సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి దెబ్బతో సేవల కొనుగోలు నిర్వాహకుల సూచిక (పీఎంఐ) రికార్డుకనిష్టానికి పతనమైంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా అమలువుతున్న లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఏప్రిల్‌లో ఇది 5.4 కు క్షీణించింది. బుధవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం 14 సంవత్సరాలలో ఇంతటి క్షీణత నమోదు కాలేదు. మార్చిలో 49.3 శాతంగా వుంది డిసెంబర్ 2005 లో డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుండి సేవల ఉత్పత్తిలో తీవ్ర పతనాన్ని నమోదు చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిందని, కఠిన లాక్ డౌన్ నిబంధనలతో 40 పాయింట్లకు పైగా పడిపోయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ ఆర్థిక వేత్త జో హేస్ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా భారీ ప్రభావం పడిందన్నారు. (పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు)
ఐహెచ్ఎస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో విపరీతంగా క్షీణించి 5.4 కు చేరుకుంది. గ్లోబల్ కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారి కారణంగా విదేశీ డిమాండ్ పడిపోయింది. ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సర్వే ప్రకారం సేవల విదేశీ డిమాండ్ ఏకంగా 0.0కు పడిపోయింది. మొత్తంగా సేవా కార్యకలాపాలు రికార్డ్ కనిష్టానికి తగ్గాయి. సేవల కార్యక్రమాలతో కలిసి మార్చిలో మిశ్రమ పీఎంఐ 50.6 ఉండగా గత నెలలో ఆల్ టైమ్ లో 7.2 కనిష్టస్థాయికి పడిపోయింది. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించడం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడవచ్చునని చెబుతున్నారు. సేవల రంగంలో మందగమనం ఉత్పాదక రంగం కంటే దారుణంగా ఉందని డేటా సూచించింది. గత వారం విడుదల చేసిన డేటా ప్రకారం, తయారీ పీఎంఐ మార్చిలో 51.8 నుండి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 27.4 కి పడిపోయింది. గత నెల అంటే ఏప్రిల్ 7వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ డేటాను కలెక్ట్ చేశారు.
కరోనావైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పౌరుల కదలికపై ఆంక్షలు, సమాచార సాంకేతికత, హాస్పిటాలిటీ, రవాణా వంటి ముఖ్యమైన సేవలు నిలిచిపోయాయి. అత్యవసరాలు తప్ప అన్ని వ్యాపారాల కార్యకాలపాలు రద్దయ్యాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే చేసిన 500 కంపెనీలలో ఉత్పత్తి 97శాతం క్షీణించింది. కాగా కరోనా కట్టడికోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను తొలుత ఏప్రిల్ 14 వరకు ఆ తర్వాత మే 3వ తేదీ వరకు, మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించింది. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment