Wipes Out
-
మోడీ తడిసాడు..అభిమాని తుడిచాడు
-
కరోనా దెబ్బ : పద్నాలుగేళ్ల కనిష్టానికి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి దెబ్బతో సేవల కొనుగోలు నిర్వాహకుల సూచిక (పీఎంఐ) రికార్డుకనిష్టానికి పతనమైంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా అమలువుతున్న లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఏప్రిల్‌లో ఇది 5.4 కు క్షీణించింది. బుధవారం విడుదల చేసిన నెలవారీ సర్వే ప్రకారం 14 సంవత్సరాలలో ఇంతటి క్షీణత నమోదు కాలేదు. మార్చిలో 49.3 శాతంగా వుంది డిసెంబర్ 2005 లో డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుండి సేవల ఉత్పత్తిలో తీవ్ర పతనాన్ని నమోదు చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిందని, కఠిన లాక్ డౌన్ నిబంధనలతో 40 పాయింట్లకు పైగా పడిపోయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ ఆర్థిక వేత్త జో హేస్ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా భారీ ప్రభావం పడిందన్నారు. (పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు) ఐహెచ్ఎస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో విపరీతంగా క్షీణించి 5.4 కు చేరుకుంది. గ్లోబల్ కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారి కారణంగా విదేశీ డిమాండ్ పడిపోయింది. ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సర్వే ప్రకారం సేవల విదేశీ డిమాండ్ ఏకంగా 0.0కు పడిపోయింది. మొత్తంగా సేవా కార్యకలాపాలు రికార్డ్ కనిష్టానికి తగ్గాయి. సేవల కార్యక్రమాలతో కలిసి మార్చిలో మిశ్రమ పీఎంఐ 50.6 ఉండగా గత నెలలో ఆల్ టైమ్ లో 7.2 కనిష్టస్థాయికి పడిపోయింది. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించడం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడవచ్చునని చెబుతున్నారు. సేవల రంగంలో మందగమనం ఉత్పాదక రంగం కంటే దారుణంగా ఉందని డేటా సూచించింది. గత వారం విడుదల చేసిన డేటా ప్రకారం, తయారీ పీఎంఐ మార్చిలో 51.8 నుండి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 27.4 కి పడిపోయింది. గత నెల అంటే ఏప్రిల్ 7వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ డేటాను కలెక్ట్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పౌరుల కదలికపై ఆంక్షలు, సమాచార సాంకేతికత, హాస్పిటాలిటీ, రవాణా వంటి ముఖ్యమైన సేవలు నిలిచిపోయాయి. అత్యవసరాలు తప్ప అన్ని వ్యాపారాల కార్యకాలపాలు రద్దయ్యాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే చేసిన 500 కంపెనీలలో ఉత్పత్తి 97శాతం క్షీణించింది. కాగా కరోనా కట్టడికోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను తొలుత ఏప్రిల్ 14 వరకు ఆ తర్వాత మే 3వ తేదీ వరకు, మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించింది. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. -
50 బిలియన్ డాలర్ల ఎగుమతులకు ‘కోవిడ్’ దెబ్బ!
ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 వల్ల ఒక్క ఫిబ్రవరిలోనే 50 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ ఎగుమతులకు విఘాతం కలిగి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది. ముఖ్యంగా తయారీ రంగ ఎగుమతులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీలకు సంబంధించి యూఎన్‌సీటీఏడీ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్) విభాగం చీఫ్ పమేలా కోక్–హమిల్టన్ ఈ అంశంపై మాట్లాడారు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ సూచీ ఫిబ్రవరిలో 20 పాయింట్లు పడిపోయి 37.5కు చేరిన విషయాన్ని ప్రస్తావించారు. 2004 తర్వాత ఈ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. -
ఈ ఒక్కరోజే రూ. 5లక్షల కోట్ల సంపద ఆవిరి
సాక్షి, ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రకంపనలు పుట్టించాయి. వారాంతంలోస్టాక్మార్కెట్లో ఈ శుక్రవారం టెర్రర్ డేగా నిలిచింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10శాతం పన్ను ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళన రేపింది. దీంతో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. దీంతో దేశీయ ఈక్విటీలు 70 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ ఒక్కరోజులోనే సుమారు 50లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బిఎస్ఇలో లిస్ట్ అయిన కంపెనీల కంబైన్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .4.7 లక్షల కోట్లు మేర పడిపోయింది. ఇది ఇలా వుంటే ఈ పతనం సోమవారం కూడా స్టాక్మార్కెట్లో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని క్వాంటమ్ సెక్యూరిటీస్‌కు చెందిన నీరజ్ దీవాన్ తెలిపారు. బాగా పెరిగిన మిడ్ క్యాప్ వాల్యుయేషన్ లాంటివి మార్కెట్ పతనానికి అనేక కారణాలున్నప్పటికీ కీలక సూచీలను బడ్జెట్ కూడా ప్రభావితం చేసినట్టు చెప్పారు. బడ్జెట్‌కంటే7-8 రోజుల ముందే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టడం మంచిదైందన్నారు. ఈ తరుణంలో మార్కెట్లకు ఎక్కడ నిలుస్తాయో చెప్పడం కష్టమన్నారు. మరోవైపు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన ఈక్విటీ మార్కెట్లలో ఈ కరెక్షన్ మంచి పరిణామమని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ వీకెనెస్ మరో రెండు నెలలు కొనసాగుతుందని, తరువాత మార్కెట్లకు సానుకూలమేనని ఎలారా క్యాపిటల్ ఎండీ హరీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లలో సెన్సెక్స్ 2.34 శాతం (839పాయింట్లు) నష్టంతో, నిఫ్టీ 2.36 శాతం(256పాయింట్లు) భారీ నష్టంతో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌కాప్ సెక్టార్లు 4శాతం నష్టపోయాయి. 2016, నవంబరు తరువాత ఇదే అది పెద్ద పతనంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
టాటాల రూ.17వేల కోట్ల సంపద ఆవిరి
సంచలనం రేపిన సైరస్ మిస్త్రీ ఉద్వాస వ్యవహారంతో టాటా గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సరైస్ మిస్త్రీని తొలగించిన ఈ రెండురోజుల కాలంలో మార్కెట్ విలువ పరంగా టాటా గ్రూప్ దాదాపు రూ.17 వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. ఈ షాకింగ్ న్యూస్ తో రెండు ట్రేడింగ్ సెషన్లలో టాటా కంపెనీల షేర్లు దిగ్భ్రాంతికి గురి చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిస్త్రీ తొలగింపు ఐటీ కంపెనీ భవిష్యత్తుపై మరింత ప్రభావాన్ని చూపించనుందని సిటీ గ్రూపు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా టాటా గ్రూప్ కంపెనీలోని గరిష్ట మార్కెట్ క్యాప్ కలిగినఐటీ దిగ్గజం టిసిఎస్ షేర్ ఈ రెండు రోజుల్లో 1.6 శాతం నష్టపోయింది. మార్కెట్ విలువలో రూ.7.788 కోట్ల రూపాయలు కోల్పోయింది. టాటా మోటార్స్ (డీవీఆర్ షేర్లు సహా) రూ.6,100 కోట్ల సంపద ఆవిరైపోయింది. అలాగే ఇతర కంపెనీల కూడా ఇదే బాటలో పయనించాయి. టాటా స్టీల్ రూ.1,431 కోట్లు, టైటాన్ రూ.906 కోట్లు, టాటా పవర్ రూ.607కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి అయితే మధ్యంతర బాధ్యతలను స్వీకరించిన రతన్ టాటా ఈ పరిణామాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం టాప్ సీఈవోల సమావేశంలో హామీ ఇచ్చారు. దీనికి బదులుగా వ్యాపారంపై తద్వారా సంస్థను మార్కెట్ లీడర్స్ గా నిలపడం పై దృష్టిపెట్టాలని కోరిన సంగతి తెలిసిందే.