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్నవారికి ప్రేమతత్వాన్ని బోధిస్తూ ప్రేమానందస్వామిగా అవతారమెత్తాడు. అతని ఆథ్యాత్మిక బోధనలకు ఆకర్షితులైన పలువురు ఆయన భక్తులుగా మారారు. బాలాజీనగర్‌కు చెందిన రవి అతని శిష్యుడిగా మారాడు. అతనికి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. తాను సంపాదించిన మొత్తంలో అధికభాగం స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలకోసం వెచ్చించేవాడు. భక్తుల బలహీనతలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రేమానందస్వామి పన్నాగం పన్నాడు. అనాథలకు చేయూతనందించేందుకు సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అందుకుగాను విరాళాలు అందించాలని కోరారు. అతని మాటలను నమ్మిన భక్తులు సుమారు రూ.50 లక్షల వరకు విరాళాలు అందించారు. వాటితో స్వామి ఉడాయించాడు. ఈ ఘటనపై రెండోనగర పోలీసులు కేసు నమోదు చేశారు. దేవుడి ఆభరణాలను దొంగలించడంలో దిట్ట నెల్లూరు నగరానికి చెందిన ఎన్.హనుమంతపవన్కుమార్ పలు దేవాలయాల్లో పూజారిగా పనిచేశారు. పనిచేసిన చోటల్లా అమ్మవారి ఆభరణాలను అపహరించి వాటిని అమ్మి సొమ్ముచేసుకొని జల్సాగా జీవించేవాడు. 2014లో ఆయన కొత్తూరు శ్రీలంక కాలనీలోని త మిళుల ఆరాధ్యదైవమైన ముత్తుమారియమ్మ ఆలయంలో పూజారిగా చేరాడు. అక్కడ అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను, ఆలయప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలోని వెండి కిరీటాన్ని అపహరించాడు. ఒకటోనగర పోలీసుస్టేషన్‌లోనూ ఆయనపై దేవాలయంలో దొంగతనం కేసులున్నాయి. కంసాలివీధిలోని దుర్గమ్మ గుడిలో పూజారిగా చేరి పక్కనే ఉన్న దుకాణంలో వస్తువులను దొంగలించాడు. డ్రైవర్స్కాలనీలోని ముత్యాలమ్మగుడిలో పూజారిగా చేరాడు. అమ్మవారి మంగళసూత్రంను అపహరించుకొని వెళ్లారు. నిందితుడు నేరం చేసిన ప్రతిసారీ తన ఇంటి అడ్రస్‌ను మారుస్తూ ఉండటంతో అతనిని పట్టుకోవడ ం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీలు, లైంగికదాడులు నీకు ఆరోగ్యం బాగలేదు. నీవు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే నా వాంఛ తీర్చు అంటూ స్వామీజీ ముసుగులో ఉన్న కామాంధులు లేకపోలేదు.తోటపల్లిగూడూరుకు చెందిన శేషయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అనంతరం స్నేహితులతో కలిసి ఆటోను బాడుగకు తీసుకొని ఆటోలో ప్రయాణికుడి వలే నటిస్తూ ఒంటరిగా ఆటోను ఎక్కిన మహిళలను బెదిరించి వారి వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకొనేవాడు. కొద్ది కాలానికి శేషయ్య స్వామీజి అవతారమెత్తాడు. బాలాజీనగర్‌కు చెందిన సుజనమ్మ అనే వృద్ధురాలిని భక్తురాలిగా చేసుకొని తన మాయమాటలతో మోసగించి ఆదిత్యనగర్‌లోని ఆమె స్థలాన్ని కాజేశాడు. అనంతరం ఆ స్థలంలోనే సాయిబాబాగుడి కట్టాడు. నీలగిరి సంఘానకి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో అతని వద్దకు వచ్చింది. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకున్న శేషయ్య సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తనతో శారీరకంగా గడపాలనీ అప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని ఆమెకు సూచించాడు. గుడివద్దకు రమ్మని పిలిచి అక్కడ పూజలు చేస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. నిందితునిపై బాలాజీనగర్ పోలీసులు సస్పెక్టెడ్ షీటు తెరిచారు. డబ్బులు రెట్టింపు చేస్తానని.. ‘తాను భగవంతుని స్వరూపమని, తనకున్న శక్తితో నగదును రెట్టింపు చేస్తాను’ అని ప్రజలను నమ్మించి అందినకాడికి దోచుకెళ్లడం బి.శివ అలియాస్ శివశంకర్స్వామిజికి వెన్నతో పెట్టిన విద్య. చిత్తూరు జిల్లా కుప్పం తాలుకా వెండుగోంపల్లి. శివశంకరస్వామి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంట్లో నుంచి పరారయ్యాడు. కర్ణాటక రాష్ర్టంలోని కోలార్‌కు చెందిన ఓ స్వామిజీ అతనికి పరిచయం ఏర్పడింది. స్వామి వద్ద సులభమార్గంలో డబ్బు సంపాదించే విధానాలు నేర్చుకొన్నాడు. తొలిసారిగా కోలార్‌లోనే తన మోసాలకు బీజం వేశాడు. పూజల పేరిట నగదు, ఆభరణాలు రెట్టింపు చేస్తానని నమ్మించడం ప్రారంభించాడు. అనంతరం పూజలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ వారికి నైట్రోవేట్ నిద్రమాత్రలు కలిపిన ప్రసాదాలు తినిపించేవాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నగదు, నగలుతో ఉడాయించేవాడు. 2014జూన్‌లో తిరుపతి ఆటోనగర్‌లో శివశంకర్స్వామిజి పూజలు చేస్తున్నట్లు నటిస్తూ భక్తులకు నిద్రమాత్రలు కలిపిన ప్రసాదాన్ని తినిపించి రూ.63లక్షలు దోచుకెళ్లాడు. ఇది జరిగిన మరుసటి రోజే నెల్లూరు మాగుంట లేఅవుట్లోని పావనీ టవర్స్‌లో ఓ కాంట్రాక్టర్‌ను బురిడీ కొట్టించి రూ.40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనపై నెల్లూరు నాల్గో నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే స్వామీజీల ముసుగులో నేరాలకు పాల్పడే ఘరానా దొంగల జాబితా చేంతాడంత ఉంటోంది. తాజాగా మే 17వతేదీన నెల్లూరు జెండావీధికి చెందిన సయ్యద్ ఆసీఫా, ఇర్షాద్ ఇంట్లో దెయ్యాలున్నాయని పూజలు చేస్తున్నట్లు నటించి 40 గ్రాముల బంగారం, రూ.50వేల నగదు అపహరించుకొని వెళ్లారు. దొంగ బాబాలను నమ్మొద్దు ఇటీవల కాలంలో కొందరు నేరగాళ్లు బాబాలు, స్వామీజీలుగా అవతారమెత్తి నేరాలకు పాల్పడుతున్నారు. నగదు రెట్టింపు చేస్తామనీ, ఆరోగ్యం నయం చేస్తామని, ఇంట్లో శాంతిపూజలు చేస్తామంటూ ఇలా పలువుర్ని మోసగించి అందిన కాడికి దోచుకెళుతున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే తాము ఈ తరహా నేరగాళ్లపై నిఘా ఉంచాం. వారు తారసపడితే వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - జి.వెంకటరాముడు, నెల్లూరు నగర డీఎస్పీ -
యువతకు చేయూత
► 18 నుంచి 35 సంవత్సరాల యువతతో ► స్వయం సహాయక సంఘాలు ► సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం... ► స్వయం ఉపాధిలో శిక్షణ ► పైలట్ ప్రాజెక్టు కింద 14 మండలాలు ఎంపిక ► మే 4వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ విధానంలో భాగంగా యువత కోసం వినూత్న పథకాలు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యు వజన నంఘాలు, అధికారులు, జాతీయ యువజ న అవార్డు గ్రహీతల అభిప్రాయూలు సేకరించింది. సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం యువత సేవా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా మండల స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. యువజన సంఘాలు రక్తదాన శిబిరాలు, అవయవ దానాలపై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే కార్యక్రమం(హరితాహారం), స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ భారత్, మిషన్ కాకతీయ, యోగా, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వనుంది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్బంగా జిల్లా, మండల స్థాయిలో అవార్డులను ఇచ్చి ప్రోత్సహించనుంది. సోషల్ మీడియాలో.. యువజన సంఘం వారి పేరు మీద ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసుకుని అందులో చేసే కార్యక్రమాలను పొందుపర్చాలి. అలాగే ఈ మెయిల్ ఐడీని సైతం క్రియేట్ చేయాలి. మొదట యూత్ క్లబ్ పేరు తరువాత మండలం, జిల్లా పేరు తో మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. ప్రతి మం డలానికి మండల పరిషత్ అధికారి మండల యువజన అధికారిగా వ్యవహరించనున్నారు. ఇక నుంచి యువజన వ్యవహారాలు అన్ని మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు చుసుకోనున్నారు. యువజన భవనాల నిర్మాణం యువత సంస్థాగత తోడ్పాటు కోసం దేశంలో తొలిసారిగా యూత్ భవన్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఈ భవనాలను నిర్మించేందుకు వెసులుబాటు కల్పించింది. అందులోనే మల్టీలెవల్ ట్రెనింగ్ ఇచ్చేందుకు, గ్రంథాలయం నిర్వహణకు సైతం ఉపయోగపడే విధంగా నిర్మించనున్నారు. యువతకు స్థానిక చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు సైతం కల్పించనుంది. యువతకు మీ సేవ కేంద్రాలను సైతం కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనుంది. యువజన సంఘ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించేందుకు నివేదిక రుపొందిస్తోంది. 14 మండలాలు ఎంపిక జిల్లాలో యువ చేతన కార్యక్రమంలో భాగంగా 14 మండలాలు పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికయ్యూరుు. మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, తొర్రూరు, వర్ధన్నపేట, పరకాల, మొగుళ్ళపల్లి, ఏటురునాగారం, జనగాం, దేవరుప్పుల, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, ఖానాపూర్, హసన్‌పర్తి మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాలలో పథకం విజయవంతమైతే దశల వారీగా జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ మండలాల వారు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా యువజన సంఘం పేరు మీదనే ఉండాలి. ఈ క్లబ్‌లోని సభ్యులందరు 18 నుంచి 35 సంవత్సరాల వారే ఉండాలి. యువజన సంఘాలను పాతవి అయిన కొత్తవి అయినా సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఈ నెల 4వ తేదీలోగా అందజేయాలి. మరిన్ని వివరాలకు వరంగల్ ములుగు రోడ్‌లోని జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో గానీ, 0870-2623125 నెంబర్ ద్వారా గానీ సంప్రదించొచ్చు. యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోస ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ప్రోత్సహిస్తుంది. యువత కోసం అనేక పథకాలను అమలు చేయనుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు సైతం అందజేయాలని పరిశీలిస్తుంది. మొదట పెలైట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని 14 మండలాలను ఎంపిక చేశాము. గోపాల్ రావు, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి -
మహానేతకు ఘనంగా నివాళి
తెలంగాణ, ఏపీలో శ్రద్ధాంజలి ఘటించిన ప్రజలు * వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలు * వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సాక్షి, హైదరాబాద్ : మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 6 వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆయనకు సర్వత్రా ఘనంగా నివాళులర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్సార్‌ను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా బయలుదేరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ఉంచిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వైఎస్సార్ అమర్హై, వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తాం, జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడినుంచి అందరూ నేరుగా శాసనసభా సమావేశాలకు వెళ్లారు. అసెంబ్లీలో వైఎస్సార్ ఫొటోను పునరుద్ధరించాలి: ఉమ్మారెడ్డి శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయిన వైఎస్సార్ ఫొటోను అసెంబ్లీ లాంజ్‌లో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, అలాంటి మహానుభావుడి ఫొటోను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలపై నిర్దిష్టమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి వైఎస్సార్ అని శ్లాఘించారు. అందరినీ ఆదరించిన నేత: పొంగులేటి అపర భగీరథుడు, ప్రతి పేదవాడికి సంక్షేమఫలాలు అందాలని కలలు కన్న మహానేత వైఎస్సార్ అర్ధంతరంగా మరణించడం తీరని నష్టమని పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మరణంపై పార్టీలకు అతీతంగా అందరూ బాధపడ్డారన్నారు. వైఎస్సార్ కలలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీని అభివృద్ధి చేసుకుందామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాదరాజు, ఇతర నాయకులు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గాదె నిరంజన్‌రెడ్డి, మతీన్బై, పుత్తా ప్రతాపరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో శ్రద్ధాంజలి దేశ చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నేత మరొకరి లేరని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ ఆశయసాధనకు కాంగ్రెస్ పార్టీ పునరంకితమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, కేవీపీ రామచంద్రరావు, ఆనం రామనారాయణరెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్‌యాదవ్, కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సమంత సందడి..
కలిసి పనిచేసేందుకు ప్రత్యూష సపోర్ట్ చారిటీ, ఆంధ్రాహాస్పిటల్స్ ఒప్పందం జీవన్మరణ వ్యాధులతో బాధపడేవారిని ఆదుకోవాలని నిర్ణయం విలేకరుల సమావేశంలో వెల్లడించిన సమంత, డాక్టర్ రమణమూర్తి ఆంధ్రాహాస్పిటల్స్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది : సమంత ప్రాణాపాయంతో బాధపడే పిల్లలకు వైద్యం అందించేందుకు ప్రత్యూష సపోర్ట్ చారిటీస్ సంస్థ నిర్వాహకురాలు, సినీ హీరోయిన్ సమంత నగరంలోని ఆంధ్ర ఆస్పత్రితో కలిసి పనిచేయనున్నారు. ఆమె బుధవారం నగరంలోని ఆస్పత్రికి వచ్చి ఎండీ డాక్టర్ రమణమూర్తితో చర్చించారు. లబ్బీపేట : ప్రముఖ సినీ హీరోయిన్ సమంత తన సేవా కార్యక్రమాలను నగరానికి విస్తరించారు. జీవన్మరణ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ఇప్పటికే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గవర్నర్‌పేటలోని ఆంధ్రాహాస్పిటల్స్లో చిన్నారుల వార్డును సమంత బుధవారం సందర్శించి, అక్కడి బాలలతో కొద్దిసేపు గడిపారు. అనంతరం సమంత విలేకరులతో మాట్లాడారు. చిన్నారులకు వైద్య సేవలందించేందుకు తాను 2012 అక్టోబర్‌లో ప్రత్యూష సపోర్టు చారిటీస్ ట్రస్టును ఏర్పాటుచేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యున్నత సేవలు అందించే ఆస్పత్రిగా గుర్తింపు పొందిన ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక నుంచి తమ సేవా సంస్థ ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి సేవలను మరింత విస్తృతం చేస్తుందని తెలి పారు. ఆంధ్రా హాస్పిటల్స్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.వి.రమణమూర్తి మాట్లాడుతూ ప్రాణాపాయ వ్యాధులతో బాధపడే పిల్లలు, అత్యవసర వైద్యం, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అవసరమైన పిల్లలకు తగిన ఆర్థికసాయం, అత్యుత్తమ వైద్యం అందించి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి రక్షించడమే తమ సంస్థల ఉద్దేశమన్నారు. వైద్య ఖర్చులో మూడో వంతు ప్రత్యూష చారిటీస్, మరో మూడో వంతు తమ ఆస్పత్రి భరిస్తాయని, మిగిలిన మొత్తం తల్లిదండ్రులు సమకూర్చుకోవాలని తెలిపారు. ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగం చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రత్యుష చారిటీ సహకారంతో ఆరు నెలల చిన్నారికి విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశామని తెలిపారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పాతూరి పద్మ, కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్‌కు కమల్ సై
స్వచ్ఛభారత్‌కు నటుడు కమలహాసన్ శ్రీకారం చుట్టారు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణంగా తారలు పుట్టిన రోజున పూజలు, అనంతరం శుభాకాంక్షల కార్యక్రమం, విందులు, వినోదాలతో గడిపేస్తుంటారు. అలాంటిది ప్రఖ్యాత నటు డు సామాజిక సేవ కోసం నడుం బిగించడం విశేషం. నటుల ప్రభావం అభిమానులపై చా లా ఉంటుందన్నది నిజం. ఆ విధంగా కమల్ చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమానికి ఆయన అభిమానులతో పాటు పుర ప్రజలు చేయి కలిపారు. కమలహాసన్ తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉద యం దక్షిణ చెన్నైలోని మాడంబాక్కం సమీపంలోని నీటి కాలువను శుద్ధిచేసే కార్యక్రమాన్ని సంకల్పించారు. ఈ కార్యక్రమానికి ఆ ప్రాంత వాసులు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఎన్విరాన్మెంట్ లిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి దక్షిణ చెన్నై, మాడంబాక్కం సమీపంలోని నీటి కాలువ ఒకప్పుడు గలగల పారే సెలయేరులా ఉండేది. ఆ ప్రాంత వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతూ జంతుజాలం దాహార్తి తీర్చే జీవ కాలువ అది. అయితే రానురాను చెట్లు, చెత్తాచెదారం, పూడికలతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఆ ప్రాంత వ్యవసాయదారులు, నీటి కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని గుర్తించిన ఎన్విరాన్మెంట్లిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండి యా సంస్థ 2012లో ఈ కాలువను శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంత ప్రజలు, పంచాయతీ సహకారంతో కొంచెం కొంచెంగా ఆ కాలువ పరిసర ప్రాంతాలను శుద్ధి చేస్తోంది. ఇప్పుడీ శుద్ధి కార్యక్రమానికి కమలహాసన్ తోడుగా నిలిచారు. స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. పుదుకోట్టై, సర్కలి, చిదంబరం, పాండిచ్చేరి, చెంగల్ప ట్టు, కాంచీపురం, తిరుత్తణి, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, ఈరోడ్, ఎలంపిల్లై, కుమరపాళయం, పొల్లాచ్చి, ఉడుమలపేట్ట, రాజపాళయం, శ్రీవిల్లిపుత్తూరు, తిరునెల్వేలి, అంబాసముద్రం, నాగర్‌కోవిల్, కన్యాకుమారి, రా మనాథపురం, కారైకుడి, అరంతాంగి, చెన్నై తదితర ప్రాంతాల్లో కొనసాగుతోందని ఎన్విరాన్మెంట్లిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆ ల్ ఇండియా కమలహాసన్ నర్పని ఇయక్కం నిర్వాహకులు వెల్లడించారు. -
మహామనిషి.. మరువలేం..
జిల్లా అంతటా ఘనంగా వైఎస్ జయంతి మచిలీపట్నం : ప్రజల మనిషి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటరులోని వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలోనూ వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించటంలో వైఎస్ ఎంతగానో కృషిచేశారని కొనియాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం, రైతుల సంక్షేమం కోసం రుణాలను మాఫీ చేయటం, రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాలు ఇప్పించటం, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నందివాడ మండల కన్వీనరు పెయ్యల ఆదాం, పలువురు నాయకులు పాల్గొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కేపీ సారథి, ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసంక్షేమం కోసం వైఎస్ చేసిన సేవలను కొనియాడారు. నందిగామలోని గాంధీ సెంటరులో ఉన్న వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు క్షీరాభిషేకం నిర్వహించారు. చందర్లపాడులో కోట బుచ్చయ్యచౌదరి, ఎంపీపీ కె.రవిబాబు, కంచికచర్లలో బండి జానకిరామయ్య, వీరులపాడులో కె.ముత్తారెడ్డి తదితరులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూజివీడులో వైఎస్ విగ్రహానికి మునిసిపల్ చైర్మన్ బసవ రేవతి, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ బసవ భాస్కరరావు, లాం ప్రసాదరావు, మునిసిపల్ వైస్‌చైర్మన్ అన్నే మమత తదిత రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైలవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో, పశువుల ఆస్పత్రి సెంటర్, హనిమరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జి.కొండూరు మండలం వెలగలేరు, కుంటుముక్కల తదితర ప్రాంతాల్లో కూడా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు అప్పిడి సత్యనారాయణరెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, ఎం.విజయబాబు, జి.కొండూరు ఎంపీపీ వేముల తిరుపతయ్య, జెడ్పీటీసీ సభ్యుడు కాజ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ ప్రధాన సెంటరులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేకనూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు గుడివాక శివరాం ఆధ్వర్యంలో వైఎస్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ సీపీ చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల కన్వీనర్లు చండ్ర వెంకటేశ్వరరావు, వెంకట్రావు, దాసి దేవదానం, విశ్వనాథపల్లి సత్యనారాయణ, పరిసే మాధవరావు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట వైఎస్సార్ సర్కిల్‌ల్లో రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు సామినేని విశ్వనాథం, మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కైకలూరులో 23 అడుగుల వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు పాలాభిషేకం నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా కోర్టుసెంటరు, బైపాస్‌రోడ్డు, హౌసింగ్‌బోర్డు పార్కులోని వైఎస్ఆర్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా, జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, పట్టణ మహిళా విభాగం కన్వీనరు తాడిబోయిన విజయలక్ష్మి, పాల పద్మ, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. పామర్రు పాలకంపెనీ, వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి తదితరులు పాల్గొన్నారు. -
జీవిత బీమా సంస్థ సేవలు అభినందనీయం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జీవిత బీమా సంస్థ ఖాతాదారులకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎస్పీ జె.ప్రభాకరరావు కొని యాడారు. జీవిత బీమా సంస్థ 57వ బీమా వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక టౌన్‌హాలులో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంస్థ సిబ్బంది అంకితభావంతో సేవలు అందించటం వల్ల దేశ వ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై పాలసీదారులకు ఎంతో అవగాహన కల్పించి ఎక్కువ మంది పాలసీలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఖాతాదారులు ఆర్థికాభివృద్ధి చేకూరేలా ప్రయత్నం చేయాల న్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారోత్సవాలను పురస్కరించుకుని జీవితా బీమా సంస్థ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు ముఖ్యఅతిథి ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజరు రంగారావు, మార్కెటింగ్ మేనేజరు తపన్కుమార్పట్నాయక్, సీఆర్ఎం మేనేజరు ఎన్.ఎన్.శ్రీహరి, సేల్స్ మేనేజర్లు సీహెచ్.సాంబశివరావు, కె.ఆదినారాయణ, సిబ్బంది, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.